Home
/
All Posts
Wednesday, May 25, 2016
నక్షత్రం ప్రకారం పేర్లు పెట్టటానికి అక్షరాలు
Anonymous
Wednesday, May 25, 2016
|
|||||||||||||||||||||||||||||
నామకరణం
Anonymous
Wednesday, May 25, 2016
నామకరణం పేర్లు.. పెట్టాల్సినవి..పెల్టకూడనివి..
మీకు అమ్మాయా..
అబ్బాయా? ఏం పేరు పెట్టారు? ఏదో ఒక పేరు.. పేరులో ఏముంది..! అంటారా? గులాబీని మరోలా పిలిస్తే మాత్రం దాని గుబాళింపు తగ్గుతుందా? - అంటారు షేక్ స్పియర్. కరెక్టే. కానీ ఇది చేతన్ భగత్ కాలం. మోడ్రన్‌గా ఉండాలి. పేరులో ఏముంది అంటే.. కుదరదు. నేమ్‌లోనే ఫేమ్ ఉంది. పిల్లలు పుట్టకముందే స్కూల్లో సీటు రిజర్వ్ చేసుకునే జమానా ఇది. అలాంటిది పిల్లల నామకరణం విషయం అంత లైట్ తీసుకుంటుందా ఈ జనరేషన్? కదా. మరి పెట్టాల్సిన పేర్లు.. పెట్టకూడని వాటి గురించి మీకు తెలుసా?
నోరు మంచిదయితే ఊరు మంచిదవుతుంది అన్నారు. కానీ పేరు మంచిదయితే మనిషి మంచోడవుతాడు అని ఎవరైనా అన్నారా?- ఈ డౌట్ మీకెప్పుడైనా వచ్చిందా? అయితే మీరింకా 1947 మోడల్ బ్రెయిన్‌నే వాడుతున్నారన్నమాట. అందుకే ప్రపంచం ఐదో తరం (ఫిఫ్త్ జనరేషన్)లో ఉంటే మనం ఇంకా మూడో తరం(3జీ)లోనే ఉన్నాం. ఈజిప్టులో ఒక పాప పేరు.. ఫేస్‌బుక్. ఈజిప్టులో ఉద్యమానికి ఫేస్‌బుక్ ఎంతటి మౌస్ అందించిందో తెలుసా? అందుకే.. ఆ స్ఫూర్తితో పాపకు పేరు పెట్టుకున్నారు. చూశారా.. ఇక్కడ స్విచ్ వేస్తే అక్కడ లైట్ వెలిగినట్లు.. అక్కడ పాపకు పేరు పెడితే ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నాం. అదే మరి పేరుకున్న గొప్పదనం. అందుకే పిల్లల నామకరణం విషయంలో ఇవి తెలుసుకోవాలి.
ధర్మ శాస్త్రం ప్రకారం..
హిందూధర్మంలో నామకరణ మహోత్సవం అనేది పుట్టిన ప్రతివ్యక్తికీ చేయాల్సిన ఒక సంబురం. ధర్మశాస్త్రంలో చెప్పిన విధంగా షోడశ సంస్కారాలలో పుంసావన కర్మలు ముఖ్యమైనవి. ఇందులో బారసాల ఇంకా ముఖ్యం. బారసాల నాడు పెట్టిన పేరు అన్ని విధాలా మంచిది. కొంతమంది శిశువు పుట్టినప్పుడు ఉన్న నక్షత్రం ప్రకారం ఆ నక్షత్రానికి కలిసే అక్షరంతో పేరు పెడతారు. కానీ అలా పెట్టాల్సిన అవసరం లేదు. బిడ్డపుట్టిన తర్వాత బారసాల నాడు బియ్యంలో నక్షత్ర నామం, సంవత్సర నామం, వ్యావహారిక నామం అని మూడు పేర్లను రాస్తారు. అందులో మిగిలిన రెండింటికీ అంత ప్రాధాన్యత లేకపోయినా వ్యావహారిక నామానికే ప్రాధాన్యత. అందుకని ఏదైనా అవసరం ఉండి పేరు మార్చుకున్నా, అది నామమాత్రానికే కాని ఆ పేరుతో చేసే ఏ పూజలు, పనులు ఫలించవు. నిత్యనైమిత్త కర్మలన్నింటికీ ఆ పేరే వాడాలి. పేరు జీవితాన్ని ప్రతిబింబిస్తుంది. నామకరణ మహోత్సవంలో మంచి తిథిని, అనుకూల సమయాన్ని చూసి పేరు పెడతారు. అందుకని ఆ పేరుతో పిలిస్తే ఆపేరు వల్ల కలిగే లాభనష్టాలు, పాపపుణ్యాలు అతనికి ప్రాప్తిస్తాయి అని చెప్పారు ప్రఖ్యాత జ్యోతిష్య పండితులు, వేద పండితులు ఒజ్జల విఠల శాస్త్రి.
పెట్టాల్సినవి..
అమ్మాయి పుడితే బేసి సంఖ్య అక్షరాలు వచ్చేలాగా, అబ్బాయి పుడితే సరిసంఖ్య అక్షరాలు వచ్చేలా పేరు పెట్టాలి. దీని వల్ల వారికి స్మృతి, స్తుతి, సదాచార సంపన్నత అలవడతాయి. అలాగే పెట్టే పేరులో సున్నా ఉండవద్దు అనే నియమం కూడా ధర్మశాస్త్రం, శాంతుల కమలాకరం అనే గ్రంథాలలో ఉంది. ఇది అభివృద్ధి నిరోధకం. ఇప్పటికాలంలో చాలామంది పేరు ట్రెండీగా ఉండాలని, కొత్తగా ఉండాలని ఎలాంటిది పడితే అలాంటి పేరు పెడుతున్నారు. భగవంతుని పేర్లు, పెద్దల పేర్లు కలిసేలా పేరు ఉండాలి. పేరు పెట్డడం వల్ల అందరూ పదేపదే ఆ పేరుతో పిలుస్తారు. దాని వల్ల భగవన్నామ స్మరణ జరిగి పుణ్యం వస్తుంది. కానీ ఇప్పుడు అలాంటి పేర్లు పెట్టుకోవడానికి చాలామంది నామోషీ పడుతున్నారు. దేశాల ఆచారాల ప్రకారం పెద్దల పేర్లను పెట్టే సాంప్రదాయం కూడా ఉంది. ఆంధ్రప్రాంతంలో తాత సరే వారిపేరు పెడితే తెలంగాణ ప్రాతంలో చనిపోయిన పెద్దల పేర్లు తమ పిల్లలకు పెట్టుకుంటారు. పేరుపెట్టడంలో కూడా ఆంధ్ర ప్రాంత వాసులు పదకొండవ రోజు తొట్టెలలో తెలంగాణలో 21వ రోజున వేస్తారు. ఇలా సంప్రదాయలలో తేడాలు ఉన్నా ఈ వేడుకను వైభవంగా చేస్తారని దత్తోపాసకులు మాల్లాది చన్ద్రశేఖర సిద్ధాంతి.
పెట్ట కూడనివి..
పేర్లు మార్చుకుంటే కలిసొస్తుందనేది నేను సమర్థించనంటారు మైలవరపు శ్రీనివాసరావు. అది కేవలం మూఢనమ్మకం మాత్రమే. ఒకసారి పెట్టిన పేరును మార్చడానికి వీలు లేదని శాస్త్రంలో గట్టిగా చెప్పబడింది. కానీ ఈవిషయం తెలియక చాలా మంది పేరు మారిస్తే కలిసొస్తుందని అనుకుంటున్నారు. మన మనసు దేనిపట్ల అయితే పాజిటివ్‌గా ఆలోచిస్తుందో దాని పరంగానే జీవితం నడుస్తుంది తప్ప పేరును మార్చేసుకున్నంత మాత్రాన జీవితం మారిపోదు. ఇంకా కొంతమందైతే సీత, రాముడు, హరిశ్చంద్రుడు ఇలాంటి వారిపేర్లను పెట్టుకుంటే జీవితాంతం కష్టాలొస్తాయి అనే అపోహలో ఉండిపోతున్నారు. కానీ వారందరూ తమ తమ కార్యాలతో విజయాన్ని సాధించిన వారే. వారిపేరును పెట్టుకొని స్మరిస్తే మనకూ పుణ్యం. నక్షత్రాల పేర్లు, చెట్టుపేర్లు, నదుల పేర్లు పెట్టకూడదని ధర్మశాస్త్రంలో చెప్పారు. ఏమాటకామాటే చెప్పుకోవాలి ఏ పేరుతో పిలిచినా సరే, మనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకునేలా కృషి చేయాలి. నలుగురిలో ఒకడిగా కాకుండా అందరికోసం ఒకడిగా ఉండాలి. మంచిపేరును ఎంచుకోవడం మంచి పేరు తెచ్చుకోవడమే ముఖ్యం అని చెప్పారాయన.
నామ ధ్యేయం
ఏ : ఏ అక్షరంతో పేరు ఉన్నట్లయితే మీరు నమ్మదగిన వ్యక్తులు. అందం పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు. స్వతంత్ర భావాలు కూడా మీ సొంతం. మీకు సాహసాలు చేయడం అంటే ఇష్టం.
బీ : మీకు భావోద్వేగాలు ఎక్కువ. మీకు ధైర్యం కూడా ఎక్కువే. విలాసవంతమైన జీవితాన్ని ఇష్టపడతారు.
సీ : పోటీతత్వం, నైపుణ్యం మీ సొంతం. స్వతత్ర భావాలుంటాయి. మంచి మాటకారులు. చెప్పదలుచుకున్న విషయాన్ని సాగదీయకుండా స్పష్టంగా చెప్పగలరు.
ఈ: కలుపుగోలుగా మాట్లాడతారు. స్నేహితుల సంఖ్య ఎక్కువే. మాట తీరుతో ఇతరులను ఆకట్టుకుంటారు.
ఎఫ్ : మీరు మంచి ప్లానర్ అని చెప్పవచ్చు. ప్రతి పనిని పక్కాగా ప్లాన్ చేసుకుని ముందడుగు వేస్తారు.
జీ : ఒక లక్ష్యాన్ని ఏర్పరుచుకొని దానికోసమే ప్రయత్నిస్తుంటారు ఈ అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులు.
హెచ్ : సృజనాత్మకత మీ సొంతం. తమను తాము నియంత్రించుకోగలరు. ఆత్మవిశ్వాసం కూడా ఎక్కువే.
ఐ : మీరు సాహసవంతులు. ైస్టెలిష్‌గా ఉండడానికి ప్రాధాన్యత ఇస్తారు. సృజనాత్మక పట్ల మీకు ఆసక్తి.
జే : లక్ష్య సాధన కోసం చాలా పోరాడతారు. మేథస్సు కలిగి ఉంటారు.
కే : కాస్త ఎక్కువగా సిగ్గుపడే వ్యక్తులు మీరు. అందరితో కలిసి ఉండాలని అనుకుంటారు.
ఎల్ : వీరు ఆకర్షణీయంగా ఉంటారు. డబ్బు, హోదా కలిగిన కెరీర్‌ను ఎంచుకుంటారు. కష్టపడే తత్వం మీది.
ఎమ్ : ధైర్యం, తెలివి, హార్డ్‌వర్క్ మీ సొంతం. మంచి నమ్మకస్తులు. సున్నితమైన మనస్కులు కూడా. మీ మనసు ఎవరైనా గాయపెడితే ఇక తిరిగి వారిని పట్టించుకోరు.
ఓ : ఓ అక్షరంతో పేరు మొదలయ్యే వారు వివేకవంతులని చెప్పొచ్చు. నీతి నిజాయితీ వీరికి ఉండే అదనపు లక్షణాలు.
పీ : మీరు చురుకుగా, జీవితాన్ని ఆనందంగా అనుభవిస్తారు. సృజనాత్మకత కలిగి ఉంటారు.
క్యూ : మీరు రచయితలుగా లేదా వక్తలుగా రాణించగలరు. ట్రెండ్‌ను ఫాలో అవ్వాలని అనుకోరు.
ఆర్ : నమ్మకం, జాలి, దయ వీరి సొంతం. ఎవరినైనా సరే ఇట్టే నమ్మేస్తారు. ఉల్లాసంగా ఉండడానికి ఇష్టపడతారు.
టీ : టీ తో పేరు స్టార్ట్ అయ్యే వ్యక్తులు ఎప్పుడూ బిజీగా ఉండడానికే ఇష్టపడతారు.
యూ : మీరు ప్రతిభావంతులుగా రాణిస్తారు. కష్టపడి పనిచేసే తత్వాన్ని కలిగి ఉంటారు.
వీ : మీరు విశ్వాసపాత్రులు. డైనమిక్ స్వభావాన్ని కలిగి ఉంటారు. ప్రతి పనినీ పక్కాప్రణాళికతో అమలు చేస్తుంటారు.
డబ్ల్యూ : మీరు గ్రేట్ లవర్స్‌గా ఉంటారు. మీ మనసు అర్థం చేసుకోవడం చాలా కష్టం.
ఎక్స్ : ఎక్స్ అక్షరంతో పేరు మొదలయ్యే వారు విలాసవంతమైన జీవితాన్ని కోరుకుంటారు. శాంత స్వభావులు. ప్రేమించి పెళ్లి చేసుకోవాలనే తత్వాన్ని కలిగి ఉంటారు.
వై : మీ పేరు వై అక్షరంతో ప్రారంభమైతే స్వతంత్రంగా ఉండాలనుకుంటారు. వ్యాపారం చేయడానికి ఇష్టపడతారు. సాహసకృత్యాలు కూడా వీరికి ఇష్టమే.
మీరు ఎలాంటి వ్యక్తులో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఆంగ్లంలో మీ పేరు ఏ అక్షరంతో మొదలవుతుందో దాన్ని బట్టి తెలుసుకోవచ్చు.
డీ అక్షరంతో పేరు ప్రారంభం అయ్యేవాళ్లకి ఆత్మైస్థెర్యం ఎక్కువ. వ్యాపారం చేయాలని అనుకుంటారు. శుభ్రత విషయంలో నిక్కచ్చిగా ఉంటారు. ఎవరికైనా చేతనైనంత సహాయం చేయాలనే స్వభావం కలిగి ఉంటారు.
ఎన్ అక్షరంతో మీ పేరు ప్రారంభం అయిన వారు సృజనాత్మకత కలిగి ఉంటారు. కళాత్మక ప్రతిభ కూడా మీ సొంతం. విరామం తీసుకోవడానికి ఇష్టపడరు. ప్రతీ పనిలోనూ పర్‌ఫెక్షన్ కోరుకుంటారు.
మీ గ్లామర్‌తో అందరినీ ఆకర్షిస్తారు. ఏదైనా పని ప్రారంభించాలంటే దానికి ముందు చాలా అలోచిస్తారు. టైమ్‌సెన్స్, పక్కాప్రణాళికను కలిగి ఉంటారు. నిజాయితీ, ఆగ్రహం కూడా ఎక్కువే. రాజకీయవేత్తగా లేక ఏదైనా ప్రత్యేక రంగంలో మీదైన ముద్రవేస్తారు.
వీరు మంచి మాటకారులుగా ఉండి ఎదుటి వారికి ఎప్పుడూ సలహాలు ఇస్తుంటారు. కొన్ని విషయాలలో స్పష్టమైన అవగాహన కలిగి ఉంటారు. సలహాదారులుగా ఉండడం వీరికి ఇష్టం.
ఇవి నిషేధం
-నక్షత్రాల పేర్లని శిశువులకు పెట్టకూడదనేది మొదటి నిషేధం. నక్షత్రాలు 27 ఉంటే ఆ అన్నిటికీ చంద్రుడొక్కడే భర్త అయిన కారణంగానూ, నక్షత్రనామాన్ని శిశువుకి పెడితే ఆ స్త్రీ శిశువుకి సవతి దోషం పట్టవచ్చుననే భయంతో నక్షత్రనామాన్ని పెద్దలు
-నదుల పేర్లు పెట్టకూడదనేది రెండో నిషేధం. నదులెన్ని ఉన్నా వాటన్నింటికీ సముద్రుడే భర్త. అందుకే నదుల పేరు అమ్మాయిలకు పెడితే సవతి దోషం ఉండొచ్చని నిషేధించారు.
-తీగల పేర్లు, చెట్ల పేర్లు కూడా పెట్టకూడదనేది మూడో నిషేధం. చెట్లు చెట్లు రాసుకుని నిప్పు పుట్టి అడవులు కాలిపోతుంటాయి, చెట్లను నరుకుతారు, గాలికి పడిపోతాయి, చీడ పడుతుంది, ఎండకీ వానకీ దిక్కూమొక్కూ లేకుండా ఒంటరిగా ఉంటాయి కాబట్టి అలాంటి కష్టాలు చందన, కేతకి, మల్లిక, మాలతి లాంటి పేర్లను పెట్టొదంటారు.
-లకారం ఓ అక్షరంతో కలిసిన అక్షరాలున్న (క్ర-క్ల..) పేరుని కూడా పెట్టరాదన్నారు పెద్దలు. ర బదులు ల పలకితే అర్థంలో భేదం రావడమే కాక, ఒక్కో సందర్భంలో అపార్థం కూడా కలగొచ్చు. ఆమ్రమనే పదానికి మామిడి పండు అనే అర్థం. దాన్ని ఆమ్ల అని పలికితే ఉసిరి అనే అర్థాన్నిస్తుంది.
-పేర్లని బట్టి కష్టాలు రావు : సీత, దమయంతి, సావిత్రి, శకుంతల.. ఇలాంటి పేర్లు పెట్టుకున్నవారికి కష్టాలు వస్తాయనే అపోహ ఉన్నది. నిజాన్ని నిజంగా ఆలోచిస్తే సీతమ్మ రామచంద్రునికి మార్గదర్శకురాలు. అందుకే పేరుని బట్టి కష్టాలు రావు.
-పేరు మార్చొకోకూడదు : పెట్టుకున్న పేరు మార్చుకోవడం, అక్షరాలని వంకరటింకరగా చేసుకుని పలికించుకోవడం.. ఇలాంటి వాటి ద్వారా జీవితగతి మారుతుందనుకోవడం భ్రమ మాత్రమే.
విజ్ఞాన భారతీయం
Anonymous
Wednesday, May 25, 2016
ఖగోళ, గణిత, పంచాంగ సాధనా పద్ధతులు (కంప్యుటేషన్స్) - విశ్లేషణ
ఈ పరివ్యాప్త సంపదలలో శాస్త్ర, సిద్ధాంత, వేద, గ్రంధాదులే కాదు, సమస్త జన, వస్తువులు నిక్షిప్తమై ఉన్నాయి. భారత దేశ మేదా శక్తిని, ఔన్నత్యాన్ని చాటి, ప్రపంచానికి అందించిన, అదిస్తున్న, అనేక జ్ఞాన, విజ్ఞాన, పరిజ్ఞాన విశేషాల సమ్మేళనంతో - వాటి అర్ధమే కాక, భావార్ధం, నిగూఢ, నిక్షిప్త, పరమార్ధాలను విశ్లేషించి తదనుగుణ విషయాలను సేకరించి, సమన్వయం చేసి ఈ విజ్ఞాన భారతీయం " శీర్షికలో ప్రస్తుతీకరిస్తున్నాం.
చాణుక్యుడి కాలం ముందు (500 బీ సీ) నుండి, ఖగోళ గణిత శాస్త్రాధ్యయనం
చేయాలంటే - సంస్కృతం, వ్యాకరణం, తర్కం, (లాజిక్) ప్రాధమిక గణితం చదివి మంచి
ప్రావీణ్యం గడించి ఉండాలి. ఈ నాలుగు కీలక అంశాలు నేర్చుకోనిదే, ఖగోళ
శాస్త్రం (ఖగోళ గణిత శాస్త్రం) లో ప్రవేశం దుర్లభమే. సిధ్ధాంతాలు లోకానికి
తెలియచేయడానికి చక్కని భాష అవసరం. ఇంతేకాక గ్రంధాధ్యయనం చేయాలంటే వెరే దారి
లేదు. భాషా పటిమ పెరగాలంటే వ్యాకరణం బాగా వచ్చివుండాలి. తర్కం ఓ సమస్యని
క్రమబద్ధ శైలిలో విశ్లేషించేందుకు దోహదపడుతుంది. గణితం చదివి ఉండటంతో వివిధ
గణాంక పద్ధతులు ప్రయోగం చేసి సమస్యలను సాధన చేయడానికి తోడ్పడుతుంది.
కాబట్టి ఈ చతుర్-క్షేత్రాలు నేర్చుకోవాలన్న నియమం సూచించారు ప్రాచీన భారతీయ
శాస్త్రవేత్తలు, వైజ్ఞానికులు. ఈ పూర్వాకాంక్షిత పాత్రమైన పాండిత్యం లేక
పోతే ఖగోళ గణితం వైపు మొగ్గు చూపటం అనవసరమని కూడా కొందరు వైజ్ఞానికులు
(బ్రహ్మగుప్త, మధవాచార్య వంటి వారు) చెప్పారు.
విశ్వవిఖ్యాత ఖగోళ గణిత శాస్త్రవేత్త, "న్యూమరికల్ అనాల్సిస్" పితామహుడు,
బ్రహ్మగుప్త (628 ఏ డీ లో) ఇలా రాసారు – "సూర్యుడు తారల కాంతిని తన
ప్రకాశంతో అధిగమించినట్లు మహాజ్ఞాని పరిషత్తులలో బీజగణిత సమస్యల సాధనతో
గణితవేత్తలు వెలుగొందుతారు. ఈ సమస్యలను పూర్ణిస్తే ఇంకా ప్రజ్వలమానమవుతాడు"
అని. నేటి గణితకారులు కూడా ఈ దృక్పదాన్ని సమర్దిస్తారు. భారత
శాస్త్రవేత్తలు యే ప్రాధమికమైన గణితానికి ఎంత ప్రాధన్యతనిచ్చేరో దీనిద్వారా
తెలుస్తోంది.
ఖగోళ, గణిత, పంచాంగ క్షేత్రాలకు ప్రాధమికమైన, ముఖ్యమైన, ప్రభావాత్మకమైన
సాధనా పద్ధతులూ, గణాంకాల విశ్లేషణలు కొన్ని ఈ వ్యాసంలో ప్రస్తావించబడ్డాయి.
భారతీయ ఖగోళ, గణిత శాస్త్ర పరమైన గ్రంధాలు అపారమైనవి. వీటిలోని అన్నీ
అంశాలు, పద్ధతుల గురించి ఒక్క వ్యాసంలో చెప్పడం దుస్సాధ్యం. అనేక గ్రంధాలు
వెలువడించాల్సిందే. కొన్ని కీలక అంశాలు, పద్ధతులను సమీకరిస్తూ అవి ఈ
క్షేత్ర రంగాలలో తెచ్చిన పరిణామాత్మక మార్పులను వివరించే ప్రయత్నం ఈ వ్యాసం
ఉద్దేశ్యం.
ప్రపంచానికి దిశామార్గం చూపిన భారతీయ ఖగోళ, గణిత శాస్త్రవేత్తలు, గ్రంధాలు
వివిధ భారతీయ గణిత సాధనా పద్ధతులు ప్రపంచ - గణిత, ఖగోళ, ఖగోళ గణిత రంగాలను
పూర్తిగా మార్చేసాయి. ఆయా క్షేత్రాలకు ఓ కొత్త దిశ, మార్గం రూపొందించాయి.
మరి కొన్ని కొత్త క్షేత్రాలకు, అంశాలకు బీజం వేసి, స్థిర రూపం ప్రదానం
చేశాయి. ఈ శాస్త్రాలలో ప్రాధమిక సమస్యా పరిష్కరాలు చేసిన, ప్రశస్తి చెందిన
మహత్తర గ్రంధాలు:
శుల్బ సూత్రాలు (800 బీ సీ నుండి 300 బీ సీ) - వీటిలో విభిన్న జ్యామితీ శాస్త్ర (జామెట్రీ) సంబంద విషయాలు పేర్కొనబడ్డాయి. ముఖ్య మైన శుల్బ సూత్రాలు - బౌధాయన శుల్బ సూత్రం, ఆపస్తంభ శుల్బ సూత్రం, కాత్యాయన శుల్బ సూత్రం, మనవ శుల్బ సూత్రం, మైత్రేయ శుల్బ సూత్రం, వరాహ శుల్బ సూత్రం, వాధుల శుల్బ సూత్రం; పాణిణి అష్టాధ్యాయి; గణితానుయోగ; ప్రాముఖ్యం చెందిన జైన ఖగోళ, విశ్వాంతరాళ, గణితశాస్త్ర సంబంద గ్రంధాలు - సూర్యప్రజ్ఞాప్తి, జంబూ ద్వీపప్రజ్ఞాప్తి, భగవతి సూత్రం, ఉత్తరాధ్యయన సూత్రం; అనుయోగద్వార సూత్రం. సూర్య సిద్ధాంతం వాటి భాష్యాలు; ఆర్యభట్ట ఆర్యభాటీయం; భాస్కరుడి - మహాభాస్కరీయం; లఘుభాస్కరీయం; బ్రహ్మగుప్త - బ్రహ్మస్పుట సిద్ధాంతం; ఖండాకాధ్యాయక; మహావీరాచార్య గణిత సారసంగ్రహము; భాస్కరాచార్య - లీలావతి గణితం; సిద్ధాంత శిరోమణి - ఈ విఖ్యాత గ్రంధం మీద వెలువడైన భాష్యాలు, టికలు - గణిత కౌముది (1350 ఏ డీ), గణితామృతసార (1420 ఏ డీ.), బుద్ధి విలాసిని (1540 ఏ డీ), గణితామృత (1538 ఏ డీ), సూర్యప్రకాశ (1541 ఏ డీ), " వాసన భాష్య " రంగనాథ (1573 ఏ డీ); బీజగణితం, గోళాధ్యాయ; గ్రహగణితం; త్రైశతిక; చయాగణితం; కాల శంకలిత; దామోదర దృక్ గణిత స్ద్ధాంతం; కమలాకర భట్ట " సిద్ధాంత తత్త్వవివేక "; నీలకంట సోమయాజి - " తంత్ర సంగ్రహ ", " గ్రహపరీక్ష కారణ "; ఉమాస్వతి తత్త్వార్థాధిగమ సూత్ర; వారహమిహిర పంచసిద్ధాంతిక, శ్రీపతి సిద్ధాంత శేఖర, కర్న కుతూహలం, గ్రహాగమ కుతూహలం, బ్రహ్మతుల్యం, సిద్ధాంత దర్పణ; జ్యేష్ఠదేవ యుక్తిభాశ; అన్నంభట్ట తర్కసంగ్రహము;బౌధాయన (800 బీ సీ) శుల్బ సూత్రం లో - " బౌధాయన సిద్ధాంతం " (ఇది నేడు పైతాగొరుస్ తీరం గా కూడా వ్యవహారంలో ఉంది), వేదీల నిర్మాణాల విషయాలున్నాయి. ఈ గ్రంధంలోనే వేది (యజ్ఞాలకు ఉపయోగించే చతురశ్రం) లో వలయం యెలా మలచాలో విశదంగా ప్రస్తావించారు. ప్రపంచంలో తొలి సారిగా చతురశ్రంలో వృత్తం యెలా నిర్మించాలన్న సూత్రాలు ప్రస్తావించారు. మహావీరాచార్య (850 ఏ డీ) గణిత సార సంగ్రహంలో క్రమచయనం (పెర్ముటేషన్స్), సంయోగాలకు (కాంబినేషన్స్) సంబంధిమిన సూత్రావళి తొలిసారిగా ప్రపంచానికి అందించారు. అంతే కాదు - "సంభావ్యత" సూత్రాలు ప్రతిపాదించారు. ఇది తరువాతి కాలంలో గణిత రంగంలో ఓ కొత్త శాఖగా ఏర్పడింది. నేడు ఆంగ్లంలో దీన్ని " ప్రాబబిలిటీ తీరీ " గా వ్యవహరిస్తున్నారు.

వటేశ్వర (880 ఏ డీ), శ్రీధరాచార్య (991 ఏ డీ), శ్రీపతి (1000 ఏ డీ), శతంద
(1100 ఏ డీ) మరికొన్ని గణిత సంబంధ గ్రంధాలు ప్రకటించారు. పరమేశ్వర (1430 ఏ
డీ) ఆర్యభాటీయం మీద భాష్యం రాసి "భటదీపిక "రూపంలో అందించారు. ఇవి కాక
భాస్కర గ్రంధాల మీద" కర్మదీపిక", "సిద్ధాంతదీపిక "వివరణలు ప్రకటించారు. ఆ
తరువాత భాస్కరాచార్యుని లీలావతి గణితం పై వ్యాఖ్యానం వ్రాశారు. కేరళ ఖోగళ
శాస్త్ర పరంపరలో వాసికెక్కిన ఇంకొన్ని ఖగోళ గణిత గ్రంధాలు - "కారణపద్ధతి",
"సద్రత్నమాల", "యుక్తిభాశ", "గణితయుక్తిభాశ". గోవిందస్వామి (800 – 850 ఏ
డీ), సూర్యదేవ, భాస్కరుని మహాభాస్కరీయం వ్యాఖ్యానాలు రచించారు. శంకరనారాయణ
(869 ఏ డీ), ఉదయదివాకర (1073 ఏ డీ), పరమేశ్వర లఘుభాస్కరీయం భాష్యాలు
వ్రాశారు. మంజులాచార్య (950 ఏ డీ) " లఘుమానస ", " బ్రహ్మమానస " అన్న కారణ
గ్రంధాలను ప్రకటించారు. ఈ కారణ గ్రంధం విశేషం ఏమిటంటే ఇది " ఆర్యపక్ష ", "
అర్ధరాత్రికపక్ష " పద్ధతులను అనుసరించాయి. ప్రశస్తాధర (958 ఏ డీ), సూర్యదేవ
యజ్వన్ (1248 ఏ డీ), పరమేశ్వర (1409 ఏ డీ) దీని మీద భాష్యాలు ప్రకటించారు.
తెలుగు నాట పావులూరి మల్లన (1120 ఏ డీ) మహావీరాచార్య గణిత సార సంగ్రహం
భాష్యం తెలుగులో వ్రాసి తెలుగులో గణితశాస్త్రాధ్యానికి నాందీ పలికేరు.
యల్లయ్య (1482 ఏ డీ) " లఘుమానస " భాష్యం రాసేరు. మల్లికార్జున సూరి (1178 ఏ
డీ) సూర్య సిద్ధాంతం భాష్యం తెలుగులో రచించారు; నరసిమ్హ (1500 ఏ డీ
ప్రాంతం) కారణ గ్రంధం " తిథి చక్ర " ప్రకటించారు; ఇది బాగా ప్రసిద్ధి
చెంది, పంచాంగ గణితసాధనకు ఉపయోగించాడానికి వాడడం మొదలుపెట్టేరు.
వీటన్నిటికీ మునుపు వాడకంలో ఉన్న పద్దెనిమిది సిద్ధాంతాలు విశ్వాంతరాళం,
అందులోని గ్రహాల గూర్చి, తదనుబంధ విషయాలు చెప్పాయి. అవి - సూర్య సిద్ధాంతం;
సోమ సిద్ధాంతం; వశిష్ట సిద్ధాంతం; రోమక సిద్ధాంతం; పౌలిస సిద్ధాంతం;
బృహస్పతి సిద్ధాంతం; గర్గ సిద్ధాంతం; వ్యాస సిద్ధాంతం; పరాశర సిద్ధాంతం;
భోజ సిద్ధాంతం; వరాహ సిద్ధాంతం; బ్రహ్మస్ఫుట సిద్ధాంతం; సిద్ధాంత శిరోమణి;
సుందర సిద్ధాంతం; తత్త్వవివేక సిద్ధాంతం; సార్వభౌమ సిద్ధాంతం; లఘు ఆర్య
సిద్ధాంతం; బృహదార్య సిద్ధాంతం.
ఖగోళ - గణిత కోవిదుడు పరమేశ్వర గ్రహణలను పరిశోదిస్తూ, 1393 ఏ డీ నుండి 1432
ఏ డీ వరకు రాత్రిళ్ళు పరిశీలనలు చేసి లభించిన విషయాలతో తదనుగుణ "
సంస్కరణలు" చేసి కొన్ని పద్ధతులను మెరుగు పరిచారు. ఈ ధోరణినే అనుసరించారు
ఆయన శిష్య, ప్రశిష్యులు. అచ్యుత పిశారతి (1550 - 1621 ఏ డీ) సూర్య చంద్ర
గ్రహణాల మీద " ఉపరాగక్రియాక్రమ " రూపంలో రాసారు. అదే రీతిలో నందగ్రామ మిశ్ర
(1730 - 1800 ఏ డీ) గ్రహణాలను విశిదీకరిస్తూ, " గ్రహణ పద్ధతి " అన్న కారణ
గ్రంధాన్ని వ్రాశారు. శంకర వారియార్ (1500-1560 ఏ డీ) " కారణసార " అన్న
ఖగోళ గణిత గ్రంధాన్ని రచించారు. దీని మీద చిత్రభాను (1530 ఏ డీ లో), అచ్యుత
పిశారతి " కారణోత్తమ " రూపంలో భాష్యాలు ప్రకటించారు. శంకర వారియార్ నీలకంట
సోమయాజి "తంత్ర సంగ్రహం" మీద "లఘువివృత్తి" రూపంలో భాష్య గ్రంధం
ప్రకటించారు.
జ్ఞానరాజ (1503 ఏ డీ), గొదావరి నదీ తీరంలోని పార్తపురంలో " సిద్ధాంత సుందర "
గ్రంధాన్ని ప్రచురించారు. ఆయన కుమారుడు చింతామణి (1530 ఏ డీ) ఈ గ్రంధంపై
భాష్యం రాసారు. జ్ఞానరాజ శిష్యుడు ధుందిరాజ (1541 ఏ డీ) అనేక గణిత శాస్త్ర
భాష్యాలు రాసారు. గణేశ దైవజ్ఞ (1507 ఏ డీ) "గ్రహలాఘవ " రచించారు. గణేశ
రచించిన " బుద్ధి విశాలిని", భాస్కరాచార్య లీలావతి గ్రంధం మీద భాష్యం. ఇది
గణిత క్షేత్ర రంగంలో ప్రామాణిక గ్రంధంగా ఉపయోగంలో ఉంది.
సూర్య సిద్ధాంతం
తర తరాల పరీవ్యాప్త జ్ఞాన సంపదకు నిదర్శనం భారతం. ప్రపంచ ఇతిహాశంలో మరే ఇతర
ఖగోళ గణిత గ్రంధం ఈ ద్రంధమంత ప్రచురణ, ప్రాచుర్యం పొందలేదు. గత 1700
యేళ్ళలో అనేక వివరణ గ్రంధాలు, కారణ గ్రంధాలు, టికలు ప్రకటించబడ్డాయి.
ఈ అతి విశిష్ట ఖగోళ గణిత ప్రధానమైన గ్రంధాన్ని - భటోట్పల (966 ఏ డీ),
దివాకర (1606 ఏ డీ), కేశవ, విజయనంది, చిత్రభాను, శ్రీ రంగనాథ, మకరంద,
నరసిమ్హ స్వల్ప సవరణలతో, మెరుగులతో భాష్యాలు ప్రకటించారు. భాస్కరాచార్య "
సిద్ధాంత శిరోమణి " లో తాను సాధించిన కొన్ని ఫలితాలను, సూర్యసిద్ధాంతం లో
పేర్కున్న కొన్ని అంశాలను సమీకరించారు.
ఇవే కాక - తెలుగానువాధం మల్లికార్జున సూరి చేయగా, చందేశ్వర, మదనపాల,
పరమేశ్వర, యల్లయ, రామకృష్ణ ఆరాధ్య (1472 ఏ డీ), భుధర (1572 ఏ డీ), తమ్మ
యజ్వన్ (1599 ఏ డీ), రంగనాథ (1603 ఏ డీ), నరసిమ్హ (1611 ఏ డీ), విశ్వనాధ
(1628 ఏ డీ), కమలాకర (పదిహేడవ శతాబ్ధం), దదా బాయి (పద్దెనిమిదవ శతాబ్ధం)
సూర్య సిద్ధాంతంపై భాష్యాలు, వివరణలు, టికలు ప్రకటించారు. దదాపు పదిహేడు
వందల సంవత్సరాలకుపైగా అవిచ్చినంగా
ఓ శాస్త్ర గ్రంధం ప్రమాణిక గ్రంధంగా మన్నన పొందడం ప్రపంచంలో మరెక్కడా
తటస్థించలేదు. ఇలా మెరుగు దిద్దుకుంటూ కాల ప్రవాహంలో అత్యంత ఉపయుక్త ఖగోళ,
గణిత, పంచాంగ క్షేత్ర గ్రంధంగా నడుస్తూ వస్తోంది.
నేటికీ ఇది పరంపరాగత భారత శాస్త్రనిధిలో సుప్రసిద్ధ గ్రంధమే.
సూర్యసిద్ధాంతంలో జాతక నిర్ణయానికి ఉపయోగించే కొన్ని ప్రాధమిక విషయాలు:
నేటికీ ఇది పరంపరాగత భారత శాస్త్రనిధిలో సుప్రసిద్ధ గ్రంధమే.
- మందఫల (ఈక్వేషన్ ఆఫ్ సెంటర్); మంద సంస్కారం - " ఎపీసైక్లిక్ మోడల్ " ఆధారంగా దీన్ని లెక్కిస్తారు; మందగ్రహ (మీన్ ప్లానెట్); మధ్యమగ్రహ, మందోచ్చ మధ్య ఉన్న కోణం మందకేంద్రం; మందవృత్త పరిధి (సర్కంఫరెన్స్ ఆఫ్ ఎపీ సైకిల్); (ఓ గ్రహం మందఫలానికి సవరణ చేబడితే దాన్ని " మందస్పుటగ్రహం " అని అంటారు) శీఘ్రోచ్చ, శీఘ్రకేంద్ర, శీఘ్ర సంస్కార తదితరాలు.
- క్రాంతి వృత్త (ఎక్లిప్టిక్), క్షితిజ (సెలెస్టియల్ హొరైజన్); ఉదయ లగ్నం (అసండెంట్) - ఇది ఓ వ్యక్తి జాతకానికి ముఖ్య అంశం. మిగతా గణాంకాలు ఈ లగ్న బిందువు మీద ఆధారపడి ఉంటాయి. దీనికి 180 డిగ్రీలకు ఉన్నది "అష్ట లగ్నం " (డిసండెంట్); వేదాంగ జ్యోతిశం ప్రకారం "క్రాంతి వృత్త" కి మూలం 0 డిగ్రీ అశ్విణి (బీటా ఏరిటిస్); ఇతర ముఖ్య అంశాలు
- "మధ్య లగ్న"; "పాతాల లగ్న"; శీగ్ర సంస్కారం; జ్యర్ధపిందక (సైన్ టేబుల్స్), ఉత్క్రమజ్యర్ధపిండక (వెర్సడ్ సైన్); జ్య,జివ, మౌరిక పర్యాయ జ్యర్ధ (సైన్) పదాలు; పరమపక్రమ / పరమక్రాంతి; పరిధి (ఎపీసైకిల్స్);
- అష్టక వర్గ పద్ధతి, షడ్ వర్గ వివరణాపటాలు, షడ్బల అంచనాల పద్ధతులు - ఇవి భారతీయ జ్యోతిష పద్ధతులు, పాశ్చాత్త పద్ధతులలో లేవు. భారతీయ కుశల పద్ధతులకు మరొక నిదర్శనం.
- గ్రహాల సంయోగ సమీకరణం; భుజజ్యఫల సమీకరణం (ఈక్వేషన్ ఆఫ్ బేస్-సైన్); శీఘ్రకర్మ సమీకరణం (ఈక్వేషన్ ఆఫ్ కంజంక్షన్); దశాంతరఫల (ఈక్వేషన్ ఫర్ డిఫ్ఫరెన్స్ ఆఫ్ మెరిడియన్); లగ్న నిర్ణయము
ఓ రోజులో ఉన్న కాల మానాన్ని నిర్ణయించేందుకు వాడీ విషయాలు:
- చంద్రుడు సూర్యుని వెనుక రాశిలో ఉంటే అది కృష్ణ పక్షము
- చంద్రుడు సూర్యునికి ముందు రాశిలో ఉంటే అది శుక్ల పక్షము
- లగ్నం సూర్యుడి రాశిలో ఉంటే అది " సూర్యోదయం " కాలం (ఉదయం)
- లగ్నం సూర్యుడి నుంచి యేడవ రాశిలో ఉంటే అది సూర్యాస్తమ కాలం (సాయంత్రం)
- లగ్నం సూర్యుడి నుంచి నాల్గవ రాశిలో ఉంటే " మధ్యాన్నం "కాలం
- లగ్నం సూర్యుడి నుంచి పదవ రాశిలో ఉంటే అది " అర్ధరాత్రి " కాలం
ఇలా నిత్య కృత్యాలకు, రోజుకి, గ్రహాలకి, అవి తిరుగాడే రాశులకి ఒక సమైక్య
బంధం వేసి ఒక తాట నడిపించి, తదనుబంధ విషయాలను చక్కగా ఇమిడించారు. ఇలా
మనుషుల కాలాన్ని, విశ్వాంతరాళంతో అనుసంధాన పరచడం వారి ఊహ, దివ్య ద్రిష్టి,
క్షుణ్ణమైన అవగాహనకి నిదర్శనాలు.
దుర్ముహూర్తాలు
ఒక " అహోరాత్రి " ముప్పై (30) ముహూర్తాలుగా విభజించబడింది. పదిహేను
ముహూర్తాలు పగలు, తద్సమాన ముహూర్తాలు రాత్రి అని వర్గీకరించారు. ఈ కింది
పట్టిక " దుర్ముహూర్తాల " ఉటంకిస్తున్నది.
వారం 1 వ దుర్ముహూర్తము 2 వ దుర్ముహూర్తము
ఆదివారం 14 వ దుర్ముహూర్తము -
సొమవారం 9 వ దుర్ముహూర్తము 12 వ దుర్ముహూర్తము
మంగళవారం 4 వ దుర్ముహూర్తము రాత్రి 7 వ దుర్ముహూర్తము
బుధవారం 8 వ దుర్ముహూర్తము -
గురువారం 6 వ దుర్ముహూర్తము 12 వ దుర్ముహూర్తము
శుక్రవారం 4 వ దుర్ముహూర్తము 9 వ దుర్ముహూర్తము
శనివారం 1, 2 వ దుర్ముహూర్తాలు

ఆర్యభట్ట ఖగోళ, గణిత శాస్త్రాలకు సంభందించి పరిణామాత్మక పద్ధతులను కనిపెట్టేరు. వాటితో పాటు
ప్రాధమిక, సంక్లిష్ట సమస్యలకు పరిష్కరణలు ఇస్తూ విభిన్న పద్ధతులు తన గ్రంధాలలో పేర్కున్నారు. వాటిలో కొన్ని ముఖ్యమైనవి:
- బీజగణిత విశ్లేషణ (ఆల్జీబ్రైక్ అనాలసిస్)
- గణితశాస్త్రంలో తొలి సారిగా " కుట్టక పద్ధతి " (ఇండిటర్మినేట్ ఈక్వేషన్స్ ఆఫ్ ఫస్ట్ డిగ్రీ) పరిష్కరణలు ఇచ్చారు. ఈ పద్ధతిని బ్రహ్మగుప్త తన " బ్రహమస్పుట సిద్ధాంతం " గ్రంధంలో, భాస్కరాచార్య (1150 ఏ డీ లో) " సిద్ధాంత శిరోమణి " గ్రంధంలో వివరించి ఉదాహరణలు ఇచ్చారు.
- తీరీ ఆఫ్ ఎపీసైకిల్స్
- ప్రపంచ ఇతిహాసంలో జ్య (సైన్), కోటిజ్య (కాస్) కోశ్తాలు (టేబుల్స్). ఇవి నేటి అంతరిక్ష శాస్త్రానికి ప్రాధమిక, అత్యవసరమైన పద్ధతులు.

ఇవి కాక - ఖవృత్త; స్వవృత్త; సముఖమధ్యం; ఉపసితి; వర్గ; ఘన; వర్గమూల;
వ్యతిపత; అధిక మాసాలు; కాలక్రియ పద; మిశ్రక; శ్రేధి; క్షేతి; ఖత; సితి;
సూన్యతత్యం; యవత్-తవత్ (తీరీ ఆఫ్ సింపుల్ ఈక్వేషన్); వర్గావర్గ (తీరీ ఆఫ్
క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్); ఘనా-ఘన (తీరీ ఆఫ్ క్యూబిక్ ఈక్వేషన్); విశమ
(తెరీ ఆద్ ఈక్వేషన్స్ విత్ సెవరల్ అన్నోన్స్); గోళ-పాద; వదవముఖ; ఉన్మండల;
అగ్ర; ద్రెక్క్సేపజ్య; దృగ్గణితజ్య; దృక్కర్మణ - అక్శ అంద్ ఆయన;
స్తిత్యార్ధ; విమరదర్ధ; ఫలవల్లి; కుత్తక (పల్వరైసెర్); ఉక్రమజ్య
(వెరిసైన్); ఉత్క్రమజ్య (ఇన్వర్స్ సైన్); సూర్య గ్రహణం; చంద్ర గ్రహణం;
తాత్కాలిక గతి (ఇంఫినైటిస్మల్స్); స్తిత్యార్ధ; భూమధ్య రేఖ; సంకాలిత (సం
ఆఫ్ సీరీస్); సంకలన; సమ్మేళణ, ప్రక్షేపణ; సమ్యోజన; ఏకీకరణ; యుక్తి; యోగ;
అభ్యాస; సర్వధన (టోటల్); వ్యుత్కలిత, వ్యుత్కలన, సోధన (క్లియరింగ్), పతన,
వియోగ, వ్యోజక, గుణణ, హనన, వధ, క్ష్యయ; గుణకార, గుణ-ఫల; ప్రత్యుత్పన్న;
వర్గ (కృతి); అక్షాంశ; విక్షేప (లాటిట్యూడ్ లెక్కకట్టడం); పత (నోడ్);
శాగ్ర, నిరగ్ర ఇత్యాది పద్ధతుల వివరణలు ఇచ్చారు.
అహర్గణ - ఆర్యభట్టుని ఖగోళగణిత శాస్త్ర అద్బుత సృష్టిఅద్వితీయ బుద్ధి కుశలత
కలిగిన, గణిత, ఖగోళ శాస్త్రవేత్త ఆర్యభట్ట " అహర్గణ " పద్ధతి
ప్రతిపాదించారు. అహర్గణ పద్ధతిలో ఈ కల్పం మొదలు యెన్ని దినములు గడచినాయో
గణాంకముల ద్వరా లెక్కించ వచ్చు. ఇది కలియుగారంభం నుంచి తీసుకున్నారు. ఇది
17 - 18 ఫిబ్రవరి 3102 బీ సీ అర్ధరాత్రి గా తీసుకున్నారు, ఇదే పందాలో
ఫ్రెంచ్ దేశ విద్వాంసుడు - జోసెఫ్ స్కాలిగర్, 1582 ఏ డీ లో, ఆర్యభాటీయ
అహర్గన పద్ధతి అవలంబించి ఖగోళశాస్త్రంలో జూలియన్ డే నంబర్ వాడేరు.
ఆర్యభట్ట తాను రచించిన ఆర్యభాటీయం - గోళ పాదం - పదకొండవ శ్లోకంలో ఈ
విశ్వంలోని అనంత వాయువు గురించి వివరణ ఇచ్చారు. ఒక్క ముక్కలో సమస్తాంతరాళం
యెలా నడుస్తోందో, దానికి కారణాలు ఏమిటో సుస్పష్టం చేసిన అద్వితీయ
గణితశాస్త్రవేత్త. ఇంత అసాధరణ బుద్ధి కుశలత చూడడం అరుదే. అంత అపూర్వ జ్ఞాన
సంపూర్ణత కలిగిన వారు ఆర్యభట్ట.
గ్రహాల అష్టా గతులు - ఆర్యభట్ట ఆవిష్కరణ
లక్షల మైళ్ళ దూరంలో ఉన్న గ్రహాలకు, సమ గతులు కాక, భిన్నమైన గతులు ఉన్నాయని
ప్రాచీన భారతీయ ఖగోళ శాస్త్రవేత్తలు తేల్చిచెప్పేరు. అంతే కాదు సుప్రసిద్ధ
ఖగోళ - గణిత శాస్త్రవేత్త, ఆర్యభట్ట గ్రహాల అష్టా గతులు కనుగొని
ప్రపంచానికి ప్రప్రధమ సారిగా శాస్త్రీయ ప్రమాణాలతో, ఉదాహరణలతో ప్రకటించాడు.
ఈ అష్టా గతులు: వక్ర (రెట్రోగ్రేడ్); అణువక్ర (లిట్టిల్ రెట్రోగ్రేడ్);
కుటిల (ట్రాన్స్వర్స్); మంద (స్లో); మందతర (వెరీ స్లో); సమ (ఈవెన్);
అతిశీఘ్రతర / అతిశీఘ్ర (వెరీ స్విఫ్ట్); శీఘ్ర (స్విఫ్ట్)
ఊపు (వాబుల్) కారణంగా అక్షం మార్పు సప్రామాణికంగా నిరూపించారు. ఈ ప్రాధమిక
మూలసూత్రాన్ని ఆర్యభట్ట కనుగొనగా, భాస్కర, బ్రహ్మగుప్తాదులు కూడా ఈ
సూత్రాన్ని పేర్కున్నారు. దదాపు వెయ్యేళ్ళ తర్వాత కెప్లర్ - లాస్ ఆఫ్ మోషన్
గా తిరిగి కనిపెట్టేరు.
గణిత శిఖామణి బ్రహ్మగుప్త
బ్రహ్మగుప్త గణితంలో వాడే పాలీనామియల్ ఈక్వేషన్స్ పద్ధతిని 628 ఏ డీ లో
కనిపెట్టేరు. ఇది ఆచార్య కంక (ఉజ్జైనీ ఖగోళ శాస్త్ర పండితుడు) పెర్షియాకి
ప్రసారం చేసారు.బ్రహ్మగుప్త పాలీనామియల్ ఈక్వేషన్స్ గణితంలో ఓ కొత్త
క్షేత్రాభివృద్ధికి దారితీసింది. ఇంతటి ప్రభావాత్మక ఆవిష్కరణలు చేసిన
ఉదాహరణలు ప్రపంచ గణిత చరిత్రలో లేవు. ఇవి కాక: - "గోమూత్రిక పద్ధతి " (జిగ్
జాగ్ మెతడ్), " ఇష్ట గణన " (ఆల్జీబ్రైక్ మెతడ్) పద్ధతులను వివరించారు. ఈ
దిశామార్గ పద్ధతులను మునుపు ఎవ్వరూ ప్రస్తావించిన ఉదహరణలు లేవు.ప్రపంచానికి
తొలిసారిగా వినూత్న పద్ధతులు బ్రహ్మగుప్త అందించారు. వాటిలో ముఖ్యమైనవి
కొన్ని:
బ్రహ్మగుప్త వర్గ ప్రకృతి పద్ధతి (ఇండిటర్మినేట్ ఈక్వేషన్ ఆఫ్ సకండ్ ఆర్డర్)
బ్రహ్మగుప్త సూత్రం (ఫార్ములా) - దీన్నే హెరాన్ ఫార్ములా అని కూడా వ్యవహరిస్తున్నారు.
బ్రహ్మగుప్త సమీకరణం - (సైక్లిక్ క్వాడ్రిలేటరల్)
బ్రహ్మస్ఫుట సిద్ధాంతం – "ధ్యానగ్రహోపదేశాధ్యయ" శీఘ్ర గణణానికి వినూత్న పద్ధతులు అందించారు.

బ్రహ్మగుప్త ప్రకారం కుటక పద్ధతి గూర్చిన జ్ఞానం " ఆచర్యపదవి " కి
అనివార్యం అని చెప్పేరు. అంత ప్రజ్ఞ ఉన్నవారే ఆచర్య పదవి చేపట్టి
నిర్వర్తించగలరని అప్పటి వారి వ్యవహార నియమం.బ్రహ్మగుప్త పతిగణితం లో అనేక
గణిత పద్ధతులను వివరించారు. వాటిలో - సంకలిత, వ్యవకలిత, గుణన, భాగహార,
వర్గ, వర్గమూలం, ఘన, ఘన-మూల, పంచ-జతి, త్రైరశిక (రూల్ ఆఫ్ త్రీ),
వ్యస్త-త్రైరసిక (ఇన్వెర్స్ రూల్ ఆఫ్ త్రీ), పంచరశిక, సప్తరశిక (రూల్ ఆఫ్
సెవెన్), నవరశిక (రూల్ ఆఫ్ నైన్), ఎకదసరశిక (రూల్ ఆఫ్ లెవన్), మిశ్రక,
శ్రేఢి (ప్రోగ్రెస్షన్, సీరీస్), క్షేత్ర, ఖత, సితి, క్రాకసిక (సా), రాశి,
ఛాయ వివరించారు.ఇవేకాక సమగమ; అస్తమన; " ఖంద "; " భేద "; ఇత్యాది ఖగోళ
శాస్త్ర పద్ధతులను విశిదీకరించారు. గణిత మహాకోవిదులు శ్రీధర, మహావీరాచర్య -
కపటి సంధి, తస్త (క్రాస్ మల్టిప్లికేషన్), రూప విభాగ, స్థాన విభాగ
పద్ధతులను ఉదాహరణలతో వివరించారు.
వీటిలో కొన్ని పద్ధతులు, ఉదాహరణకు - " కపట సంధి " పద్ధతి ముందు పర్షియా,
అరబ్ దేశాలకు ప్రసారమై అల్-ఖ్వార్జీమీ (825 ఏ డీ), అల్ అన్శావి (1025 ఏ
డీ), అల్ బెరునీ (1030 ఏ డీ), అల్ బత్తాని, అల్ హస్సర్ (1175 ఏ డీ), అల్
కలశది (1475 ఏ డీ) ద్వరా యూరోప్ కి ప్రసారమయ్యాయి. అల్ నశావి ఈ పద్ధతిని
"అల్ అమల్ అల్ హిందీ", "తారీక్ అల్ హిందీ (హిందువుల పద్ధతి) అన్న నామ
వ్యవహారాలతో వివరించాడు.ఆర్యభట్ట ప్రకారం నక్షత్ర సంవత్సర (సిడరల్ ఏడాది)
365.25868 రోజులు. 628 ఏ డీ లో బ్రహ్మగుప్త ఇది 365.26875 రోజులుగా
సరిచేశారు. పృత్యూదకస్వామి (864 ఏ డీ), భటోట్పల (966 ఏ డీ), లల్ల,
సోమేశ్వర, యమత, అమరాజ (1200 ఏ డీ), శ్రీదత్త, వరుణ బ్రహ్మగుప్త బ్రహ్మస్ఫుట
సిద్ధాంతం పై భాష్యాలు వెలువరించారు. హెన్రీ టీ కోల్బ్రూక్ బ్రహ్మస్ఫుట
సిద్ధాంత ఆంగ్లానువాదం "హిందూ ఆల్జీబ్రా - ఫ్రం సాన్స్కృట్ వర్క్స్ ఆఫ్
బ్రహ్మగుప్త అండ్ భాస్కర (1817)" అన్న పేరుతో చేశాడు.
ఛాయాగణితం
నిత్యం కనిపించే సూర్య, చంద్రుల స్థితిగతుల ఆధారంగా చంద్రుని ఛాయలు
మారుతాయి. చంద్ర చాయను బట్టి చంద్ర ఛాయాగణితాన్ని ప్రాచీన భారతీయ
శాస్త్రవేత్తలు, వైజ్ఞానికులు విశ్లేషణతో, అనుభవపూర్వక జ్ఞానంతో
కనుగొన్నారు. కొన్ని ప్రామాణికమైన చంద్ర ఛాయ గణిత పద్ధతులను అందించారు.
వీటి ద్వారా ఛాయా గణాంకాలు చేయవచ్చు. అనాదిగా వెలువడిన ప్రతీ ఖగోళ గణిత
కారణ గ్రంధాలు చంద్ర ఛాయ గణిత తత్సంబంధ "వ్యాతిపత", "గ్రహణ", "శృంగోన్నతి",
"మౌఢ్య" వంటి అంసాలు అంతర్భాగంగా పేర్కుంటూ వచ్చాయి. ఈ ప్రకృతి
విలక్షణాన్ని క్షుణ్ణంగా పరిశీలించి వాడకంలోకి తీసుకొచ్చారు భారతీయ
వైజ్ఞానికులు.
గణిత చక్ర చూడామణి, భారతీయ ఖగోళ - గణిత దిగ్గజం - భాస్కరాచార్య
సుప్రసిద్ధ ఖగోళ గణిత శాస్త్రవేత్త భాస్కరాచార్య - బైక్వాడ్రాటిక్ పద్ధతి,
కంటిన్యూస్ ఫ్రాక్షన్స్ గణన పద్ధతిని కూలంకషంగా వివరించారు. వీటిని
ప్రపంచవిఖ్యాతం చెందిన " సిద్ధాంత శిరోమణి " గ్రంధంలో పేర్కొన్నారు. తన
బుద్ధి కుశలతను, అసమాన ప్రతిభను చాటుతూ, భాస్కరాచార్య " కలన గణితం /
శూన్యలబ్ది " (నేటి - డిఫరెన్షియల్ కాల్కులస్) గణిత క్షేత్రానికి
అంకురార్పణం చేస్తూ ఈ సమీకరణం ఇచ్చారు:
జ్య వై' - జ్య వై = (వై' - వై) కోటిజ్య వై; ఇది (జ్య వై ) = (కోటిజ్య వై) వై (ఇందులో - జ్య అంటే సైన్; కోటిజ్య అంటే కోసైన్;)
1150 ఏ డీ లో "సిద్ధాంత శిరోమణి " గ్రంధంలో భాస్కరాచార్య అనేక విషయాలు, అంశాలు పేర్కున్నారు. వాటిలో కాల పట్టికలు కూడా ఉన్నాయి:
1 దినము = 60 ఘడియలు (24 గంటలు)
1 ఘడియ = 60 విఘడియలు (24 నిమిషాలు)
1 విఘడియ = 60 పరఘడియలు (24 సకెండ్లు)
1 పరాగఘడియ = 60 సూక్ష్మ-ఘడియలు (0.4 సకెండ్లు)
1 నక్షత్ర-ఘడియలు = 0.0067 సెకండ్లు

భారతీయ గణిత దిగ్గజం భాస్కారాచార్య ప్రకారం సంవత్సరానికి 365.25848 రోజులు.
చాంద్ర-మాసంలో 29.53 రోజులుంటాయి. కాబట్టి పన్నెండు నెలల్లో 354.36
రోజులుంటాయి. సూర్య సంవత్సరము, చాంద్ర సంవత్సరము, ఈ రెండిటి వ్యత్యాసం "
శుద్ధి " / "అధి-మాస శేషం ", ఇది 10.898 దినములు. ఏ ఏ కృష్ణస్వామి అనే గణిత
కోవిదుడు, ఆచార్యుడు " ది అర్లియెస్ట్ సొల్యూషన్ ఆఫ్ బైక్వాడ్రాటిక్ "
అన్న (పేపర్) "కరెంట్ సైన్స్ ", వాల్యూం 7, నంబర్ 4 (పత్రికలో) ప్రకటించి, ఈ
పద్ధతికి భాస్కరాచార్య ఆద్యుడని, ఫెరారి కన్నా 400 యేళ్ళ క్రితమే భారత
దేశంలో ఇవి ఉన్నాయని తన పరిశోధనా ఫలితాలు వెళ్ళడించారు.
సంగమగ్రామ మాధవ " వెన్వరోహ పద్ధతి "
గణితంలో " సిరీస్ " గా వ్యవహరించబడే సైన్ సీరీస్, కాస్ సీరీస్ పద్ధతులను
కనిపెట్టిన అద్బుత ఖగోళ గణిత మేధావి. తను కనిపెట్టిన పద్ధతులతో ప్రపంచాన్ని
ఆశ్చర్య పరిచాడు. మాధవ వినూత్న పద్ధతి నెలకొల్పి రెండు గంటల 40 నిమిషాల
అంతరాలతో చంద్రుడి తులాంశం కనుగొన్నారు. ఈ పద్ధతిని " వెన్వ " (బాంబూ ట్రీ)
నాట్ల అధారంగా ఏర్పరచినందుకు దీన్ని వెన్వరోహ పద్ధతిగా వ్యవహరించారు. తాను
రచించిన స్పుర్టచంద్రాప్తి, వెన్వరోహ గ్రంధాలలో ఈ పద్ధతి వివరణలు ఇచ్చారు.
చంద్ర గ్రహం గతిలో అంతర్భేదాలు -
భారతీయ ఖగోళ శాస్త్ర వికాసానికి మచ్చుతునక, సూక్ష్మ చంద్రగతిపై పరిశోధనలు.
మరి ఈ లెక్కలు యెందుకింత ముఖ్యం? కొద్దిగా మారితే వచ్చే నష్టం ఏమిటీ?
ఏమవుతుంది? ఈ ప్రశ్నలకు సమాధానం - 3 డిగ్రీల వక్ర దైర్ఘ్యం (ఆర్క్
వేరియేషన్) పంచాంగాలలో 6 గంటల కాల వ్యవధి మార్పు తెస్తుంది. అందుకనే ఇంత
ముఖ్య మైన అసమానతల మీద నిశిత దృష్టి సారించి, భారతీయ ఖగోళ గణిత
శాస్త్రేవేత్తలు, వైజ్ఞానికులు గత 1300 యేళ్ళ గా దీనికి అత్యంత శ్రద్ధగా
చూస్తూ, కాలానుగుణంగా ఒక్కకొక్క అసమానతలను కనుగొంటూ దానికి మెరుగులు
దిద్దుతూ వచ్చారు; కొత్త సమీకరణలు ఇచ్చారు. వీరి అపార నైపుణ్యానికి
జోహారులర్పించక తప్పదు. వారు ఎంతటి జ్ఞాన సంపూర్ణులో చాటి చెప్తోంది. అంతే
కాదు వారు ఓ సమస్యని పూర్ణం చేయాడానికి యెంతకి సుదీర్ఘ ప్రయత్నాలు చేస్తారో
ప్రపంచానికి ఓ ఉదాహరణంగా చాట వచ్చు.
చంద్ర గ్రహ గతిలో అసమానతలకి మూడు ముఖ్య కారణాలు. అవి:
మందఫలం - (ఈక్వేషన్ ఆఫ్ సెంటర్) – ఈ గతి అసమానత వల్ల భూమి, చంద్రుడి గ్రహ
గతుల కోణం, దాని వల్ల "ట్రూ మూన్", "మీన్ మూన్" వ్యత్యాసం 6.17' వరకూ
ఉండవచ్చు.అంతర్భేదం (ఎవెక్షన్)ఆర్యభట్ట కాలం (450 ఏ డీ) నుండి చంద్ర
గతిభేదాలు (ఇనీక్వాలిటీ ఆఫ్ మూన్స్ మోషన్) లెక్కించేందుకు సమీకరణలు ఇస్తూ
వచ్చారు. కాలానుగుణంగా అవి మరింత మెరుగవుతూ వచ్చాయి.
భారతీయ గ్రంధాలలో లభించిన కొన్ని వివరాలు:
ఆర్యభట్టీయం 300’.25 సైన్ జీ1
సూర్య సిద్ధాంతం 300’.25 సైన్ జీ1
ఖండఖాద్యక 296’ సైన్ జీ1
బ్రహ్మస్ఫుట సిద్ధాంత 293’.5 సైన్ జీ1
ఇవి కాక గణిత కోవిదులు ఆచార్య మంజుల (932 ఏ డీ), శ్రీపతి (1039 ఏ డీ) చంద్ర గతి అంతర్భేద సమీకరణం ఇచ్చి దానికి (" ఎవెక్షన్ ") అసమానతను కూడా కలిపేరు. ఇది వారు కనుగొన్న మార్పు. మంజుల ఇచ్చిన సమీకరణం:
-144’ కాస్ (ఎస్ ఎల్ – ఆల్ఫ) సైన్ డీ
1150 ఏ డీ లో ఖగోళ, గణిత శాస్త్ర ఉద్దండ మహా పండితుడు, గణిత చక్ర చుడామణి భాస్కరాచార్య చంద్ర గతిలో మూడవ అసమానతను తన విశ్లేషణలో కనుగొన్నారు. దాన్ని లెక్కవేసేందుకు ఈ సమీకరణం ఇచ్చారు:
379’.8 సైన్ జీ1 + 34’ సైన్ 2డీ

ఖగోళ శాస్త్ర మహాపండితుడు చంద్రుడి సరైన నిజ (ట్రు) గతి (మోషన్)
కనుకున్నేందుకు మొదట శ్రీపతి సమీకరణం వాడాలని ఆతరువాత దామోదర పద్ధతిని
ఉపయోగించుకోవాలని " తంత్ర సంగ్రహం" గ్రంధంలో సూచించారు.నాలుగవ అసమానత
చంద్రశేఖర సామంత కనుగొన్నారు - ఇది "సంవత్సర సమీకరణం". సంవత్సర సమీకరణం
(అన్నూల్ ఈక్వేషన్) – భూమి సూర్యభ్రమణం చేస్తూ సూర్యునికి ఉఛ్ఛ లో అత్యంత
సమీపంలో, నీచ స్థానం లో అత్యంత దూరంలో ఉంటుంది. యెందుకంటే భూమి దీర్ఘవృత్త
కక్షలో పరిబ్రమిస్తుంది కాబట్టి. ఈ వ్యత్యాసం 11 ' ఆర్క్ దాకా వుండ వచ్చు.
దీనే సంవత్సర సమీకరణం అంటారు.
************************************
ఈ విధంగా అంతులేని నైపుణ్యంతో ఆధునిక పరికరాల ఆసరా లేకుండా ఎన్నో విషయాలను
కనిపెట్టి అపార శాస్త్ర సంపదను మానవాళికై అందించిన భారతీయ ఖగోళ
శాస్త్రజ్ఞులు ధన్యులు. ఆచంద్ర తారార్కం భారతీయ శాస్త్రవేత్తలు, గణిత
కోవిదులు, వైజ్ఞానికులు చేసిన కృషి, సాధించిన ఫలితాలు మానవాళి
పురోభివృధ్ధికి దోహదం చేస్తాయి. ఈ క్షేత్ర రంగాలలో ప్రపంచమంతటికీ
మార్గదర్శనం చూపిన మహనీయ వ్యక్తులుగా చరిత్రలో శాశ్వత స్థానాన్ని వారు
పొందేరు.
వారి కృషికి ఆదర్శంగా తీసుకుని ఆయా శాస్త్రాలను మనవైన చేర్పులు చేయడానికి ఉద్యుక్తులమవాలి.
మూలం : సుజన రంజని...
Tuesday, May 24, 2016
పొడుపు కథలు
Anonymous
Tuesday, May 24, 2016
పొడుపు కథలు :
* ఈకలు ఈరమ్మ, ముళ్ల పేరమ్మ, సంతకు వెళితే అందరూ కొనేవారేజ. ఉల్లిపాయ
* గుప్పెడు పిట్ట.. దాని పొట్టంతా తీపి.
జ. బూరె
* అడవిలో పుట్టింది, మా ఇంటికి వచ్చింది. తాడేసి కట్టింది. తైతక్కలాడింది. కడవలో దూకింది. పెరుగులో మునిగింది. వెన్నంత తెచ్చింది.
జ. కవ్వం
* దాస్తే పిడికిలో దాగుతుంది. తీస్తే ఇల్లంతా పాకుతుంది.
జ. దీపం
* జామ చెట్టు కింద జానమ్మ, ఎంత గుంజినా రాదమ్మా.
జ. నీడ
* నామముంది కాని పూజారి కాదు. వాలముది కానీ కోతి కాదు.
జ. ఉడుత
* సినిమాహాలుకి మనతో వస్తుంది. టికెట్ తీసుకుంటుంది. సినిమా చూడదు. మనం చూసి వచ్చేవరకు వేచి చూస్తుంది.
జ. మన వాఇనం
* అరచేతిలో అద్దం.. ఆరు నెలల యుద్ధం
జ. గోరింటాకు
* ఆకు చిటికెడు. కాయ మూరెడు.
జ. మునగకాయ
* ఆకు బారెడు. తోక మూరెడు.
జ. మొగలిపువ్వు
* ఇల్లుకాని ఇల్లు
జ. బొమ్మరిల్లు
* ఇంటికి అందం
జ. గడప
* ఇంటింటికీ ఒక నల్లోడు
జ. మసిగుడ్డు
* ఇంటికి అంత ముండ కావాలి
జ. భీగము
* ఇల్లంతాఎలుక బొక్కలు..
జ. జల్లెడ
* ఇల్లంతా తిరిగి మూల కూర్చొంది
జ. చీపురుకట్ట
* ఇంటి వెనుక ఇంగువ చెట్టు ఎంత కోసినా తరగదు
జ. పొగ
* ఇంతింతాకు, బ్రహ్మంతాకు, విరిస్తే ఫెళఫెళ
జ. అప్పడం
* ఆ ఇంటికి ఈ ఇంటికి మధ్య దూలం
జ. ముక్కు
* ఈత చెట్టుకి ఇద్దరు బిడ్డలు
జ. కల్లు కుండలు
* ఆకాశంలో పాములు
జ. పొట్లకాయ
* ఓ ఆకు..మర్రి ఆకు.. కాయ.. మామిడి కాయ.. పువ్వు మల్లెపువ్వు
జ. జిల్లేడు
* ఆకులేని అఢవిలో జీవంలేని జంతువు జీవమున్న జంతువులను వేటాడుతుంది.
జ. దువ్వెన
* ఆకేలేయదు నీరుతాగదు. నేలని పాకదు. ఏమిటి ఆ తీగ?
జ. విద్యత్తు తీగ
* ఆడవాళ్లకుండనిది.. మగవాళ్లకు ఉండేది?
జ. మీసం
* ఆ ఇంటికి ఈ ఇంటికి లాలా బుడిగి
జ. కుక్కపిల్ల
* ఆ వీధిరాజుకి కొప్పుంది. జుట్టలేదు. కళ్లున్నాయి చూపులేదు
జ. కొబ్బరి కాయ
* ఆరామడల నుంచి అల్లుడు వస్తే అత్తగారు వడ్డించింది విత్తులేని కూర
జ. పుట్టగొడుగులు
* ఇక్కడ విచిన కోడి ఇందూరు పోయింది
జ. లేఖ
* ఇటుకతో ఇల్లు కట్టి.. దంతాన తనుపుపెట్టే.. తానుబోయి సరసమాడెను
జ. మొగలిపువ్వు
* ఆకాశంలో 60 గదులు, గదిగదికో సిపాయి, సిపాయికో తుపాకి.
జ. తేనెపట్టు
* ఆకాశంలో అంగవస్ర్తాలు ఆరబెట్టారు.
జ. అరిటాకు
* ఆలుకాని ఆలు.
జ. వెలయాలు
* అందంకాని అందం
జ. పరమానందం, బ్రహ్మానందం
* ఆ కొండకు ఈ కొండకు ఇనుప సంకెళ్లు.
జ. చీమలదండు
* ఆకాశన అప్పన్న.. నేలకుప్పన్న బోడినాగన్న.. పిండి పిసకన్న
జ. వెలగపండు
* ఆకాశాన కొడవళ్లు వ్రేలాడుతున్నాయి.
జ. చింతకాయలు
* ఆ ఆటకత్తె ఎప్పుడూలోనే నాట్యం చేస్తుంది
జ. నాలుక
* ఆకాశాన పటం.. కింద తోక.
జ. గాలిపటం
* ఆకాశంలో ఎగురుతుంది. పక్షి కాదు. మనుషుల్ని ఎగరేసుకుపోతుంది గాలికాదు.
జ. విమానం
* అరచేతిలో 60 నక్షత్రాలు
జ. జల్లెడ
* అరచేతి పట్నంలో 60 వాకిళ్లు
జ. అద్దం
* అంకటి బంకటి కూర, తియ్యగున్నది. ఇంత పెట్టు
జ. మీగడ
* అడ్డ గోడ మీద పూజారప్ప
జ. తేలు
* అడవిలో పుట్టింది, అడవిలో పెరిగింది. మా ఇంటికి వచ్చింది తైతక్కలాడింది.
జ. కవ్వం
* అదిలేకపోతే ఎవ్వరూ ఏమీ తినరు. ఏమిటి?
జ. ఆకలి
* అనగనగనగా ఓ అప్సరస. ఆమె పేరులో మధ్య అక్షరం తీసేస్తే మేక.
జ. మేనక
* అవ్వ చీరకు పుట్టెడు చిల్లులు.
జ. పుట్ట
* అరం కణం గదిలో 60 మంది నివాసం
జ. అగ్గిపెట్టె, పుల్లలు
* ఆ బాబా ఈ బాబా పోట్లాడితే కూన రాములు వచ్చి తగువు తీర్చాడు.
జ. తాళం
* పోకంత పొట్టోడు. ఇంటికి గట్టోడు.
జ. తాళం కప్ప
* అమ్మతమ్ముడినికాను, కానీ నేను మీకు మేనమాను.
జ. చందమామ
* అరటిపండుకి పదే
విత్తులు
జ. బొగడగొట్టం
* అడవిలో ఆంబోతు రంకే వేస్తుంది
జ. గొడ్డలి
* అరచేతి కింద అరిసె
జ. పిడక
* అలాము కొండకు సలాము కొట్టు
జ. గొడ్డలి
* అమ్మంటే దగ్గరకు.. అయ్యంటే దూరంగా పోయేవి ఏమిటి?
జ. పెదవులు
* అంక పొంకలు లేనిది.
జ. శివలింగం
* అడవిలో అక్కమమ తల విలబోసుకుంది?
జ. ఈతచెట్టు
* అక్క ింటిలో చెల్లి ఇంటిలోనికి వెలుగు తెస్తుంది
జ. పెద్ద పొయ్యి
* అడ్డగోడమీద బుడ్డ చెంబు, తోసినా ఇటుపక్క పడదు. అటు పక్క పడదు.
జ. ఆబోతు మూపురం.
* అయ్యకు అందవు. అమ్మకు అందుతాయి.
జ. పెదవులు
* మనిషికి రెండే కాళ్లు, ఏడు చేతులు.
జ. నిచ్చెన
* మూలన కూర్చుంటుంది. ఎండొచ్చినా, వానొచ్చినా బయటకు బయలుదేరుతుంది.
జ. గొడుగు.
* ఎర్రవాడొస్తే, నల్లవాడు పారిపోతాడు
జ. సూర్యుడు, చంద్రుడు
* బంగారు చెంబులో వెండి గచ్చకాయ
జ. పనసతొన.
* నల్లని షర్టువాడు, కావలికి గట్టివాడు.
జ. తాళం.
* తోవలో పుట్టేది, తోవలో పెరిగేది, తొవలో పోయేవారి కొంగు పట్టేది?
జ. ముళ్ల మొక్క
* బండకు కొడితే వెండి ఊడుతుంది?
జ. కొబ్బరికాయ
* వానా లేక ఎండా లేక పైరు పచ్చంగా, ఆకు లేక సున్నం లేక నోరు ఎర్రంగ
జ. రామచిలుక.
* దేహమెల్ల కళ్లు, దేవేంద్రుడు కాదు. నరవాహనము లేక నడిచిపోలేదు. తనకు జీవం లేదు, జీవుల్ని చంపు.
జ. వల
* పొట్టలో వేలు, నెత్తి మీద రాయి.
జ. ఉంగరం
* పొడవాటి మానుకి నీడే లేదు.
జ. దారి
* పోకంత పొట్టి బావ, కాగంత కడప మోస్తాడు.
జ. పొయ్యి
* ముట్టుకుంటే ముడుచుకుంటుంది. పట్టుకుంటే గుచ్చుకుంటుంది.
జ. అత్తిపత్తి
* ముద్దుగా నుండును, ముక్కుపైకెక్కు, చెవులు రెండూ లాగి చెంప నొక్కు దండి పండితులకు దారి చూపుట వృత్తి.
జ. కళ్లజోడు.
* పైడిపెట్టెలో ముత్యపు గింజ
జ. వడ్లగింజ
* తల్లి కూర్చొండు, పిల్ల పారాడు.
జ. కడవ, చెంబు
* పూజకు పనికిరాని పువ్వు. పడతులు మెచ్చే పువ్వు.
జ. మొగలిపువ్వు.
* ఇంతింత ఆకు, ఇంపైన ఆకు, రాజుల మెచ్చిన రత్నాల ఆకు?
జ. తమలపాకు
* తొలుతో చేస్తారు. కర్రతో చేస్తారు. అన్నం పెడతారు, అదే పనిగా బాదుతారు?
జ. మద్దెల
* తోలు నలుపు, తింటే పులుపు.
జ. చింతపండు
* తొలు తియ్యన, గుండు మింగన్నా?
జ. అరటి పండు
* జానెడు ఇంట్లో, మూరెడు కర్ర?
జ. కుండలో గరిటె.
* కుడితి తాగదు, మేత మేయదు, కానీ కుండెకు పాలిస్తుంది?
జ.తాటిచెట్టు
* కొప్పుంది కాని జుట్టు లేదు, కళ్లున్నాయి కానీ చూపు లేదు?
జ. కొబ్బరి కాయ
* కొమ్ములుంటాయి కానీ ఎద్దు కాదు. అంబారీ ఉంటుంది కానీ ఏనుగు కాదు?
జ. నత్త
* పైన చూస్తే పండు, పగుల గొడితే బొచ్చు?
జ. పత్తి కాయ.
* నూరు పళ్లు, ఒకటే పెదవి.
జ. దానిమ్మ
* సన్నని స్తంభం, ఎక్కలేరు దిగలేరు.
జ. సూది
* కాళ్ళు చేతులు లేని అందగత్తెకు బోలెడు దుస్తులు.
జ. ఉల్లిపాయ
* నల్లకుక్కకు నాలుగు చెవులు
జ. లవంగం
* తెలిసి కాయ కాస్తుంది. తెలీకుండా పువ్వు పూస్తుంది.
జ. అత్తి చెట్టు
* తొడిమ లేని పండు, ఆకులేని పంట.
జ. విభూది పండు, ఉప్పు
* తన్ను తానే మింగి, మావమౌతుంది.
జ. మైనపు వత్తి
* చూస్తే చూసింది గానీ కళ్లు లేవు. నవ్వితే నవ్వింది గాని పళ్లు నోరు లేదు, తంతే తన్నింది గాని కాలు లేదు.
జ. అద్దం
* చూస్తే చిన్నోడు, వాడి ఒంటి నిండా నార బట్టలు?
జ. టెంకాయ
* తల నుండి పొగ చిమ్ముంది, భూతం కాదు. కన్నులెర్రగా ఉండు రాకాసి కాదు. పాకిపోవుచుండు పాము కాదు?
జ. రైలు
* నిలబడితే నిలుస్తుంది, కూర్చుంటే కూలబడుతుంది?
జ. నీడ
* దాని పువ్వు పూజకు రాదు. దాని ఆకు దొప్పకు రాదు, దాని పండు అందరు కోరు?
జ. చింతపండు
* ఇల్లంతా వెలుగు, బల్లకింద చీకటి.
జ. దీపం
* ఎర్రటి పండు మీద ఈగైనా వాలదు.
జ. నిప్పు
* ఎందరు ఎక్కిన విరగని మంచం.
జ. అరుగు.
* దాస్తే పిడికిలిలో దాగుతుంది, తీస్తే ఇల్లంతా జారుతుంది.
జ.దీపం వెలుగు.
* ఓహొయి రాజా! ఒడ్డు పొడుగేమి? పట్టుకోబోతే పిడికెడు లేవు?
జ. పొగ
* కాళ్లు లేవు గానీ నడుస్తుంది. కళ్లు లేవు గానీ ఏడుస్తుంది?
జ. మేఘం
* తలపుల సందున మెరుపుల గిన్నె.
జ. దీపం
* తల్లి దయ్యం, పిల్ల పగడం.
జ. రేగుపండు
* తెల్లకోటు తొడుక్కున్న ఎర్రముక్కు దొర
జ. కొవ్వొత్తి
* ఒకటే తొట్టి, రెండు పిల్లలు.
జ. వేరుశనగ
* అడ్డగోడమీద బుడ్డ చెంబు, తోసినా ఇటుపక్క పడదు. అటు పక్క పడదు.
జ. ఆబోతు మూపురం.
-------------------------------------------------------------
* అయ్యకు అందవు. అమ్మకు అందుతాయి.
జ. పెదవులు
--------------------------------------------------------------
* మనిషికి రెండే కాళ్లు, ఏడు చేతులు.
జ. నిచ్చెన
---------------------------------------------------------------
* మూలన కూర్చుంటుంది. ఎండొచ్చినా, వానొచ్చినా బయటకు బయలుదేరుతుంది.
జ. గొడుగు.
----------------------------------------------------------------
* ఎర్రవాడొస్తే, నల్లవాడు పారిపోతాడు
జ. సూర్యుడు, చంద్రుడు.
-------------------------------------------------------
* బంగారు చెంబులో వెండి గచ్చకాయ
జ. పనసతొన.
--------------------------------------------------------
* నల్లని షర్టువాడు, కావలికి గట్టివాడు.
జ. తాళం.
--------------------------------------------------------
* తోవలో పుట్టేది, తోవలో పెరిగేది, తొవలో పోయేవారి కొంగు పట్టేది?
జ. ముళ్ల మొక్క
---------------------------------------------------------
* బండకు కొడితే వెండి ఊడుతుంది?
జ. కొబ్బరికాయ
---------------------------------------------------------
* వానా లేక ఎండా లేక పైరు పచ్చంగా, ఆకు లేక సున్నం లేక నోరు ఎర్రంగ
జ. రామచిలుక.
* దేహమెల్ల కళ్లు, దేవేంద్రుడు కాదు. నరవాహనము లేక నడిచిపోలేదు. తనకు జీవం లేదు, జీవుల్ని చంపు.
జ. వల
-----------------------------------------------------------------------------------
* పొట్టలో వేలు, నెత్తి మీద రాయి.
జ. ఉంగరం
-----------------------------------------------------
* పొడవాటి మానుకి నీడే లేదు.
జ. దారి
-----------------------------------------------------
* పోకంత పొట్టి బావ, కాగంత కడప మోస్తాడు.
జ. పొయ్యి
------------------------------------------------------
* ముట్టుకుంటే ముడుచుకుంటుంది. పట్టుకుంటే గుచ్చుకుంటుంది.
జ. అత్తిపత్తి
-------------------------------------------------------------------------------------
* ముద్దుగా నుండును, ముక్కుపైకెక్కు, చెవులు రెండూ లాగి చెంప నొక్కు దండి పండితులకు దారి చూపుట వృత్తి.
జ. కళ్లజోడు.
--------------------------------------------------------------------------------------
* పైడిపెట్టెలో ముత్యపు గింజ
జ. వడ్లగింజ
-----------------------------------------------
* తల్లి కూర్చొండు, పిల్ల పారాడు.
జ. కడవ, చెంబు
------------------------------------------------
* పూజకు పనికిరాని పువ్వు. పడతులు మెచ్చే పువ్వు.
జ. మొగలిపువ్వు.
-------------------------------------------------
* ఇంతింత ఆకు, ఇంపైన ఆకు, రాజుల మెచ్చిన రత్నాల ఆకు?
జ. తమలపాకు
* తొలుతో చేస్తారు. కర్రతో చేస్తారు. అన్నం పెడతారు, అదే పనిగా బాదుతారు?
జ. మద్దెల
----------------------------------------------------------------------
* తోలు నలుపు, తింటే పులుపు.
జ. చింతపండు
-----------------------------------------------------------------------
* తొలు తియ్యన, గుండు మింగన్నా?
జ. అరటి పండు
------------------------------------------------------------------------
* జానెడు ఇంట్లో, మూరెడు కర్ర?
జ. కుండలో గరిటె.
------------------------------------------------------------------------
* కుడితి తాగదు, మేత మేయదు, కానీ కుండెకు పాలిస్తుంది?
జ.తాటిచెట్టు
-------------------------------------------------------------------------
* కొప్పుంది కాని జుట్టు లేదు, కళ్లున్నాయి కానీ చూపు లేదు?
జ. కొబ్బరి కాయ
-------------------------------------------------------------------------
* కొమ్ములుంటాయి కానీ ఎద్దు కాదు. అంబారీ ఉంటుంది కానీ ఏనుగు కాదు?
జ. నత్త
-------------------------------------------------------------------------
* పైన చూస్తే పండు, పగుల గొడితే బొచ్చు?
జ. పత్తి కాయ.
--------------------------------------------------------------------------
* నూరు పళ్లు, ఒకటే పెదవి.
జ. దానిమ్మ
---------------------------------------------------------------------------
* సన్నని స్తంభం, ఎక్కలేరు దిగలేరు.
జ. సూది
మా ఊరెద్దు మీ ఊరు పోదు ,మీ ఊరెద్దు మా ఊరు రాదు ?
జ : మైలు రాళ్లు .
--------------------------------------------------------------------------------------------------
మెడ ఉంటుంది కానీ తల ఉండదు , చేతులు ఉంటాయి కానీ వేల్లుండవు ?
జ : చొక్కా
--------------------------------------------------------------------------------------------------
అర చేతికింద అరిసె ?
జ : పిడక .
----------------------------------------------------------------------------------------------------
వందమంది అన్నదమ్ములకు ఒకే తాడు ?
జ : చీపురు .
----------------------------------------------------------------------------------------------------
అన్నదమ్ములు ముగ్గురు ,అయితే బుద్ధులు మాత్రం వేరు . నీళ్లలో మునిగే వాడొకడు ,తేలే వాడొకడు , కరిగే వాడొకడు ?
జ : వక్క,ఆకు , సున్నం .
----------------------------------------------------------------------------------------------------
మా ఇంటి వెనక ఇంగువ చెట్టు;ఎంత కోసిన గుప్పెడు కాదు?
జ: పొగ గొట్టం లోని పొగ.
మూడు కాళ్ళ ముసలమ్మ నీళ్లు తాగి కొయ్య మింగుతుంది .ఏమిటది ?
జ:సాన.
----------------------------------------------------------------------------------------------------
ఊరికంతా ఒకటే దుప్పటి . ఏమిటది ?
జ :ఆకాశం .
----------------------------------------------------------------------------------------------------
లోకమంతా చాప వేసి , నిద్ర పోకుండా తిరుగుతూ ఉంటాడు . ఎవరతను ?
జ :సముద్రం .
----------------------------------------------------------------------------------------------------
ఇంటికి కన్ను , కంటికి కన్ను , మింటికి కన్ను ఇల్లంతా వెలుగునిచ్చు . ఎవరది ?
జ :దీపం .
----------------------------------------------------------------------------------------------------
ఎర్రని కోటలో తెల్లని భటులు ?
జ :నోటిలో పళ్ళు .
----------------------------------------------------------------------------------------------------
ముఖము లేకున్నా బొట్టు పెట్టుకుంటుంది ?
జ: గడప .
----------------------------------------------------------------------------------------------------
గాలి గండమే కానీ దానికి నీటి గండం లేదు ?
జ : చేప .
----------------------------------------------------------------------------------------------------
గొడుగు కాని గొడుగు ,కొరకరాని పిడుగు ?
జ :కుక్కగొడుగు .
----------------------------------------------------------------------------------------------------
చాచుకొని సావిట్లో పడుకుంటుంది .ముడుచుకుని మూలన నక్కుతుంది ?
జ :చాప .
----------------------------------------------------------------------------------------------------
జీడి వారి కోడలు ,వేడి వారి మరదలు ,వైశాఖ మాసంలో ఇంటికి వస్తుంది ?
జ : మామిడి పండు .
చింపిరి చింపిరి గుడ్డలు ముత్యాల వంటి బిడ్డలు .ఏమిటది ?
జ :మొక్కజొన్నపొత్తు.
----------------------------------------------------------------------------------------------------
కిటకిట తలుపులు కిటారి తలుపులు తియ్యావేయ్యా తీపులు లేవు . ఏమిటది ?
జ :కనురెప్పలు .
----------------------------------------------------------------------------------------------------
అడవిలో పుట్టింది ,అడవిలో పెరిగింది మాయింటి కొచ్చింది ,తైతక్కలాడింది . ఏమిటది ?
జ ;కవ్వం .
----------------------------------------------------------------------------------------------------
గోడమీద బొమ్మ !గొలుసుల బొమ్మ !వచ్చే పోయేవారిని వడ్డించే బొమ్మ !ఏమిటది ?
జ :తేలు.
----------------------------------------------------------------------------------------------------
చిటారు కొమ్మన మిఠాయి పొట్లం . ఏమిటది ?
జ :తేనెపట్టు .
----------------------------------------------------------------------------------------------------
నిగనిగలాడే నిర్మల వస్తువు ,భుగ భుగ మండే పరిమళ వస్తువు ,నీటికి నానదు,గాలికి కరుగు ,నిప్పుకు మండు.ఏమిటది ?
జ :కర్పూరం .
----------------------------------------------------------------------------------------------------
మా తాత దొడ్డిలో మంచి ఎద్దుల మంద ,ఎద్దులు పడుకుంటే పగ్గాలు మేస్తాయి .ఏమిటది ?
జ :గుమ్మడికాయ .
----------------------------------------------------------------------------------------------------
తెల్లని బంతి చల్లని బంతి అందని బంతి ఆడని బంతి .ఏమిటది ?
జ :జాబిలి .
----------------------------------------------------------------------------------------------------
మూట విప్పితే ముత్యాలు .ఏమిటది ?
జ :దానిమ్మపండు .
----------------------------------------------------------------------------------------------------
కింద గట్టు ,పైన గట్టు మధ్యలో ఎర్రబొట్టు .ఏమిటది ?
జ :నాలుక .
ప్ర :- కారం కాని కారం ?
జ :- ఆకారం .
ప్ర :- ఇదొస్తే ఎవరైనా నోరు తెరిచి దారి ఇవ్వాల్సిందే ?
జ :- ఆవలింత .
ప్ర :- దీని పళ్ళు ఊడితే మళ్ళీ రావు ?
జ :- దువ్వెన .
ప్ర :- కూత కూస్తే కాని పరుగు తీయదు ?
జ :- రైలు .
ప్ర :- మనిషి కాదు. జ్ఞానం లేదు. కాని , తన వేయి కళ్ళతో మంచి చెడ్డలను వేరు చేస్తుంది. ఏంటది ?
జ :- జల్లెడ .
ప్ర :- మొండెం వుంటుంది . కాని , తల , కాళ్ళు , చేతులు లేవు . ఏంటది ?
జ :- సీసా .
ప్ర :- అందర్నీ చూడగలదు . తనను తాను చూడలేదు ?
జ :- కన్ను .
ప్ర :- వంటి నిండా గాయాలు . కడుపు నిండా రాగాలు . ఏంటది ?
జ :- పిల్లనగ్రోవి .
ప్ర :- నాలుగు కాల్లునాయి . నిలబడగలదు . కానీ , నడవలేదు . ఏంటది ?
జ :- కుర్చీ .
ప్ర :- రెక్కల్లేని పిట్ట ఎంత ఎగిరినా ఉన్నచోట నుండి కదలదు . ఏంటది ?
జ :- జెండా .
ప్ర : పై పచ్చ ,లో తెలుపు , గులకరాళ్ళు , తేటనీళ్ళు ఏంటది ?
జ : కమలాపండు .
ప్ర : కర్రకాని కర్ర ఏంటది ?
జ : జీలకర్ర .
ప్ర : బంగారు భరిణలో రత్నాలు.పగలగొడితేగాని రావు ?
జ : దానిమ్మ పండు .
ప్ర : ఒక వైపు తిప్పితే దారి మూస్తుంది .మరో వైపు తిప్పితే దారి తెరుస్తుంది . ఏంటది ?
జ : తాళంచెవి .
ప్ర : గాజు పంజరంలో మిణుగురు పురుగు.పగలు నిద్ర , రాత్రి జాగారం చేస్తుంది . ఏంటది ?
జ : బల్బు .
ప్ర : నల్లని పైరు . ఎంత కోసినా పెరుగుతుంది . ఏంటది ?
జ : జుట్టు .
ప్ర : నిమ్మ కాని నిమ్మ ?
జ : దానిమ్మ .
ప్ర : జనం కాని జనం ?
జ : భోజనం .
ప్ర : వనం కాని వనం ?
జ : భవనం .
ప్ర : పాలు కాని పాలు ?
జ : విన్నపాలు / మురిపాలు / జులపాలు .
*******************************సమాప్తం*******************************
తెలుగు సామెతలు
Anonymous
Tuesday, May 24, 2016
తెలుగు సామెతలు
అంత్యనిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మేలు
అంబలి తాగే వారికి మీసాలు యెగబట్టేవారు కొందరా
అతి రహస్యం బట్టబయలు
అడిగేవాడికి చెప్పేవాడు లోకువ
అత్తలేని కోడలుత్తమురాలు కోడల్లేని అత్త గుణవంతురాలు
అనువు గాని చోట అధికులమనరాదు
అభ్యాసం కూసు విద్య
అమ్మబోతే అడివి కొనబోతే కొరివి
అయితే ఆదివారం కాకుంటే సోమవారం
ఆలూ లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం
ఇంట్లో ఈగల మోత బయట పల్లకీల మోత
ఇల్లు కట్టి చూడు పెళ్ళి చేసి చూడు
ఇంట గెలిచి రచ్చ గెలువు
ఇల్లు పీకి పందిరేసినట్టు
ఎనుబోతు మీద వాన కురిసినట్టు
చెవిటి వాని ముందు శంఖమూదినట్టు
కందకు లేని దురద కత్తిపీటకెందుకు
కత్తిపోటు తప్పినాక కలంపోటు తప్పదు
కుక్క కాటుకు చెప్పుదెబ్బ
కోటి విద్యలు కూటి కొరకే
నీరు పల్లమెరుగు నిజము దేవుడెరుగు
పిచ్చుకపై బ్రహ్మాస్త్రం
పిట్ట కొంచెము కూత ఘనము
రొట్టె విరిగి నేతిలో పడ్డట్టు
వాన రాకడ ప్రాణపోకడ
కళ్యాణమొచ్చినా కక్కొచ్చినా ఆగదు
మీసాలకు సంపంగి నూనె
ఆ మొద్దు లొదే ఈ పేడు
ఆ తాను ముక్కే !!!
ఆడబోయిన తీర్థము యెదురైనట్లు
ఆడలేక మద్దెల వోడు అన్నట్లు
ఆది లొనే హంస పాదు
ఏమీ లేని యెడారిలో ఆముదము చెట్టే మహా వృక్షము
ఆకలి రుచి యెరుగదు, నిద్ర సుఖమెరుగదు
ఆకాశానికి హద్దే లేదు
ఆలస్యం అమృతం విషం
ఆరే దీపానికి వెలుగు యెక్కువ
ఆరోగ్యమే మహాభాగ్యము
ఆత్రానికి బుద్ధి మట్టు
ఆవులింతకు అన్న ఉన్నాడు కాని, తుమ్ముకు తమ్ముడు లేడంట
ఆవు చేను మేస్తే, దూడ గట్టు మేస్తుందా?
అబద్ధము ఆడినా అతికినట్లు ఉండాలి
అడగందే అమ్మైనా అన్నమ్ పెట్టదు
అడ్డాల నాడు బిడ్డలు కాని, గడ్డాల నాడు కాదు
ఏ ఎండకు ఆ గొడుగు
అగడ్తలొ పడ్డ పిల్లికి అదే వైకున్ఠం
అగ్నికి వాయువు తొడైనట్లు
ఐశ్వర్యమొస్తే అర్ధరాత్రి గొడుగు పట్టమనేవాడు
అందని మ్రానిపండ్లకు అర్రులు చాచుట
అందితే జుట్టు అందక పోతే కాళ్ళు
అంగట్లో అన్నీ ఉన్నా, అల్లుడి నోట్లో శని ఉన్నట్లు
అన్నపు చొరవే గాని అక్షరపు చొరవ లేధు
అప్పు చేసి పప్పు కూడు
అయ్య వచే వరకు అమావాస్య ఆగుతుందా
అయ్యవారిని చెయ్యబొతే కోతి బొమ్మ అయినట్లు
బతికుంటే బలుసాకు తినవచ్చు
బెల్లం కొట్టిన రాయిలా
భక్తి లేని పూజ పత్రి చేటు
బూడిదలో పోసిన పన్నీరు
చాదస్తపు మొగుడు చెబితే వినడు, గిల్లితే యేడుస్తాడు
చాప కింద నీరులా
చచ్చినవాని కండ్లు చారెడు
చదివేస్తే ఉన్నమతి పోయినట్లు
విద్య లేని వాడు వింత పశువు
చేతకానమ్మకే చేష్టలు ఎక్కువ
చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్లు
చక్కనమ్మ చిక్కినా అందమే
చెడపకురా చెడేవు
చీకటి కొన్నాళ్ళు, వెలుగు కొన్నాళ్ళు
చెరువుకి నీటి ఆశ, నీటికి చెరువు ఆశ
చింత చచ్చినా పులుపు చావ లేదు
చింతకాయలు అమ్మేదానికి సిరిమానం వస్తే, ఆ వంకర టింకరవి యేమి కాయలని అడిగిందట
చిలికి చిలికి గాలివాన అయినట్లు
డబ్బుకు లోకం దాసోహం
దేవుడు వరం ఇచ్చినా పూజారి వరం ఇవ్వడు
దరిద్రుడి పెళ్ళికి వడగళ్ళ వాన
దాసుని తప్పు దండంతో సరి
దెయ్యాలు వేదాలు పలికినట్లు
దిక్కు లేని వాడికి దేవుడే దిక్కు
దొంగకు దొంగ బుద్ధి, దొరకు దొర బుద్ధి
దొంగకు తేలు కుట్టినట్లు
దూరపు కొండలు నునుపు
దున్నపోతు మీద వర్షం కురిసినట్లు
దురాశ దుఃఖమునకు చెటు
ఈతకు మించిన లోతే లేదు
ఎవరికి వారే యమునా తీరే
ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారు
గాడిద సంగీతానికి ఒంటె ఆశ్చర్యపడితే, ఒంటె అందానికి గాడిద మూర్ఛ పోయిందంట
గాజుల బేరం భోజనానికి సరి
గంతకు తగ్గ బొంత
గతి లేనమ్మకు గంజే పానకము
గోరు చుట్టు మీద రోకలి పోటు
గొంతెమ్మ కోరికలు
గుడ్డి కన్నా మెల్ల మేలు
గుడ్డి యెద్దు జొన్న చేలో పడినట్లు
గుడ్డు వచ్చి పిల్లను వెక్కిరించినట్లు
గుడి మింగే వాడికి నంది పిండీమిరియం
గుడినీ గుడిలో లింగాన్నీ మింగినట్లు
గుడ్ల మీద కోడిపెట్ట వలే
గుమ్మడి కాయల దొంగ అంటే భుజాలు తడుముకొన్నాడట
గుర్రము గుడ్డిదైనా దానాలో తక్కువ లేదు
గురువుకు పంగనామాలు పెట్టినట్లు
తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టినట్లు
ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడు
ఇంటి పేరు కస్తూరివారు వీధిలో గబ్బిలాల కంపు
ఇంటికన్న గుడి పదిలం
ఇసుక తక్కెడ పేడ తక్కెడ
జోగి జోగి రాజుకుంటే బూడిద రాలిందంట
కాచిన చెట్టుకే రాళ్ళ దెబ్బలు
కాగల కార్యము గంధర్వులే తీర్చినట్లు
కాకి ముక్కుకు దొండ పండు
కాకి పిల్ల కాకికి ముద్దు
కాలం కలిసి రాక పోతే కర్రే పామై కాటు వేస్తుంది
కాలు జారితే తీసుకోగలము కాని నోరు జారితే తీసుకోగలమా
కాసుంటే మార్గముంటుంది
కడుపు చించుకుంటే కాళ్ళపైన పడ్డట్లు
కలకాలపు దొంగ ఒకనాడు దొరుకును
కలిమి లేములు కావడి కుండలు
కలిసి వచ్చే కాలం వస్తే, నడిచి వచ్చే కొడుకు పుదతాదు
కంచే చేను మేసినట్లు
కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా!
కందకు కత్తి పీట లోకువ
కందెన వేయని బండికి కావలసినంత సంగీతం
కరవమంటే కప్పకు కోపం విడవమంటే పాముకు కోపం
కీడెంచి మేలెంచమన్నారు
కొండ నాలికకి మందు వేస్తే ఉన్న నాలిక ఊడినట్లు
కొండల్లే వచ్చిన ఆపద కూడా మంచువలే కరిగినట్లు
కొండను తవ్వి యెలుకను పట్టినట్లు
కొన్న దగ్గిర కొసరు గాని కోరిన దగ్గర కొసరా
కూసే గాడిద వచ్చి మేసే గాడిదను చెరిచిందిట
కూటికి పేదైతే కులానికి పేదా
కొరివితో తల గోక్కున్నట్లు
కోతి పుండు బ్రహ్మాండం
కోతికి కొబ్బరి చిప్ప ఇచ్చినట్లు
కొత్తొక వింత పాతొక రోత
కోతి విద్యలు కూటి కొరకే
కొత్త అప్పుకు పొతే పాత అప్పు బయటపడ్డదట
కొత్త బిచ్చగాడు పొద్దు యెరగడు
కృషితో నాస్తి దుర్భిక్షం
క్షేత్ర మెరిగి విత్తనము పాత్ర మెరిగి దానము
కుడుము చేతికిస్తే పండగ అనేవాడు
కుక్క వస్తే రాయి దొరకదు రాయి దొరికితే కుక్క రాదు
లేని దాత కంటే ఉన్న లోభి నయం
లోగుట్టు పెరుమాళ్ళకెరుక
మెరిసేదంతా బంగారం కాదు
మంచమున్నంత వరకు కాళ్ళు చాచుకో
నోరు మంచిదయితే ఊరు మంచిదవుతుంది
మంది యెక్కువయితే మజ్జిగ పలచన అయినట్లు
మనిషి మర్మము మాను చేవ బయటకు తెలియవు
మనిషి పేద అయితే మాటకు పేదా
మనిషికి మాటే అలంకారం
మనిషికొక మాట పశువుకొక దెబ్బ
మనిషికొక తెగులు మహిలో వేమా అన్నారు
మంత్రాలకు చింతకాయలు రాల్తాయా
మీ బోడి సంపాదనకు ఇద్దరు పెళ్ళాలా
మెత్తగా ఉంటే మొత్త బుద్ధి అయ్యిందట
మొక్కై వంగనిది మానై వంగునా
మొరిగే కుక్క కరవదు
మొసేవానికి తెలుసు కావడి బరువు
ముల్లును ముల్లుతోనే తీయాలి వజ్రాన్ని వజ్రంతొనే కొయ్యాలి
ముండా కాదు ముత్తైదువా కాదు
ముందర కాళ్ళకి బంధాలు వేసినట్లు
ముందుకు పోతే గొయ్యి వెనుకకు పోతే నుయ్యి
ముంజేతి కంకణముకు అద్దము యెందుకు
నడమంత్రపు సిరి నరాల మీద పుండు
నేతి బీరకాయలో నెయ్యి యెంత ఉందో నీ మాటలో అంతే నిజం ఉంది
నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా
నవ్వు నాలుగు విధాలా చేటు
నీ చెవులకు రాగి పొగులే అంటే అవీ నీకు లేవే అన్నట్లు
నిదానమే ప్రధానము
నిజం నిప్పు లాంటిది
నిమ్మకు నీరెత్తినట్లు
నిండు కుండ తొణకదు
నిప్పు ముట్టనిది చేయి కాలదు
నూరు గొడ్లు తిన్న రాబందుకైనా ఒకటే గాలిపెట్టు
నూరు గుర్రాలకు అధికారి ఐనా భార్యకు యెండు పూరి
నెల్లాళ్ళు సావాసం చేస్తే వారు వీరు అవుతారు
ఒక ఒరలో రెండు కత్తులు ఇమడవు
ఊపిరి ఉంటే ఉప్పు అమ్ముకొని బ్రతకవచ్చు
బతికి ఉంటే బలుసాకు తినవచ్చు
ఊరంతా చుట్టాలు ఉత్తికట్ట తావు లేదు
ఊరు మొహం గోడలు చెపుతాయి
పాకి దానితొ సరసమ్ కంటే అత్తరు సాయిబు తో కలహం మేలు
పాము కాళ్ళు పామునకెరుక
పానకంలో పుడక
పాపమని పాత చీర ఇస్తే గోడ చాటుకు వెళ్ళి మూర వేసిందట
పచ్చ కామెర్లు వచ్చిన వాడికి లోకం అంతా పచ్చగా కనపడినట్లు
పండిత పుత్రః శుంఠ
పనిలేని మంగలి పిల్లి తల గొరిగినట్లు
పరిగెత్తి పాలు తాగే కంటే నిలబడి నీళ్ళు తాగడం మేలు
పట్టి పట్టి పంగనామం పెడితే గోడ చాటుకు వెళ్ళి చెరిపి వేసుకున్నాడట
పెదిమ దాటితే పృథివి దాటును
పెళ్ళంటే నూరేళ్ళ పంట
పెళ్ళికి వెళుతూ పిల్లిని చంకన పెట్టుకు వెళ్ళినట్టు
పేనుకు పెత్తనమిస్తే తల అంతా కొరికిందట
పెరుగు తోట కూరలో పెరుగు యెంత ఉందో నీ మాటలో అంతే నిజం ఉంది
పిచ్చి కోతికి తేలు కుట్టినట్లు
పిచ్చోడి చేతిలో రాయిలా
పిల్లి శాపాలకు ఉట్లు తెగుతాయా
పిల్లికి చెలగాటం యెలుకకు ప్రాణ సంకటం
పిండి కొద్దీ రొట్టె
పిట్ట కొంచెము కూత ఘనము
పోరు నష్టము పొందు లాభము
పోరాని చోట్లకు పోతే రారాని మాటలు రాకపోవు
పొర్లించి పొర్లించి కొట్టిన మీసాలకు మన్ను కాలేదన్నదట
పుణ్యం కొద్దీ పురుషుడు, దానం కొద్దీ బిడ్డలు
పువ్వు పుట్టగానే పరిమళించినట్లు
రాజు గారి దివాణంలో చాకలోడి పెత్తనము
రామాయణంలో పిడకల వేట
రమాయణం అంతా విని రాముడికి సీత యేమౌతుంది అని అడిగినట్టు
రామేశ్వరం వెళ్ళినా శనేశ్వరం వదలనట్లు
రెడ్డి వచ్చే మొదలు పెట్టు అన్నట్టు
రొట్టె విరిగి నేతిలో పడ్డట్లు
రౌతు కొద్దీ గుర్రము
ఋణ శేషం శత్రు శేషం ఉంచరాదు
చంకలో పిల్లవాడిని ఉంచుకుని ఊరంతా వెతికినట్టు
సంతొషమే సగం బలం
సిగ్గు విడిస్తే శ్రీరంగమే
సింగడు అద్దంకి పోనూ పొయ్యాడు రానూ వచ్చాడు
శివుని ఆజ్ఞ లేక చీమైనా కుట్టదు
శుభం పలకరా యెంకన్నా అంటే పెళ్ళి కూతురు ముండ ఎక్కడ అన్నాడంట!
శ్వాస ఉండేవరకు ఆశ ఉంటుంది
తాచెడ్డ కోతి వనమెల్ల చెరిచిందట
తాడి తన్ను వాని తల తన్నేవాడు ఉంటాడు
తాళిబొట్టు బలం వల్ల తలంబ్రాల వరకు బతికాడు
తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు
తాటాకు చప్పుళ్ళకు కుందేళ్ళు బెదురుతాయా
తాతకు దగ్గులు నేర్పినట్టు
తేలుకు పెత్తనమిస్తే తెల్లవార్లూ కుట్టిందట
తన కోపమే తన శత్రువు
తన్ను మాలిన ధర్మము మొదలు చెడ్డ బేరము
తంతే గారెల బుట్టలో పడ్డట్లు
తప్పులు వెదికే వాడు తండ్రి ఒప్పులు వెదికేవాడు వోర్వలేనివాడు
తీగ లాగితే డొంక అంతా కదిలినట్లు
తెగేదాక లాగవద్దు
తిక్కలోడు తిరణాళ్ళకు వెలితే ఎక్కా దిగా సరిపొయిందంట
తినే ముందు రుచి అడుగకు వినే ముందు కథ అడుగకు
తినగా తినగా గారెలు చేదు
తింటే గారెలు తినాలి వింటే భారతం వినాలి
తియ్యటి తేనె నిండిన నోటితోనే తేనెటీగ కుట్టేది
ఉల్లి చేసిన మేలు తల్లి కూడ చేయదు
ఉపకారానికి పోతే అపకారమెదురైనట్లు
ఉరుము ఉరుమి మంగళం మీద పడ్డట్టు
ఉత్తికెక్కలేనమ్మ స్వర్గానికెక్కినట్టు
వాపును చూసి బలము అనుకున్నాడట
వీపుమీద కొట్టవచ్చు కాని కడుపు మీద కొట్టరాదు
వెర్రి వెయ్యి విధాలు
వినాశకాలే విపరీత బుద్ధి
యే ఎండకు ఆ గొడుగు
యే గాలికి ఆ చాప
యెద్దు పుండు కాకికి ముద్దు
యేకులు పెడితే బుట్టలు చిరుగునా
యెక్కడైనా బావ కానీ వంగ తోట దగ్గర మాత్రం కాదు
యెప్పుడూ ఆడంబరంగా పలికే వాడు అల్పుడు.....
చిలిపి ప్రశ్నలు
Anonymous
Tuesday, May 24, 2016
చిలిపి ప్రశ్నలు :
* వైద్యులు ఆపరేషన్ చేస్తున్నప్పడు ముఖానికి గుడ్డ ఎందుకు కట్టుకుంటారు?
జ. ఎవరు చేశారో తెలియకూడదని
* నోరు లేకపోయినా కరిచేవి?
జ. చెప్పులు
* చేయడానికి ఇష్టపడానికి ధర్మం
జ. కాలధర్మం
* డబ్బులు ఉండని బ్యాంకు
జ. బ్లడ్ బ్యాంక్
* ఓకే చోదకుడితో నడిచే బస్సు
జ. డబుల్ డెక్కర్ బస్సు
* ఎంత విసిరినా చేతిలో ఉండే కర్ర
జ. విసనకర్ర
* ఉత్తరానికి, దక్షిణానికి తేడా?
జ. ఉత్తరం పోస్టు డబ్బాలో వేయగలం. దక్షిణాన్ని వేయలేం.
* విసిసిపీ నదిలో ఎక్కువ ఏమున్నాయి?
జ. ‘సీ’లు
* మొదటి ర్యాంకు రావాలంటే పరీక్షలు ఎలా రాయాలి?
జ. పెన్నుతో
* మనకు కలలు ఎందుకు వస్తాయి.
జ. కంటాం కాబట్టి
* తాగలేని రసం ఏమిటి?
జ. పాదరసం.
* పిల్లలు ఉండని స్కూల్ ఏమిటి?
జ. డ్రైవింగ్ స్కూల్
* నడవలేని కాలు ఏమిటి?
జ. పంపకాలు
* ఆడలేని బ్యాట్ ఏమిటి?
జ. దోమల బ్యాట్
* కనిపించని గ్రహం ఏమిటి?
జ. నిగ్రహం.
* భోజనంలో పనికి రాని రసం ఏమిటి?
జ. పాదరసం.
* తాగలేని రమ్ ఏమిటి?
జ. తగరం.
* దేవుడు లేని మతం ఏమిటి?
జ. కమతం
* దున్నలేని హలం?
జ. కుతూహలం.
* రాజులు నివశించని కోట ఏమిటి?
జ. తులసి కోట
* అందరికీ ఇష్టమైన కారం ఏమిటి?
జ. ఉపకారం.
* కరవలేని పాము?
జ. వెన్నుపాము.
* కొట్టకుండా తగిగే దెబ్బ ఏమిటి?
జ. వడదెబ్బ
* తాగలేని పాలు ఏమిటి?
జ. పాపాలు.
* పూజకు పనికిరాని పత్రి ఏమిటి?
జ. ఆసుపత్రి
* గీయలేని కోణం ఏమిటి?
జ. కుంభకోణం.
* చెట్లు లేని వనం?
జ. భవనం.
* వెలిగించలేని క్యాండిల్?
జ. ఫిల్డర్ క్యాండిల్.
* కోడి వేడినీళ్లు తాగితే ఏం చేస్తుంది?
జ. ఉడకబెట్టిన గుడ్డు పెడుతుంది.
* స్కూల్ బ్యాగులో ఉండని స్కేలు
జ. రిక్టర్ స్కేలు
* తాజ్ మహల్ ఎక్కడుంది?
జ. భూమ్మీద.
* ఇంటికి పెట్టలేని గేట్ ఏమిటి?
జ. ఇంటరాగేట్
* అంకెల్లో లేని పది?
జ. ద్రౌపది.
* చేపల్ని తినే రాయి ఏమిటి?
జ. కొక్కిరాయి.
* వాహనాలకు ఉండని టైర్లు ఏమిటి?
జ. సెటైర్లు
* భార్య లేని పతి ఎవరు?
జ. అల్లోపతి
* అన్నం తినకపోతే ఏమవుతుంది?
జ. మిగిలిపోతుంది.
* కూర్చోలేని హాలు ఏమిటి?
జ. వరహాలు.
* వాహనాలకు ఉండని టైర్ ఏమిటి?
జ. రిటైర్
* తినలేని కాయ ఏమిటి?
జ. లెంపకాయ
* నారి లేని విల్లు ఏమిటి?
జ. హరివిల్లు
* డబ్బులుండని బ్యాంక్ ఏమిటి?
జ. బ్లడ్ బ్యాంక్
* వేసుకోలేని గొడుగు ఏమిటి?
జ. పుట్టగొడుగు.
* చీమలు కనిపెట్టలేని షుగర్ ఏమిటి?
జ. బ్రౌన్ షుగర్
* వేయలేని టెంట్ ఏమిటి?
జ. మిలిటెంట్
* మొక్కకు పూయని రోజాలు ఏమిటి?
జ. శిరోజాలు.
* రుచి లేని కారం ఏమిటి?
జ. ఆకారం
* చారలు లేని జీబ్రా ఏమిటి?
జ. ఆల్జీబ్రా
* అందరూ కోరుకునే సతి ఏమిటి?
జ. వసతి.
* అందరికి నచ్చే బడి ఏమిటి?
జ. రాబడి.
* పగలు కూడా కనపడే నైట్ ఏమిటి?
జ. గ్రానైట్
* ఎగ్జామినర్ దిద్దని పేపర్ ఏమిటి?
జ. న్యూస్ పేపర్.
* వేలికి పెట్టుకోలేని రింగ్ ఏమిటి?
జ. ఫైరింగ్
* అందరూ భయపడే బడి ఏమిటి?
జ. చేతబడి.
* అందరూ నమస్కరించే కాలు ఏమిటి?
జ. పుస్తకాలు
* వీసా అడగని దేశమేమిటి?
జ. సందేశం.
* ఆయుధంలేని పోరాటమేమిటి?
జ. మౌనపోరాటం.
* గుడ్డు పెట్టలేని కోడి ఏమిటి?
జ. పకోడి
* కనిపించని వనం ఏమిటి?
జ. పవనం.
* నీరు లేని వెల్ ఏమిటి?
జ. ట్రావెల్
* సూర్యుడు ప్రవేశించలేని రాశి ఏది ?
జ :- ద్రవ్యరాశి .
----------------------------------------------------------------------------------------------------
* గులాబ్ జామ్ తియ్యగా అవ్వాలంటే ఏం చేయాలి ?
జ :- వండాలి !
----------------------------------------------------------------------------------------------------
* ఆడవాళ్లు ఎక్కువగా కోరుకునే వరం ?
జ :- సవరం .
----------------------------------------------------------------------------------------------------
* కోడి లేకుండా గుడ్లేలా వస్తాయి ?
జ :- బాతులు పెడితే .
----------------------------------------------------------------------------------------------------
* కదులుతున్న రైలు ఎక్కబోయి కిందపడితే ఏమవుతుంది ?
జ :- రైలు వెళ్లిపోతుంది !
----------------------------------------------------------------------------------------------------
* కొత్త చెప్పులు కొనగానే ఎక్కడికి వెళ్లడానికి భయపడతారు?
జ :- గుడికి !
----------------------------------------------------------------------------------------------------
* ఆర్పలేని మంట ?
జ :- కడుపు మంట !
----------------------------------------------------------------------------------------------------
* పాకుతూ వెళ్లే కొండ ?
జ :- అనకొండ .
----------------------------------------------------------------------------------------------------
* తలలో ఉండే పాలు?
జ :- జుల పాలు .
----------------------------------------------------------------------------------------------------
* పోపుల పెట్టెలోని కర్ర ?
జ :- జిల్లకర్ర .
* కాకినాడ నుంచి వైజాగ్ పరిగెడుతుంటే మొదటగా వచ్చేది ఏంటి ?
జ :- ఆయాసం .
----------------------------------------------------------------------------------------------------
* గుమ్మాలకు తోరణాలు ఎందుకు కడతారు ?
జ :- కట్టకపోతే పడిపోతాయి కాబట్టి !
----------------------------------------------------------------------------------------------------
* ఎంత వయసొచ్చినా బేబీగానే ఉండాలంటే ఏం చేయాలి ?
జ :- బేబీ అని పేరు పెట్టుకోవాలి !
----------------------------------------------------------------------------------------------------
* డాక్టర్ కు ఇళ్ళు అద్దెకిస్తే ఏమవుతుంది ?
జ :- అద్దె వస్తుంది !
----------------------------------------------------------------------------------------------------
* గుళ్లో భక్తులకు ప్రసాదం ఎప్పుడు పెడతారు ?
జ :- చేయి చాచినప్పుడు .
----------------------------------------------------------------------------------------------------
* చేతులు మారినా సెకండ్ హ్యాండ్ కానిది ?
జ :- డబ్బు .
----------------------------------------------------------------------------------------------------
* ఏం . ఆర్. పి.ధర లేకుండా కొనేది ?
జ :- పెళ్ళికొడుకును !
----------------------------------------------------------------------------------------------------
* ఒక్కరోజులో సరిగ్గా వంద కిలోల స్వీట్స్ అమ్మాలం టే ఏం చేయాలి ?
జ :- తూచాలి !
----------------------------------------------------------------------------------------------------
* యమగండం , రాహుకాలం లేని వారం ?
జ :- పరివారం.
----------------------------------------------------------------------------------------------------
* అప్పట్లో ప్రయాణం చేయాలంటే గుర్రాలపై వెళ్ళేవారు ఎందుకు ?
జ :- నడిచివెళ్ళలేక !
* మన టైం బాగుండాలంటే ఏం చేయాలి ?
జ :- వాచీ శుభ్రం చేసుకోవాలి !
----------------------------------------------------------------------------------------------------
* ఒక పీకాక్ రోజుకి రెండు గుడ్లు పెడితే వారానికి ఎన్ని గుడ్లు పెడుతుంది ?
జ :- పీకాక్ గుడ్లు పెట్టదుగా !పీ హేన్ పెడుతుంది !
----------------------------------------------------------------------------------------------------
* నలుపు , తెలుపు కావాలంటే ఏం చేయాలి ?
జ :- 'న' కు బదులు 'తే ' రాయాలి !
----------------------------------------------------------------------------------------------------
* భయపెట్టే గ్రహం ఏది ?
జ :- ఆగ్రహం .
----------------------------------------------------------------------------------------------------
* నవ్వు నాలుగు విధాల చేటని ఎందుకు అంటారు ?
జ :- నోరుంది కాబట్టి !
----------------------------------------------------------------------------------------------------
* నొప్పి పుట్టించే కాలు ?
జ :- టీకాలు .
----------------------------------------------------------------------------------------------------
* వాహనాలు లేని రోడ్లు, చెట్లులేని అడవి , ఇళ్ళు లేని నగరాలు ఎక్కడ కనిపిస్తాయి ?
జ :- పటంలో .
----------------------------------------------------------------------------------------------------
* పక్షులు ఎక్కువగా సేదతీరే పురం ?
జ :- గోపురం .
----------------------------------------------------------------------------------------------------
* నీడ ఎలా ఏర్పడుతుంది ?
జ :- నల్లగా .
----------------------------------------------------------------------------------------------------
* నీళ్లు లేని చెరువు ?
జ :- అచ్చెరువు .
* నోటితో కాకుండా తినేది ?
జ :- తిట్టు .
----------------------------------------------------------------------------------------------------
* చెట్లకు కాయని ఫలాలు ?
జ :- రాశి ఫలాలు .
----------------------------------------------------------------------------------------------------
* మనమంతా తక్కువగా నిద్రపోయే నెల ఏది ?
జ :- ఫిబ్రవరి .
----------------------------------------------------------------------------------------------------
* ఎంత వర్షం కురిసినా తడవనిది?
జ :- సముద్రం .
----------------------------------------------------------------------------------------------------
* చలికాలంలో పది కప్పుల ఐస్ క్రీం ఒకేసారి తింటే ఏమవుతుంది ?
జ :- అసాధ్యమవుతుంది .
----------------------------------------------------------------------------------------------------
* పులి మనకు నమస్కారం పెడితే ఏం చేయాలి ?
జ :- పారిపోవాలి !
----------------------------------------------------------------------------------------------------
* ఆఫ్రికా అడవి మనుషులు అరటి పండు తినే ముందు ఏం చేస్తారు ?
జ :- తొక్క తీస్తారు .
----------------------------------------------------------------------------------------------------
* పడుకున్నా నిద్రపట్టని వారు ఎక్కువగా చేసే పని ?
జ :- మెలుకువగా ఉండటం .
----------------------------------------------------------------------------------------------------
* ముట్టుకోలేని కారు ?
జ :- షికారు .
----------------------------------------------------------------------------------------------------
* వేడి వేడి బజ్జీలు మూతి కాలకుండా తినాలంటే ముందు ఏం చేయాలి ?
జ :- నోరు తెరవాలి .
Subscribe to:
Posts (Atom)