Sunday, February 07, 2016

thumbnail

What is Health ?

ఆరోగ్యం అనగా ఏమిటి?.,What is Health?

ఆరోగ్యము అంటే ?
  • ఒక వ్యక్తి శరీరములో ఏదైనా జబ్బు (disease) లేనంత మాత్రాన ... ఆ వ్యక్తీ ఆరోగ్యవంతుడని అనలేము.
ఒక వ్యక్తి ...
  • "శారీరకంగాను ,
  • మానసికంగాను ,
  • శరీరకవిధులనిర్వహణలోను ,
  • ఆర్ధికంగాను ,
  • సామాజికంగాను ...
తను ఉన్న ప్రదేశం లో సమర్ధవంతం గా నివసించ గలిగితే ... ఆరోగ్య వంతుడనబడును ".
  • (Mere absence of a disease in a person is not healthy. A person is said to be healthy " when is physically , mentally , physiologically , socially , financially " fit to live in his own circumstances .. then ... he / she is healthy)
ఆరోగ్యము మనిషి ప్రాధమిక హక్కు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యముగా ఉండాలి , ఆరోగ్యముగా ఉండడానికి ప్రయత్నించాలి , మంచి ఆరోగ్యకర పరిసరాలను కల్పించుకోవాలి. ఆరోగ్యముగా ఉండమని ఇతరులకు సలహా ఇవ్వాలి . 'ఆరోగ్యకరమైన జీవనశైలి'ని అలవర్చుకోవడం తప్పనిసరి .

జీవనశైలి అంటే ?

ఆరోగ్యకరమైన జీనశైలి అనేది ఒక నైపుణ్యం. శాస్త్రీయంగా నేర్చుకోవాల్సిన విషయం. 'ఆరోగ్యమంటే... జబ్బులేకపోవడం మాత్రమే కాదు. శారీరకంగా, మానసికంగా, సామాజికంగా 'ఒక మంచి పద్ధతి'గా ఉండడమే ఆరోగ్యం అని ప్రప్రంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) చెప్పింది. మనిషి శరీరంలో జరిగే లక్షలాది రసాయనిక చర్యలు, అనువంశికత, మనిషి చుట్టూ ఉండే పర్యావరణం, స్థానిక సంస్కృతులూ- ఇవన్నీ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. అయితే 'ఆరోగ్యకరమైన జీవనశైలి' వైద్య శాస్త్రం, సామాజిక శాస్త్రాలు కలిస్తే వచ్చే దృక్పథం ఇది.

'ఆరోగ్యకరమైన జీవనశైలి'లో నాలుగు అంశాలుంటాయి.

* సమతుల ఆహారం,

* శారీరక వ్యాయామం,

* వ్యక్తిగత జీవితంలో ఆశావహత-వాస్తవిక దృష్టి

* సామాజికంగా సానుకూల దృక్పథం-సమిష్టితత్వం.

పై నాలుగు అంశాలను పాటిస్తున్న వారు 'ఆరోగ్యకరమైన జీవనశైలి'తో ఉన్నట్టు లెక్క.


ఆరోగ్యవంతుడి శారీరక లక్షణాలు

బరువు (వయస్సు ప్రకారం) : ఎత్తు సెంటి మీటర్లలో -(minus) 100 = బరువు కిలో గ్రాముల్లో (సుమారు గా)
(Range : Height - 100 = Wight +- 5 Kgs)
శారీరక ఉష్ణోగ్రత : 98 డిగ్రీలు ఫారెన్హీట్ +- 1 డిగ్రీ (నార్మల్ రేంజ్).
గుండె లయ (హార్ట్ బీట్) :72 +- 8 (నార్మల్ రేంజ్)
నాడీ లయ (పల్స్ రేట్) : 72 +- 8 (నార్మల్ రేంజ్)
రక్తపోటు (బ్లడ్ ప్రెషర్) : 120/80 మీ.మీ.అఫ్ మెర్కురి (mercury) (140 /90 వరకు నార్మల్)
మూల జీవక్రియ రేటు (బేసల్ మెటబాలిక్ రేటు) :
English BMR Formula
Women: BMR = 65 + ( 4.35 x weight in pounds ) + ( 4.7 x height in inches ) - ( 4.7 x age in years )
Men: BMR = 66 + ( 6.23 x weight in pounds ) + ( 12.7 x height in inches ) - ( 6.8 x age in year )

Metric BMR Formula
Women: BMR = 65 + ( 9.6 x weight in kilos ) + ( 1.8 x height in cm ) - ( 4.7 x age in years )
Men: BMR = 66 + ( 13.7 x weight in kilos ) + ( 5 x height in cm ) - ( 6.8 x age in years )

ఇక్కడ క్లిక్ చేయండి -
1. BMI లెక్క కట్టుటకు
2. BMR లెక్క కట్టుటకు

ఆరోగ్యం కొరకు తీసుకోవలసిన జాగ్రత్తలు :

పౌష్టికాహారం

పౌష్టికాహారం : పుస్ఠి కరమైన ఆహారము - ఒక్కొక్క రికి ఒకలా ఉంటుంది - శాఖార్లులు , మాంసాహారులు: పాలు ,పండ్లు , పప్పులు ఆకుకూరలు , కాయకురాలు మున్నగు వాటితో కూడుకున్నది ,

సమతుల్యాహారం : సరియైన , సరిపడు , అన్నీ (పిండి పదార్దములు , మాంస కత్తులు , క్రొవ్వులు , విటమిన్లు , మినరల్స్, తగినంత నీరు ) ఉన్న ఆహారము .

శారీరక వ్యాయామం : మనుషులము తిండి ఎంత అవసరమో .. వ్యాయామము అంతే అవసరము .. దీని వలన శరీరము లోని మాలిన పదార్దములు( free radicals ) విసర్జించబడుతాయి . ప్రతి రోజు ఒక గంట నడవాలి .... ఇది రెగ్యులర్ గా ఉండాలి .

మానసిక వ్యాయామం : చిన్న చిన్న విషయాలకు స్పందించకుండా ఎప్పుడు మనషు ప్రశాంతం గా ఉండేటట్లు చూసుకోవాలి . నవ్వుతు బ్రతకాలి ... నవ్విస్తూ బ్రతకాలి .

ధ్యానం : అంతే ఏమిటి ? .. మనషు స్థిరం గా , నిలకడ గా ఒకే విషయం పై , దేవుడైనా , దెయ్యేమైనా ... లగ్నంయ్యేతట్లు ప్రతిరోజూ సుమారు ఒక గంట ధ్యానం లో ఉండాలి .


thumbnail

Thinking

ఆలోచన...


భవిష్యత్తు గురించి ఎక్కువ ఆలోచించే వాడికి

భయం ఉంటుంది.

గతం గురుంచి ఎక్కువ ఆలోచించే వాడికి

బాధ ఉంటుంది.

వర్తమానంలో జీవించే వాడికి

ఆనందం ఉంటుంది.
thumbnail

About You

నీ గురించి...


నీ గురించి చాలామంది చాలా కలలు కంటుండడం

నీకు ఇబ్బందిగా అనిపించినప్పుడు , అందరి

కలలను నిజం చెయ్యడం నీకు అసాధ్యం అనిపించినప్పుడు...

పారిపోకు .

నీ చుట్టూ నీకు తెలియకండానే కలలని అల్లిన

నీకు నచ్చని మనుషుల నిద్రని చెడగొట్టు చాలు...

నీ మీద ఒత్తిడి పెంచే కలలవే చెదిరిపోతాయి...
thumbnail

అన్నీ తెలిసి... అన్నీ తెలిసి ఏదీ చేయలేని వాడు ఏదీ తెలియని వాడితోనే సమానం.

అన్నీ తెలిసి...


అన్నీ తెలిసి ఏదీ చేయలేని వాడు

ఏదీ తెలియని వాడితోనే సమానం.
thumbnail

Small Story

కుండ కోరిక...ఒక చిన్న కథ


ఒక కుమ్మరి కుండలు తయారుచేస్తున్నాడు. ఓర్పుతో, నేర్పుతో మట్టి ముద్దలను కుండల ఆకృతిలో మలిచాడు. వాటిని కాల్చడానికి ఏర్పాట్లు చేసాడు.


అప్పటికే కాలుతున్న కొన్ని కుండలను చూసి పచ్చి కుండల్లో ఒక దానికి చాలా భయం వేసింది.

"అమ్మో! ఒళ్లు కాలిపోవడమే? వద్దు దయచేసి నన్ను కాల్చొద్దు. సుఖంగా ఉన్న ప్రాణాన్ని దుఃఖాన పెట్టకు. నాకు భయంగా ఉంది అని దీనంగా కుమ్మరిని బతిమాలింది.

కుమ్మరి కుండతో 'జీవితంలో తొలిదశలో కష్ట పడితే తర్వాత జీవితాంతం హాయిగా ఉండొచ్చు. ఇప్పుడు కష్టమని భావించి సోమరిగా ఇలా ఉండి పోతే నీ జీవితం వృధా అవుతుంది. సమాజానికీ ఉపయోగపడక వ్యర్థమైపోతావూ' అంటూ ఎన్నో విధాల నచ్చచెప్పాడు.

అతడు ఎంత చెప్పినా వినకుండా మొండికేసింది. సరే అంతలా అడుగుతోంది పోనిమ్మని కుమ్మరి ఈ కుండని వదిలేసి మిగిలిన కుండలను ఆవంలో పెట్టాడు.

ఆవంలో కాలుతున్న కుండలని చూస్తూ తనకి ఆ అవస్థ తప్పినందుకు ఆనంద పడుతూ, 'నాకా బాధలు లేవు హాయిగా ఉన్నానూ' అనుకుంది ఆ పచ్చి కుండ.

బాగా కాలిన ఎర్రని, నల్లని కుండలన్నీ అమ్ముడుపోయాయి. ఎవరూ కొనేవారు లేక పచ్చి కుండ మాత్రం ఆరుబయట ఆవరణలో అలా ఉండిపోయింది.

కుమ్మరి కొన్ని కుండలో నీళ్లు నింపాడు.కొన్ని కుండల్లో మట్టి నింపి మొక్కలు నాటాడు. 

తనకా బరువులు లేనందుకు ఆనందించింది ఆ కుండ.

ఇలా ఉండగా ఓ రోజు కుండపోతగా వర్షం కురిసింది. కాల్చిన కుండలూ, కుండీలూ ధృడంగా అలాగే ఉంటే ఈ పచ్చి కుండ మాత్రం మెల్లిగా కరిగి మట్టిలో కలిసిపోసాగింది. తన ఆకృతిని, ఉనికిని కోల్పోయింది.

కుమ్మరి మాటల్లో అంతరార్థం దానికి చివరి క్షణంలో బోధ పడింది. కానీ అప్పటికే జీవితం చేజారిపోయింది.
thumbnail

నిజం నిప్పు

నిజం నిప్పు..


నిజం నిప్పు...!

అబద్దం అప్పు...!!

ఒకటి నిన్ను కాలుస్తుంది, ఇంకోటి నిన్ను వెంటాడుతుంది.
thumbnail

జీవితం

జీవితం...


జీవితం కోడిగుడ్డు లాంటిది..

ఏది కోడిపిల్ల అవుతుందో..

ఏది ఆమ్లెట్ అవుతుందో తెలీదు..!!
thumbnail

కాలం

కాలం...!!


జరిగిపోయిన కాలాన్ని గురించి ఆలోచించొద్దు...
అది నీకు కన్నీటిని ఇస్తుంది...!

అలాగని జరగబోయే దాని గురించి కూడా ఆలోచించకు..
అది నీకు భయాన్ని కలిగిస్తుంది...!!

కాబట్టి, ఈ క్షణాన్ని సంతోషంగా అనుభవించు...!!
thumbnail

మార్పు

మార్పు...

సమయం మారుతుంది.


రోజులు మారతాయి.

సంవత్సరం మారుతుంది.

వాతవరణం మారుతుంది.

వయసు పెరుగుతుంది.

కానీ, నా స్నేహం మాత్రం మారదు మిత్రమా...!!
thumbnail

Love&Care

ఏది శాశ్వతం...


రూపాన్ని చూసి మోసపోకు..!

రూపాయిని చూసి మురిసిపోకు..!!

రూపమైనా, రూపాయైనా శాశ్వతం కాదు..!

మనసులోని ప్రేమాభిమానాలే శాశ్వతం..!!
thumbnail

Talk

మాట్లాడితే...!!


కోపంతో మాట్లాడితే  -  గుణాన్ని కోల్పోతారు

అధికంగా మాట్లాడితే  -  ప్రశాంతతని  కోల్పోతారు

అనవసరంగా మాట్లాడితే  -  అర్థాన్ని కోల్పోతారు

అహంకారంతో మాట్లాడితే  -  ప్రేమను కోల్పోతారు
thumbnail

Human

మనిషి...!!


తనను తెలుసుకున్న వాడు తత్వజ్ఞుడు.
పరులను తెలుసుకున్న వాడు పరమజ్ఞుడు.
అంతు తెలియదన్న వాడు ఆత్మజ్ఞుడు.
అన్నీ తెలుసన్న వాడు అల్పజ్ఞుడు.

thumbnail

Nanna

నాన్న...!!

నాలో నమ్మకాన్ని పెంచిన వ్యక్తి నాన్న...

నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించిన వ్యక్తి నాన్న...
నాలో ధైర్యాన్ని మేల్కొలిపిన వ్యక్తి నాన్న...
మంచి చెడుల తారతమ్యతని తెలిపిన వ్యక్తి నాన్న...
నాకు మంచి ఆలోచనలు కలిగేల మంచి విషయాలు చెప్పిన వ్యక్తి నాన్న...
నాకు సమాజం పట్ల అవగాహన కల్పించిన వ్యక్తి నాన్న...
నేను నిరుత్సాహపడ్డప్పుడు నా భుజం తట్టి నాలో ఆత్మస్తైర్యాన్ని మేల్కొలిపిన వ్యక్తి నాన్న...
అందుకే నాన్న... కేవలం ఒక వ్యక్తి మాత్రమే కాదు...

నా మార్గదర్శి

thumbnail

Amma

అమ్మంటే అమ్మే...!!


ప్రతి ప్రాణి మొదటి ప్రేమను ఆస్వాదించేది తల్లి వల్లే.మనం పుడుతూ అమ్మని ఏడిపిస్తాం - కాని మనం పుట్టాకమనల్ని చూసి ఆనందపడే మొదటి వ్యక్తి అమ్మ.
మనం గొప్ప పని చేసాం అని తెలిస్తే "నా కొడుకు గొప్ప పని చేసాడు" అని మొదట సంతోష పడేది అమ్మ.
మనం తప్పు చేసాం అని తెలిస్తే "నా కొడుకు తప్పు చేయడు" అని ఒక గట్టి నమ్మకంతో ఉండేదీ అమ్మే.
మనం పెడదోవ పట్టకుండా సక్రమమైన మార్గంలో నడవాలని ప్రతిక్షణం ఆవేదన పడుతుంది అమ్మ.
మనం తనను బాధపెట్టినా, మనం మాత్రం బాగుండాలనే కోరుకుంటుంది అమ్మ.
మనం గెలిచినప్పుడు అందరూ మనకి దగ్గరవ్వాలని చూస్తారు, కాని మనం ఓటమిలో ఉన్నప్పుడు తనుబాధపడుతూ మనల్ని ఓదార్చేది, మనకి ధైర్యం చెప్పేదీ మాత్రం అమ్మే.
అందుకే అమ్మ ప్రేమ పాలకంటే స్వచ్చమైంది.ఎవరో ఒకరు ఏదో ఒక సందర్భంలో మనల్ని బాధపెట్టేవాళ్ళు చాలా మంది ఉంటారు.
కాని మనం కోపంతో ఎప్పుడైనా కసురుకున్నా - మనల్ని ఏ మాత్రం బాధపెట్టని, అసలు ఆ ఆలోచనే రానివ్వని ఒకేఒక వ్యక్తి అమ్మ.
మనం ఎదుటి వ్యక్తిలో లోపాల్ని వెతుకుతాం - కాని మనలో ఎన్ని లోపాలున్నా మనల్ని ప్రేమించేది అమ్మ ఒక్కటే.

అందుకే అమ్మంటే నాకు మాత్రమే కాదు అందరికీ ప్రాణం