సౌందర్య చిట్కాలు :
1.
ముఖంపై మచ్చలు ఇబ్బంది పెడుతున్నాయా ?
|
కొందరు స్త్రీలకు ముఖంపై చారికల్లాంటి మచ్చలు ఇబ్బంది పెడతాయి.వీటిని నివారించడానికి ఈ క్రింది చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. |
»
| ముఖాన్ని ఎప్పటికప్పుడు శుభ్రంగా కడుక్కోవాలి. |
»
| ఎక్కువగా నిళ్ళు తిసుకోవడం వల్ల ముఖం తాజాగా తయారయ్యి మచ్చలు పొతాయి. |
»
| కొంచెం ఉల్లి రసంలో చెంచా తేనె కలిపి ముఖానికి రాసుకుంటే ముఖంపై మచ్చలు నివారించవచ్చు. |
»
| మచ్చలపై నిమ్మతొక్కలతో మసాజ్ చేసుకోవాలి. |
|
»
| వారానికి రెండు సార్లు బాదం పప్పును నీటిలో నానబెట్టి నానిన తరువాత దంచి ఒక చెంచా నిమ్మరసంలో కలిపి మెత్తగా పేస్ట్ లా చేసుకుని ముఖానికి పట్టిస్తే గుణం కనబడుతుంది. |
»
| కొంచెం ఉల్లి రసంలొ దూదిని ముంచి నల్ల మచ్చలు ఉన్నచోట రాసుకుంటే ఫలితం ఉంటుంది. |
»
| అరకప్పు టమోటో రసంలో అరకప్పు మజ్జిగను మిక్స్ చేసి మచ్చలు మీద రాస్తే మచ్చలు పోతాయి. |
|
|
౨.
పెదవులు పగులుతున్నాయా ?
|
అందమైన పెదవులు మగువకు ఎంతో అందాన్ని చేకూరుస్తాయి.అయితే శీతాకాలంలో ఎక్కువగా పెదవులు పగిలి చాలా ఇబ్బంది పెడుతుంటాయి.మరి ఇలా పెదాలు పగలకుండా ఉండటానికి ఈ చిట్కాలు పాటిస్తే మీ పెదవులు గులాబీరేకుల్లా సుతారంగా ఉంటాయి. |
»
| పెదవులు ఎక్కువగా పగులుతుంటే వాటికి పాల మీగడ రాయాలి. |
»
| గులాబీ రేకులను పాలలో కలిపి పెదవులపై రాసి కొంచెం సేపాగిన తర్వాత కడుక్కుంటే మృదువుగా తయారవుతాయి. |
|
»
| పెదాలపై వున్న నలుపు పోగొట్టాలంటే తేనే,గ్లిజరిన్,నిమ్మరసం కలిపి రాసుకోవాలి. |
»
| మీగడలో సెనగ పిండి,నిమ్మరసం కలిపి పెదాలకు రాసుకుంటే మృదువుగా తయారవుతాయి. |
|
|
౩.
మొటిమలు మిమ్మల్ని బాదిస్తున్నాయా ?
|
యుక్త వయసు వచ్చిన తర్వాత ఎక్కువ మంది ఆడవారిని మొటిమలు వేధిస్తుంటాయి.వీటివల్ల ముఖం అందవికారంగా తయారయ్యి నలుగురితో కలవాలంటే సంకొచించే పరిస్ధితి ఏర్పడుతుంది.అయితే అలాంటి వారు ఈ చిట్కాలు పాటిస్తే మొటిమలు మిమ్మల్ని దరిచేరవు. |
»
| మొటిమలు ఎక్కువగా ఆయిల్ పుడ్ తినేవారిలో వస్తాయి.కాబట్టీ అయిల్ పుడ్ ను వీలైనంత వరకూ తగ్గించుకునేలా చూడాలి. |
»
| మొటిమలు ఎక్కువగా ముఖం మీద ఉండే బ్యాక్టీరియా వల్ల వస్తుంటాయి.కాబట్టి ముఖాన్ని ఎప్పటికపుడు సబ్బుతో శుభ్రంగా కడుక్కుని పొడి టవల్ తో శుభ్రంగా తుడుచుకోవాలి. |
»
| మొటిమలు ఉన్నవారు వాటిని సూది,పిన్నిసు వంటి వాటితో పొడుస్తుంటారు.ఇలా చెయ్యడం వల్ల దీనిలో ఉండే బ్యాక్టీరియా ముఖంలోని ఇతర ప్రాంతాలకు విస్తరించే ప్రమాదం ఉంది. |
»
| మొటిమలు వాచి నొప్పి పెడుతుంటే ఐస్ క్యూబ్ను వాటిపై మెల్లగా రుద్దుతుంటే కొంచేం ఉపశమనం లభిస్తుంది. |
|
»
| కొంచెం నిటీలో దాల్చిన చెక్క పొడి వేసి మెత్తగా పెస్ట్ లా చేసుకుని మొటిమలకు పట్టిస్తే ఫలితం కనబడుతుంది. |
»
| మొటిమలు ఎక్కువగా ఉన్నవారు మాంసాహరం తగ్గించాలి. |
»
| నీటిని ఎక్కువగా తాగడం వల్ల కూడా మొటీమలు రాకుండా చూసుకోవచ్చు. |
»
| మొటిమలు ఉన్నయి కదా అని ఏక్రిం బడితే ఆక్రిం రాసేయకూడదు.దీనివల్ల మీ ముఖం ఇన్ పెక్షన్ బారిన పడే ప్రమాదం ఉంది. |
»
| టమోటాపండు రసం తీసీ మొటిమలు మీద రాసుకుంటే ఫలితం కనిపిస్తుంది. |
»
| కొంచెం నిమ్మరసంలో వేపాకు పొడి వేసి బాగా కలుపుకుని మొటిమల మీద రాస్తే మొటిమల నుండి విముక్తి పొందవచ్చు. |
»
| మొటిమలు ఉన్న చోట తెల్ల ఉల్లిపాయ రసం తీసి దానిలో కొంచెం తెనె,చిటికెడు ఉప్పు కలిపి పేస్ట్ చేసుకుని అప్లైచేస్తే మొటిమలు తగ్గుతాయి. |
»
| మొటిమలు మీద వెల్లుల్లి రసం రాయడం వల్ల వీటిని నివారించవచ్చు. |
|
|
౪.
మీ గోళ్ళను అందంగా ఉంచుకోవాలనుకుంటున్నారా ?
|
మగువల సౌందర్య పోషణలో చేతి గోళ్ళు ప్రముఖ పాత్ర పోషిస్తాయి.చాలా మంది వీటిని అల్లారు ముద్దుగా కాపాడుకుంటూ ఉంటారు.అలాంటి వారి కోసం మేమందిస్తున్న కొన్ని టిప్స్ ఇవిగో.. |
»
| నెయిల్స్ ని కత్తిరించేటప్పుడు చాలా జాగ్రత్త అవసరం పదునైన సాధనాలతో కత్తిరించు కోవడం వల్ల ఒకోసారి గోటి చిగుళ్ళు దెబ్బతిని పెరుగుదల ఆగిపోయె ప్రమాదం ఉంది. |
»
| గోళ్ళు కత్తిరించుకునే ముందు చేతిని కొంచెం నులివెచ్చటి నిటిలో నానబెట్టి ఆ తర్వాత కట్ చేసుకుంటే త్వరగా కట్ అవుతాయి. |
 |
»
| నెయిల్ పాలిష్ అదే పనిగా ఎక్కువసార్లు వాడటం వల్ల విటిలో ఉండే కెమికల్ మీ గోళ్ళను పాడు చేసే ప్రమాదం ఉంది. |
»
| గోళ్ళు పాడవకుండా ఉండటానికి అసహజసిద్దమైన పాలిష్ల కన్నా ప్రకృతిలో దొరికే గోరింతాకు రుబ్బి పెట్టుకోవడం చాలా ఉత్తమం.ఎందుకంటె దినిలో ఉండే అనేక ఔషదగుణాలు మీ గోళ్ళను పాడవకుండా కాపాడుతాయి. |
»
| రోజు పడుకునేముందు గోళ్ళచుట్టూ ఏదైనా క్రీంస్ రాసుకుంటే గోళ్ళ చుట్టూ ఉండీఅ చర్మం మెత్తగా తయారవుతుంది. |
|
|
5 .
చుండ్రు తగ్గడానికి తీసుకోవలసిన జాగ్రత్తలు
|
కొంతమంది మహిళలను చుండ్రు సమస్య వీపరీతంగా వేధిస్తూ ఉంటుంది.ఈ చుండ్రు వల్ల అనేక మంది సమస్యలను ఎదుర్కుంటూ ఉంటారు.మరి ఈ చిట్కాలను పాటిస్తే చుండ్రు మీ దరిదాపులకు కూడా రాదు.అవేంటో చూద్దామా మరి. |
»
| వారంలో కనీసం రెండు సార్లయినా తలమ్మటా కుంకుడుకాయతో గానీ స్నానం చయ్యాలి. |
»
| కొబ్బరి నూనెలో కొంచెం నిమ్మరసం కలిపి కుదుళ్ళకు బాగా పట్టేలా పట్టించి గంట తర్వాత తల స్నానం చెయ్యాలి. |
»
| గసగసలాను మెత్తగా పెష్ట్ లా చేసుకుని తలకు పట్టించి ఒక గంట తర్వాత స్నానం చేస్తే ఫలితం ఉంటుంది. |
|
»
| ఒక కప్పు వేడి నీటిలో నిమ్మకాయ రసంపిండి తలకు పట్టించి తలస్నానం చేయ్యాలి. |
»
| కొబ్బరి నూనెలో కర్పూరం కలుపుకుని కురులకు పట్టించి అరగంట ఆగిన తర్వాత స్నానం చేస్తే ఫలితం ఉంటుంది. |
»
| మందార ఆకులను వేడి నూనెలో కలిపి తలకు రాసుకోవాలి. |
»
| టీస్పూన్ కీరాజ్యూస్ లో కొంచెం నిమ్మరసం,చిటికెడు పసుపు కలిపి చర్మానికి రాసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. |
»
| కొబ్బరి నీళ్ళలో రెండుచుక్కలు నిమ్మరసం కలిపి తాగితే చుండ్రు నుండి ఉపసమనం పొందవచ్చు. |
»
| పారిజాతం గింజల్ని మెత్తగా నూరి పోడిచేసి దీన్ని నూనెలో కలిపి తలకు పట్టించి స్నానం చేస్తే ఫలితం ఉంటుంది. |
»
| తలస్నానం చేసే ముందు కురులకు పెరుగు పట్టించి అరగంట తరువాత స్నానం చేస్తే ఫలితం ఉంటుంది. |
»
| జుట్టుకు హెర్బల్ ఆయిల్ మసాజ్ చేసుకోవడం వల్ల చుండ్రును నివారించవచ్చు. |
|
|
6.
కలువల్లాంటీ కళ్ళు కోసం
|
అందమైన కళ్ళు మీ అందాన్ని నిబడీకృతం చేస్తాయి. చక్కటి కలువల్లాంటి కళ్ళు కోసం ఈ చిట్కాలు పాటించండి. |
»
| అరటిస్పూన్ కిరా రసంతో కొద్దిగా రొజ్ వాటర్ కలిపి ఈ మిశ్రమాన్ని కళ్ళకు రాసుకుని అరగంట సేపు ఉంచి ఆ తర్వాత కడుక్కుంటే కళ్ళు ఆకర్షణీయంగా ఉంటాయి. |
»
| కళ్ళు చాలా సున్నితమైనవి కాబట్టి బజారున దొరికే ఏ క్రీమ్ పడితే ఆ క్రీం రాసేయకూడదు.అలా చెయడం వల్ల మీ కళ్ళు ఇన్ పెక్షన్ బారిన పడే ప్రమాదం ఉంది. |
»
| తగినంతసేపు నిద్ర పోవడం వల్ల కళ్ళు తాజాగా కనబడతాయి. |
|
»
| గ్లాస్ నిటిలో ఉసిరి పొడి నానబెట్టి ఉదయాన్నే ఈ మిశ్రమంతో కళ్ళు కడుక్కుంటే తాజాగా మెరుస్తాయి. |
»
| కళ్ళ చుట్టూ ఉండే ముడతలు పొవాలంటే పాలమిగడతో అక్కడ మసాజ్ చేసుకుంటే ముడతలు నుండి విముక్తి పొందవచ్చు. |
»
| కీరదోసకాయలను చక్రాల్లా కోసి ఆ చక్రాలను కళ్ళ మీద ఉంచుకుంటే కళ్ళూ తాజాగా ఉంటాయి. |
»
| రోజూ పావుగంట పాటు రెండు చేతులను రేండు కాళ్ళపై ఉంచుకుని ప్రశాంతంగా కూర్చుంటే మీ కళ్ళకు రిలిఫ్ లభిస్తుంది. |
»
| అల్మాండ్ ఆయిల్ లొ కొంచెం ఆలివ్ అయిల్ కలిపి కంటి చుట్టూ ఉండే నలుపు ప్రాంతంపై రాస్తే ఆ నలుపును నివారించవచ్చు. |
»
| కళ్ళకు మేకప్ వేసుకునే బ్రష్ల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి.వీటిపై ఉండే దుమ్ము,ధూళీ వల్ల మీ కళ్ళకు ఇంఫెక్షన్ రావచ్చు. |
»
| ఉప్పు నీటితొ కళ్ళను కడుక్కోవడం వల్ల కళ్ళు మెరుస్తాయి. |
|
|
౭.
మిలమిల మెరిసె చేతుల కోసం
|
స్త్రీల సౌందర్య పోషణలో చేతులు ప్రముఖపాత్ర పోషిస్తాయి.చాలామంది వాటిని ఎంతో అపురూపంగా చూసుకుంటారు.అలాంటి వారి కొసమే మెము అందిస్తున్న ఈ చిట్కాలు. |
»
| ఎండలోనికి వెళ్ళినప్పుడు ఎండతాకిడికి చేతులు కమిలిపోతాయి.కాబట్టి బయటకు వేళ్ళేటపుడు చేతికి గ్లౌజులు ధరించాలి. |
»
| చేతికి ఎప్పటికపుడు మాయిశ్చరైజర్ క్రీములు రాస్తూ ఉండాలి. |
»
| నిమ్మరసంలో పంచదార కలిపి చేతులకు మర్ధనా చేసుకుంటే చేతులు నునుపుగా ఉంటాయి. |
»
| ఆకుకూరలు,పండ్లు ఎక్కువగా తీసుకోవడంవల్ల మీ చేతులు నిగనిగలాడతాయి. |
|
»
| గ్లిజరిన్,ఆలివ్ ఆయిల్ కలిపిన మిశ్రమాన్ని చేతులకు రాసుకుంటే చేతులు కాంతివంతంగా తయారవుతాయి. |
»
| టీస్పూన్ పంచదారలో టీస్పూన్ కొబ్బరి నూనె కలిపి ఈ మిశ్రమాన్ని చేతులకు మర్ధనా చేసుకోవడం వల్ల చేతులు నునుపుగా తయారవుతాయి. |
»
| బట్టలు ఉతుకుతున్నప్పుడు బట్టలసబ్బులో ఉండే రసాయన పదార్ధాలు మీ చేతిని హని చేసే ప్రమాదం ఉంది.కాబట్టి వుతికిన వేంటనే నిమ్మరసాన్ని చేతికి రాసుకుని కాసేపాగాక కడుక్కోవాలి. |
»
| అతివేడయిన,అతిచల్లనైన పదార్ధాలను డైరక్ట్ గా చేతితో తాకకూడదు. |
»
| ఒకస్పూన్ రోజ్ వాటర్ లో ఒకస్పూన్ గ్లిజరిన్ కలిపి చేతులకు రాసుకుని గంట తర్వాత శుభ్రంగా కడుక్కుంటే మీ చేతులు మృదువుగా తయారవుతాయి. |
|
|
౮ .
చర్మం మెరుస్తూ నిగనిగలాడటానికి చిట్కాలు
|
ప్రతీ స్త్రీ తన చర్మం నిగనిగలాడుతూ ఉండాలని కోరుకుంటుంది.అయితే కాలుష్యం,ఎండ మొదలైన వాటి బారిన పడి చర్మం కమిలిపోవడం,తెల్లని మచ్చలు రావడం,గరుకుగా తయారవడం,వంటివి జరగవచ్చు.ఇలాంటి దుష్ప్రాబావాల నుండి మీ చర్మాన్ని రక్షించుకోవాలంటే ఈ క్రింది జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. |
ఆహర పరంగా తీసుకోవలసిన జాగ్రత్తలు - |
»
| బొప్పాయి,అరటి,జామ,ఆపిల్ వంటిపండ్లను ఎక్కువగా తీసుకోవాలి. |
»
| ఎక్కువ సార్లు మంచీనిరు తాగడం అలవాటు చేసుకోవాలి. |
»
| నిమ్మ,ఉసిరి లాంటి పుల్లటి పండ్లను ఎక్కువగా తీసుకోవాలి.ఎందుకంటే వీటిలో ఉండే సి విటమిన్ మీ చర్మాన్ని కాపాడుతుంది. |
|
»
| ఒక చిన్న పాత్రలో నారింజ తొక్కలు వేసి అయిదు నిమిషాలు మరిగించి దించి ఆ తొక్కలను చర్మంపై రాసుకుంటే చర్మం నిగనిగలాడుతుంది. |
»
| తేనెను అప్పుడప్పుడు తీసుకోవడం వల్ల చర్మం పొడిబారకుండా తాజాగా ఉంటుంది. |
»
| నానబెట్టిన బాదం పొప్ప్ను ఉదయాన్నే తిసుకుంటే చర్మం పొడిబారదు. |
»
| టీస్పూన్ కీరాజ్యూస్ లో కొంచెం నిమ్మరసం,చిటికెడు పసుపు కలిపి చర్మానికి రాసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. |
»
| రోజూ ఒక గుడ్డును తీసుకుంటే చర్మానికి మంచిది. |
»
| ఎక్కువగా పళ్ళరసాలను తాగితే చర్మానికి గ్లో వస్తుంది. |
»
| కలబందను కొన్ని రోజులపాటు చర్మానికి రాసుకుంటే ఫలితం కనబడుతుంది. |
»
| కొబ్బరి నూనెను చర్మమంతా వారానికి ఒకసారి మర్దనా చేసుకొవాలి. |
|
|
9 .
కురులు ఏపుగా పెరగడానికి చిట్కాలు
|
వత్తైన జుట్టు మగువకు ఎంతో అత్మ వశ్వాసాన్నిస్తుంది.అయితే కొంత మంది ఆడవారికి జుట్టు చాలా పలచగా ఉంటుంది.మరి జుట్టు పలచగా ఉందని బాదపడకుండా ఈ క్రింది చిట్కాలను పాటిస్తే మీ జుట్టు కూడా ఏపుగా పెరుగుతుంది.ఇక్కసారి అవేంటో చూద్దామా.. |
»
| జుట్టు ఎక్కువగా రాలిపోయేవారు దువ్వెనతో స్పీడ్ గా కాకుండా కాస్త నెమ్మదిగా దువ్వుకుంటే జుట్టు దువ్వెనకు చిక్కి తెగిపోకుండా కాపాడుకోవచ్చు. |
»
| తలలకు నూనెను పట్టించి కుదుళ్ళ వరకూ వెళ్ళాలా మర్దనా చేసుకోవాలి.దీని వల్ల వెంట్రుకలకు రక్త ప్రసరణ బాగా జరిగి వెంట్రుకలు బలంగా పెరుగుతాయి. |
»
| వారానికి కనీసం రెండు సార్లయినా కుంకుడు కాయతోగాని తలమ్మటా స్నానం చెయ్యాలి. |
»
| బయట పనుల మీద ఎక్కువ తిరిగెవారు తలకు దుమ్మూ,దూళి పట్టకుండా చున్నీగానీ,షాల్ గానీ కట్టుకోవాలి. |
|
»
| స్నానం చేసిన వెంటనే జుట్టును ప్యాన్ గాలిలో అరబెట్టి ఆ తర్వాత దువ్వుకోవాలి.తడిజుట్టును దువ్వితే తెగిపొయె ప్రమాదం ఉంది. |
»
| మందారపు పువ్వుని కాగేనూనేలో వేసి చల్లారిన తర్వాత జుట్టుకు పట్టించుకోవాలి. |
»
| జుట్టు ఎదుగుదలకు పోషకపదార్ధాలు,ప్రోటిన్స్ అవసరం కాబట్టి బలమైన పోషక పదార్ధాలైన పాలు,పళ్ళరసాలును ఎక్కువగా ఎక్కువగా తీసుకోవాలి. |
»
| దువ్వుకునే దువ్వెనల్లో దుమ్ము,మట్టి వంటివి చెరకుండా ఎప్పటికప్పుడు శుభ్రపరుచుకుని ఆ తరువాత దువ్వుకోవాలి. |
»
| తలంటుకునే ముందు వెంట్రుకలకు కలబంద రసం పూసి అరగంట తర్వాత తలస్నానం చేస్తే జుట్టు నిగనిగ మెరుస్తుంది. |
»
| అవసరమైన ఆందోళనలకు గురవడం వల్లకూడా జుట్టు రాలిపోయే ప్రమాదం ఉంది.కాబట్టి మనసును ఎప్పుడూ ప్రశాంతంగా ఉంచుకోండి. |
|
|
మూలం : ఆంధ్ర బులెటిన్ .కం ,...
Subscribe by Email
Follow Updates Articles from This Blog via Email
No Comments