Friday, April 08, 2016

thumbnail

ఉగాది పచ్చడి


ఉగాదినాడు షడ్రుచుల సమ్మేళనం - తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు అనే ఆరు రుచులు కలసిన ఉగాది పచ్చడి తింటారు. సంవత్సరం పొడుగునా ఎదురయ్యే మంచి చెడులను, కష్ట సుఖాలను సంయమనంతో స్వీకరించాలన్న సందేశాన్ని ఉగాది పచ్చడి ఇస్తుంది. ఈ పచ్చడి కొరకు చెరకు, అరటి పళ్ళు, మామిడి కాయలు, వేప పువ్వు, చింతపండు, జామకాయలు, బెల్లం మొదలగునవి వాడుతుంటారు.

ఉగాది పచ్చడికి మన శాస్త్రాలలో "నింబ కుసుమ భక్షణం" మరియు "అశోకకళికా ప్రాశనం " అని వ్యవహరించే వారు.ఋతు మార్పు కారణంగా వచ్చే వాత,కఫ ,పిత్త దోషాలను హరించే ఓఉషధంగా ఉగాది పచ్చడి తినే ఆచారం ఆరంభమైంది.ఉగాది పచ్చడిని శాస్త్రీయంగా తయారు చేసే పద్దతిలో ఉప్పు 'వేపపువ్వు, చింతపండు, బెల్లం, పచ్చిమిరప కాయలు, మామిడి చిగుళ్ళు మరియు అశోక చిగుళ్ళు వేసి చేసేవాళ్ళు.ఈ పచ్చడిని శ్రీరామ నవమి వరకు తినాలని శాస్త్రాలు చెబుతున్నాయి.
త్వామష్ఠ శోక నరాభీష్ట
మధుమాస సముద్భవ
నిబామి శోక సంతప్తాం
మమ శోకం సదా కురు
ఈ మంత్రం చదువుతూ ఉగాది పచ్చడి తినాలని శాస్త్రాలు చెప్తున్నాయి.ఉగాది పచ్చడి చేసే ఆచారం ఆహారంలో ఉండే ఓఉషధ గుణాన్ని,వృక్షసంరక్షణ అవసరాన్ని,ఆయుర్వేదానికి ఆహారానికి గల సంభందాన్ని చెప్పాడమే కాక హిందూ పండుగలకు,ఆచారాలకు సముచిత ఆహారానికి గల సంబంధాన్ని చాటిచెప్తుంది. 

ఉగాదినాడు షడ్రుచుల సమ్మేళనం - తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు అనే ఆరు రుచులు కలసిన ఉగాది పచ్చడి తింటారు. సంవత్సరం పొడుగునా ఎదురయ్యే మంచి చెడులను, కష్ట సుఖాలను సంయమనంతో స్వీకరించాలన్న సందేశాన్ని ఉగాది పచ్చడి ఇస్తుంది. కాబట్టి ఈ పచ్చడి కొరకు చెరకు, అరటి పళ్ళు, మామిడి కాయలు, వేప పువ్వు, చింతపండు, జామకాయలు, బెల్లం మొదలగునవి వాడుతుంటారు.

ఉగాది పచ్చడి తయారీ విధానం:


కావలసిన పదార్ధాలు:

మామిడికాయ (ఓ మాదిరి పరిమాణం కలది)- 1
వేప పూత - 1/2 cup 
సన్నవి కొబ్బరి ముక్కలు- 1/2 cup
కొత్త చింతపండు- 100 grm 
కొత్త బెల్లం- 100 grm
పచ్చిమిరపకాయలు-2
అరటిపండు - 1
కిస్స్మిస్స్ పళ్ళు -20
సనగ  తరిగిన జామ కాయ ముక్కలు -10
చెరకు రసం -కొద్దిగా 
ఉప్పు - కొద్దిగా 
నీళ్లు   

తయారు చేయు విధానము:
  1. ముందుగా, వేపపూతని కాడల నుండి వేరు చేస్కుని, పూతలోంచి చిన్న చిన్న అప్పుడప్పుడే బయటకి        వస్తున్న వేపకాయల్ని వేరుచేస్కోవాలి. అందులోని పూతని సిద్ధంగా పెట్టుకోవాలి.
  2. చింతపండులో కొద్దిగా నీళ్ళు పోసి నానబెట్టుకోవాలి.  ఒక పదినిమిషాల తర్వాత చేత్తో కలిపి గుజ్జును వేరుచేసి పెట్టుకోవాలి. 
  3. మామిడికాయని చక్కగా చిన్న చిన్న ముక్కలుగా తరుక్కోవాలి. అలాగే కొబ్బరిముక్కలను సన్నగా తరగాలి.
  4. చెరకు రసాన్ని తీసి పకన పెట్టుకొని, మిగిలిన పళ్ళను సనగ తరగాలి,మిర్చిని సన్నగా తరగాలి.
  5. ఇప్పుడు బెల్లాన్ని కూడా తురిమి పెట్టుకొని దాన్ని చింతపండు గుజ్జులో కలిపాలి. 
  6. ఇప్పుడు ఆ చింతపండు, బెల్లం గుజ్జులో మిగతా పదార్ధాలన్ని వేసి ఒక అరస్పూన్ ఉప్పు వేసి కలుపుకోవాలి. 
  7. అంతే ఉగాది పచ్చడి రెడీ ఇక వసంత లక్ష్మిని ఆహ్వానించి, నైవేద్యంగా అందించి, మీరు ప్రసాదంలా స్వికరించండి, అందరికి ప్రసదని అందచేయండి.
  8. ఉగాది పచ్చడి సేవనం తెలియజెప్పే నిజం. 'కష్ట సుఖాలు జీవితంలో చవిచూడాలి". 

Related Posts :

Subscribe by Email

Follow Updates Articles from This Blog via Email

No Comments