Monday, February 08, 2016

thumbnail

Autism-ఆటిజం

utism-ఆటిజం


ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు - Autism-ఆటిజం- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...     ఇన్నాళ్లుగా పాశ్చాత్య దేశాల్లోనే ఎక్కువ అనుకుంటున్న 'ఆటిజం' ఇప్పుడు మన దేశంలోనూ ఎక్కువగానే ఉందని అర్థమవుతోంది. అందుకు రోజురోజుకూ పిల్లల మానసిక వైద్యుల వద్దకు వస్తున్న కేసుల సంఖ్యే తార్కాణం. ఆటిజం.. ఒకటే రుగ్మత కాదు. ఇదో చట్రం! దీనిలో ఎన్నో ఛాయలు.. ఎన్నో స్థాయులు.. మరెన్నో భేదాలు! అందరూ ఒకేలా అనిపించకపోవచ్చు. అందరిలోనూ ఒకే లక్షణాలుండకపోవచ్చు. కానీ ముందుగానే దీన్ని ఆనవాళ్లు పట్టుకుంటే.. దీన్ని అధిగమించటం.. ఈ చట్రాన్ని దాటటం మరీ అసంభవమేం కాకపోవచ్చు. అందుకే తల్లిదండ్రుల్లో 'ఆటిజం'పై అవగాహన పెంచేందుకు సమగ్ర వివరాలను మీ ముందుకు తెస్తోంది ఈ వారం సుఖీభవ!మెడ నిలపటం, పాకటం, తప్పటడుగులు, అత్తతాతలు.. పిల్లల ఎదుగుదల క్రమంలో ప్రతిదీ ఒక పండగే. వీటిలో ఏదైనా తేడా వచ్చినప్పుడు తల్లిదండ్రులు తేలికగానే గుర్తుపడతారు.. వెంటనే దృష్టిసారిస్తారు కూడా. కానీ ఈ గడపలన్నీ దాటి.. ప్రయాణం బాగానే సాగుతోందనుకుంటున్న తరుణంలో కూడా కొన్ని సమస్యలు ఉండొచ్చు. వీటిని గుర్తించటం అంత తేలిక కాదు. వాటిని పట్టుకోవటానికి కాస్త అవగాహన అవసరం. ఇలాంటి సమస్యల్లో ముఖ్యమైనదీ.. ఇప్పటి వరకూ పాశ్చాత్య దేశాల్లోనే ఎక్కువ అనుకుంటున్నదీ... సంపన్న వర్గాల్లోనే ఎక్కువ అనుకుంటున్నదీ.. మన దేశంలోనూ, అన్ని వర్గాల్లోనూ ఎక్కువేనని ఇప్పుడిప్పుడే స్పష్టంగా బయటపడుతున్నదీ... ఆటిజం!'ఆటిజం' భిన్న విభాగాలకు విస్తరించిన ఎదుగల సమస్య. దీన్నే 'పర్వేసివ్‌ డెవలప్‌మెంటల్‌ డిసార్డర్స్‌' అంటారు. వీరందరిలోనూ కొన్ని రకాల లక్షణాలు ప్రత్యేకంగా కనబడతాయి. కొన్ని అంశాల్లో ఎదుగుదల అస్తవ్యస్తమవుతుంది. ముఖ్యంగా మూడు అంశాలను ప్రత్యేకంగా గమనించొచ్చు.* ఇతరులతో కలవలేకపోతుండటం: ఆటిజమ్‌ పిల్లలు తోటి పిల్లలతో ఆడుకోవటానికి అంతగా ఇష్టపడరు. ఒంటరిగా ఆడుకోవటం, ఒంటరిగా గడపటం ఎక్కువ.* భావవ్యక్తీకరణ లోపం: మాటలు రావటం జాప్యం కావచ్చు. వచ్చినా పూర్తిస్థాయిలో ఉండకపోవచ్చు. తమ అవసరాలను తీర్చుకునేందుకు వేలుపట్టుకుని అక్కడి వరకూ తీసుకువెళ్లటం వంటివి చేస్తుంటారు.* ప్రవర్తన లోపాలు: చేసిందే మళ్లీ మళ్లీ చేస్తుండటం, ఒకపనిని ఎప్పుడు చేసినా తిరిగి అలాగే చెయ్యాలని ప్రయత్నిస్తుండటం (అబ్‌సెషన్‌ ఆఫ్‌ సేమ్‌నెస్‌). రోజూ తాము వాడే టాయ్‌లెట్‌నే వాడతామంటారు. రెండోదానిలోకి వెళ్లనని మొరాయిస్తుంటారు. కొందరు సంతోషం కలిగితే చేతులను కాళ్లను పైకీ కిందికీ అదేపనిగా ఆడిస్తారు. మరి కొందరు సూదులు, గుండుపిన్నుల వంటి ఒకే రకం వస్తువులను సేకరిస్తుంటారు..... ఆటిజమ్‌ పిల్లల్లో సాధారణంగా ఈ మూడు లక్షణాలూ ఉంటాయి. కొందరిలో ఒకట్రెండు మాత్రమే ఎక్కువగా కనబడినా అన్ని లక్షణాలూ ఏదో ఒక స్థాయిలో కనబడతాయి. అమెరికా 'డయాగ్నోస్టిక్‌ అండ్‌ స్టాటిస్టికల్‌ మాన్యువల్‌ (డీఎస్‌ఎం)'లో దీన్ని 'పర్వేసివ్‌ డెవలప్‌మెంటల్‌ డిజార్డర్‌' కింద దీన్ని వర్గీకరించారు. ఈ లక్షణాలు ఆరంభమైన సమయం, తీవ్రత, క్షీణిస్తున్న తీరు తదితర అంశాలను బట్టి దీన్ని ప్రధానంగా 5 రకాలుగా విభజించారు.* ఆటిస్టిక్‌ డిజార్డర్‌: ఎక్కువగా కనబడే ఆటిజం సమస్య ఇదే. దీన్ని 'చైల్డ్‌హుడ్‌ ఆటిజమ్‌' అంటారు. ఇది ఆడ పిల్లల్లో కన్నా మగపిల్లల్లో ఎక్కువ. మున్ముందు వివరంగా చూద్దాం.* రట్స్‌ డిజార్డర్‌: అరుదైన ఈ రకం ఆడపిల్లల్లో ఎక్కువగా కనబడుతుంది. దీని ప్రత్యేకతేమంటే.. పుట్టిన ఏడాది వరకూ పిల్లలు బాగానే ఉంటారుగానీ తర్వాత లక్షణాలు కనబడటం మొదలవుతుంది. ఇవి రెండు మూడేళ్లలోనే వేగంగా తీవ్రమవుతాయి. అప్పటికి వచ్చిన ఒకట్రెండు మాటలు కూడా తిరిగి వెనక్కి వెళ్లిపోతాయి. ఇది ముదిరే రకం (ప్రోగ్రెసివ్‌ డిజార్డర్‌) కావటం వల్ల కొంతకాలానికి నాడీ సంబంధ సమస్యలూ ఆరంభమవుతాయి. సరిగా నడుము నిలపలేకపోతుండటం వంటివాటితో మొదలై మెల్లగా 'ఫిట్స్‌' కూడా వస్తాయి. సాధారణంగా వయసుతో పాటు పెరగాల్సిన తల వీరిలో చిన్నదవుతుంటుంది. చొంగ కారటం, చేతులుకాళ్లు ఒకే రకంగా ఆడిస్తుండటం, చేతులతో చప్పుళ్లు చేయటం వంటివి కనబడతాయి. యుక్తవయసుకు ముందే సమస్యలు బాగా ముదిరి వీరు బతికిబట్టకట్టటం కూడా కష్టమవుతుంటుంది.* ఆస్పర్జెర్స్‌ డిజార్డర్‌: ఇది మగ పిల్లల్లో ఎక్కువ. సాధారణంగా ఆటిజమ్‌ పిల్లల్లో మాటలు ఆలస్యంగా వస్తుంటాయి. కానీ ఈ రకంలో మాటలు మామూలుగానే ఉంటాయి. నలుగురిలోకి వెళ్లటం, తెలివి తేటలు కూడా బాగానే ఉంటాయి. కానీ తక్కువగా మాట్లాడతారు. అడిగిన దానికి సమాధానం చెప్పేసి ఆపేస్తారు. శరీరాకృతి భిన్నంగా ఉంటుంది. పొడుగ్గా ఉంటారు. పొడవైన ముఖంతో పాటు చెవులూ భిన్నంగా ఉంటాయి. మిగతా ఆటిజమ్‌ పిల్లలతో పోలిస్తే ఇతరులతో బాగానే కలుస్తారు కాబట్టి వీరిలో భాషా నైపుణ్యాలు కాస్త ఎక్కువగానే అలవడతాయి. కొంతవరకూ బాగానే చదువుతారు. కొన్ని పనుల్లో ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు. అందువల్ల ఆయా అంశాల్లో నైపుణ్యం సాధిస్తారు. అందువల్ల మిగతా ఆటిజమ్‌ పిల్లలతో పోలిస్తే కాస్త మెరుగ్గా (వెల్‌ ఫంక్షనింగ్‌ ఆటిజమ్‌) ఉంటారు. కానీ వీరిలో ప్రవర్తనా సమస్యలు అధికం. కోపోద్రేకాల వంటివి ఎక్కువ.* చైల్డ్‌హుడ్‌ డిసింటిగ్రేటెడ్‌ డిజార్డర్‌: ఇది ఆటిజమ్‌లో తీవ్రమైన సమస్య. వీళ్లు పుట్టినపుడు బాగానే ఉంటారు. ఒకటి రెండేళ్ల వరకూ ఎదుగుదల కూడా బాగానే ఉంటుంది. పాకటం, నిలబడటం, మాట్లాడటం అన్నీ మామూలుగానే వస్తాయి. ఆ తర్వాత ఎదుగుదల వెనక్కి మళ్లటం (రిగ్రెషన్‌) మొదలవుతుంది. అదీ చాలా వేగంగా. వీరిలో- ముఖం రఫ్‌గా, ముదరినట్టుండటం, తలకట్టు కిందికి ఉండటం, పొట్టిగా, లావుగా ఉండటం వంటివి కనబడతాయి. నాడీ సంబంధ లోపాలూ ఆరంభమై, ఫిట్స్‌ వచ్చి నెమ్మదిగా మంచానికే పరిమితమవుతారు, బతికి బట్టకట్టే అవకాశాలూ తగ్గుతాయి.కాదు మాంద్యంకొందరు పిల్లల్లో- ఎవరితోనూ కలవకపోవటం, ఒంటరిగా ఉండటానికే ఇష్టపడుతుండటం, సరిగా మాట్లాడలేకపోతుండటం.. వంటి భిన్న లక్షణాలను గమనించి.. 'లియో కానర్‌' అనే మానసిక విశ్లేషకుడు తొలిగా దీనికి 'ఆటిజం' అని పేరు పెట్టారు. * బుద్ధిమాంద్యం ఉన్నవారూ ఇతరులతో కలవకుండా, తమ లోకంలో తాముంటారు కాబట్టి మొదట్లో దీన్ని అంతా 'బుద్ధిమాంద్యం'గానే భావించేవారు. కానీ 'ఆటిజమ్‌' పిల్లలు బుద్ధిమాంద్యం పిల్లల్లా స్తబ్ధుగా ఉండరు. హుషారుగా, పరిసరాలను గమనిస్తూనే ఉంటారు. కాబట్టి ఇది బుద్ధిమాంద్యం కాదని గుర్తించారు. పైగా ఆటిజమ్‌ పిల్లలు కొన్నింట్లో చాలా చురుకుగా ఉంటారు. కొందరు ఏదైనా ఒకసారి దారిని చూస్తే మరచిపోరు. మరికొందరు అంకెలు, సంఖ్యలు టకటకా చెప్పేస్తారు. పద్యాలు, గేయాలను ఒకసారి వినగానే తిరిగి అప్పజెప్పేస్తారు. చుట్టుపక్కల పరిసరాలను అంతగా చూడనట్టు ప్రవర్తించినా వీరిలో కొన్ని అసాధారణ సామర్థ్యాలుంటాయి. దీన్నే 'సావంట్‌ స్కిల్స్‌' అంటారు. ఈ ప్రత్యేకతలన్నింటి దృష్ట్యా ఇది బుద్ధిమాంద్యం కాదని తేల్చారు. అయితే ఆటిజమ్‌ పిల్లలు పెద్దయ్యాక కొందరిలో బుద్ధిమాంద్యం లక్షణాలు కనిపించొచ్చు. ఇతరులతో కలివిడిగా ఉండకపోవటం, నేర్చుకోకపోవటం వంటివి దీనికి దారితీయొచ్చు. కారణాలుఆటిజంకు ఇదమిత్థమైన కారణమిదీ అని చెప్పటం కష్టం. అందుకే దీనికి సంబంధించి రకరకాల సిద్ధాంతాలు, భావనలు విస్తృతంగా ఉన్నాయి.* కొందరికి మెదడు లోపాలుంటాయి. ఈ పిల్లల్లో బుద్ధిమాంద్యంతో పాటు ఫిట్స్‌, ఇతరత్రా వ్యాధులు కూడా కనబడుతుంటాయి. మెదడు ఎదుగుదలకు తోడ్పడే కొన్ని జన్యువులు, క్రోమోజోములు కూడా ఆటిజంకు దోహదం చేస్తున్నట్టు భావిస్తున్నారు. మెదడులో సెరటోనిన్‌, డోపమిన్‌ వంటి రసాయన మార్పులు కూడా సమస్యకు మూలం కావొచ్చనీ, అలాగే గర్భిణిగా ఉన్నప్పుడు తల్లి ఏవైనా వైరల్‌ ఇన్ఫెక్షన్ల బారినపడినా, లేదా కాన్పు సమయంలో బిడ్డ మెదడుకు తగినంత ఆక్సిజన్‌ అందకపోవటం వంటి సమస్యలు తలెత్తినా ఆటిజం బారిన పడచ్చని భావిస్తున్నారు.* తల్లి ఆప్యాయంగా చూసుకోకపోవటం, దగ్గరకు తీసుకోకపోవటం వల్ల పిల్లలకు ప్రేమ తెలియక, ఒంటరితనానికి దారి తీస్తుందని అనుకునేవారు. కానీ ప్రేమగా చూసుకునే వారి పిల్లలూ ఆటిజమ్‌ బారినపడుతున్నట్టు గుర్తించి దీన్ని కారణంగా చూడటం లేదు. ఈ మధ్యకాలంలో గుర్తిస్తున్న మరో అంశమేమంటే సాఫ్ట్‌వేర్‌ వంటి కొన్ని వృత్తుల్లోని తల్లులకు పుట్టే బిడ్డల్లో ఈ సమస్య ఎక్కువగా కనబడుతుండటం! దీనికి సంబంధించి ఇదమిత్థమైన గణాంకాలుగానీ, కారణాలుగానీ లేవు. కొన్ని వృత్తుల్లోనివారు పిల్లలతో ఎక్కువ సమయం గడపలేకపోవటం, పని గంటలు అస్తవ్యస్తంగా ఉండటం, పరిసరాల నుంచి సరైన ప్రేరణ లేకపోవటం, రేడియేషన్‌ ప్రభావం వంటివి కారణాలు కావచ్చు. మొత్తానికి ఆటిజంపై చాలా రకాల ఆలోచనలు, భావాలు, సిద్ధాంతాలు అందుబాటులోకి వస్తున్నాయిగానీ ఇవేవీ కూడా పూర్తిగా నిరూపణ అయినవి కావు. గుర్తించేదెలా?మరీ చిన్నవయసులో..* అకారణంగా నిరంతరంగా ఏడ్వటం* గంటల తరబడి స్తబ్ధుగా ఉండటం* తల్లి దగ్గరకు తీసుకుంటున్నా పెద్దగా స్పందించకపోవటం* పరిచిత వ్యక్తులను చూడగానే నవ్వక పోవటం* తల్లిదండ్రులు రమ్మని చేతులు చాచగానే.. ఉత్సాహంగా ముందుకు రావాల్సిన పిల్లల్లో అలాంటి స్పందనలేవీ కనిపించకపోవటంకాస్త పెద్దవయసులో..* మిగతా పిల్లలతో కలవకపోవటం* పిలిస్తే పలకకపోతుండటం* పెరిగే కొద్దీ ఒంటరిగా ఉండటానికే ఎక్కువగా ఇష్టపడుతుండటం* మనుషుల కంటే బొమ్మలు, వస్తువుల పట్ల ఆసక్తి ఎక్కువగా ఉండటం* ఎవరైనా పలకరించినా వెంటనే సమాధానం ఇవ్వకపోవటం* కళ్లలో కళ్లు పెట్టి చూడకపోతుండటం* ముఖంలో భావోద్వేగాలేవీ చూపించకపోతుండటం* మాటలు సరిగా రాకపోతుండటం, సరిగా మాట్లాడలేకపోతుండటం* గుంపులో ఉన్నా మిగతా పిల్లలతో కలివిడిగా ఉండలేకపోతుండటం, తమ బొమ్మలు తాము పెట్టుకు ఆడుకుంటుండటం* ఎదుటి వారికి దెబ్బలు, గాయాల వంటివి తగిలినా పట్టనట్టుగా ఉండిపోతుండటం, వెంటనే స్పందించకపోతుండటం* తమకు దెబ్బలు తగిలినా నొప్పి, బాధ పట్టనట్టు ఉండిపోవటం* నడక మొదలుపెట్టినప్పుడు మునివేళ్ల మీద నడుస్తుండటం* వయసుకు తగినట్లు భాషా పాటవం వృద్ధి చెందకపోవటం* పలకరించినా రెండు మాటలు మాట్లాడి వెళ్లిపోవటం, సంభాషణను కొనసాగించే శక్తి కొరవడటం* 'నేను - నువ్వు' అన్న తారతమ్యం తెలియకపోవటం. ఉదాహరణకు 'నీకు పాలు కావాలా' అని అడిగితే.. 'నీకు పాలు కావాలా' అంటుండటం* ఎదుటి వారు అన్న మాటనే తాము మళ్లీ అనటం. ఉదాహరణకు 'నీ పేరేమిటి?' అని అడిగితే సమాధానం చెప్పటానికి బదులు తను కూడా 'నీ పేరేమిటి?' అనటం. (ఎకోలాలియా)* మనం ఎప్పుడో అడిగిన ప్రశ్నకు.. వెంటనే స్పందించకుండా.. తర్వాత ఎప్పుడో మళ్లీ అదే ప్రశ్నను అడుగుతుండటం* మనసు ఎక్కడో లగ్నమై ఉండటంతో కొన్నిసార్లు అసందర్భంగా మాట్లాడుతుండటం.* ఏదైనా ఒక వస్తువు లేదా బొమ్మ పట్ల విపరీతమైన వ్యామోహం పెంచుకోవటం. ఎప్పుడూ యావంతా దాని మీదే ఉండటం, దాన్ని తీసేస్తే విపరీతంగా కోపం రావటం* చేతులు, కాళ్లు లేదా వేళ్లు కాస్త అసహజంగా ఒకే తీరులో కదలిస్తుండటం* వీటితో పాటు ప్రవర్తనాపరమైన సమస్యలు కూడా కనబడుతుంటాయి. ముఖ్యంగా అడిగినవి ఇవ్వకపోతే అరవటం, గట్టిగా గీపెట్టటం మొ||* కొంతమందిలో ప్రతి దానికీ భయపడటం. గాలికి తీగలాంటిదేదన్నా గుతున్నా కూడా భయపడిపోవటం, చీమలాంటిది కనబడినా భయపడటం, చిన్న చిన్న శబ్దాలకు కూడా గట్టిగా చెవులు మూసుకోవటం, శబ్దాలు భరించలేకపోవటం వంటి భావోద్వేగపరమైన అంశాలు కూడా ఉంటాయి.* కొందరు విపరీతంగా చురుకుగా ఉంటుంటారు. ఎప్పుడూ కదులుతూ, అటూఇటూ తిరుగుతూ ఉండటం చాలామందిలో కనబడుతుంది.* కొందరికి మేధస్సు సగటు స్థాయిలోనే ఉన్నా.. కొందరిలో మాత్రం కొన్నికొన్ని విషయాల్లో అపారమైన ప్రజ్ఞ కనబడుతుంటుంది.* 30% మందిలో ఫిట్స్‌, మరికొన్ని రకాల మెదడు, నాడీ సంబంధ సమస్యలూ కనబడుతుంటాయి.*  కొద్దిమందిలో మానసిక ఎదుగుదల కూడా కుంటుపడొచ్చు.చికిత్స ఏమిటి?సమస్య అందరిలో ఒకే తీరులో. ఒకే తీవ్రతలో ఉండదు. కారణాలూ స్పష్టంగా తెలీవు కాబట్టి దీనికి చికిత్స కూడా లక్షణాల ఆధారంగా ఉంటుంది. వైద్యులు 'ఆటిజం రేటింగ్‌ స్కేల్స్‌' ఆధారంగా పిల్లల ప్రవర్తన, లక్షణాలన్నింటినీ గమనిస్తారు. అవసరమైతే 'ఐక్యూ' పరీక్షలూ చేస్తారు. దీనిలో- మోస్తరు, మధ్యస్తం, తీవ్రం- స్థాయులు నిర్ధారించి దాన్ని బట్టి దీన్ని ఎలా ఎదుర్కొనాలన్నది నిర్ధారిస్తారు. సాధారణంగా ఆటిజం, ఆస్పర్జెస్‌ సిండ్రోమ్‌ వంటివి ఉన్నవారు వీటితో చాలా వరకూ మెరుగవుతారు.మందులు (ఫార్మకలాజికల్‌ థెరపీ):* ఫిట్స్‌, మెదడులో లోపాలు, ఉద్రేకపూరితమైన ప్రవర్తన వంటివి ఉంటే మూడేళ్లు దాటిన పిల్లలకు మందులు సిఫార్సు చేస్తారు. ముఖ్యంగా ఒకచోట కూర్చోకుండా, అస్సలు కుదురు లేకుండా నేర్చుకోవటంలో కూడా వెనకబడిపోతుండే 'హైపరాక్టివ్‌' పిల్లలకు 'ఏడీహెచ్‌డీ'కి ఇచ్చే మందులు ఇస్తుంటారు. చెప్పిందే చెప్పటం, ఏదైనా ఒక వస్తువునే పట్టుకుని వదలకపోతుండటం వంటి అబ్సెషన్స్‌ ఎక్కువగా ఉండే పిల్లలకు అవసరమైతే 'యాంటీ డిప్రసెంట్‌' మందులూ ఇవ్వాల్సి వస్తుంటుంది. ఉద్రేకాలు, ఉద్వేగాలు ఎక్కువగా ఉండి కొట్టుకోవటం, గిచ్చటం వంటివి చేస్తున్న వారికి యాంటీసైకోటిక్‌, ట్రాంక్విలైజర్‌ మందులు కూడా ఇవ్వాల్సి రావచ్చు. ఇవన్నీ ఆటిజంను తగ్గించేవి కాకపోయినా... పిల్లల్లో ఉండే లక్షణాలను, సమస్యలను అధిగమించేందుకు ఇవి గణనీయంగా దోహదం చేస్తాయి.మానసిక స్థితిని చక్కదిద్దటం (సైకలాజికల్‌ ఇంటర్వెన్షన్‌)ఆటిజం పిల్లలకు కీలకమైనది మానసిక స్థితిని చక్కదిద్దే శిక్షణే. తల్లిదండ్రులు దీన్ని అర్థం చేసుకోవటం చాలా అవసరం. చిన్నతనంలోనే ప్రేరణ (స్టిమ్యులేట్‌) ఇవ్వటం వల్ల ఫలితాలు మెరుగ్గా ఉంటాయి. అతిగా ఆశించకుండా అలాగని నిరాశలో కూరుకుపోకుండా చికిత్సలో భాగస్వాములు కావటం కీలకం.* స్పీచ్‌ థెరపీ, లాంగ్వేజ్‌ స్టిమ్యులేషన్‌: ఒక పద్ధతి ప్రకారం ఉదయం నుంచీ రాత్రి వరకూ పిల్లలతో మాట్లాడుతుండటం, సంభాషణా సామర్థ్యం పెరిగేలా చూడటం అవసరం. దీనికి స్పీచ్‌థెరపీ దోహదం చేస్తుంది. కళ్లలో కళ్లు పెట్టి చూడటాన్ని అలవాటు చేసేందుకు శిక్షణ, అలాగే మలమూత్ర విసర్జన కోసం 'టాయ్‌లెట్‌ ట్రైనింగ్‌' వంటివన్నీ పద్ధతి ప్రకారం నేర్పిస్తారు. క్రమేపీ స్థాయులను పెంచుకుంటూ వెళతారు. దీంతో మెదడులో లోపం క్రమేపీ సర్దుకుంటుంటుంది.* ప్రవర్తన చక్కదిద్దటం: ఆటిజం పిల్లలకు 'బిహేవియర్‌ మోడిఫికేషన్‌' కూడా ముఖ్యమే. పిల్లవాడికి ఏదైతే బాగా ఇష్టమో దాన్ని వెంటనే ఇవ్వకుండా.. మనం చెప్పిన పని చేస్తే అప్పుడు ఇవ్వటం, మంచి అలవాట్లు పాదుకునేలా చూడటం ముఖ్యం. వేరే పిల్లలతో గొడవలు పడటం వంటివి చేస్తుంటే సైకో థెరపీ వంటివీ ఇస్తారు.* మరీ చిన్నపిల్లలకు 'సెన్సరీ ఇంటిగ్రేషన్‌ థెరపీ' ఇస్తారు. వీళ్లు కంటితో చూసి ఎక్కువ నేర్చుకోరు కాబట్టి ఇతర జ్ఞానేంద్రియాల ద్వారా స్పర్శ, ధ్వని వంటి వాటి ద్వారా వారికి కావాల్సినవి నేర్పిస్తారు.* ముఖ్యంగా వీరిలోని ప్రత్యేక నైపుణ్యాలను గుర్తించి వాటికి మెరుగుపెట్టించటం ముఖ్యం. వీటిలో వీరు బాగా రాణిస్తారు. దీనికి ఆక్యుపేషనల్‌ థెరపీ, మ్యూజిక్‌ థెరపీ వంటివీ దోహదం చేస్తాయి.ఫలితం..* ముందే గుర్తించి చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తే వీరు చదువుల్లో ముందుండటం వంటివి సాధిస్తారు. దీనివల్ల వీరు చాలా వరకూ సాధారణ జీవితం గడిపే అవకాశం ఉంటుంది. ఇతరత్రా లోపాలేమీ లేకుండా మేధస్సు సాధారణ స్థాయిలో ఉండి, మాటలు-సంభాషణ బాగానే ఉన్న వారికి మొదటి నుంచీ చికిత్స ఇస్తే చాలా మెరుగయ్యే పరిస్థితి ఉంటుంది.పథ్యంఆహారంలో పడని వస్తువుల వల్ల ఆటిజం తరహా మెదడు సమస్యలు వస్తున్నాయన్న వాదనా ఉంది. ముఖ్యంగా గోధుమల్లో ఉండే గ్లూటెన్‌ అనే ప్రోటీను, పాలలో ఉండే కెసీన్‌ అనేవి వీరికి అలర్జీ కలిగిస్తాయని భావించి.. వీరికి ఇవి లేకుండా ఆహారం ఇవ్వటం వల్ల ఉపయోగం ఉంటుందన్న వాదన ప్రాచుర్యంలోకి వచ్చింది. దీన్నే 'జీఎఫ్‌ సీఎఫ్‌' డైట్‌ అంటారు. అయితే దీన్ని కచ్చితంగా పాటించటం కష్టం. 2, 3 నెలల పాటు ఇలా ఇచ్చి చూసి ఫలితం ఉంటే కొనసాగించటం లేకపోతే సాధారణ ఆహారానికి మారటం మంచిది.Courtesy with-Dr.A.Gowridevi -child pshychiatrist, shine hospital 

=========================

thumbnail

Advises to Pregnent women-గర్భిణీ స్త్రీలకు సలహాలు

గర్భిణీ స్త్రీలకు సలహాలు , Advises to Pregnent women




ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -గర్భిణీ స్త్రీలకు సలహాలు , Advises to Pregnent women- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


గర్భం అనేది సృష్టి రహస్యం. ఇది మహిళలకు దేవుడిచ్చిన ఓ అపురూపమైన కానుక. కొన్ని సూచనలు పాటిస్తే ప్రసవం సులభతరమౌతుంది . గర్భం ధరించిన స్త్రీలు నిత్యం సంతోషంగా ఉండాలి. దీంతో పుట్టబోయే శిశువు కూడా అలాగే ఉంటుంది. ఆరోగ్యమైన శిశువు కొరకు పౌష్ఠిక ఆహారం: పాలు, పండ్లు, ఆకు కూరలు ,పప్పు, మాంసము ,చేపలు తీసుకోవాలి .

గర్భధారణకు మొట్టమొదటి సంకేతం సరయిన సమయంలో రావలసిన ఋతుస్రావం కాకపోవడం. కొందరిలో కడుపులో వికారం, వాంతులు వంటివి అనిపించవచ్చును. దీనిని తేదీ(నెల) తప్పడం అంటారు. క్రితం ఋతుచక్రం రోజుకు ఒక వారం కలుపుకుంటే ఇంచుమించుగా గర్భధారణ సమయం లెక్కించవచ్చును. ఈ తేదీల ఆధారంగానే వైద్య నిపుణులు అంచనా వేసి ఎప్పుడు పురుడు పోసుకునేదీ లెక్కకడతారు. దీనిని నేగలీ సూత్రం (Naegele's rule) అంటారు.EDD = LMP +9 months ,7 days.

గర్భ నిర్ధారణ పరీక్షలు ఎక్కువగా జరాయువు(placenta) నుండి తయారయ్యే హార్మోన్లు ఆధారంగా పనిచేస్తాయి. వీటిని రక్తంలో గాని, మూత్రంలో గాని కొద్ది రోజులలోనే గుర్తించవచ్చును. గర్భాశయంలో స్థాపించబడిన తరువాత, జరాయువు చే స్రవించబడిన కోరియానిక్ గొనడోట్రోఫిన్ స్త్రీ అండాశయంలొని కార్పస్ లుటియమ్ నుండి ప్రొజెస్టిరోన్ స్రావాన్ని ప్రేరేపిస్తాయి. దీని మూలంగా ఎండోమెట్రియమ్ మెత్తగా వాచి, రక్తనాళాలు వృద్ధిచెందుతాయి. దీని మూలంగా పిండాభివృద్ధికి కావలసిన ఆహార పదార్షాలు సరఫరా చెందుతాయి.

ప్రారంభ దశలో స్కానింగ్ పరీక్ష గర్భధారణ మరియు పిండం యొక్క వయస్సును కూడా తెలియజేస్తుంది. దీని ద్వారా పురుడు జరిగే సమయం కూడా నేగలీ సూత్రం కన్నా సరిగ్గా అంచనా వేయవచ్చును. శాస్త్రబద్ధంగా పురుడు ప్రారంభమైన సమయం ఋతుచక్రం యొక్క తేదీల ప్రకారం 3.6 శాతం కేసులలో మాత్రమే జరుగుతుంది. అయితే స్కానింగ్ ద్వారా అంచనా కూడా 4.3 శాతంలో మాత్రమే సరైనదిగా తెలిసినది.

స్త్రీ, పురుష ప్రాకృతిక సంభోగంలో, పురుషుని వీర్యకణాలు స్త్రీ అండాన్ని ఫలదీకరించిన తరువాత ఏర్పడిన పిండం స్త్రీ గర్భాశయంలో పెరగడం ప్రారంభిస్తాయి. దీనిని గర్భం (Pregnancy) అంటారు. గర్భం ధరించిన స్త్రీని గర్భవతి అంటారు. కొంతమందిలో ఒకటి కన్నా ఎక్కువ పిండాలు తయారౌతాయి. ఫలదీకరణం తరువాత తయారైన పిండం పెరుగుతూ ఉండే కాలాన్ని గర్భావధి కాలం అంటారు. దీని తరువాత శిశువు జన్మింస్తుంది. దీనిని పురుడు అంటారు. క్షీరదాలన్నింటిలో క్షుణ్ణంగా పరిశోధన మానవులలో జరిగింది. ఈ వైద్య శాస్త్రాన్ని ఆబ్స్టెట్రిక్స్ (Obstetrics) అంటారు. గర్భావధి కాలం తరువాత శిశువు జననం సాధారణంగా 38 - 40 వారాలు అనంతరం జరుగుతుంది. అనగా గర్భం ఇంచుమించు తొమ్మిది నెలలు సాగుతుంది.(9 lunar month * 30 days = 270 days).

ఫలదీకరణం తరువాత ప్రారంభ దశను 'పిండం'(Embryo) అంటారు. 'శిశువు'(Foetus) అని ఇంచుమించు రెండు నెలలు లేదా 8 వారాల తర్వాత నుండి పురిటి సమయం వరకు పిలుస్తారు. చాలా దేశాల్లో మానవుల గర్భావథి కాలాన్ని మూడు ట్రైమిస్టర్(3*3 months) కాలాలుగా విభజిస్తారు. మొదటి ట్రైమిస్టర్ కాలంలో గర్భస్రావం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రెండవ ట్రైమిస్టర్ కాలంలో శిశువు పెరుగుదలను సులభంగా గుర్తించవచ్చును. మూడవ ట్రైమిస్టర్ కాలంలో శిశువు గర్భాశయం బయట స్వతంత్రంగా బ్రతకగలిగే స్థాయికి పెరుగుతుంది.

తీసుకోవలసిన జాగ్రత్తలు :
  • ఆరోగ్యమైన శిశువు కొరకు అన్ని కలిసిన పౌస్టికాహారము అనగా ఎక్కువపాలు , పండ్లు , ఆకుకూరలు , పప్పు , మాంసము , చేపలు వగైరా తీసుకోవాలి .
  • మొదటి ఆరునెలలు .... నెలకొకసారి , ఏడు -ఎనిమిది నెలల్లో నెలకు రెండు సార్లు , తొమ్మిదోనెలలో వారానికొకసారి వైద్యపరీక్షలు అవసరము .
  • సొంతముగా మందులు వాడడము , ఎక్షురేలు తీయించుకోవడము చేయకండి.
  • ఎత్తుమడమల చెప్పులు వాడకంది ,
  • గర్భం ధరించిన స్త్రీలు నిత్యం సంతోషంగా ఉండాలి. దీంతో పుట్టబోయే శిశువు కూడా అలాగే ఉంటుంది.
  • మొదటి మూడునెలలు , చివరి నెలలో దూరప్రయాణాలు , కారు స్కూటరు నడపడము , చేయరాదు .
  • రాత్రులు 8-10 గంటలు , పగలు 1 గంట నిద్ర లేదా విశ్రాంతి తీసుకోవాలి . నిద్రపోవునపుడు ఒక ప్రక్కకు (వీలైతే ఎడమ వైపు ) తిరిగి పడుకోవాలి .
  • స్త్రీలు గర్భము దాల్చిన మూడు మాసముల తరువాత, ప్రసవించిన మూడు మాసముల వరకు యోగ విద్య నభ్యసించ రాదు. ఉదయము నడక మాత్రము చేయవలయును.
  • ధనుర్వాతం బారినుండి రక్షణకోసము టెటనస్ టాక్షాయిడ్ ఇంజక్షన్‌ లు తీసుకోవాలి .
  • రక్తస్రావము , ఉమ్మనీరు పోవడము , శిశువు కదలిక తగ్గినట్లు అనిపించినప్పుడు , కడుపు నొప్పి వచ్చినా డాక్టర్ని సంప్రదించాలి .
 గర్భవతులకు - పోషకాహారం-- గర్భస్త సమయంలో ఆహారంలో తీసుకోవలసిన జాగ్రత్తలు -

భారతదేశంలో, ముఖ్యంగా దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న జనాభాలో స్త్ర్రీ గర్భవతిగా లేని సమయంలోను, గర్భవతిగా ఉన్న సమయంలోను, ఓకే విధమైన ఆహారం తీసుకుంటున్నట్లు లెక్కల్లో తేలింది. బిడ్డకు, తల్లికి ఇద్దరికీ సరిపడా లేక ఎక్కువ ఆహారం తీసుకోవలసిన - అవసరం చాలా ఉంది.

నష్టాలు -
  • 1. గర్భవతి తీసుకోవలసిన దానికంటే తక్కువ ఆహారం తీసుకోవటంవలన, తక్కువ బరువుతో శిశువు జన్మించడం - ఇది - తల్లీ/బిడ్డల మరణాలకు దారితీయటం ఎక్కువగా కనిపిస్తుంది.
  • 2. శిశువు బరువు వృధ్ది చెందడంలోను, తల్లికికూడా కొవ్వు శరీరంలో పెరిగేటందుకు అదనపు ఆహారం చాలా దోహద పడుతుంది.
  • 3. పాలిచ్చే తల్లులు (బాలింతలు) సంపూర్ణ ఆహారం తీసుకుంటే, శిశువుకు కావలసినంతగా పాలు వచ్చే అవకాశం ఉంటుంది.

గర్భవతికి కావలసిన ఆహారం -
  • గర్భవతి తీసుకొనే ఆహారం పుట్టబోయే బిడ్డ బరువు పై ప్రభావం చూపుతుంది.
  • గర్బవతికి 300 cal (కాలరీల శక్తి ఎక్కువగా/అదనంగా 15గ్రా మాంసకృత్తులు/10గ్రా కొవ్వుపదార్దాలు అయిదు/ఆరు నెలల గర్భధారణ నుండి తిసుకోవలసిన అవసరం చాలా ఉంటుంది.
  • గర్భవతులు , బాలింతులు తీసుకొనే ఆహారంలో, అధనపు కాల్షియం ఉండాలి. శిశువు ఎముకలు దంతాలు రూపు దిద్దుకోవటానికి, రొమ్ము పాలు పెరగటానికి ఇది చాలా అ వసరం.
  • గర్భ స్ధ దశలో ఇనుము లోపంతో వచ్చే రక్తహీనత, కాన్పుసమయంలో తల్లి మరణానికి దారి తీస్తుంది. శిశువు తక్కువ బరువు తో పుడతారు కనుక, ఇనుము ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవలసి ఉంటుంది.
గర్భవతులు ఆహారం విషయంలో పాటించవలసినవి -
1. గర్భవతులు, బాలింతలు, అదనపు ఆహారం తప్పకుండా తీసుకోవాలి.
2. రోజుకు మూడు కన్నా ఎక్కువ పూటలు భోజనం చేస్తే మరీ మంచిది. .
3. ముడిధాన్యాలు, మొలకెత్తినధాన్యాలు,పులిసిన ఆహారం(పెరుగు ) అదనంగా తీసుకొవాలి.
4. పాలు/మాంసము/కోడిగుడ్లు తీసుకోవాలి.
5. ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు ఎక్కువగా తినాలి .
6. మందులు వైద్యుని సలహా ప్రకారమే తీసుకోవాలి.
7. ఐరన్, ఫోలిక్ / కాల్షీయంను (ఎక్కువ 14-16 వారాల గర్బం నుంచి ప్రారంభించాలి, తల్లి పాలు ఇచ్చేంతవరకు పోడిగించాలి.
8. గర్భవతి, రోజూవారీ చేసుకొనే పనులలో నడక ఉండాలి, కాని ఎక్కువ బరువుపనులు చెయ్యరాదు, అదీ నెలలునిండిన సమయంలో ప్రత్యేకంగా.
9. పోగాకు లేదా మద్యపానం అనగా (సారా, విస్కీ) లాంటివి సేవించరాదు.
10. టీ, కాఫీ తాగడంవలన, శరీరానికి కావలసినంత ఐరన్ అందదు, అందువలన భోజనం తరువాత, టీ / కాఫీ తీసుకొనరాదు.
11.అనవసరమైన భయం ప్రసవ సమయాన్ని కష్టతరము చేస్తుంది,గర్భము , ప్రసవము సృష్టిలో సర్వసాధారణ విషయాలని గుర్తుంచుకోండి.
12. భార్యా భర్తలు నిత్యమూ సంభోగము చేయవచ్చును . అతిగా సంభోగము చేయరాదు . 8-9 వ నెలలో పొట్టపైన ఒత్తిడి పడకుండా రతిలో పాల్గొనాలి .
13. గర్భము దరించిన నుండి , బిడ్డకు పాలు ఇవ్వడం ఆపేంత వరకూ రక్తదానం చేయరాదు .
గర్భము ధరించిన స్త్రీ ఏవిధముగా ఉండాలి?
  • గర్భము ధరించిన స్త్రీ ముఖ్యముగా ఎల్లవేలలూ ప్రసంతముగా వుండాలి.
  • ప్రతిపనిలోను నీజాయితిగా వుండాలి.
  • అనునిత్యము దేవనామస్మరణ చేయవలెను.
  • దర్మప్రవుత్తి కల్గివుండాలి.
  • సత్యమునే పలకవలెను.
  • మీకుటుంబమందు ఆప్యాయత అనురాగము కలిగి వుండాలి .
  • నీతి కధలను చదువుతు వుండాలి.
  • గర్భం ధరించిన స్త్రీలు నిత్యం సంతోషంగా ఉండాలి. దీంతో పుట్టబోయే శిశువు కూడా అలాగే ఉంటుంది.
గర్భిణులు నిద్రలో కొన్ని సమస్యలు-జాగ్రత్తలు :
గర్భిణులు కంటినిండా నిద్రపోవటం ఎంతో అవసరం. అయితే గర్భం ధరించినపుడు శరీరంలో జరిగే మార్పులు నిద్రలో కొన్ని సమస్యలు సృష్టిస్తుంటాయి. కొన్ని జాగ్రత్తలు పాటిస్తే రాత్రిపూట హాయిగా నిద్రపోవటానికి వీలుంటుందని నిపుణులు సూచిస్తున్నారు.
  • * గర్భిణులు మూడోనెల నుంచి ఎడమ వైపు తిరిగి పడుకోవాలి. ఎక్కువసేపు వెల్లకిలా పడుకోకుండా చూసుకోవాలి.
  • * పగలు సాధ్యమైనంత ఎక్కువగా ద్రవాలు తీసుకోవాలి. అయితే రాత్రిపూట వాటిని పరిమితం చేయాలి-లేకపోతే ఎక్కువసార్లు మూత్రవిసర్జన నిద్రలేమికి దారితీయును. .
  • * కారం తక్కువగా ఉండే పదార్థాలు తినాలి. ఛాతీలో మంట పుట్టించే మసాలా ఆహారాన్ని మానెయ్యటమే మంచిది--చాతిలోమంట నిద్రరానివ్వదు ..
  • * పడుకునేటప్పుడు గర్భిణుల కోసం ప్రత్యేకంగా తయారుచేసిన దిండ్లు వాడుకోవాలి. అవి అందుబాటులో లేకపోతే మరో దిండును మోకాళ్ల మధ్య పెట్టుకొని పడుకోవచ్చు.
  • * పగటిపూట వీలు చేసుకొని కాసేపు కునుకు తీయాలి. నిద్ర బాగా పట్టేందుకు మనసును ప్రశాంతంగా ఉంచే పద్ధతులు పాటించాలి.
  • * నిద్రలేమితో బాధపడుతుంటే తప్పకుండా డాక్టరుకు చూపించుకోవటం మరవరాదు.

గర్భిణి లలో మధ్యపానము , Alcohol in pregnency .


ఇంటిలో గర్భిణీ స్త్రీలు ఉన్నప్పుడు మానసికం గా తీసుకోవలసిన జాగ్రత్తలు : 

ఇంట్లో గర్భిణీ స్త్రీలు ఉన్నప్పుడు, ఆ గృహస్తులు కొత్త ఇల్లు లేదా ఫ్లాట్స్ వంటి వాటివి కొనుగోలు చేయడం, కట్టడం వంటివి కూడదని వాస్తు నిపుణులు అంటున్నారు. గృహ నిర్మాణ పనులు చేపట్టినప్పుడు అక్కడ వాతావరణము దుమ్ము, ధూళి వంటి వాటివలన కాలుష్యమౌతుంది కనుక కచ్చితముగా గర్భిణీ స్త్రీలను, పుట్టబోయే పిల్లల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందని వాస్తు శాస్త్రం చెబుతోంది. శిశువు పుట్టిన తర్వాతే కట్టడాల నిర్మాణాలు, ఫ్లాట్స్ కొనడం వంటివి చేయాలని వాస్తునిపుణులు సలహా ఇస్తున్నారు.

అలాగే నిద్రలేచిన వెంటనే గర్భిణీ స్త్రీలు పచ్చటి ప్రకృతి, జలపాతాలు వంటి దృశ్య పటాలను ప్రొద్దునే నిద్రలేస్తూనే చూడటం మంచిది. నిద్రలేచిన వెంటనే దేవుడు పటాల్ని చూడటం ద్వారా రోజంతా శుభదాయకంగా ఉంటుంది.

గర్భిణీ స్త్రీలు ఉండే ఇళ్లలో గృహస్థలం యొక్క దక్షిణము వైపున ఖాళీస్థలాన్ని వదిలిపెట్టి ఉత్తరము వైపున ఇల్లు ఉండకుండా చూడాలి. ఇటువంటి స్థలం గర్భిణీ స్త్రీలనే మాత్రమే గాకుండా స్త్రీలకు బాధలను కలిగిస్తాయని వాస్తు నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాస్తు ప్రకారము దక్షిణము న విశాలప్రదేశమున్నట్లైతె రాత్రులు యమకింకరులు తిరుగుతారని నమ్మకము .

మరోవైపు గర్భవతికి ఆరు మాసములు నిండిన తర్వాత గృహారంభం, గృహప్రవేశం చేయకూడదని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. క్రొత్త వతావరణము కడుపులో బిడ్డ మానసిక స్థితి పై ప్రభావము ఉంటుంది . దీంతో పాటు సముద్ర ప్రయాణము, భర్త దూరముగా వలస వెళ్ళుట , గర్భవతి శ్రాద్ధాన్న భోజనం చేయుట వంటివి కూడదు అని అంటారు .

ఇంకా గర్భిణీ స్త్రీ భర్త పుణ్యతీర్థములు సేవించుట, శవమును మోయుట, శవము వెంట నడుచుట వంటివి చేయకూడదు. గర్భిణీ స్త్రీలైతే.. నదీ స్నానము, శవం వద్ద దీపమెలిగించడం, రక్తాన్ని చూడటం, శ్మశాన దర్శనం చేయడం శిశువుకు మంచిది కాదు. అంటువ్యాధు వచ్చే ప్రమాదము మరియు బిడ్డ మానసిక పెరుగుదల పై ప్రభావము చూపుతాయి .

అలాగే గర్భిణీ స్త్రీలుండే ఇంటి నిర్మాణంలో మార్పులు, చేర్పులు చేయడం శ్రేయస్కరం కాదని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. ఆ సమయము లో గర్భిణీ లకు ప్రశాంతత కరువవుతుందనే వాదన ఉంది .


గర్భిణి స్త్రీలలో మానసిక ఒత్తిడి ప్రభావము, Mental stress effects on Pregnancy

గర్భిణి తీవ్ర మానసిక ఒత్తిడి అనుభవిస్తే ఆ ప్రభావం కడుపులోని బిడ్డ పైనా పడుతుందా? దీనిపై వైద్యరంగం ఎప్పటి నుంచో రకరకాల అధ్యయనాలు చేస్తోంది. తాజాగా వెల్లడైన అంశమేమంటే- గర్భం దాల్చిన తర్వాత తొలి మూడు మాసాల్లో తల్లి తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనైతే ఆమెకు పుట్టే బిడ్డకు రక్తహీనత, ముఖ్యంగా ఇనుము లోపం బారినపడే అవకాశాలు ఎక్కువ. దీనివల్ల బిడ్డ మానసిక, శారీరక ఎదుగుదల ప్రభావితమవుతుందని ఇజ్రాయెల్‌ పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఇనుము బిడ్డ శారీరక అవయవాల ఎదుగుదలకు, ముఖ్యంగా మెదడు వికాసానికి చాలా కీలకం. తల్లుల్లో ఇనుము లోపం, మధుమేహం, గర్భం దాల్చిన తర్వాత పొగ తాగటం వంటివి పిల్లల్లో ఇనుము లోపాన్ని పెంచుతాయి. అలాగే నెలలు నిండక ముందే పుట్టిన బిడ్డల్లో కూడా ఇనుము లోపించే అవకాశాలు ఎక్కువ. వీటన్నింటికి తోడు- గర్భిణి తీవ్ర మానసిక ఒత్తిడికి గురైనా కూడా పిల్లల్లో ఇనుము లోపం తలెత్తవచ్చని తాజా అధ్యయనంలో వెల్లడవటం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అంశం. ఈ నేపథ్యంలో గర్భిణులంతా 'చక్కటి పోషకాహారం, మానసిక ప్రశాంతత'.. ఈ రెండు అంశాల మీదా ప్రత్యేక శ్రద్ధ పెట్టటం చాలా అవసరమని పరిశోధకులు సూచిస్తున్నారు.

=============================================
మూలాలు
* From my knowledge & experience.
1. ↑ Embryo Definition. MedicineNet.com. MedicineNet, Inc. .
2. ↑ Fetus Definition. MedicineNet.com. MedicineNet, Inc. .
3. ↑ Trimester Definition. MedicineNet.com. MedicineNet, Inc. .
4. ↑ Nguyen, T.H.; et al. (1999). "Evaluation of ultrasound-estimated date of delivery -Ultrasound in Obstetrics and Gynecology 14 (1): 23-28.
5.* Harrison's Text book of Medicine.
6. * Obstetrics for Under graduates" by Dr.R K Raju.MD (prof.& Head of Dept. of OBS & Gynaec._AMC visakhapatnam)
  • ====================================

Sunday, February 07, 2016

thumbnail

Acupuncture health system-ఆక్యుపంచర్ వైద్య విధానం

Acupuncture health system,ఆక్యుపంచర్ వైద్య విధానం .

  • image : courtesy with Wikipedia.Org.

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -,ఆక్యుపంచర్ వైద్య విధానం - గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

  • చైనా సంప్రదాయ వైద్య విధానాలలో, ఆక్యుపంచర్‌ వైద్య విధానము ఒకటి . దీనిని భారతీయ ప్రాచీన వైద్య విధానం అని కూడా అంటారు . . చిన్న చిన్న వైద్యవిధానాలను అనుసరించి మనం ఆరోగ్యంగా ఉండవచ్హు. అందులో ఒక వైద్య విధానమే...ఆక్యుపంచర్.

మహాభారత యుద్ధకాలంలో భీష్ముడు అంపశయ్యపై ఊపిరిపోసుకున్న నేపథ్యంలో ఆక్యుపంచర్‌ వైద్యం ప్రాచుర్యం పొందిందనేది వైద్యుల మాట. అతి తక్కువఖర్చుతో దీర్ఘకాలిక వ్యాధులను సైతం ఈ వైద్యం ద్వారా నయం చేస్తున్నారంటే అతిశయోక్తికాదు.. ఖరీదైన కార్పొరేట్‌ వైద్యం చేయించుకోలేని వారికి ఆక్యుపంచర్‌ థెరపీ సంజీవని లాంటిది. అంతేకాదు లక్షలు వెచ్చించి వైద్యకోర్సులను అభ్యసించలేని వారికి ఆక్యుపంచర్‌ కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. డాక్టర్‌ ఆఫ్‌ మెడిసిన్‌(ఎండి) వంటి పిజి కోర్సులను అభ్యసించిన పలువురు ఈ రంగంలో రాణిస్తున్నారు. ఆక్యుపంక్చర్‌ వైద్య విధానం ద్వారా ఎలాంటి సైడ్‌ ఎఫెక్ట్‌ లేకుండా తక్కువ ఖర్చుతో ఎన్నో రకాల వ్యాధులనుండి విముక్తి పొందవచ్చు. సామాన్యులకు అందుబాటులో లేని ఈ వైద్యాన్ని ప్రస్తుతం అందరికి అందుబాటులోకి తెచ్చేందుకు విజయవాడ నగరంలో పవిత్ర అకాడమి వారు కళాశాలను ఏర్పాటు చేసారు. మొగల్రాజపురంలో పవిత్ర అకాడమి మెడికల్‌ ఆక్యుపంక్చర్‌ కళాశాలను నెలకొల్పారు.
  • ఆక్యుపంచర్-ప్రసూతి వైద్యం :
కొన్ని వేల సంవత్సరాలుగా బాధా నివారణకోసం, వ్యసనాల నుంచి విముక్తి చేయడంకోసం, వాంతుల నివారణకోసం, ఇంకా ఇతర వ్యాధుల చికిత్స కోసం సూదిపొడుపు వైద్యాన్ని ఉపయోగిస్తున్నారు. అయితే ప్రసూతి వైద్యంలో, ముఖ్యంగా నొప్పులను నియంత్రించడంలో దీని ఉపయోగం గురించి చెప్పుకోదగిన అద్యయనాలేవీ అందుబాటులో లేవు. ఎంత సమర్థంగా పనిచేస్తుందో రుజువు చేసే ఆధారాలు లేవు. మన దేహంలో 12 శక్తి పథాలు ఉంటే, అందులో 365కి పైగా బిందు కేంద్రాలు ఉన్నట్టు శాస్త్రం చెబుతున్నది. శస్త్ర చికిత్స, నొప్పుల వల్ల శక్తి ప్రవాహానికి అంతరాయం కలిగి దేహంలో అసమతౌల్యం ఏర్పడుతుంది. ఆ అసమతౌల్యం బాధను, ఇబ్బందిని కలిగిస్తుంది. శస్త్ర చికిత్స లేక నొప్పుల వల్ల శక్తి ప్రవాహానికి అంతరాయం కలిగినప్పుడు కొన్ని నిర్దిష్ట ప్రదేశాలలో సూదులను పొడవడం ద్వారా శక్తిని సరైన మార్గంలోకి మళ్లేట్టు చేస్తారు. ఆధునిక శాస్త్ర విజ్ఞానం అంచనా ప్రకారం, ఆక్యుపంచర్ ఈ బాధ కలిగించే స్పందనలను మెదడుకు వెళ్లకుండా అడ్డుకుంటుంది. లేక శరీరంలో సహజంగానే బాధానివారణ రసాయనాలను ఉత్త్పత్తి చేస్తుంది.
  • టెక్నిక్:

ఈ చికిత్సా విధానంలో నిపుణుడైన ఆక్యుపంచర్ వైద్యుడు పేషంటు దేహంలోని కీలకమైన శక్తి బిందువుల వద్ద చర్మం కింది భాగంలో శుద్దిచేసిన మంచి సూదులను గుచ్చుతారు. ఒక్కో బిందువు వద్ద ఒక్కో వ్యవధిలో సూదులను శరీరంలో ఉంచుతారు. కొన్నిసార్లు సూదుల ద్వారా తక్కువ తీవ్రతతో విద్యుత్ ప్రవాహాన్నీ పంపించి, బాధ తీవ్రతను నియంత్రించడానికి కృషి చేస్తారు. ప్రసూతికి చాలా వారాల ముందు నుంచే వారానికి గంట చొప్పున ఆక్యుపంచర్ చేయవచ్చు.
  • పరిమితులు:

* ఆక్యుపంచర్ వైద్యుడు మాత్రమే సూదులను ప్రయోగించవలసి ఉంటుంది.* సూదులు గుచ్చిన చోట అంటువ్యాధులు సోకే ప్రమాదం ఉంటుంది.* నొప్పుల సమయంలో సూదులు గుచ్చితే,తల్లి అటూ ఇటూ కదలడం కష్టమవుతుంది.* ఆక్యుపంచర్ వల్ల బాధ తగ్గడం కంటే, కడుపులో వికారం కలిగి తొందరగా ప్రసవం జరగడానికి వీలు కలిగే అవకాశం ఉందని కూడా కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి.* ఆక్యుపంచర్ బాధా నివారణ ఔషధాల వినియోగం, స్థానికంగా మత్తు ఇవ్వడం(రీజినల్ అనస్తీసియా) వంటి వాటిని తగ్గించిన దాఖలాలు తక్కువ.
ఆక్యుపంచర్ వల్ల శరీరంలో సహజ బాధానివారణ రసాయనాలేవి(ఎండోమార్ఫిన్స్) జనించడంలేదని కొన్ని అధ్యయనాల్లో తేలింది. అంతేగాక ప్రసూతికి ముందు వారాల తరబడిఆక్యుపంచర్ చికిత్స తీసుకున్నవారిలో తొలిదశ నొప్పుల్ వ్యవధి తగ్గిపోయిందని కూడా ఆ అధ్యయనాలు సూచిస్తున్నాయి. అయితే ఈ ఫలితాలను కచ్చితమైనవిగా పరిగణించడానికి లేదు. ఈ అంశంపై సందేహాలను తొలగించడానికి మరింత అధ్యయనం చేయవలసి ఉంది. ఇటీవల స్వీడన్ లో ఒక అధ్యయనం జరిగింది. స్వీడిష్ ప్రసూతి వైద్యులు గర్భిణులపై నాలుగురోజులపాటు ఆక్యుపంచర్ ఉపయోగించి చూశారు. ఆక్యుపంచర్ తీసుకున్న మహిళలల్లో ఎప్పటిలాగే సగం మంది ఎపిడ్యురల్ అనస్తీసియాను కోరుకున్నట్టు ఈ అధ్యయనంలో వెల్లడయింది. బాధా నివారణకోసం నాడీ స్పందనలను పెంచే చికిత్సలనో, వేడి బియ్యం సంచిని ఉపయోగించే విధానాన్నో వారు కోరుకునే అవకాశాలు తక్కువగా ఉన్నాయని కూడా ఈ అధ్యయనంలో తేలినట్టు బ్రిటిష్ జోర్నల్ ఆఫ్ అబ్స్టెరిక్స్ అండ్ గైనకాలజీ తాజా సంచిక పేర్కొంది.
  • ---/భవానీ శంకర్ కొడాలి, ఎండి, అసోసియేట్ ప్రొఫెసర్,

  • ===========================
thumbnail

Acupressure-ఆక్యుప్రెషర్‌ చికిత్స

ఆక్యుప్రెషర్‌ చికిత్స, Acupressure,రిప్లెక్సాలజీ చికిత్స , మర్ధన చికిత్స

  • ఆక్యుప్రెషర్‌ చికిత్స, Acupressure - మందు అవసము లేని వైద్యం :
ఎటువంటి మందుల్లేకుండా నిర్వహించే వైద్యవిధానాలు ఇటీవల కాలంలో మంచి ప్రజాదరణ పొందుతున్నాయి. ఇటువంటి వాటిలో ఆక్యుప్రెషర్‌, రేకీలు నేడు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయి. ప్రత్యామ్నాయ వైద్యము లో రిఫ్లెక్సాలజీ అనేది ఒక ప్రాచీన రూపము . ఆక్యుప్రజర్ , ఆయుర్వేదిక్ మసాజ్  ల మాదిరిగా పోలిఉండే రిప్లెక్షాలజీ ని కొందరు  పిలిచే ఆక్యుప్రెషర్‌ చికిత్స.. క్రీ.పూ. 5000 సంవత్సరాల కాలంలో మన దేశంలోనే ప్రారంభం కావడం విశేషం. ఆ కాలంలో రుషులు, మహామునులు ఈ వైద్యం ద్వారా రోగాలను నయం చేసినట్టు చారిత్రక ఆధారాలు కూడా ఉండడం విశేషం.
అరిచేతులు, అరికాళ్లలో శరీరంలోని వివిధ అవయవాలకు సంబంధించినటువంటి పాయింట్స్‌ ఉంటాయి. వీటిని యాక్టివేట్‌ చేయడం ద్వారారిప్లెక్షాలజీ లో చికిత్సలను నిర్వహిస్తారు. నడుము నొప్పి, మోకాళ్ల నొప్పులు, వెన్ను నొప్పులకు సంబంధించిన సమస్యలు ఈ వైద్యంతో పూర్తిగా నయమవుతాయని ఆక్యుప్రెషర్‌ /రిప్లెక్షాలజీ థెరపిస్ట్‌లు డాక్టర్‌ కె.నారాయణ, డాక్టర్‌ శ్రీనివాస్‌లు తెలిపారు. ఇవేగాకుండా ఐటి ఉద్యోగులకు స్పాండిలైటిస్‌ (మెడ, భుజాల నొప్పులు), నడుము నొప్పి, నిద్ర ఉండకపోవడం వంటి వాటిని ఈ చికిత్స ద్వారా పూర్తిగా నయం చేయవచ్చన్నారు. ఉదా: ఆక్యుప్రెజర్/రిప్లెక్షాలజీ  పద్ధతితో ఒక బొటనవేలును మరో బొటనవేలుతో నెమ్మదిగా ఒత్తటంవల్ల మెదడు ఉత్తేజితమై ఏకాగ్రత పెరుగుతుంది. ఎక్కువసేపు చదువుకునేవాళ్లు మధ్యమధ్యలో ఇలా చేయటం మంచిది.
ఆక్యుప్రెషర్‌/రిప్లెక్షాలజీ  ద్వారా గుండెజబ్బులు, ఆస్తమా, కిడ్నీ దెబ్బతినడం వంటి వ్యాధులకు చికిత్సలతో పాటు ఆడవారికి సంబంధించిన గైనిక్‌ సమస్యలను సైతం నయం చేయవచ్చు. నేడు ఈ వైద్య విధానం చైనా, జపాన్‌, థాయిలాండ్‌ తదితర దేశాల్లో విశేష ప్రాచర్యాన్ని పొందింది.
  • Some more details about accupressure/replexology Treatment(in Telugu),

మన శరీరంలోని ప్రతి అవయవమూ కండరాలు, నాడీ వ్యవస్థలతో పనిచేస్తుందనే సంగతి విదితమే. ఒక్కో శరీర భాగానికి సంబంధించి ఒక్కోచోట నాడులు కేంద్రీకృతమై వుంటాయి. వాటిపై ఒత్తిడి కలిగించి ప్రేరణ కలిగించి నట్లయితే ఆయా భాగాల్లో ఏర్పడిన లోపాలు సవరించబడి సక్రమంగా పనిచేస్తాయి. ఈ సనూత్రం ఆధారంగా కనిపెట్టిన చికిత్సావిధానమే రిఫ్లెక్సాలజీ.
శారీరకంగా అలసిపోతున్నారా? మానసికంగా ఆందోళన చెందుతున్నారా? రక్తపోటు, తలనొప్పి లాంటి రుగ్మతలు పీడిస్తున్నాయా? టెన్షన్‌కు గురవుతున్నారా? జ్ఞాపకశక్తి తగ్గిపోతోందా? ఇవన్నీ చిరాకుపెట్టే అంశాలే. బాధించే లక్షణాలే. స్థిమితం లేకుండా చేసి అనుక్షణం వేధించే భూతాలే. కానీ, ఇకపై ఇలాంటి సివ్టుమ్స్‌కు ఎంతమాత్రం చింతించాల్సిన అవసరం లేదు. వీటిని తరిమికొట్టే రిఫ్లెక్సాలజీ చికిత్స అమెరికా, బ్రిటన్‌ లాంటి అనేక దేశాల్లో ఎందరో చేయించుకుంటున్నారు. సత్వర ఫలితం కనిపించడంతో అనేకమంది ఈ రకమైన చికిత్స చేయించుకునేం దుకు ముందుకొస్తున్నారు. త్వరలో మనదేశంలోనూ అమలుచేసే అవకాశాలు ఉన్నాయి. ఇంతకీ రిఫ్లెక్సాలజీ చికిత్స ఎలా చేస్తారో, దానివల్ల ఎంతటి ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకుందాం.
పోటీ ప్రపంచంలో రోజురోజుకీ వత్తిడి పెరుగు తోంది. ఆందోళన కారణంగా నిద్రలేమి, జ్ఞాపకశక్తి తగ్గడం, ఇతరత్రా అనేక శారీరక, మానసిక జబ్బులు వస్తున్నాయి. ఇది నానాటికీ విస్తరిస్తోంది. ఎందరో ఈ రకమైన లక్షణాలతో ఇబ్బంది పడ్తున్నారు. చదువు, ఉద్యోగాల వేటలో ఉరుకులు, పరుగులు.. కెరీర్‌ డెవలప్‌మెంట్‌లో భాగంగా మరింత వత్తిడి. ఇల్లు, పెళ్ళి లాంటి అంశాల్లో మరో రకమైన అలసట. వెరసి జీవితమే ఒక పరుగు పందెం. ఒక రేస్‌ తర్వాత మరో రేస్‌. నిరంతరం గెలుపు దిశగా పరుగులెత్తడం. వత్తిడితో కూడిన విజయాలు, విషాదంతో కూడిన పరాజయాలు. ఈ మితిమీరిన వత్తిడి మానసిక ఆందోళనకు కారణమౌతోంది. అందుకే పెరిగిన పోటీలాగే జబ్బులూ పెరిగాయి. దాంతో ముఖంలో కాంతి పోవడం, కంటి కింద నల్లటి వలయాలు, కళ్ళలో కాంతి కరువవడం లాంటివి పైకి కనిపించే లక్షణాలు. కాగా, గుండె దడదడలాడటం, ఆకలి మందగించడం, నిద్రలేమి, అంతూఅదుపూ లేని ఆలోచనలు, అస్థిమితం, ఆందోళన లాంటివి ఇబ్బంది పెట్టే కొన్ని లక్షణాలు ‌.
  • రిఫ్లెక్సాలజీ చికిత్స ఎలా చేస్తారంటే..
ఇదొకరకమైన మసాజ్‌ లాంటిది. పాదాలు, చేతులు లాంటి శరీర భాగాలను.. మర్దనతో పాటు ఆక్యుపంచర్‌ను జతకలుపుతారు. వేళ్ళతో నొక్కడంవల్ల రక్తప్రసరణ, నాడీ వ్యవస్థలను పునరుద్ధరిస్తారు. లేనిపక్షంలో శరీరంలోని కొన్ని కొన్ని ప్రాంతాల్లో కణాలు గూడుకట్టుకుని చిన్ని చిన్ని గింజల్లా లేదా కణుపుల్లా తయారౌతాయి. రిఫ్లెక్సాలజీ ప్రక్రియ ద్వారా అలాంటి భాగాలను బాగా మర్దన చేసి తొలగించగల్గుతారు. దాంతో మెదడులోని కండరాలు శక్తివంతంగా పనిచేస్తాయి. ఆక్యుప్రెషర్‌ సాయంతో ఆక్యుపంచర్‌ కేంద్రాలను ప్రేరేపించినట్లవు తుంది. మొద్దబారిన భాగాలు తిరిగి చురుగ్గా పనిచేస్తాయి. శరీరము, మెదడు కూడా ఉపశమనం పొంది సక్రమంగా పనిచేస్తాయి. ముఖ్యంగా కాస్మొటాలజీ లొ ముఖాన్ని మునివేళ్ళతో నొక్కుతూ కండరాలను ప్రేరేపిస్తారు. ఫేషియల్‌ రిఫ్లెక్సాలజీ మరింత ప్రయోజనకరంగా వుంది.
రిఫ్లెక్సాలజీ చికిత్సకు క్రీములు, లోషన్లు లాంటి ఏ మందులతో పనిలేదు. కానీ, దివ్య ఔషధంలా పనిచేస్తుంది. పాదాలు, చేతులు, చెవులు, బొటలవేలు, ఇతర వేళ్ళపై ఆక్యుప్రెషర్‌ను పంపుతారు. అవసరమైన భాగాల్లో మునివేళ్ళతో చక్కగా మర్దన చేస్తారు. దీనికి నూనెలు కానీ ఏ రకమైన ద్రవాలు కానీ ఉపయోగించనక్కర్లేదు. ఒక సంవత్సరకాలంగా ఈ చికిత్స విస్తృత ఆదరణ పొందింది. కొన్ని కొన్ని మెడిసిన్లవల్ల జబ్బులు నయమైనప్పటికీ చాలాసార్లు వెంటనే రియాక్షన్‌ రావడం లేదా దీర్ఘకాలంలో సైడ్‌ ఎఫెక్ట్స్‌ వుండటం చూస్తుం టాం. కానీ, రిఫ్లెక్సాలజీవల్ల అలాంటి కష్టనష్టాలేమీ వాటిల్లే అవకాశం లేదు. ఇది బిగుసు కున్న కండరాలను సహజస్థితికి తెస్తుంది. రక్తప్రసరణ సాఫీగా జరిగేలా చేసి, నాడీవ్యవస్థను క్రమబద్ధం చేస్తుంది. టెన్షన్ను తగ్గిస్తుంది. ఏ రకమైన మెడిసిన్లు వాడకుండానే సహజసిద్ధంగా పనిచేసి శరీరం చురుగ్గా పనిచేసేట్లు ప్రేరేపిస్తుంది.
  • నియమ-నిబంధనలు :
రిఫ్లెక్సాలజీకి సంబంధించి నియ మాలు, నిబంధనలు అంటూ ఏమీ లేవు. మన శరీరంలోని ప్రతి అవయవమూ కండరాలు, నాడీ వ్యవస్థలతో పనిచేస్తుందనే సంగతి విదితమే. ఒక్కో శరీర భాగానికి సంబంధించి ఒక్కోచోట నాడులు కేంద్రీకృతమై వుంటాయి. వాటిపై ఒత్తిడి కలిగించి ప్రేరణ కలిగించి నట్లయితే ఆయా భాగాల్లో ఏర్పడిన లోపాలు సవరించబడి సక్రమంగా పనిచేస్తాయి. ఈ సనూత్రం ఆధారంగా కనిపెట్టిన చికిత్సావిధానమే రిఫ్లెక్సాలజీ. దీని వల్ల ప్రధానంగా శారీరక అలసట, మానసిక ఆందోళన తగ్గుతాయి. క్షీణించిన జ్ఞాపకశక్తి మెరుగవుతుంది. ఇన్‌సోమ్నియాతో బాధపడ్తున్నవారు ఇకపై హాయిగా, ఆనందంగా నిద్రపోగల్గుతారు. మల్టిపుల్‌ స్లెరోసిస్‌ పేషెంట్లకు కూడా ఈ చికిత్స వల్ల ఎంతో మేలు జరుగుతోంది. మూత్రపిండ సంబంధమైన వ్యాధులు సైతం నయమౌతు న్నాయి.
మన శరీరం పది సమానమైన భాగాలుగా విభజించబడ్తుంది. కుడివైపు ఐదు, ఎడంవైపు ఐదు భాగాలుంటాయి. మూడు ట్రాన్స్‌వర్స్‌ లైన్లుంటాయి. భుజం వద్ద ఒకటి, నడుంవద్ద ఒకటి, కింది భాగంలో ఒకటి వుంటాయి. వీటిపై అవసరమైనంత ప్రెషర్‌ను కలుగజేసి శరీర భాగాలు సక్రమంగా పనిచేసేలా చూస్తారు. ఎందరెందరికో ఈ చికిత్స ఉపశమనం కలిగించడంవల్ల పెద్ద పెద్ద డాక్టర్లు కూడా రిఫ్లెక్సాలజీగురించి ఆలోచిస్తున్నారు.
శరీరంలో అక్కడక్కడా బ్లాకేజ్‌లు కనిపించడం సాధారణం. పైపైన చూస్తే ఇలాంటివి స్పష్టంగా కనిపించవు. రిఫ్లెక్సాలజీ చికిత్సలో మునివేళ్ళతో జాగ్రత్తగా, అవసరమైనంత వత్తిడి కలుగజేస్తూ మర్దన చేసినప్పుడు వేళ్ళకు ఈ బ్లాకేజ్‌లు తెలిసొస్తాయి. వాటిని నిర్మూలించి నొప్పి, వత్తిడి తగ్గేలా చేస్తారు. శరీరంలో విడుదలయ్యే ఎండార్ఫిన్స్‌ లాంటి రసాయనాల వల్ల కూడా వత్తిడి, ఆందోళన పెరుగుతాయి. వీటన్నిటినీ బ్యాలెన్స్‌ చేయడంలో రిఫ్లెక్సాలజీ ఉపయోగపడ్తుంది. ఇదేదో ''తూతూ మంత్రం, తుమ్మాకు మంత్రం'' బాపతు కాదు. శాస్త్రీయంగా అత్యంత శక్తివంతమైన ఔషధాయుధం అని తేలింది.
ప్రస్తుతం రిఫ్లెక్సాలజీ చికిత్స ఆసియా, యూరప్‌, ఆఫ్రికా, ఉత్తరమెరికా దేశాల్లో బాగా ప్రాచుర్యం పొందింది. ఇప్పుడు ఇంగ్లండులో ఈ చికిత్స ఎక్కువగా జరుగుతున్నప్పటికీ, ఇది మొట్టమొదట చైనాలో మొదలైందని చెప్పాలి. దాదాపు 5 వేల సంవత్సరాల క్రితమే చైనాలో ఈ పద్ధతిని ప్రాక్టీస్‌ చేశారు. ఇక ఉత్తరమెరికాలోనూ దీనికి బాగా ఆదరణ వుంది. జపాన్‌దేశంలో దీన్ని జొకు షిన్‌ డొ అని పిలుస్తారు. జపాన్‌లో ఎక్కువగా కాలి పాదాన్ని రకరకాలుగా మసాజ్‌ చేసే టెక్నిక్‌ అమల్లో వుంది.
ఈ ప్రాచీన జొకు షిన్‌ డొ పద్ధతి అనంతర కాలంలో అనేక మార్పుచేర్పులను సంతరించుకుంది. చైనాలో చేతివేళ్ళపై సూదులతో ఆక్యుప్రెషర్‌ కలిగించడం ద్వారా ఆక్యుపంచర్‌ చేసే పద్ధతి ప్రపంచవ్యాప్తంగా జనాదరణ పొందింది. తలనొప్పి, సైనోసైటిస్‌ లాంటి దీర్ఘకాలిక వ్యాధులను సైతం ఆక్యుపంచర్‌ద్వారా తగ్గించడం సాధారణం. ఈ చైనా ఆక్యుపంచర్‌ సూత్రమే ఇవాళ్టి ఆధునిక రిఫ్లెక్సాలజీ చికిత్సకు మూలం.
ఈజిప్టు దేశస్తులు కూడా అతి పూర్వకాలంలోనే పాదాలను నొక్కి వత్తిడి కలిగిస్తూ చికిత్స చేసేవారు. అయితే వీళ్ళు ఒక్కొక్కరూ ఒక్కో విధంగా ప్రాక్టీస్‌ చేసినందువల్ల ఈ రకమైన చికిత్సకు సరైన పద్ధతి, ప్రణాళిక లేకపోయాయి.
ప్రస్తుతం అమల్లో ఉన్న రిఫ్లెక్సాలజీ చికిత్సను 1913లో అమెరికా సంయుక్త రాష్ట్రాలకు చెందిన ఈ.ఎన్‌.టి. స్పెషలిస్టులు (చెవి, ముక్కు, గొంతు స్పెషలిస్టులు) డాక్టర్‌ విలియం హెచ్‌. ఫిజరాల్డ్‌, డాక్టర్‌ ఎడ్విన్‌ బోవర్స్‌ పరిచయం చేశారు. ''ఇలా శరీర భాగాలపై వత్తిడి కలిగించడంవల్ల ఇతర భాగాల్లో ఒకలాంటి మత్తు ఆవరిస్తుంది'' అన్నారు ఫిజరాల్డ్‌. అమెరికాలోని రిఫ్లెక్సాలజిస్టులు, ఆధునిక పద్ధతులను ఇంప్లిమెంట్‌ చేస్తూనే, ఇంగమ్స్‌ థియరీలను మొదట క్షుణ్ణంగా అధ్యయనం చేస్తారు.
రిఫ్లెక్సాలజీ దివ్య ఔషధంలా పనిచేస్తున్న మాట వాస్తవమే. అయితే శాస్త్రీయంగా అధ్యయనం చేసి, అందులో తర్ఫీదు పొందినవారి వద్ద చికిత్స చేయించుకుంటేనే తగిన ప్రయోజనం వుంటుందని గుర్తించాలి. చవకగా ట్రీట్‌మెంట్‌ చేస్తున్నారనో లేక అందుబాటులో ఉన్నారనో, ఒక ప్రయోగం చేసిచూద్దామనో ఎవరో ఒకరి దగ్గర చికిత్స చేయించుకుంటే ఆశించిన మేలు జరక్కపోవచ్చు. ఒక్కోసారి రోగం ముదిరి, మరింత ప్రమాదకరంగా మారే అవకాశమూ వుంది. కనుక తస్మాత్‌ జాగ్రత్త అని హెచ్చరిస్తున్నారు నిపుణులు.
రిఫ్లెక్సాలజీ చికిత్సలో ఫేషియల్‌ రిఫ్లెక్సాలజీ మరింత చెప్పుకోదగ్గది. దీనివల్ల త్వరిత ప్రయోజనం కనిపిస్తోంది. ఈ చికిత్సలో గొప్ప ప్రయోజనం పొందిన కొన్ని కేసుల గురించి క్లుప్తంగా తెలుసుకుందాం.
పశ్చిమ యోర్క్‌షైర్‌లో బెలిండా ఒక మహిళ 18 సంవత్సరాలుగా డిప్రెషన్‌తో బాధపడ్తోంది. మధ్యమధ్యలో కొంత తగ్గినప్పటికీ ఇన్నేళ్ళుగా ఆమె దాన్నుండి పూర్తిగా బయటపడలేదు. మొదటిసారి డెలివరీ సమయంలో ఆమెకి డిప్రెషన్‌ వచ్చింది. ఒక్కసారిగా జీవనశైలి మారిపోవడంతో అలా జరిగింది. అనేకసార్లు తీవ్ర అలజడికి గురవడము, రాత్రులు నిద్రపట్టకపోవడము, ఉదయం వేళల్లో విపరీమైన ఆందోళనకు గురవడము, మధ్యాహ్నం వరకూ ఏడవడము, అజీర్తి, గాస్ట్రిక్‌ ట్రబులు లాంటి లక్షణాలతో ఆమె శారీరకంగా, మానసికంగా బాధపడింది. మొత్తానికి రిఫ్లెక్సాలజీ గురించి తెలుసుకుని ఆ సెంటరుకు వెళ్ళి అన్ని విషయాలూ విడమర్చి చెప్పింది. వారానికి ఒకసారి చొప్పున 5 సిట్టింగులు పూర్తయ్యేసరికి ఆమెలో నిద్రలేమి అంతరించి హాయిగా నిద్రపోసాగింది. అజీర్తి కూడా పూర్తిగా తగ్గిపోయింది. మరి కొన్ని వారాల చికిత్స తర్వాత ఆందోళన కూడా తగ్గింది. ఆమె ఇప్పుడు పూర్తి నార్మల్‌ స్థితికి వచ్చి చక్కగా ఉద్యోగం చేసకుంటూ పిల్లలతో ఆనందంగా జీవించగల్గుతోంది.
మరో వ్యక్తి ఒకరకమైన ఎలర్జీతో బాధపడ్తున్నాడు. అదెంత తీవ్రంగా వుండేదంటే అతనికి జలుబు చేసి, ఏ మందులు వాడినా ఆర్నెల్లపాటు తగ్గలేదట. రోజురోజుకీ ఉత్సాహం తగ్గిపోసాగింది. శరీరం, మనసు కూడా నిద్రాణంగా తయారయ్యాయి. శారీరకంగా, మానసికంగా నరకయాతన అనుభవించాడు. డాక్టర్లు పెయిన్‌ కిల్లర్లే శరణ్యమని చెప్పి స్ట్రాంగ్‌ డోసులు ఇవ్వసాగారు. ఆ దశలో అతనికి రిఫ్లెక్సాలజీ గురించి తెలిసి చికిత్సకోసం వెళ్ళాడు. ఐదు వారాల్లో అతనిలో గొప్ప మార్పు కనిపించింది. నాసికా రంధ్రాలు పూర్తిగా తెరుచుకున్నాయి. ఊపిరాడకపోవడం, జలుబు తగ్గాయి. నొప్పికి మాత్రలు వేసుకోవడం మానేశాడు. ఇప్పుడతను ఎంతో ఉల్లాసంగా కనిపిస్తున్నాడు. ఈ చికిత్స గురించి మాట్లాడ్తూ ''రిఫ్లెక్సాలజీ నిజంగా అద్భుతమైన ట్రీట్‌మెంట్‌. నొప్పి, మానసిక ఆందోళన కూడా తగ్గిపోయాయి. ఇది క్షణాల్లో లేదా రోజుల్లో తగ్గదు. వ్యాధి తీవ్రతను బట్టి కొన్ని నెలలు చేయించుకోవాల్సి వుంటుంది. నాది దీర్ఘకాలిక వ్యాధి కనుక నేను ఇప్పటికీ రిఫ్లెక్సాలజీ చేయించుకుంటున్నాను, ఇంకా కొంతకాలం చేయించుకుంటాను.. ఇది ఎంత ప్రయోజనకరమైందని రుజువైంది'' అంటూ ఆనందంగా చెప్పుకొచ్చాడు.
ఇవి మచ్చుకు రెండు ఉదాహరణలు మాత్రమే. వందలాదిమంది రిఫ్లెక్సాలజీ చికిత్సతో లాభం పొందుతున్నారు. త్వరలో మనదేశంలోనూ రిఫ్లెక్సాలజీ సెంటర్లు వస్తాయి. అందాకా ఓపికపడదాం.
పై ఫొటోలో చూపించినట్టు రోజూ 5-10 సార్లు అరచేయి మధ్యలో నొక్కడం వలన మూత్రపిండాల సమస్య నుండి బయటపడవచ్హు. మూత్రపిండాల సమస్య లేనివారు కూడా ఈవిధంగా చేయవచ్హు. కాని మరీ ఎక్కువగా చేయడం కూడా సమస్యే. ప్రయత్నించి లాభించండి
మూలము : Harison Text book of medicine , Text book of alternative medical therapy. Text book for students of Acupuncture treatment.


  • =======================================

thumbnail

Activity disorder of Children-పిల్లల చురుకుదనము లో తగ్గుదల

పిల్లల చురుకుదనము లో తగ్గుదల , Activity disorder of Children


పిల్లలు డల్ గా ఉంటూ, తమ చుట్టూ ప్రక్కల్ జరిగే విషయాల మీద ఆసక్తి ప్రదర్శించకుండా ఉంటుంటే… అది తప్పకుండా పట్టించుకోవలసిన విషయమే. ఇలా పిల్లలు అనాసక్తికరంగా ప్రవర్తించడాన్ని. ఎటెన్షన్ డిఫిసిట్ హైపర్ ఆక్టివిటీ డిజార్డర్ (ఎ.డి. హెచ్ . డి.)( Attention Deficit Hyper Activity Disorder) అంటారు.ఎ.డి. హెచ్ . డి. అంటే…పిల్లల్లో మొదట్లో చాలా చురుగ్గా అంటే ఆక్టివ్ గా ఉంటారు. కాలక్రమేణా చప్పబడిపోతారు. ఇలా ఒక్కసారిగా వారి ప్రవర్తనలో విపరీతమయిన మార్పు సంభావిస్తుందన్న మాట. మెదడు ఎదుగుదల సక్రమంగా లేనప్పుడే ఈ పరిస్థితి సంభవిస్తుందని శాస్త్రవేత్తలు స్పష్టీకరిస్తున్నారు. మెదడు మొదటి అయిదేళ్ళలో అత్యధిక ఎదుగుదల రికార్డు చేస్తుంది. శరీరంలోని హార్మోన్లు, తినే ఆహారంలోని విటమిన్లు ఈ విషయంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. జన్యు సంబంధం అంటే తల్లిదండ్రులతో ఎవరికైనా మెదడు సరిగా లేకపోతే పిల్లలకు ఈ పరిస్థితి రావచ్చు. మేనరిక వివాహలలో జన్మించిన పిల్లలు సాధారణంగా ఇవి తక్కువగా ఉండటానికి కారణం ఈ రకమైన జన్యు సంబంధమైన లోపాలే…పసికట్టడమెలా..క్లాస్ రూమ్ లో తోటి పిల్లలతో వీరి ప్రవర్తన ఎలా వుందో తెలుసుకుంటూ వుండాలి. పిల్లల స్నేహితులేవరు.. వాళ్ళు మన పిల్లలతో ఎలా ఉంటున్నారు? ఈ విషయాలు తెలిస్తే పిల్లాడి ప్రవర్తన అంచనా వేయవచ్చు.జాగ్రత్తలు :ఆరోగ్యకరమైన ప్రశాంత వాతావరణాన్ని పిల్లలచుట్టూ ఏర్పరచాలి.క్రియేటివిటీకి స్థానం ఉండేటట్లు చేయాలి.సంగీతం నేర్పడం… పెయింటింగ్ వేయడం… డ్యాన్స్ అంటే నృత్యం… మ్యూజిక్ అనుగుణంగా చిందులు వేయడం నేర్పితే వాళ్ళల్లో ఆహ్లాదకర భావాలు మొదలవుతాయి. కొంత వారి మానసిక పరిస్థితిని అదుపు చేయడానికి, ఎదుగుదలకు తోడ్పడుతుంది.
  • ==================================

thumbnail

Pimples-మొటిమలు

Pimples , మొటిమలు

[pimple-main_Full.jpg] 


టీనేజ్‌ నుంచి మధ్యవయసు వచ్చేవరకు ఆడవారిని ఎక్కువగా బాధించే సమస్యలలో మొటిమలు ఒకటి. మొటిమలు మహిళల సౌందర్యాన్ని సవాల్‌ చేసే సమస్య. మగ వారిలో కుడా కనిపించును . పింపుల్స్‌ సాధారణంగా 12 సంవత్సరాల నుండి 25 సంవత్సరాల వరకూ రావడం జరుగుతుంది.
మృదుత్వంతో మెరిసిపోవాల్సిన మోముపై చిన్న మొటిమ వస్తే.. అమ్మాయిల కంగారు అంతాఇంతా కాదు. అది తగ్గేదాకా రకరకాల చికిత్సలు ప్రయత్నిస్తారు. చాలామందిని వేధించే ఈ మొటిమలు ఎందుకు వస్తాయి.. నిర్లక్ష్యం చేస్తే ఎదురయ్యే ఇతర సమస్యలు గురించి వివరంగా తెలుసుకుందాం.
కౌమారదశలో ప్రవేశించే వారికే మొటిమల సమస్య ఉంటుందనుకుంటారు చాలామంది. నిజానికి, నలభై ఏళ్లు పైబడినవారికీ వస్తాయివి. కేవలం ముఖంపైనే కాదు.. చేతులు, ఛాతి, వీపు వంటి భాగాలపైనా మొటిమలు వస్తాయి. నాలుగు స్థాయుల్లో వేధించే ఈ సమస్య తీవ్రత కొందరిలో ఎక్కువగా ఉంటుంది. మొటిమలు వచ్చి తగ్గడంతో పాటు.. కొందరికి మచ్చలు పడితే.. మరికొందరికి గుంటల దాకా దారితీస్తాయి. అవి తగ్గడానికి చాలా సమయం పడుతుంది. ఎంతో బాధించే వీటి రాకకు కారణాలనేకం.
  • హార్మోన్లలో చోటుచేసుకునే మార్పులు.. 
  • చర్మంలో నూనె గ్రంథుల పనితీరు,
  •  బ్యాక్టీరియల్‌ ఇన్‌ఫెక్షన్‌ వంటివి ఇందుకు ప్రధాన కారణాలు. 
  • పరోక్షంగా ఒత్తిడితోనూ కొన్నిసార్లు వస్తుంటాయి. 
  • పీసీఓడీ (పాలిసిస్టిక్‌ ఓవరీస్‌) సమస్య, 
  • కొన్నిరకాల ఉత్ప్రేరకాలు, 
  • గర్భనిరోధక మాత్రలు, 
  • క్షయకు వాడే మందులు.. వంటివీ ఈ సమస్యకు దారితీస్తాయి.

ఏర్పడే విధానము:
మొటిమలు (Acne) స్వేదగ్రంధులకు సంబంధించిన చర్మ వ్యాధి. మొటిమలు ముఖము పైనే కాకుండా మెడ, భుజము, ఛాతి పైన కూడా పుడుతూ ఉంటాయి. 70% నుండి 80% వరకు యువతీ యువకులలో ఇవి కనిపిస్తాయి. యవ్వనములో హార్మోనులు (ఆడువారిలో-ఈస్త్రోజన్, ప్రొజిస్త్రాన్, మగవారిలో-టెస్టోస్టిరాన్) సమతుల్యము (ratio) లోపించడము వలన సబేసియస్-గ్రంధులు నుండి సెబమ్ (oil like substance) ఎక్కువగా తయారై మొటిమలకు దారితీస్తుంది. మొటిమలు చిన్నవి, పెద్దవి అని రెండు రకాలుగా ఉంటాయి. చిన్నవి యుక్తవయసులో కొద్దికాలము పాటు కనిపించినా ఎటువంటి బాధ ఉండదు, వీటివలన ముఖముపై మచ్చలు ఏమి మిగలవు. పెద్దవి-Acne vulgaris అనేవి నొప్పి, దురదతో కూడికొని ముఖముపై మచ్చలు ఏర్పడే రకము. సాదారణముగా మొటిమలు ముఖముపైనే కాక మెడపైన, భుజాలపైన, ఛాథిపైన కూడా పుట్టవచ్చును.
ముఖముపైన ఉండే నూనె గ్రంధులు (sabesious glanda) చర్మములోని వెంట్రుకల కుదుల్లలో ఉండి యుక్తవయస్సులో ఎక్కువగా జిడ్డును తయారుచేయును. వెంట్రుక కుదుల్ల రంద్రాలు మూసుకుపోవడము వలనో, బయటి సూక్షమజీవుల (ex. proprioni bacterium acnes) వలనో ఇన్పెక్షన్ కి గురై పుండుగా మారి, పుండుమానిపోయి మచ్చగా మిగులును. చిదపడము, గోకడము వలన గోళ్ళనుండి ఇన్పెక్షన్ అయి ఎక్కువగా బాదపెట్టును. ఆహారపదార్దములు ముఖ్యముగా నూనెలు, క్రొవ్వులతో కూడిన పదార్దములు తినడము వలన మొటిమలు వస్తాయన్నది అపోహ మాత్రమే.

మొటిమలుపై ప్రభావితము చూపే అంశాలు
* మానసిక వత్తిడి ఎక్కువైనపుడు* ఆడు వారిలో PCOD (Poly Cystic Overian Disease) వున్నపుడు* వంశపారంపర్యము (కొంతవరకు)* ఆయిలీ స్కిన్ తత్వం ఎక్కువ వుండడం
పర్సనల్  జాగ్రత్తలు :-
* ముఖము రెండుపూటలా సబ్బుతో కడుగుకోవాలి* జిడ్డుముఖమైతే నూనె, కొవ్వు పదార్దములు తినడము తగ్గించాలి.* ప్రతిరోజూ వ్యాయామము చేయాలి* మొటిమలు చిదపడము , గోకడము చేయరాదు.* గట్టిగా తువ్వాలు తో ముఖము తుడవరాదు.
నివారణ- పింపుల్స్‌ను గిల్లకూడదు- మానసిక ఆందోళనను నివారించడానికి ప్రాణాయామం, యోగా చేయాలి.- తాజాగా ఉన్న ఆకుకూరలు, పండ్లు, కాయగూరలు తీసుకోవాలి.- నిలువ ఉంచిన ఆహార పదార్థాలను తినకూడదు- మలబద్ధకం లేకుండా జీర్ణశక్తి బాగా ఉండేలా చూసుకోవాలి.- స్వీట్స్‌, కూల్‌డ్రింక్స్‌, కేక్స్‌, ఆయిల్‌ ఫుడ్స్‌, వేపుళ్లు, కొవ్వు అధికంగా ఉన్న ఆహార పదార్థాలు తినకూడదు.- గోరు వెచ్చని నీటితో ముఖాన్ని రోజుకు 4 నుంచి 6సార్లు శుభ్రపరచుకోవాలి.- మార్కెట్‌లో లభించే రకరకాల క్రీములను, లోషన్‌లు వైద్యసలహా లేకుండా రాయకూడదు.- సున్నిపిండితో ముఖాన్ని శుభ్రం చేసుకోవడం చాలా మంచిది.- రోజుకు సరిపోయే స్థాయిలో నిద్ర ఉండేలా చూసుకోవాలి.పింపుల్స్‌ ఎక్కువగా ఉన్నప్పుడు ప్రకృతిసిద్ధ మైన పౌష్టిక ఆహారాన్ని తీసుకుంటూ, ఎక్కువ కేలరీలు ఉన్న ఆహార పదార్థాలు మానేయాలి.
వైద్యం
శరీరములో హార్మోనులు అసమతుల్యత కొంతకాలానికి - సుమారుగా 1 సం. నకు, సర్దుకోవడము వలన మొటిమలు వాటంతటవే పోతాయి, మళ్ళీ పుట్టవు.
పెద్ద మొటిమలు వున్నవాళ్ళు -
  • క్లిండామైసిన్+అయిసోట్రిటినోయిన్ , కలిసివున్న ఆయింట్ ను వాడాలి (eg. Clindac-A ointment)
  • Femcinol -A skin ointment ... apply daily two times.
  • డాక్షిసైక్లిన్ (Doxycycline)100 mg రోజుకి ఒకటి చొప్పున 7-10 రోజులు వాడాలి.
  • మచ్చలు పోవడానికి "అలొవెరా " తో కూడిన ఆయింట్మెంట్ (eg. Aloderm-B ointment) సుమారు నెల రోజులు వాడాలి.
ప్రత్యామ్నాయాలున్నాయి...మొటిమలు త్వరగా నయం కావాలంటే.. కొన్నిరకాల పీల్స్‌, లేజర్లు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. అలాంటివాటిల్లో శాలిసిలిక్‌ యాసిడ్‌, మాండలిక్‌ యాసిడ్‌, గ్త్లెకోలిక్‌ యాసిడ్‌ ఉన్న పీల్స్‌ ఎంచుకోవాలి. ఈ చికిత్సను రెండు వారాలకోసారి ఆరు నుంచి ఎనిమిది విడతల వారీగా చేస్తారు. ఈ చికిత్సతో పాటు మందులు కూడా సూచిస్తారు వైద్యులు. అప్పుడే ఫలితం త్వరగా ఉంటుంది. పరిస్థితిని బట్టి లేజర్‌ చికిత్స కూడా మరో ప్రత్యామ్నాయం.
లేజర్‌ చికిత్సలున్నాయ్‌...మోముపై గుంటలకు లేజర్‌, డెర్మారోలర్లు అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ గుంటల్ని పూర్తిగా నివారించాలంటే.. ముందు మొటిమల్ని పూర్తిగా నివారించడం తప్పనిసరి. అప్పుడే గుంటల్ని పూర్తిగా తగ్గింవచ్చు. వీటికోసం అందుబాటులో ఉన్న రెండుమూడు రకాల లేజర్‌ చికిత్సల్లో ఫ్రాక్షనల్‌ సీఓ2, అర్బియం గ్లాస్‌, ఎన్డీయాగ్‌, ఐపీఎల్‌.. వంటివి కొన్ని. ఈ చికిత్సను నెలకోసారి మూడు, నాలుగు విడతల్లో చేస్తారు. డెర్మారోలర్‌ అయితే.. ఐదు విడతల్లో నెలకోసారి చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ రెండింటినీ కలిపి కూడా చేయవచ్చు.
ఈ రెండూ వద్దనుకుంటే.. ఫిల్లర్లు ప్రయత్నించవచ్చు. ఇవి తాత్కాలికం, సెమీ పర్మనెంట్‌, శాశ్వత పద్ధతుల్లో ఉంటాయి. తాత్కాలిక ఫిల్లరయితే.. ఆ ఫలితం ఆరు నుంచి ఎనిమిది నెలలు మాత్రమే ఉంటుంది. సెమీ పర్మనెంట్‌ చేయించుకుంటే.. ఏడాది నుంచి ఏడాదిన్నర దాకా పనిచేస్తుంది. శాశ్వత ఫిల్లర్‌తో ఐదు నుంచి ఎనిమిదేళ్ల వరకు గుంటలు కనిపించవు. ఈ చికిత్సను మాత్రం ఒకేసారి చేస్తారు.

ఆడవారికి వీటిని దూరం చేసి ముఖసౌందర్యాన్ని కాపాడుకోవడానికి కొన్ని గృహ-చిట్కాలు...
  • ఒక చెంచా గంధపు పొడిలో చిటికెడు పసుపు, కొద్దిగా పాలు పోసి కలిపి ముఖానికి రాస్తే క్రమేణా మొటిమలు తగ్గుతాయి.
  • మొటిమలు తగ్గడానికి రెండు రోజులకొకసారి అర కప్పు ఆలోవెరా గుజ్జుని సేవించండి లేదా చర్మం మీదకూడా పూయవచ్చు. గర్భిణులు ఆలోవెరా గుజ్జును సేవించకూడదు.
  • దాల్చిన చెక్కను పేస్ట్‌లా చేసి మొటిమలపై రాసి కాసేపాగి కడిగేయండి.
  • రాత్రి పడుకోబోయే ముందు గోరువెచ్చని నీటితో ముఖం శుభ్రంగా కడుక్కుని మెంతి ఆకులతో చేసిన పేస్ట్‌ని ముఖానికి పట్టించి ఆరిన తర్వాత కడిగేస్తే మొటిమలు మాయమవుతాయి.
  • ఒక టీస్పూన్ మిరియాల పొడి కానీ మిరియాలు కానీ తీసుకుని అందులో 8 వేపాకులు, 20 గ్రాముల చందనం పొడి కలిపి నూరుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి అరగంట తరువాత వేడినీటితో కడగాలి. ఇలా రోజుకొకసారి ఒక వారం రోజులపాటు వేసుకుంటే మొటిమలు రావు. ఉన్నవి తగ్గిపోతాయి.
  • కొత్తిమీర రసంలో చిటికెడు ఉప్పు కలిపి ముఖానికి రాసి అరగంట తర్వాత చన్నీటితో కడిగితే మొటిమలు పోతాయి. ఉసిరి విత్తనాలను నాలుగైదు గంటలపాటు నీటిలో నానపెట్టి తర్వాత దాన్ని రుబ్బి ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించినా కూడా మొటిమలు మాయమవుతాయి. అలాగే ఉల్లి రసం రాస్తే మొటిమలు, కాలిన గాయాల తాలూకు మచ్చలు తగ్గుతాయి.
  • కమలా పళ్ళ తొక్కలను ఎండ బెట్టి చూర్ణం చేసి మొహానికి రాసుకుంటే మొటిమలు, వాటి తాలూకు మచ్చలు కూడా పోతాయి. ముఖాన మొటిమలు, మచ్చలు, పొడలు లాంటివి ఉంటే... కొద్దిగా పొదీనా ఆకులు మెత్తగా నూరి రాత్రి పడుకునే ముందు ముఖానికి రాసి, ఉదయాన్నే శుభ్రంగా కడిగి వేయాలి. ఇలా వారం రోజులు చేస్తే మచ్చలు లేకుండాపోతాయి.
  • మొటిమలతో బాధపడేవారు బూరుగు చెట్టుకుండే ముల్లును బాగా అరగదీసి ఆ చూర్ణాన్ని పట్టించినా కూడా ఫలితం ఉంటుంది. ఇలా చేయడం వల్ల సమయానికి సమయం, డబ్బుకు డబ్బు ఆదా అవుతుంది.
మొటిమలతో జాగ్రత్తలు : 
చూడటానికి మొటిమలు చిన్నగానే ఉంటాయి గానీ యుక్తవయసు పిల్లలను తెగ ఇబ్బంది పెడతాయి. సౌందర్యపరంగానే కాదు.. మానసికంగానూ వేధిస్తాయి. అందుకే ముఖంపై ఒక్క మొటిమ కనబడినా వెంటనే గిల్లేస్తుంటారు. నిజానికి ఇలా గిల్లటం వల్ల మొటిమలు తగ్గకపోగా మరింత తీవ్రమయ్యే ప్రమాదముంది. కాబట్టి మొటిమలు గలవారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం తప్పనిసరి.
* ముఖంపై నూనె లేదా జిడ్డుగా ఉండే ఎలాంటి పదార్థాలనూ రాయకూడదు. ఇలాంటివి చర్మంలోని తైల గ్రంథులు మూసుకునేలా చేసి మొటిమలను మరింత తీవ్రం చేస్తాయి. తప్పనిసరైతేనే ముఖానికి మేకప్‌ వేసుకోవాలి. అలాగే పడుకునేప్పుడు మేకప్‌ను పూర్తిగా కడుక్కోవాలి.
* రోజూ షాంపూతో తలస్నానం చేయటం వల్ల ముఖం జిడ్డుబారకుండా ఉంటుంది. తలకు నూనె, క్రీముల వంటివి వాడితే.. అవి ముఖమంతా విస్తరించి, మొటిమలు ఉద్ధృతం కావటానికి దోహదం చేస్తాయి.
* మొటిమల సమస్య తీవ్రంగా గలవారిలో కొందరికి తైలగ్రంథుల మార్గంలో అధికంగా నూనె పేరుకుపోవటం వల్ల పసుపురంగులో గానీ నల్లగా గానీ ముఖంపై చిన్న బుడిపెలు (బ్లాక్‌హెడ్స్‌) ఏర్పడుతుంటాయి. వీటిని గిల్లటం మంచిది కాదు. దీంతో మొటిమలు తగ్గటం ఆలస్యమవుతుంది.
* రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే చర్మ సౌందర్యం కూడా మెరుగుపడుతుంది. ఇది మొటిమలు తగ్గేందుకూ దోహదం చేస్తుంది.
* కొందరు మొటిమలు తగ్గేందుకు వేసుకునే మందులను వెంటనే ఆపేస్తుంటారు. ఇది మంచి పద్ధతి కాదు. ఇలాంటి మందులు పూర్తి ప్రభావం చూపేందుకు 8 వారాల వరకు సమయం పడుతుందని గుర్తించాలి.


===============================================================