Monday, November 14, 2016

thumbnail

Srisailam History - శ్రీశైలం చరిత్ర

శ్రీశైలం :

శ్రీశైలము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమునందు కర్నూలు జిల్లా లోని ప్రసిద్ధ శైవ క్షేత్రము. హరహర మహదేవ శంభో శంకరా అంటూ భక్తుల గొంతులతో మారుమ్రోగుతూ నల్లమల అడవులలో కొండగుట్టలమధ్య గల శ్రీ మల్లికార్జునుని పవిత్ర క్షేత్రము. మెలికలు తిరుగుతూలోయలు దాటుతూ దట్టమైన అరణ్యాల మధ్య భక్తజనులను బ్రోచేందుకు వెలసిన పరమేశ్వరుని దివ్యధామం అయిన శ్రీశైలం ద్వాదశ జ్యోతిర్లింగాల లో ఒకటి.

చరిత్ర : 

ఇక్ష్వాకులు, పల్లవులు, విస్ణుకుండినులు, చాళుక్యులు, కాకతీయులు, రెడ్డి రాజులువిజయనగర రాజులు, శివాజీ లాంటి ఎందరో సేవలు చేసిన మహాక్షేత్రం. పాండవులు, శ్రీరాముడు లాంటి పురాణ పురుషులు పూజలు చేసిన శ్రీమల్లికార్జునుని పవిత్రధామం. శ్రీశైల దేవస్థానమునకు రక్షణ కొరకు కొందరు రాజులు చుట్టూ కోట లాంటి పటిష్ఠ కట్టడము నిర్మించారు. నాలుగు వైపులా నాలుగు పెద్ద ద్వారములుసుదూరానికి సైతం కానవచ్చే బ్రహ్మాండమైన నాలుగు గోపురాలు,అత్యద్భుతమైన కట్టడాలుగా దేవాలయాలు నిర్మించారు. శ్రీశైలం ఒక భాస్కర క్షేత్రముః- ఆధారము గోకర్ణ కంఢము లోనిగోకర్ణ పురాణము అను సంసృత గ్రంథము ౬౬ వ. అధ్యాయము నుండి .... పర్వతాగ్రే నదీతీరే బ్రహ్మ,విష్ణు,శివై శ్రితే..........అను శ్లోక ప్రమాణముగా శ్రీశైలం ఒక భాస్కర క్షేత్రము అనుటలో ఎలాంటి సందేహము లేదు.
శ్రీశైలం ద్వాదశ జ్యోతిర్లింగాలలో రెండవది,అష్టాదశ శక్తి పీఠములలో ఆరవదిమరియు దశ భాస్కర క్షేత్రములలో శ్రీశైలం ఆరవది.
సేకరణః-సిరిపురపు.నాగమల్లిఖార్జునశర్మశ్రీశారదాజ్యోతిష్యాలయ వ్యవస్థాపకులుశ్రీశైలంప్రాజెక్టు (సుండిపెంట),కర్నూలుజిల్లా.ఆంధ్రప్రదేశ్.
 
 

శాసనాధారాలు:
శ్రీశైలం చరిత్రకు ఆధారాలుగా ఉన్న శాసనాల్లో మొదటిది క్రీ.శ.6వ శతాబ్ది నాటిది. ఆరవ శతాబ్ది నాటి మైసూరులోని కదంబరాజుల తాల్గుండి శాసనంలో మొదటిసారి శ్రీశైలం పేరు కనిపిస్తోంది.

సాహిత్యాధారాలు:

తెలుగు, తమిళ, కన్నడ గ్రంథాల్లో దీని ప్రశంస విస్తారంగా కనిపిస్తోంది. క్రీ.శ.6, 7 శాతాబ్దాల నాటి తమిళ శైవ గ్రంతం తేవరంలో అస్పర్సుందర్నమ్మందర్ అనే పేర్లున్న భక్తకవులు శ్రీశైలాన్ని గురించి గానం చేశారు. తిరుప్పాపురం (శ్రీపర్వతం) అని పేర్కొన్నారు. క్రీ.శ.14వ శతాబ్దం నాటి శైవకవియైన పాల్కురికి సోమనాథుడు తన పండితారాధ్య చరిత్రములో కరమొప్పు దక్షిణ కైలాసము అంటూ శ్రీశైలాన్ని కీర్తించారు. తెలుగు సాహిత్యంలో తొలి యాత్రాచరిత్రగా పేరొందిన కాశీయాత్ర చరిత్రలో శ్రీశైలం 1830ల నాడు ఎలా ఉందన్న వివరాలు దొరుకుతున్నాయి. 1830లో చెన్నపట్టణం నుంచి కాశీకి యాత్రగా వెళ్ళిన గ్రంథకర్త ఏనుగుల వీరాస్వామయ్య ఆ ఏడాది జూన్ 16 నాటికి శ్రీశైలం చేరుకున్నారు. ఆయన వ్రాసిన దాని ప్రకారం 1830ల్లో ఈ ప్రాంతం కందనూరు నవాబు అధీనంలో ఉండేది. శ్రీశైలం కొండమీద వాసయోగ్యమైన పరిస్థితులు లేకపోవడమూక్రూరమృగాల భీతి ఉండడంతో ఈ ఆలయాల అర్చకులుకందనూరు నవాబు తరఫున యాత్రికుల నుంచి హాశ్శీలు తీసుకునే ముసద్దీలు ఆత్మకూరు పట్టణంలో కాపురం ఉండేవారు. ఉత్సవాలకు వచ్చే సాధారణ భక్తులకు ఒక్కొక్కరికీ రూ.7, గుర్రానికి రూ.5, అభిషేకానికి రూ.3, వాహనోత్సవం చేయిస్తే ఉత్సవపు సెలవులు కాక రూ.43, దర్పణసేవోత్సవానికి రూ.ప్రకారం నవాబుకు చెల్లించాల్సివచ్చేది. శ్రీశైలానికి వెళ్ళే నాలుగు బాటల్లో ఆత్మకూరు బాట తప్ప మిగిలిన దారులు ఉత్సవాలు కాని సామాన్యమైన రోజుల్లో వెళ్లేందుకు వీలే లేని స్థితిలో ఉండేవి. చెంచువాళ్ళ భయంఅడవి జంతువుల భయం విస్తరించివుండేది. చెంచువాళ్ళు ఆటవికులైనా అప్పట్లో చాలామంది దారినపోయే యాత్రికులను యాచించి తినే అలవాటు పడ్డారని వ్రాసుకున్నారు. ప్రతిరోజూ పల్లకీసేవ జరిగేది. చైత్రమాసంలో భ్రమరాంబ అమ్మవారికి తామసపూజలు జరిగేవి. అర్చకులు ఒకరొకరు మార్చి మార్చి డ్యూటీలు చేసుకునేవారని వుంది.

స్థల పురాణం:

పూర్వం అరుణాసురడు అనే రాక్షసుడు ఈ ప్రపంచాన్ని పరిపాలించేవాడు. అతను చాలా కాలం పాటు గాయత్రీ మత్రం జపిస్తూ బ్రహ్మ కోసం తపస్సు చేసి ద్విపదాలచే మరియు చతుష్పదాలచే మరణం లేకుండా వరం పొందాడు. వరం ప్రభావంతీ భయపడిన దేవతలు ఆదిశక్తిని ప్రార్థించారు. అమ్మవారు ప్రత్యక్షమయి అరుణాసురుడు తన భక్తుడని గాయత్రీ మంత్రం జపిస్తున్నంతవరకు అతనిని ఎవరూ ఏమీ చేయలేరని చెపుతుంది. తర్వాత దేవతలు పధకం ప్రకారం దేవతల గురువు అయిన బృహస్పతిని అరుణాసురని దగ్గరికి పంపిస్తారు. అరుణాసురడు దేవ గురువు బృహస్పతి రాక గురించి ఆశ్చర్యం వ్యక్త పరుచగాబృహస్పతి అందుకు నమాధానంగా ఇద్దరం ఒకే అమ్మవారిని గాయత్రీ మంత్రంతో పూజ చేస్తున్నమనికాబట్టి ఈరాకలో వింత ఏమి లేదని చెపుతాడు. అందుకు అరుణాసురుడు దేవతలు పూజ చేసే అమ్మవారిని నేను ఎందుకు పూజ చేయాలని అహంకరించి గాయత్రి మంత్రం జపాన్ని మానేస్తాడు. దానికి కోపించిన ఆదిశక్తి భ్రమర రూపం ధరించి అసంసాఖ్యకంగా భ్రమరాలని సృష్టిస్తుంది. ఆ భ్రమరాలు అరుణాసురుడిని అతని సైన్యాన్ని సంహరిస్తాయి.

నామవివరణ:

శ్రీశైలానికే సిరిగిరిశ్రీగిరిశ్రీపర్వతముశ్రీశైలము మొదలైన నామాతరాలున్నాయి. శ్రీ అనగా సంపదశైలమంటే పర్వతం కనుక శ్రీశైలమంటే సంపద్వంతమైన పర్వతమని అర్థం. దీనికి శ్రీకైలాసం అనే పేరుతో వ్యవహారం వుండడమూ ఉంది. క్రీ.శ.1313లోని ఒక శాశనాన్ని అనుసరించి దీనికి శ్రీ కైలాసము అనే పేరూ ఉన్నట్టు తెలుస్తోంది. దానిలో మహేశ్వరులు శ్రీకైలాసము (శ్రీశైలం) పైన నివసించారని ఉంది.

వసతి సదుపాయములు :

శ్రీ శైలంలో వసతిగా దేవస్థానమువారి సత్రములుఅతి పెద్ద కాటేజీలుహొటల్స్ ఉన్నాయి. ఆంధ్రదేశములో ఎక్కడా లేని విధంగా కులప్రాతిపదికగా ఎవరికి వారుగా ప్రతి కులపువారికీ ఒక సత్రం నిర్వహింపబడుతున్నది. శివరాత్రి పర్వదినములుకార్తీకమాసమునందు తప్ప మిగిలిన రోజులలో ఏసత్రములోనైనా ఎవరికైనా వసతి లభించును. ఈ సత్రములే కాక మరికొన్ని కర్ణాటక వారి సత్రములప్రైవేటువారి సత్రములతోనూ శ్రీశైలం భక్తజనులతో కళకళలాడుతుంటుంది.

శ్రీశైలం-దర్శనీయ ప్రదేశాలు :

శ్రీశైలం చుట్టు ప్రక్కల దాదాపు అయిదు వందల వరకూ శివలింగాలు ఉంటాయంటారు. పరిసర ప్రాంతాలలో చూడదగిన ప్రదేశాలుదేవాలయాలు,మఠాలుమండపాలుచారిత్రక స్థలాలు అనేకాలు ఉన్నాయి. చూపులకు కానరానంతగా విస్తరించుకొన్న శ్రీశైలము క్షేత్రములోని దర్శనీయ ప్రదేశాలను ముఖ్యముగా నాలుగు భాగాలుగా విభజించవచ్చు. అవి
శ్రీశైల దేవాలయ ప్రాంతము.
సున్నిపెంట ప్రాంతము
మండపాలుపంచమఠాల ప్రాంతము
అడవిలో గల పర్యాటక ప్రాంతములుచారిత్రక ప్రదేశాలు.

ఆలయవిశిష్టత :

శ్రీశైలంలో దేవాలయాలలో భ్రమరాంబ మల్లికార్జునస్వామి దేవాలయం ప్రసిద్ధి చెందినది. దీనిలో శివ పార్వతుల విగ్రహాలు వుంటాయి. ఇక్కడ మల్లికార్జున స్వామిని శివుడుగా మరియుమాత పార్వతి దేవిని భ్రమరాంబగా పూజిస్తారు. శివ భగవానుడికి గల 12 జ్యోతిర్ లింగాలలో శ్రీశైలం ఒకటి కావునహిందువులు ఈ దేవాలయానికి చాల ప్రాముఖ్యతనిచ్చి దర్శనం చేసుకొంటారు. ఇక్కడ కల మల్లెల తీర్థం అనే జలపాతాలలో స్నానాలు ఆచరిస్తారు. ఈ నీటిలో స్నానాలు ఆచరిస్తే పాపాలు పోతాయని మోక్షం వస్తుందని భావిస్తారు.




శ్రీశైల దేవాలయ ప్రాంతము :

శ్రీమల్లికార్జునుని దేవాలయముఅభేద్యమైన ప్రాకారము లోపల నాలుగు మండపములతో అపూర్వమైన శిల్ప సంపదతో అలరారే అందమైన దేవాలయము. ప్రధాన గర్భాలయము మాత్రము ఎటువంటి శిల్పాలు లేకుండా సాధారణ నిర్మాణముగా ముష్కరుల నుండి రక్షణ కొరకు కట్టినట్టుగా ఉంటుంది.
భ్రమరాంబిక అమ్మవారి గుడి.: భ్రమరాంబికా అమ్మవారి దేవాలయము అద్భుతమైన శిల్పకళతో అందమైన శిల్పతోరణాలతో కూడిన స్థంబాలతోనూ అత్యద్భుతంగా ఉండును. ఈ ఆలయము ఆంధ్రదేశములోనే అత్యంత విశిష్టమైన శిల్ప కళ కలిగిన దేవాలయముగా వినుతికెక్కినది. ఈ దేవాలయములో గర్భాలయ వెనుక భాగమున గోడకు చెవి ఆన్చి వింటే ఝమ్మనే బ్రమరనాధం వినవస్తుంది.
మనోహర గుండముశ్రీశైలములో తప్పకుండా చూడవలసిన వాటిలో ఇది ఒకటి. దీనిలో గొప్పతనము ఏమిటంటే చాలా స్వచ్ఛమైన నీరు ఈ గుండములో ఉంటుంది. శ్రీశైలము చాలా ఎత్తైన ప్రదేశములో ఉంది. అంత ఎత్తులో కూడా ఆ రాళ్ళలో ఇంత చక్కని నీరు ఉండటం నిజంగా చూడవలసినదే. ఈ నీరు చాలా స్వచ్ఛంగా ఉంటుంది. మహానంది లోని కోనేటి నీటిలో క్రింద రూపాయ వేస్తే పైకి స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే ఈ చిన్ని గుండంలో కూడా కనిపిస్తుంది.

నాగ ప్రతిమలు:
పంచ పాండవులు దేవాలయాలుపాండవులు మల్లికార్జునుని దర్శించుకొని వారి పేరున అయిదు దేవాలయాలను ప్రధాన దేవాలయ వెనుక భాగమున నిర్మించి శివలింగములను ప్రతిష్ఠించిరి.

అద్దాల మండపము:

వృద్ద మల్లికార్జున లింగముఇది ముడతలు పడిన ముఖంలా ఉన్న శివ లింగం. ఇది చూస్తే అంత అందముగా ఉండదు. బహుశా ముసలితనాన్ని గుర్తు చేస్తుంది!
  

సున్నిపెంట ప్రాంతము :

ఆనకట్ట: శ్రీశైలం ప్రాజెక్టు.
జల విద్యుత్ కేంద్రము




మండపాలుపంచమఠాల ప్రాంతము :

పంచమఠాలు అని పిలువబడే మఠాలు ఇక్కడ ఉన్నాయి.
ఘంటా మఠం
భీమ శంకరమఠం
విభూతి మఠం
సారంగధర మఠం: మిగిలిన మఠాలలో నిర్వహణలోఅభివృద్ధిలో ప్రసిద్దమైనది సారంగధర మఠం.
రుద్రాక్షమఠం: ఇక్కడి మఠంలో శివలింగము రుద్రాక్ష రూపంలో ఉండటం ఇక్కడి ప్రత్యేకత.
విశ్వామిత్రమఠం:
నంది మఠం మొదలైనవి.


అడవిలో గల పర్యాటక ప్రాంతములుచారిత్రక ప్రదేశాలు 

పాతాళ గంగ :

శ్రీశైలం ప్రక్కనే కృష్ణానది ప్రవహిస్తుంది. కాకపోతే శ్రీశైలము చాలా ఎత్తులో ఉన్నదినది మాత్రము క్రింద లోయలో ప్రవహిస్తుంది. అందుకే శ్రీశైలము నుండి చాలా మెట్లు దిగి కృష్ణానదిలో స్నానం చెయ్యాలి. ఈ కృష్ణానదినే ఇక్కడ పాతాళగంగ అనే సార్థక నామధేయముతో వ్యవహరిస్తారు. ఆ మెట్లు అన్నీ దిగి కృష్ణలో మునిగి తిరిగి ఎక్కినపుడు పాతాళగంగ అనునది ఎంత సార్థక నామధేయమో తెలుస్తుంది. పాతాళ గంగ వద్ద నీరు నీలంగా కాక పచ్చగా ఉంటుంది నీటి క్రింద బండలపై నాచు నిలచి సూర్య కిరణాల వెలుగు వలన పచ్చగా కానవస్తుంది. అయితే అందరూ నీటి క్రిందగల దీనిని పచ్చల బండ అని వ్యవహరిస్తారు.
2004 లో పాతాళగంగకు వెళ్ళుటకు రోప్ వే ఏర్పాటు చేయబడింది. ఉదయం నుండి సాయంత్రం వరకు ఇది అందుబాటులో ఉంటుంది. త్రేతాయుగ కాలం నాటి ఆంజనేయ స్వామి గుడి తప్పనిసరిగా చూడవలసిన వాటిలో ఒకటి.

          

సాక్షి గణపతి ఆలయము:

ఇది ముఖ్యాలయానికి కొద్ది దూరంలో ఉంటుంది. ఈ గణపతి ఆలయము ప్రత్యేకత ఏమిటంటే మనము శ్రీశైలములో శివుడిని దర్శించినంత మాత్రముననే కైలాస ప్రవేశానికి అనుమతి లభిస్తుంది. అప్పుడు మనకు ఈ సాక్షి గణపతే సాక్ష్యము చెపుతాడుమనము శ్రీశైలము వచ్చినాము అని.ఇతనిని సాక్షి గణపతి అంటారు.

శ్రీశైల శిఖరం :

శ్రీశైలం మొత్తంలో ప్రత్యేకమైనది శ్రీశైల శిఖరంశ్రీశైలములో శిఖరదర్శనము చేసుకొంటే పునర్జన్మ ఉండదు అని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. శిఖరదర్శనము అంటే పక్కనే నిలబడి శిఖరాన్ని చూడటం కాదుదూరంగా ఉన్న ఈ ఎత్తైనకొండ శిఖరేశ్వరం పై నుండి దూరంగా ఉన్న ఆలయ శిఖరాన్ని చూడాలి. అలా చూస్తేశిఖరం కనిపిస్తే పునర్జన్మ నుండి విముక్తులవుతారు.
  
               









పాలధారపంచధారలు :

శిఖరేశ్వరమునకుసాక్షిగణపతి గుడికి మధ్యగా హటికేశ్వరము నకు సమీపాన అందమయిన లోయలో ప్రశాంత ప్రదేశంలో జగద్గురు శంకరాచార్య తపమాచరించిన ప్రదేశము ఉంది. ఇక్కడి శిలపై శంకరుని పాదముద్రలు ఉన్నాయి. కొండపగులులనుండి పంచధార (ఐదుధార) లతో ఉరికివచ్చే జలాలు చల్లగా ఏ కాలంలోనైనా ఒకే మాదిరిగా ప్రవహిస్తూ ఒక్కొక్కథార ఒక్కొక్క రుచితో నుండుట ఇక్కడి ప్రత్యేకత. ఒకథార నుండి జలము సేవించి ప్రక్కమరొక దాని నుండి సేవిస్తే మార్పు తెలుస్తుంది.









ఆది శంకరాచార్యుడు తపస్సు చేసిన ప్రదేశం :

దేశం రాజకీయంగా అల్లకల్లోల పరిస్థితులలో ఉన్నప్పుడువివిధ దార్శనికులు,మతప్రచారకులు అశాంతికి దోహదంచేస్తున్న సమయంలో,భారతీయ సంప్రదాయానికి ఆధారమైన వైదిక వాజ్మయాన్ని సరిగా అధ్యయనం చేసేవారుగానివాఖ్యానించగలిగేవారుగాని చాలా అరుదుగా ఉన్న సమయంలో జన్మించిన శ్రీశంకరులు పరిస్థితులను చక్కదిద్ది ప్రజలలో వైదికథర్మస్ఫూర్తిని వ్యాప్తి చేస్తూ దేశంనలుమూలలా నాలుగు ప్రప్రసిద్ధ పీఠాలను స్థాపించి విస్తృతంగా పర్యటిస్తూ ఉండేవారు. అలా పర్యటించే సమయంలోచాలా కాలం శ్రీశైల పరిసరములందు తపమాచరించారు. ఈయన తపమాచరించిన ఈ ప్రదేశమునకు ఒక మంచి కథనము ఉంది.
శంకరులు ఇక్కడ తపస్సు చేసుకొంటూ ఈపరిసరాలలో అద్వైతమత వ్యాప్తి చేయుచున్నకాలమందుశంకరులు చేయు కార్యములు నచ్చని కొందరు ఆయనను అంతమొందించు యత్నముతో ఆపరిసరాలయందు బీభత్సము సృష్టించుచున్న ఒకపెద్ద దొంగలముఠానాయకుని రెచ్చగొట్టికొంత సొమ్మిచ్చి పంపించారు.అతడు ఇదే ప్రదేశమున పెద్ద కత్తితో మాటువేసి తపమాచరించుకొనుచున్న శంకరుని వెనుకగా ఒకేవేటున తలఎగరగొట్టు ప్రయత్నమున ముందుకురికెను.ఇక్కడ ఇది జరుగుచున్న సమయమున శంకరుని ప్రధాన శిష్యుడైన పద్మపాదుడు మల్లికార్జునుని దేవాలయమున ఈశ్వరుని ధ్యానించుచూ కూర్చొని ఉండెను. ఈశ్వరునే మనసున ఉంచి ధ్యానిస్తున్న అతనికి హటాత్తుగా ఈ దృశ్యము కనిపించెను.వెంటనే అతడు మహోగ్రుడైన శ్రీలక్షీనరసింహుని వేడనారంభించెను. ఇక్కడ శంకరుని వధించుటకు ఉరికిన ఆ దొంగలనాయకునిపై ఎటునుండో హటాత్తుగా ఒక సింహము దాడి చేసిఅతడి శరీరాన్ని ముక్కలుముక్కలుగా చీల్చివేసి ఎట్లు వచ్చినదో అట్లే మాయమయినది.ఈ విషయము శంకరులకు ధ్యానమునుండి బయటకు వచ్చిన తరువాత తెలియజేసారు. అంతవరకూ ఆయనకు జరిగినది తెలియదు.అధిక కాలము ఈప్రాంతమందు తపమాచరించిన గుర్తుగా ఇక్కడ ఉన్న పెద్ద బండపై శంకరుని యొక్క పాదముద్రలు ఉన్నాయి.


శివాజీ సాంస్కృతిక,స్మారక భవనము :

శివాజీ గొప్ప దుర్గా భక్తుడు. శ్రీశైల దేవాలయమును ఎన్నోసార్లు దండయాత్రలనుండి కాపాడి శ్రీశైలంలో భ్రమరాంబికా అమ్మవారి స్వహస్తాలతో వీరఖడ్గం అందుకొన్న ఘనుడు.అతని పేరున ఇక్కడ ఇంకనూ తుదిమెరుగులు దిద్దుకొనుచూ రెండు అంతస్తులుగా నిర్మింపబడిన శివాజీ సాంస్కృతిక,స్మారక భవనము లో- అతడి జీవిత విశేషాల కథనం మరియు చిత్రాల ప్రదర్శన కొరకు మొదటి అంతస్తునూ, శివాజీ కాంశ్యవిగ్రహము కొరకు రెండవ అంతస్తునూ కేటాయించారు.మూడు రూపాయల నామమాత్రపు రుసుముతో సందర్శకులను అనుమతించుచున్నారు.

హటకేశ్వరం :

హటకేశ్వరంకర్నూలు జిల్లాశ్రీశైలం మండలానికి చెందిన గ్రామము. శ్రీశైలమల్లికార్జునదేవస్థానమునకు మూడు కిలోమీటర్ల దూరములో కల మరొక పుణ్యక్షేత్రం హటకేశ్వరం. ఇక్కడ హటకేశ్వరాలయము ఉంది. ఈ పరిశరాలలోనే శ్రీ ఆది శంకరాచార్యులవారు నివసించారు. పరమశివుడు అటిక (ఉట్టికుండ పెంకు)లో వెలియడంతో ఈ ఆలయంలోని ఈశ్వరుని అటికేశ్వరుడు అనేవారు రానురాను అదేమెల్లగా హటికేశ్వరస్వామిగా మారిపోయింది. హటకేశ్వర నామంతో ఆప్రాంతానికి రాకపోకలు సాగించే భక్తుల మాటగా హటకేశ్వరంగా పిలువ బడుతోంది. ఇక్కడ చెంచులు అదివాశీలు నివసిస్తున్నారు. ఈ దేవాలయ పరిశరాలలో పలు ఆశ్రమములుమఠములు ఉన్నాయి. ఇక్కడికి వచ్చెందుకు శ్రీశైలం దేవస్థానము నుండి ప్రతి అర గంటకు బస్సులు ఉన్నాయి.


శిఖరం :

శ్రీశైలం మొత్తంలో ప్రత్యేకమైనదిఈ శిఖరేశ్వరం. శ్రీశైలములో శిఖరదర్శనము చేసుకొంటే పునర్జన్మ ఉండదు అని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. శిఖరదర్శనము అంటే పక్కనే నిలబడి శిఖరాన్ని చూడటం కాదు,అక్కడ ఉన్న నందిని రోలుమాదిరిగా నున్న దానిలో నవధాన్యాలు వేసి ఈశ్వరుని స్మరించి అటూ ఇటూ వీలుగా త్రిప్పుకొనుచూ సుదూరంగా ఉన్న శ్రీమల్లిఖార్జుని ఆలయపు విమానంపైనున్న శిఖరాన్ని చూడుటకు ప్రయత్నించాలి.అలా చూసే క్రమంలో ఆవ్యక్తికి గనుక శిఖరం కనిపిస్తే కొద్ది దినాలలో చనిపోతారు మరియు పునర్జన్మ నుండి విముక్తులవుతారు.

కదళీవనము :

శ్రీ దత్తాత్రేయ స్వామి అవతార పరంపరలో 3వ అవతార పురుషుడైన శ్రీ నృసింహ సరస్వతి స్వామి మహారాష్ట్రలోని కరంజా నగరంలో జన్మించి నర్సోబవాడాలోనుకర్ణాటకలోని గాణాగాపురంలోనూ తపమాచరించి చివరకు కదళీవనంలో అంతర్ధానమయ్యారు. వీరశైవ సంప్రదాయానికి చెందిన అక్క మహాదేవి కూడా ఇక్కడే అవతార సమాప్తి గావించారని ప్రతీతి.

శ్రీశైలం-రవాణా సౌకర్యాలు:

రోడ్డు మార్గములు
హైదరాబాదు నుండి శ్రీశైలం 212 కి.మీ. దూరంలో ఉంది.ఈ రోడ్డు అటవీ ప్రాంతం గుండా పోతుంది. అటవీశాఖ వారు రాత్రి వేళల్లో ఈ ప్రాంతం గుండా ప్రయాణించటానికి అనుమతించరు కనుక పగటి వేళ మాత్రమే ప్రయాణించాలి.
గుంటూరు నుండి శ్రీశైలం 225 కి.మీ. దూరంలో ఉంది. గుంటూరు నుండి నరసరావుపేట, వినుకొండ మీదుగా వచ్చే ఈ మార్గం దోర్నాల వద్ద కర్నూలు రోడ్డుతో కలుస్తుంది. అక్కడి నుండి శ్రీశైలంకు కొండ మార్గంలో ప్రయాణం (53 కి.మీ.) కొండల మధ్యగా చాలా బాగుంటుంది.

రైలు మార్గములు
భారతదేశములో ఏవైపునుండి అయినా గుంటూరు మీదుగా నరసరావుపేట వరకూ రైలు సౌకర్యములు కలవు.

విమాన మార్గములు
హైదరాబాద్ నుండి విజయవాడ లేదా గుంటూరు వరకూ మైనర్ ఎయిర్ పోర్టులద్వారా చేరుకొని అటుపై బస్సు ద్వారా చేరవచ్చు.

ఆనాటి శ్రీశైలము. ఏనుగుల వీరాసామయ్య గారి మాటల్లో

శ్రీశైలయాత్రకు తీసే హాశ్సీలు కందనూరునవాబుకు చేరుచున్నది. శివరాత్రి ఉత్సవములో శూద్రజనము 1కి ర్పూ 2, గురానికి ర్పూ 5, అభిషేకమునకు ర్పూ 3, వాహనోత్సవము చేయిస్తే ఉత్సవపు సెలవులు గాకగా 3, దర్మణసేవోత్సవమునకు ర్పూ 3. ఈప్రకారముగా పుచ్చుకొనుచున్నారు. శ్రీశైలమునకు నాలుగు భాటలు. ఎటుపోయినా నీశ్వర సంకల్పమేమో ఆమడదూరముఛీకారణ్యమయిన దోవ. ఒక భాట నెల్లూరు మీద నచ్చి చుక్కల పర్వతము నెక్కవలసినది. మరియొకటి కంభం దూపాటి మీదవచ్చి చుక్కలకొండ నెక్కవలెను. మరియొక భాట పడమటి దేశస్థులు కృష్ణానది దాటి రావలసినది. ఆ కృష్ణ పాతాళగంగయని పేరువహించి శ్రీశైలము క్రింద ప్రవహింపుచున్నది. శ్రీశైలమునుంచి ఆగంగకు పోవలెనంటే రెండుకోసుల దూరము. దిగియెక్కవలెను. కొంతదూరము సుళువైన డోలీమీద పోవచ్చును. మెట్లు పొడుగుగనుక నెక్కడముదిగడము కష్టము. నేను వచ్చిన యీ యాత్మకూరు భాట తప్పమిగతా మూడు భాటలు ఉత్సవకాలములలో నడవవల్సినది గాని తలుచుకొన్నప్పుడు నడవకూడదు. మృగభయముచెంచువాండ్ల భయమున్ను విస్తరించియుండును. ఆ ఛెంచువాండ్లు అడివి మనుష్యులయినను యాత్రకు వచ్చేవారిని యాచించి తినే వాడికే పడియున్నారు. శివరాత్రి మొదలు చైత్రమాసమువరకు శ్రీశైలము మీద ప్రతిదినమున్ను పల్లకీసేవ అనే ఉత్సవము జరుగుచున్నది. ఛైత్రమాసములో భ్రమరాంబ యనే దేవికి తామసపూజ చేసి శ్రీశైలముమీద వచ్చియుండే జనులు విరామమును బొందుచున్నారు. అటుపిమ్మటనొకరిద్దరు అర్చకులు మాత్రము మార్చిమార్చి ఆయాత్మకూరు నుంచి వచ్చి యుంచున్నారు. ఎక్కువ నీళ్ళు ఒంటక జ్వరముమహోదరముసోభ మొదలయిన రోగములు కలుగుచున్నవి. శ్రీశైలమున గుడికి సమీపముగా 20 చెంచుగుడిశేలున్నవి. వారున్న ఆ గుడిశెలు వదిలి బాధ్రపద మాసములో వలస పోవుచున్నారు. అప్పటికి వర్షాకాలము తీరి యీగెల ఉపద్రవము కలుగుచున్నది. అది సహించతగినది కాదు. గుడివద్ద స్వామికి ఆవులు 100 దనుక నున్నవి. కడప విడిచిన వెనుక ఆవుపాలుపెరుగున్ను కండ్ల చూడవలెనంటే శ్రీశైలముమీద చూడవలసినది గాని ఇతర స్థలములలో ఆవులను మాత్రము కండ్ల చూడవచ్చును. ఆవుపాలు తీసుటలేదుదూడలకు విడిచిపెట్టుచున్నారు. అంత జాగ్రత్తగా ఈ దేశస్థులు పసువులను కాపాడిన్నిదున్నడముకు ఎద్దులు నెల్లూరుసీమనించి తెచ్చే వారివద్ద హమేషా వారికి కొనవలసి యున్నది. ఎనుములు పాడికే గాని అచ్చటి దున్నలు ఆభూమిని నిగ్గి దున్న నేరవు. తడవకు 18-20 వరహాలు పెట్టి యెద్దులను కొనుచున్నారు. ఆ యాత్మకూరి కాపురస్థులు అనేక పర్షన్ వాండ్లను గొప్పచిన్నలను చూచి మెరుగైనవారై యున్నారు. ముసాఫరులకు దేవి యాచకులయిన తెనుగు బ్ర్రాంహ్మణులు రెండిండ్లవారున్నుస్వామి యాచకుడయిన జంగవాడొకడున్ను - వీరే స్థల మివ్వవలసినది గానియితరుల యిండ్లు గొప్పలయినను స్థల మివ్వరు. 2-3 చిన్న దేవస్థలములుచావిళ్ళున్ను న్నవి. తప్పితే అందులో దిగవలసినది. ఆయాత్మకూరినించి పట్టణపు షవారీల మీద కష్టముగా శ్రీశైలపర్వతమునకు పోయి చేరవచ్చునని తెలియనందుచేత మూడు డోలీలు రూపాయీలకు చేయించినాను. వాటిని నొక దినములో అక్కడి వడ్లవాడు చేసాడు. అక్కడి రూపాయికిన్ని చెన్నపట్టణపు రూపాయికిన్ని సుమారు కాలురూపాయి భేదమున్నది. పట్టణపు రూపాయి కె అక్కడి రూపాయి12 ఎనిమిదిమంది కూలి బోయీలను అక్కడి వారిని శ్రీశైలమునకు పోయి రాగలందులకు జనము కి రూపాయిలు లెక్కను కుదుర్చుకొన్నాను.

           ---- ఓం నమశ్శివాయ శివాయ నమః ఓం -------



Tuesday, October 18, 2016

thumbnail

Ram Karri Publications

Ram Karri Publications :      

                     సంభాషించే తీరు                  

సంభాషణ ఒక గొప్ప కళ..
ఇంటా – బయట వివిధసందర్భాల్లో,
వివిధ వ్యక్తులతో సంభాషించాల్సివచ్చినప్పుడు,
మనం కొన్ని మర్యాదలు (Manners) పాటించాలి...
అది వ్యక్తి ఔనత్యాన్ని ఇతరులు అంచనా వేయడానికి తోడ్పడుతుంది....



మీరు ఉన్నత వ్యక్తిత్వం గల – సందర్భోచితంగా సంభాషించగల
వ్యక్తిగా అందర్నీ ఆకట్టుకోవాలంటే;

మీ సంభాషణ చాతుర్యంతో ఎదుటి వారి హృదయం
మీద చక్కని ముద్ర వేయాలంటే...

కొన్ని అంశాలపట్ల శ్రద్ద వహించాల్సి వుంటుంది...

మన్నన పాటించకుండా , ఏ భాషలో ఎంత మాట్లాడినా
మీరు మీ ప్రత్యేకత నిలుపుకోలేరు...

కనుక మాట్లాడేటప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకోండి....




౧. ఇతరులు చెప్పేది శ్రద్దగా వినడం ఉత్తమం..
Be a Good Listener


౨. నమ్రతను అవలంభించండి..
Be Courteous


౩. ఎదుటి వ్యక్తిని ఆప్యాయంగా పలకరించండి..
Be Interested in the other Fellow


౪. సంతోషంగా చక్కని హావభావాలు కనపరచండి..
Be Cheerful with Good Expressions


౫. మీరు మాట్లాడే ముందు ఆలోచించండి..
Think Before You Speak


౬. ఇతరులకు మీ పట్ల సద్భావన కలిగేలా ఉండండి..
Be Flexible


౭. కానీ, మరీ సన్నిహితమైన చొరవ వద్దు..
Be Friendly But not Familier


౮. మీ ప్రవర్తనకు భిన్నంగా ఉండే వాటిని దరి చేరనియకండి..
Avoid any irregularities in Your Behavior



మంచి సంభాషణకు మార్గదర్శక సూత్రాలతో
ఇంతవరకు ఏమేమి అవలంభించాలో తెలుసుకున్నాం..!
ఇప్పుడు ఏవేవి అవలభించకుడదో గ్రహిద్దాం..!

౯. స్వంత అనుభవాలు వినిపించవద్దు...
Stop Telling Personal Experiences

౧౦. యాసగా మాట్లాడవద్దు..
Avoid too Much Slang


౧౧. అహంభావ ప్రదర్శన వద్దు...
Avoid Egoism

౧౨. నమ్మశక్యం కానంతగా అతిశయోక్తులు మాట్లాడొద్దు..
Avoid Exaggeration



౧౩. మీ సంభాషణలో నిజాయితీ లేదనిపించేలా చేసుకోకండి..
Don’t Be In-Sincere

౧౪. వ్యర్ద పదాలు దోర్లనివద్దు..
Eliminate Superfluous Words


౧౫. మీరు వాదించే వారిగా ముద్ర పడవద్దు..
Don’t Be Argumentative


౧౬. మీరు సణుగుతూ ఉండే వారిగానో లేక పరనింద చేసే వారిగానో ఉండొద్దు
Don’t Be a Mumbler or a Dogmatic




ఈ ౧౬ సూత్రాలు ప్రవర్తనకు...
ముఖ్యంగా మాట్లాడేటప్పుడు అనుసరించాల్సిన పద్దతికి సంభందించినవి...
ఇతరులతో మనం మాట్లాడేటప్పుడు నిత్యం మదిలో మెదల్తుండాలి..
వీటితో పాటు మన హావభావ ప్రకటన మీద – శరీర విన్యాసం మీద మనకు అదుపు వుండాలి..
సరళంగా – సూటిగా సంభాషించడం ఉత్తమం..
అలాగేయ్ ఎదుటి వారి ఆసక్తిని – నిరసక్తతని గమనించడం కుడా ముఖ్యమే..
మర్యాద – మన్నన సంభాషణల్లో నేర్పుగా చూపించగల వ్యక్తులు
మొట్టమొదటి పలకరింపులోనే ఎదుటివారికి ఇష్టులవుతారు..
ఇతరుల హృదయాలను ఆదిలోనే గెలవగలిగేలా
సంభాషణ ప్రారంభించే వారికి,

ఏ ప్రాంతానికి వెళ్ళినా – ఏ భాషలో మాట్లాడినా విజయం తధ్యం..!
అటువంటి నిపుణులకు కాదేదీ అసాద్యం........!

                   -------- శుభం భూయాత్ -------

“ సంభాషించే తీరు (The Art of Conversation) ”

Complied By:
తెలుగు భాష సంరక్షణ వేదిక

Publishers :
రాయవరం, ఆంధ్రప్రదేశ్, ఇండియా – 533346
Phone : 8096339900