Sunday, February 07, 2016

thumbnail

Acupuncture health system-ఆక్యుపంచర్ వైద్య విధానం

Acupuncture health system,ఆక్యుపంచర్ వైద్య విధానం .

  • image : courtesy with Wikipedia.Org.

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -,ఆక్యుపంచర్ వైద్య విధానం - గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

  • చైనా సంప్రదాయ వైద్య విధానాలలో, ఆక్యుపంచర్‌ వైద్య విధానము ఒకటి . దీనిని భారతీయ ప్రాచీన వైద్య విధానం అని కూడా అంటారు . . చిన్న చిన్న వైద్యవిధానాలను అనుసరించి మనం ఆరోగ్యంగా ఉండవచ్హు. అందులో ఒక వైద్య విధానమే...ఆక్యుపంచర్.

మహాభారత యుద్ధకాలంలో భీష్ముడు అంపశయ్యపై ఊపిరిపోసుకున్న నేపథ్యంలో ఆక్యుపంచర్‌ వైద్యం ప్రాచుర్యం పొందిందనేది వైద్యుల మాట. అతి తక్కువఖర్చుతో దీర్ఘకాలిక వ్యాధులను సైతం ఈ వైద్యం ద్వారా నయం చేస్తున్నారంటే అతిశయోక్తికాదు.. ఖరీదైన కార్పొరేట్‌ వైద్యం చేయించుకోలేని వారికి ఆక్యుపంచర్‌ థెరపీ సంజీవని లాంటిది. అంతేకాదు లక్షలు వెచ్చించి వైద్యకోర్సులను అభ్యసించలేని వారికి ఆక్యుపంచర్‌ కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. డాక్టర్‌ ఆఫ్‌ మెడిసిన్‌(ఎండి) వంటి పిజి కోర్సులను అభ్యసించిన పలువురు ఈ రంగంలో రాణిస్తున్నారు. ఆక్యుపంక్చర్‌ వైద్య విధానం ద్వారా ఎలాంటి సైడ్‌ ఎఫెక్ట్‌ లేకుండా తక్కువ ఖర్చుతో ఎన్నో రకాల వ్యాధులనుండి విముక్తి పొందవచ్చు. సామాన్యులకు అందుబాటులో లేని ఈ వైద్యాన్ని ప్రస్తుతం అందరికి అందుబాటులోకి తెచ్చేందుకు విజయవాడ నగరంలో పవిత్ర అకాడమి వారు కళాశాలను ఏర్పాటు చేసారు. మొగల్రాజపురంలో పవిత్ర అకాడమి మెడికల్‌ ఆక్యుపంక్చర్‌ కళాశాలను నెలకొల్పారు.
  • ఆక్యుపంచర్-ప్రసూతి వైద్యం :
కొన్ని వేల సంవత్సరాలుగా బాధా నివారణకోసం, వ్యసనాల నుంచి విముక్తి చేయడంకోసం, వాంతుల నివారణకోసం, ఇంకా ఇతర వ్యాధుల చికిత్స కోసం సూదిపొడుపు వైద్యాన్ని ఉపయోగిస్తున్నారు. అయితే ప్రసూతి వైద్యంలో, ముఖ్యంగా నొప్పులను నియంత్రించడంలో దీని ఉపయోగం గురించి చెప్పుకోదగిన అద్యయనాలేవీ అందుబాటులో లేవు. ఎంత సమర్థంగా పనిచేస్తుందో రుజువు చేసే ఆధారాలు లేవు. మన దేహంలో 12 శక్తి పథాలు ఉంటే, అందులో 365కి పైగా బిందు కేంద్రాలు ఉన్నట్టు శాస్త్రం చెబుతున్నది. శస్త్ర చికిత్స, నొప్పుల వల్ల శక్తి ప్రవాహానికి అంతరాయం కలిగి దేహంలో అసమతౌల్యం ఏర్పడుతుంది. ఆ అసమతౌల్యం బాధను, ఇబ్బందిని కలిగిస్తుంది. శస్త్ర చికిత్స లేక నొప్పుల వల్ల శక్తి ప్రవాహానికి అంతరాయం కలిగినప్పుడు కొన్ని నిర్దిష్ట ప్రదేశాలలో సూదులను పొడవడం ద్వారా శక్తిని సరైన మార్గంలోకి మళ్లేట్టు చేస్తారు. ఆధునిక శాస్త్ర విజ్ఞానం అంచనా ప్రకారం, ఆక్యుపంచర్ ఈ బాధ కలిగించే స్పందనలను మెదడుకు వెళ్లకుండా అడ్డుకుంటుంది. లేక శరీరంలో సహజంగానే బాధానివారణ రసాయనాలను ఉత్త్పత్తి చేస్తుంది.
  • టెక్నిక్:

ఈ చికిత్సా విధానంలో నిపుణుడైన ఆక్యుపంచర్ వైద్యుడు పేషంటు దేహంలోని కీలకమైన శక్తి బిందువుల వద్ద చర్మం కింది భాగంలో శుద్దిచేసిన మంచి సూదులను గుచ్చుతారు. ఒక్కో బిందువు వద్ద ఒక్కో వ్యవధిలో సూదులను శరీరంలో ఉంచుతారు. కొన్నిసార్లు సూదుల ద్వారా తక్కువ తీవ్రతతో విద్యుత్ ప్రవాహాన్నీ పంపించి, బాధ తీవ్రతను నియంత్రించడానికి కృషి చేస్తారు. ప్రసూతికి చాలా వారాల ముందు నుంచే వారానికి గంట చొప్పున ఆక్యుపంచర్ చేయవచ్చు.
  • పరిమితులు:

* ఆక్యుపంచర్ వైద్యుడు మాత్రమే సూదులను ప్రయోగించవలసి ఉంటుంది.* సూదులు గుచ్చిన చోట అంటువ్యాధులు సోకే ప్రమాదం ఉంటుంది.* నొప్పుల సమయంలో సూదులు గుచ్చితే,తల్లి అటూ ఇటూ కదలడం కష్టమవుతుంది.* ఆక్యుపంచర్ వల్ల బాధ తగ్గడం కంటే, కడుపులో వికారం కలిగి తొందరగా ప్రసవం జరగడానికి వీలు కలిగే అవకాశం ఉందని కూడా కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి.* ఆక్యుపంచర్ బాధా నివారణ ఔషధాల వినియోగం, స్థానికంగా మత్తు ఇవ్వడం(రీజినల్ అనస్తీసియా) వంటి వాటిని తగ్గించిన దాఖలాలు తక్కువ.
ఆక్యుపంచర్ వల్ల శరీరంలో సహజ బాధానివారణ రసాయనాలేవి(ఎండోమార్ఫిన్స్) జనించడంలేదని కొన్ని అధ్యయనాల్లో తేలింది. అంతేగాక ప్రసూతికి ముందు వారాల తరబడిఆక్యుపంచర్ చికిత్స తీసుకున్నవారిలో తొలిదశ నొప్పుల్ వ్యవధి తగ్గిపోయిందని కూడా ఆ అధ్యయనాలు సూచిస్తున్నాయి. అయితే ఈ ఫలితాలను కచ్చితమైనవిగా పరిగణించడానికి లేదు. ఈ అంశంపై సందేహాలను తొలగించడానికి మరింత అధ్యయనం చేయవలసి ఉంది. ఇటీవల స్వీడన్ లో ఒక అధ్యయనం జరిగింది. స్వీడిష్ ప్రసూతి వైద్యులు గర్భిణులపై నాలుగురోజులపాటు ఆక్యుపంచర్ ఉపయోగించి చూశారు. ఆక్యుపంచర్ తీసుకున్న మహిళలల్లో ఎప్పటిలాగే సగం మంది ఎపిడ్యురల్ అనస్తీసియాను కోరుకున్నట్టు ఈ అధ్యయనంలో వెల్లడయింది. బాధా నివారణకోసం నాడీ స్పందనలను పెంచే చికిత్సలనో, వేడి బియ్యం సంచిని ఉపయోగించే విధానాన్నో వారు కోరుకునే అవకాశాలు తక్కువగా ఉన్నాయని కూడా ఈ అధ్యయనంలో తేలినట్టు బ్రిటిష్ జోర్నల్ ఆఫ్ అబ్స్టెరిక్స్ అండ్ గైనకాలజీ తాజా సంచిక పేర్కొంది.
  • ---/భవానీ శంకర్ కొడాలి, ఎండి, అసోసియేట్ ప్రొఫెసర్,

  • ===========================
thumbnail

Acupressure-ఆక్యుప్రెషర్‌ చికిత్స

ఆక్యుప్రెషర్‌ చికిత్స, Acupressure,రిప్లెక్సాలజీ చికిత్స , మర్ధన చికిత్స

  • ఆక్యుప్రెషర్‌ చికిత్స, Acupressure - మందు అవసము లేని వైద్యం :
ఎటువంటి మందుల్లేకుండా నిర్వహించే వైద్యవిధానాలు ఇటీవల కాలంలో మంచి ప్రజాదరణ పొందుతున్నాయి. ఇటువంటి వాటిలో ఆక్యుప్రెషర్‌, రేకీలు నేడు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయి. ప్రత్యామ్నాయ వైద్యము లో రిఫ్లెక్సాలజీ అనేది ఒక ప్రాచీన రూపము . ఆక్యుప్రజర్ , ఆయుర్వేదిక్ మసాజ్  ల మాదిరిగా పోలిఉండే రిప్లెక్షాలజీ ని కొందరు  పిలిచే ఆక్యుప్రెషర్‌ చికిత్స.. క్రీ.పూ. 5000 సంవత్సరాల కాలంలో మన దేశంలోనే ప్రారంభం కావడం విశేషం. ఆ కాలంలో రుషులు, మహామునులు ఈ వైద్యం ద్వారా రోగాలను నయం చేసినట్టు చారిత్రక ఆధారాలు కూడా ఉండడం విశేషం.
అరిచేతులు, అరికాళ్లలో శరీరంలోని వివిధ అవయవాలకు సంబంధించినటువంటి పాయింట్స్‌ ఉంటాయి. వీటిని యాక్టివేట్‌ చేయడం ద్వారారిప్లెక్షాలజీ లో చికిత్సలను నిర్వహిస్తారు. నడుము నొప్పి, మోకాళ్ల నొప్పులు, వెన్ను నొప్పులకు సంబంధించిన సమస్యలు ఈ వైద్యంతో పూర్తిగా నయమవుతాయని ఆక్యుప్రెషర్‌ /రిప్లెక్షాలజీ థెరపిస్ట్‌లు డాక్టర్‌ కె.నారాయణ, డాక్టర్‌ శ్రీనివాస్‌లు తెలిపారు. ఇవేగాకుండా ఐటి ఉద్యోగులకు స్పాండిలైటిస్‌ (మెడ, భుజాల నొప్పులు), నడుము నొప్పి, నిద్ర ఉండకపోవడం వంటి వాటిని ఈ చికిత్స ద్వారా పూర్తిగా నయం చేయవచ్చన్నారు. ఉదా: ఆక్యుప్రెజర్/రిప్లెక్షాలజీ  పద్ధతితో ఒక బొటనవేలును మరో బొటనవేలుతో నెమ్మదిగా ఒత్తటంవల్ల మెదడు ఉత్తేజితమై ఏకాగ్రత పెరుగుతుంది. ఎక్కువసేపు చదువుకునేవాళ్లు మధ్యమధ్యలో ఇలా చేయటం మంచిది.
ఆక్యుప్రెషర్‌/రిప్లెక్షాలజీ  ద్వారా గుండెజబ్బులు, ఆస్తమా, కిడ్నీ దెబ్బతినడం వంటి వ్యాధులకు చికిత్సలతో పాటు ఆడవారికి సంబంధించిన గైనిక్‌ సమస్యలను సైతం నయం చేయవచ్చు. నేడు ఈ వైద్య విధానం చైనా, జపాన్‌, థాయిలాండ్‌ తదితర దేశాల్లో విశేష ప్రాచర్యాన్ని పొందింది.
  • Some more details about accupressure/replexology Treatment(in Telugu),

మన శరీరంలోని ప్రతి అవయవమూ కండరాలు, నాడీ వ్యవస్థలతో పనిచేస్తుందనే సంగతి విదితమే. ఒక్కో శరీర భాగానికి సంబంధించి ఒక్కోచోట నాడులు కేంద్రీకృతమై వుంటాయి. వాటిపై ఒత్తిడి కలిగించి ప్రేరణ కలిగించి నట్లయితే ఆయా భాగాల్లో ఏర్పడిన లోపాలు సవరించబడి సక్రమంగా పనిచేస్తాయి. ఈ సనూత్రం ఆధారంగా కనిపెట్టిన చికిత్సావిధానమే రిఫ్లెక్సాలజీ.
శారీరకంగా అలసిపోతున్నారా? మానసికంగా ఆందోళన చెందుతున్నారా? రక్తపోటు, తలనొప్పి లాంటి రుగ్మతలు పీడిస్తున్నాయా? టెన్షన్‌కు గురవుతున్నారా? జ్ఞాపకశక్తి తగ్గిపోతోందా? ఇవన్నీ చిరాకుపెట్టే అంశాలే. బాధించే లక్షణాలే. స్థిమితం లేకుండా చేసి అనుక్షణం వేధించే భూతాలే. కానీ, ఇకపై ఇలాంటి సివ్టుమ్స్‌కు ఎంతమాత్రం చింతించాల్సిన అవసరం లేదు. వీటిని తరిమికొట్టే రిఫ్లెక్సాలజీ చికిత్స అమెరికా, బ్రిటన్‌ లాంటి అనేక దేశాల్లో ఎందరో చేయించుకుంటున్నారు. సత్వర ఫలితం కనిపించడంతో అనేకమంది ఈ రకమైన చికిత్స చేయించుకునేం దుకు ముందుకొస్తున్నారు. త్వరలో మనదేశంలోనూ అమలుచేసే అవకాశాలు ఉన్నాయి. ఇంతకీ రిఫ్లెక్సాలజీ చికిత్స ఎలా చేస్తారో, దానివల్ల ఎంతటి ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకుందాం.
పోటీ ప్రపంచంలో రోజురోజుకీ వత్తిడి పెరుగు తోంది. ఆందోళన కారణంగా నిద్రలేమి, జ్ఞాపకశక్తి తగ్గడం, ఇతరత్రా అనేక శారీరక, మానసిక జబ్బులు వస్తున్నాయి. ఇది నానాటికీ విస్తరిస్తోంది. ఎందరో ఈ రకమైన లక్షణాలతో ఇబ్బంది పడ్తున్నారు. చదువు, ఉద్యోగాల వేటలో ఉరుకులు, పరుగులు.. కెరీర్‌ డెవలప్‌మెంట్‌లో భాగంగా మరింత వత్తిడి. ఇల్లు, పెళ్ళి లాంటి అంశాల్లో మరో రకమైన అలసట. వెరసి జీవితమే ఒక పరుగు పందెం. ఒక రేస్‌ తర్వాత మరో రేస్‌. నిరంతరం గెలుపు దిశగా పరుగులెత్తడం. వత్తిడితో కూడిన విజయాలు, విషాదంతో కూడిన పరాజయాలు. ఈ మితిమీరిన వత్తిడి మానసిక ఆందోళనకు కారణమౌతోంది. అందుకే పెరిగిన పోటీలాగే జబ్బులూ పెరిగాయి. దాంతో ముఖంలో కాంతి పోవడం, కంటి కింద నల్లటి వలయాలు, కళ్ళలో కాంతి కరువవడం లాంటివి పైకి కనిపించే లక్షణాలు. కాగా, గుండె దడదడలాడటం, ఆకలి మందగించడం, నిద్రలేమి, అంతూఅదుపూ లేని ఆలోచనలు, అస్థిమితం, ఆందోళన లాంటివి ఇబ్బంది పెట్టే కొన్ని లక్షణాలు ‌.
  • రిఫ్లెక్సాలజీ చికిత్స ఎలా చేస్తారంటే..
ఇదొకరకమైన మసాజ్‌ లాంటిది. పాదాలు, చేతులు లాంటి శరీర భాగాలను.. మర్దనతో పాటు ఆక్యుపంచర్‌ను జతకలుపుతారు. వేళ్ళతో నొక్కడంవల్ల రక్తప్రసరణ, నాడీ వ్యవస్థలను పునరుద్ధరిస్తారు. లేనిపక్షంలో శరీరంలోని కొన్ని కొన్ని ప్రాంతాల్లో కణాలు గూడుకట్టుకుని చిన్ని చిన్ని గింజల్లా లేదా కణుపుల్లా తయారౌతాయి. రిఫ్లెక్సాలజీ ప్రక్రియ ద్వారా అలాంటి భాగాలను బాగా మర్దన చేసి తొలగించగల్గుతారు. దాంతో మెదడులోని కండరాలు శక్తివంతంగా పనిచేస్తాయి. ఆక్యుప్రెషర్‌ సాయంతో ఆక్యుపంచర్‌ కేంద్రాలను ప్రేరేపించినట్లవు తుంది. మొద్దబారిన భాగాలు తిరిగి చురుగ్గా పనిచేస్తాయి. శరీరము, మెదడు కూడా ఉపశమనం పొంది సక్రమంగా పనిచేస్తాయి. ముఖ్యంగా కాస్మొటాలజీ లొ ముఖాన్ని మునివేళ్ళతో నొక్కుతూ కండరాలను ప్రేరేపిస్తారు. ఫేషియల్‌ రిఫ్లెక్సాలజీ మరింత ప్రయోజనకరంగా వుంది.
రిఫ్లెక్సాలజీ చికిత్సకు క్రీములు, లోషన్లు లాంటి ఏ మందులతో పనిలేదు. కానీ, దివ్య ఔషధంలా పనిచేస్తుంది. పాదాలు, చేతులు, చెవులు, బొటలవేలు, ఇతర వేళ్ళపై ఆక్యుప్రెషర్‌ను పంపుతారు. అవసరమైన భాగాల్లో మునివేళ్ళతో చక్కగా మర్దన చేస్తారు. దీనికి నూనెలు కానీ ఏ రకమైన ద్రవాలు కానీ ఉపయోగించనక్కర్లేదు. ఒక సంవత్సరకాలంగా ఈ చికిత్స విస్తృత ఆదరణ పొందింది. కొన్ని కొన్ని మెడిసిన్లవల్ల జబ్బులు నయమైనప్పటికీ చాలాసార్లు వెంటనే రియాక్షన్‌ రావడం లేదా దీర్ఘకాలంలో సైడ్‌ ఎఫెక్ట్స్‌ వుండటం చూస్తుం టాం. కానీ, రిఫ్లెక్సాలజీవల్ల అలాంటి కష్టనష్టాలేమీ వాటిల్లే అవకాశం లేదు. ఇది బిగుసు కున్న కండరాలను సహజస్థితికి తెస్తుంది. రక్తప్రసరణ సాఫీగా జరిగేలా చేసి, నాడీవ్యవస్థను క్రమబద్ధం చేస్తుంది. టెన్షన్ను తగ్గిస్తుంది. ఏ రకమైన మెడిసిన్లు వాడకుండానే సహజసిద్ధంగా పనిచేసి శరీరం చురుగ్గా పనిచేసేట్లు ప్రేరేపిస్తుంది.
  • నియమ-నిబంధనలు :
రిఫ్లెక్సాలజీకి సంబంధించి నియ మాలు, నిబంధనలు అంటూ ఏమీ లేవు. మన శరీరంలోని ప్రతి అవయవమూ కండరాలు, నాడీ వ్యవస్థలతో పనిచేస్తుందనే సంగతి విదితమే. ఒక్కో శరీర భాగానికి సంబంధించి ఒక్కోచోట నాడులు కేంద్రీకృతమై వుంటాయి. వాటిపై ఒత్తిడి కలిగించి ప్రేరణ కలిగించి నట్లయితే ఆయా భాగాల్లో ఏర్పడిన లోపాలు సవరించబడి సక్రమంగా పనిచేస్తాయి. ఈ సనూత్రం ఆధారంగా కనిపెట్టిన చికిత్సావిధానమే రిఫ్లెక్సాలజీ. దీని వల్ల ప్రధానంగా శారీరక అలసట, మానసిక ఆందోళన తగ్గుతాయి. క్షీణించిన జ్ఞాపకశక్తి మెరుగవుతుంది. ఇన్‌సోమ్నియాతో బాధపడ్తున్నవారు ఇకపై హాయిగా, ఆనందంగా నిద్రపోగల్గుతారు. మల్టిపుల్‌ స్లెరోసిస్‌ పేషెంట్లకు కూడా ఈ చికిత్స వల్ల ఎంతో మేలు జరుగుతోంది. మూత్రపిండ సంబంధమైన వ్యాధులు సైతం నయమౌతు న్నాయి.
మన శరీరం పది సమానమైన భాగాలుగా విభజించబడ్తుంది. కుడివైపు ఐదు, ఎడంవైపు ఐదు భాగాలుంటాయి. మూడు ట్రాన్స్‌వర్స్‌ లైన్లుంటాయి. భుజం వద్ద ఒకటి, నడుంవద్ద ఒకటి, కింది భాగంలో ఒకటి వుంటాయి. వీటిపై అవసరమైనంత ప్రెషర్‌ను కలుగజేసి శరీర భాగాలు సక్రమంగా పనిచేసేలా చూస్తారు. ఎందరెందరికో ఈ చికిత్స ఉపశమనం కలిగించడంవల్ల పెద్ద పెద్ద డాక్టర్లు కూడా రిఫ్లెక్సాలజీగురించి ఆలోచిస్తున్నారు.
శరీరంలో అక్కడక్కడా బ్లాకేజ్‌లు కనిపించడం సాధారణం. పైపైన చూస్తే ఇలాంటివి స్పష్టంగా కనిపించవు. రిఫ్లెక్సాలజీ చికిత్సలో మునివేళ్ళతో జాగ్రత్తగా, అవసరమైనంత వత్తిడి కలుగజేస్తూ మర్దన చేసినప్పుడు వేళ్ళకు ఈ బ్లాకేజ్‌లు తెలిసొస్తాయి. వాటిని నిర్మూలించి నొప్పి, వత్తిడి తగ్గేలా చేస్తారు. శరీరంలో విడుదలయ్యే ఎండార్ఫిన్స్‌ లాంటి రసాయనాల వల్ల కూడా వత్తిడి, ఆందోళన పెరుగుతాయి. వీటన్నిటినీ బ్యాలెన్స్‌ చేయడంలో రిఫ్లెక్సాలజీ ఉపయోగపడ్తుంది. ఇదేదో ''తూతూ మంత్రం, తుమ్మాకు మంత్రం'' బాపతు కాదు. శాస్త్రీయంగా అత్యంత శక్తివంతమైన ఔషధాయుధం అని తేలింది.
ప్రస్తుతం రిఫ్లెక్సాలజీ చికిత్స ఆసియా, యూరప్‌, ఆఫ్రికా, ఉత్తరమెరికా దేశాల్లో బాగా ప్రాచుర్యం పొందింది. ఇప్పుడు ఇంగ్లండులో ఈ చికిత్స ఎక్కువగా జరుగుతున్నప్పటికీ, ఇది మొట్టమొదట చైనాలో మొదలైందని చెప్పాలి. దాదాపు 5 వేల సంవత్సరాల క్రితమే చైనాలో ఈ పద్ధతిని ప్రాక్టీస్‌ చేశారు. ఇక ఉత్తరమెరికాలోనూ దీనికి బాగా ఆదరణ వుంది. జపాన్‌దేశంలో దీన్ని జొకు షిన్‌ డొ అని పిలుస్తారు. జపాన్‌లో ఎక్కువగా కాలి పాదాన్ని రకరకాలుగా మసాజ్‌ చేసే టెక్నిక్‌ అమల్లో వుంది.
ఈ ప్రాచీన జొకు షిన్‌ డొ పద్ధతి అనంతర కాలంలో అనేక మార్పుచేర్పులను సంతరించుకుంది. చైనాలో చేతివేళ్ళపై సూదులతో ఆక్యుప్రెషర్‌ కలిగించడం ద్వారా ఆక్యుపంచర్‌ చేసే పద్ధతి ప్రపంచవ్యాప్తంగా జనాదరణ పొందింది. తలనొప్పి, సైనోసైటిస్‌ లాంటి దీర్ఘకాలిక వ్యాధులను సైతం ఆక్యుపంచర్‌ద్వారా తగ్గించడం సాధారణం. ఈ చైనా ఆక్యుపంచర్‌ సూత్రమే ఇవాళ్టి ఆధునిక రిఫ్లెక్సాలజీ చికిత్సకు మూలం.
ఈజిప్టు దేశస్తులు కూడా అతి పూర్వకాలంలోనే పాదాలను నొక్కి వత్తిడి కలిగిస్తూ చికిత్స చేసేవారు. అయితే వీళ్ళు ఒక్కొక్కరూ ఒక్కో విధంగా ప్రాక్టీస్‌ చేసినందువల్ల ఈ రకమైన చికిత్సకు సరైన పద్ధతి, ప్రణాళిక లేకపోయాయి.
ప్రస్తుతం అమల్లో ఉన్న రిఫ్లెక్సాలజీ చికిత్సను 1913లో అమెరికా సంయుక్త రాష్ట్రాలకు చెందిన ఈ.ఎన్‌.టి. స్పెషలిస్టులు (చెవి, ముక్కు, గొంతు స్పెషలిస్టులు) డాక్టర్‌ విలియం హెచ్‌. ఫిజరాల్డ్‌, డాక్టర్‌ ఎడ్విన్‌ బోవర్స్‌ పరిచయం చేశారు. ''ఇలా శరీర భాగాలపై వత్తిడి కలిగించడంవల్ల ఇతర భాగాల్లో ఒకలాంటి మత్తు ఆవరిస్తుంది'' అన్నారు ఫిజరాల్డ్‌. అమెరికాలోని రిఫ్లెక్సాలజిస్టులు, ఆధునిక పద్ధతులను ఇంప్లిమెంట్‌ చేస్తూనే, ఇంగమ్స్‌ థియరీలను మొదట క్షుణ్ణంగా అధ్యయనం చేస్తారు.
రిఫ్లెక్సాలజీ దివ్య ఔషధంలా పనిచేస్తున్న మాట వాస్తవమే. అయితే శాస్త్రీయంగా అధ్యయనం చేసి, అందులో తర్ఫీదు పొందినవారి వద్ద చికిత్స చేయించుకుంటేనే తగిన ప్రయోజనం వుంటుందని గుర్తించాలి. చవకగా ట్రీట్‌మెంట్‌ చేస్తున్నారనో లేక అందుబాటులో ఉన్నారనో, ఒక ప్రయోగం చేసిచూద్దామనో ఎవరో ఒకరి దగ్గర చికిత్స చేయించుకుంటే ఆశించిన మేలు జరక్కపోవచ్చు. ఒక్కోసారి రోగం ముదిరి, మరింత ప్రమాదకరంగా మారే అవకాశమూ వుంది. కనుక తస్మాత్‌ జాగ్రత్త అని హెచ్చరిస్తున్నారు నిపుణులు.
రిఫ్లెక్సాలజీ చికిత్సలో ఫేషియల్‌ రిఫ్లెక్సాలజీ మరింత చెప్పుకోదగ్గది. దీనివల్ల త్వరిత ప్రయోజనం కనిపిస్తోంది. ఈ చికిత్సలో గొప్ప ప్రయోజనం పొందిన కొన్ని కేసుల గురించి క్లుప్తంగా తెలుసుకుందాం.
పశ్చిమ యోర్క్‌షైర్‌లో బెలిండా ఒక మహిళ 18 సంవత్సరాలుగా డిప్రెషన్‌తో బాధపడ్తోంది. మధ్యమధ్యలో కొంత తగ్గినప్పటికీ ఇన్నేళ్ళుగా ఆమె దాన్నుండి పూర్తిగా బయటపడలేదు. మొదటిసారి డెలివరీ సమయంలో ఆమెకి డిప్రెషన్‌ వచ్చింది. ఒక్కసారిగా జీవనశైలి మారిపోవడంతో అలా జరిగింది. అనేకసార్లు తీవ్ర అలజడికి గురవడము, రాత్రులు నిద్రపట్టకపోవడము, ఉదయం వేళల్లో విపరీమైన ఆందోళనకు గురవడము, మధ్యాహ్నం వరకూ ఏడవడము, అజీర్తి, గాస్ట్రిక్‌ ట్రబులు లాంటి లక్షణాలతో ఆమె శారీరకంగా, మానసికంగా బాధపడింది. మొత్తానికి రిఫ్లెక్సాలజీ గురించి తెలుసుకుని ఆ సెంటరుకు వెళ్ళి అన్ని విషయాలూ విడమర్చి చెప్పింది. వారానికి ఒకసారి చొప్పున 5 సిట్టింగులు పూర్తయ్యేసరికి ఆమెలో నిద్రలేమి అంతరించి హాయిగా నిద్రపోసాగింది. అజీర్తి కూడా పూర్తిగా తగ్గిపోయింది. మరి కొన్ని వారాల చికిత్స తర్వాత ఆందోళన కూడా తగ్గింది. ఆమె ఇప్పుడు పూర్తి నార్మల్‌ స్థితికి వచ్చి చక్కగా ఉద్యోగం చేసకుంటూ పిల్లలతో ఆనందంగా జీవించగల్గుతోంది.
మరో వ్యక్తి ఒకరకమైన ఎలర్జీతో బాధపడ్తున్నాడు. అదెంత తీవ్రంగా వుండేదంటే అతనికి జలుబు చేసి, ఏ మందులు వాడినా ఆర్నెల్లపాటు తగ్గలేదట. రోజురోజుకీ ఉత్సాహం తగ్గిపోసాగింది. శరీరం, మనసు కూడా నిద్రాణంగా తయారయ్యాయి. శారీరకంగా, మానసికంగా నరకయాతన అనుభవించాడు. డాక్టర్లు పెయిన్‌ కిల్లర్లే శరణ్యమని చెప్పి స్ట్రాంగ్‌ డోసులు ఇవ్వసాగారు. ఆ దశలో అతనికి రిఫ్లెక్సాలజీ గురించి తెలిసి చికిత్సకోసం వెళ్ళాడు. ఐదు వారాల్లో అతనిలో గొప్ప మార్పు కనిపించింది. నాసికా రంధ్రాలు పూర్తిగా తెరుచుకున్నాయి. ఊపిరాడకపోవడం, జలుబు తగ్గాయి. నొప్పికి మాత్రలు వేసుకోవడం మానేశాడు. ఇప్పుడతను ఎంతో ఉల్లాసంగా కనిపిస్తున్నాడు. ఈ చికిత్స గురించి మాట్లాడ్తూ ''రిఫ్లెక్సాలజీ నిజంగా అద్భుతమైన ట్రీట్‌మెంట్‌. నొప్పి, మానసిక ఆందోళన కూడా తగ్గిపోయాయి. ఇది క్షణాల్లో లేదా రోజుల్లో తగ్గదు. వ్యాధి తీవ్రతను బట్టి కొన్ని నెలలు చేయించుకోవాల్సి వుంటుంది. నాది దీర్ఘకాలిక వ్యాధి కనుక నేను ఇప్పటికీ రిఫ్లెక్సాలజీ చేయించుకుంటున్నాను, ఇంకా కొంతకాలం చేయించుకుంటాను.. ఇది ఎంత ప్రయోజనకరమైందని రుజువైంది'' అంటూ ఆనందంగా చెప్పుకొచ్చాడు.
ఇవి మచ్చుకు రెండు ఉదాహరణలు మాత్రమే. వందలాదిమంది రిఫ్లెక్సాలజీ చికిత్సతో లాభం పొందుతున్నారు. త్వరలో మనదేశంలోనూ రిఫ్లెక్సాలజీ సెంటర్లు వస్తాయి. అందాకా ఓపికపడదాం.
పై ఫొటోలో చూపించినట్టు రోజూ 5-10 సార్లు అరచేయి మధ్యలో నొక్కడం వలన మూత్రపిండాల సమస్య నుండి బయటపడవచ్హు. మూత్రపిండాల సమస్య లేనివారు కూడా ఈవిధంగా చేయవచ్హు. కాని మరీ ఎక్కువగా చేయడం కూడా సమస్యే. ప్రయత్నించి లాభించండి
మూలము : Harison Text book of medicine , Text book of alternative medical therapy. Text book for students of Acupuncture treatment.


  • =======================================

thumbnail

Activity disorder of Children-పిల్లల చురుకుదనము లో తగ్గుదల

పిల్లల చురుకుదనము లో తగ్గుదల , Activity disorder of Children


పిల్లలు డల్ గా ఉంటూ, తమ చుట్టూ ప్రక్కల్ జరిగే విషయాల మీద ఆసక్తి ప్రదర్శించకుండా ఉంటుంటే… అది తప్పకుండా పట్టించుకోవలసిన విషయమే. ఇలా పిల్లలు అనాసక్తికరంగా ప్రవర్తించడాన్ని. ఎటెన్షన్ డిఫిసిట్ హైపర్ ఆక్టివిటీ డిజార్డర్ (ఎ.డి. హెచ్ . డి.)( Attention Deficit Hyper Activity Disorder) అంటారు.ఎ.డి. హెచ్ . డి. అంటే…పిల్లల్లో మొదట్లో చాలా చురుగ్గా అంటే ఆక్టివ్ గా ఉంటారు. కాలక్రమేణా చప్పబడిపోతారు. ఇలా ఒక్కసారిగా వారి ప్రవర్తనలో విపరీతమయిన మార్పు సంభావిస్తుందన్న మాట. మెదడు ఎదుగుదల సక్రమంగా లేనప్పుడే ఈ పరిస్థితి సంభవిస్తుందని శాస్త్రవేత్తలు స్పష్టీకరిస్తున్నారు. మెదడు మొదటి అయిదేళ్ళలో అత్యధిక ఎదుగుదల రికార్డు చేస్తుంది. శరీరంలోని హార్మోన్లు, తినే ఆహారంలోని విటమిన్లు ఈ విషయంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. జన్యు సంబంధం అంటే తల్లిదండ్రులతో ఎవరికైనా మెదడు సరిగా లేకపోతే పిల్లలకు ఈ పరిస్థితి రావచ్చు. మేనరిక వివాహలలో జన్మించిన పిల్లలు సాధారణంగా ఇవి తక్కువగా ఉండటానికి కారణం ఈ రకమైన జన్యు సంబంధమైన లోపాలే…పసికట్టడమెలా..క్లాస్ రూమ్ లో తోటి పిల్లలతో వీరి ప్రవర్తన ఎలా వుందో తెలుసుకుంటూ వుండాలి. పిల్లల స్నేహితులేవరు.. వాళ్ళు మన పిల్లలతో ఎలా ఉంటున్నారు? ఈ విషయాలు తెలిస్తే పిల్లాడి ప్రవర్తన అంచనా వేయవచ్చు.జాగ్రత్తలు :ఆరోగ్యకరమైన ప్రశాంత వాతావరణాన్ని పిల్లలచుట్టూ ఏర్పరచాలి.క్రియేటివిటీకి స్థానం ఉండేటట్లు చేయాలి.సంగీతం నేర్పడం… పెయింటింగ్ వేయడం… డ్యాన్స్ అంటే నృత్యం… మ్యూజిక్ అనుగుణంగా చిందులు వేయడం నేర్పితే వాళ్ళల్లో ఆహ్లాదకర భావాలు మొదలవుతాయి. కొంత వారి మానసిక పరిస్థితిని అదుపు చేయడానికి, ఎదుగుదలకు తోడ్పడుతుంది.
  • ==================================

thumbnail

Pimples-మొటిమలు

Pimples , మొటిమలు

[pimple-main_Full.jpg] 


టీనేజ్‌ నుంచి మధ్యవయసు వచ్చేవరకు ఆడవారిని ఎక్కువగా బాధించే సమస్యలలో మొటిమలు ఒకటి. మొటిమలు మహిళల సౌందర్యాన్ని సవాల్‌ చేసే సమస్య. మగ వారిలో కుడా కనిపించును . పింపుల్స్‌ సాధారణంగా 12 సంవత్సరాల నుండి 25 సంవత్సరాల వరకూ రావడం జరుగుతుంది.
మృదుత్వంతో మెరిసిపోవాల్సిన మోముపై చిన్న మొటిమ వస్తే.. అమ్మాయిల కంగారు అంతాఇంతా కాదు. అది తగ్గేదాకా రకరకాల చికిత్సలు ప్రయత్నిస్తారు. చాలామందిని వేధించే ఈ మొటిమలు ఎందుకు వస్తాయి.. నిర్లక్ష్యం చేస్తే ఎదురయ్యే ఇతర సమస్యలు గురించి వివరంగా తెలుసుకుందాం.
కౌమారదశలో ప్రవేశించే వారికే మొటిమల సమస్య ఉంటుందనుకుంటారు చాలామంది. నిజానికి, నలభై ఏళ్లు పైబడినవారికీ వస్తాయివి. కేవలం ముఖంపైనే కాదు.. చేతులు, ఛాతి, వీపు వంటి భాగాలపైనా మొటిమలు వస్తాయి. నాలుగు స్థాయుల్లో వేధించే ఈ సమస్య తీవ్రత కొందరిలో ఎక్కువగా ఉంటుంది. మొటిమలు వచ్చి తగ్గడంతో పాటు.. కొందరికి మచ్చలు పడితే.. మరికొందరికి గుంటల దాకా దారితీస్తాయి. అవి తగ్గడానికి చాలా సమయం పడుతుంది. ఎంతో బాధించే వీటి రాకకు కారణాలనేకం.
  • హార్మోన్లలో చోటుచేసుకునే మార్పులు.. 
  • చర్మంలో నూనె గ్రంథుల పనితీరు,
  •  బ్యాక్టీరియల్‌ ఇన్‌ఫెక్షన్‌ వంటివి ఇందుకు ప్రధాన కారణాలు. 
  • పరోక్షంగా ఒత్తిడితోనూ కొన్నిసార్లు వస్తుంటాయి. 
  • పీసీఓడీ (పాలిసిస్టిక్‌ ఓవరీస్‌) సమస్య, 
  • కొన్నిరకాల ఉత్ప్రేరకాలు, 
  • గర్భనిరోధక మాత్రలు, 
  • క్షయకు వాడే మందులు.. వంటివీ ఈ సమస్యకు దారితీస్తాయి.

ఏర్పడే విధానము:
మొటిమలు (Acne) స్వేదగ్రంధులకు సంబంధించిన చర్మ వ్యాధి. మొటిమలు ముఖము పైనే కాకుండా మెడ, భుజము, ఛాతి పైన కూడా పుడుతూ ఉంటాయి. 70% నుండి 80% వరకు యువతీ యువకులలో ఇవి కనిపిస్తాయి. యవ్వనములో హార్మోనులు (ఆడువారిలో-ఈస్త్రోజన్, ప్రొజిస్త్రాన్, మగవారిలో-టెస్టోస్టిరాన్) సమతుల్యము (ratio) లోపించడము వలన సబేసియస్-గ్రంధులు నుండి సెబమ్ (oil like substance) ఎక్కువగా తయారై మొటిమలకు దారితీస్తుంది. మొటిమలు చిన్నవి, పెద్దవి అని రెండు రకాలుగా ఉంటాయి. చిన్నవి యుక్తవయసులో కొద్దికాలము పాటు కనిపించినా ఎటువంటి బాధ ఉండదు, వీటివలన ముఖముపై మచ్చలు ఏమి మిగలవు. పెద్దవి-Acne vulgaris అనేవి నొప్పి, దురదతో కూడికొని ముఖముపై మచ్చలు ఏర్పడే రకము. సాదారణముగా మొటిమలు ముఖముపైనే కాక మెడపైన, భుజాలపైన, ఛాథిపైన కూడా పుట్టవచ్చును.
ముఖముపైన ఉండే నూనె గ్రంధులు (sabesious glanda) చర్మములోని వెంట్రుకల కుదుల్లలో ఉండి యుక్తవయస్సులో ఎక్కువగా జిడ్డును తయారుచేయును. వెంట్రుక కుదుల్ల రంద్రాలు మూసుకుపోవడము వలనో, బయటి సూక్షమజీవుల (ex. proprioni bacterium acnes) వలనో ఇన్పెక్షన్ కి గురై పుండుగా మారి, పుండుమానిపోయి మచ్చగా మిగులును. చిదపడము, గోకడము వలన గోళ్ళనుండి ఇన్పెక్షన్ అయి ఎక్కువగా బాదపెట్టును. ఆహారపదార్దములు ముఖ్యముగా నూనెలు, క్రొవ్వులతో కూడిన పదార్దములు తినడము వలన మొటిమలు వస్తాయన్నది అపోహ మాత్రమే.

మొటిమలుపై ప్రభావితము చూపే అంశాలు
* మానసిక వత్తిడి ఎక్కువైనపుడు* ఆడు వారిలో PCOD (Poly Cystic Overian Disease) వున్నపుడు* వంశపారంపర్యము (కొంతవరకు)* ఆయిలీ స్కిన్ తత్వం ఎక్కువ వుండడం
పర్సనల్  జాగ్రత్తలు :-
* ముఖము రెండుపూటలా సబ్బుతో కడుగుకోవాలి* జిడ్డుముఖమైతే నూనె, కొవ్వు పదార్దములు తినడము తగ్గించాలి.* ప్రతిరోజూ వ్యాయామము చేయాలి* మొటిమలు చిదపడము , గోకడము చేయరాదు.* గట్టిగా తువ్వాలు తో ముఖము తుడవరాదు.
నివారణ- పింపుల్స్‌ను గిల్లకూడదు- మానసిక ఆందోళనను నివారించడానికి ప్రాణాయామం, యోగా చేయాలి.- తాజాగా ఉన్న ఆకుకూరలు, పండ్లు, కాయగూరలు తీసుకోవాలి.- నిలువ ఉంచిన ఆహార పదార్థాలను తినకూడదు- మలబద్ధకం లేకుండా జీర్ణశక్తి బాగా ఉండేలా చూసుకోవాలి.- స్వీట్స్‌, కూల్‌డ్రింక్స్‌, కేక్స్‌, ఆయిల్‌ ఫుడ్స్‌, వేపుళ్లు, కొవ్వు అధికంగా ఉన్న ఆహార పదార్థాలు తినకూడదు.- గోరు వెచ్చని నీటితో ముఖాన్ని రోజుకు 4 నుంచి 6సార్లు శుభ్రపరచుకోవాలి.- మార్కెట్‌లో లభించే రకరకాల క్రీములను, లోషన్‌లు వైద్యసలహా లేకుండా రాయకూడదు.- సున్నిపిండితో ముఖాన్ని శుభ్రం చేసుకోవడం చాలా మంచిది.- రోజుకు సరిపోయే స్థాయిలో నిద్ర ఉండేలా చూసుకోవాలి.పింపుల్స్‌ ఎక్కువగా ఉన్నప్పుడు ప్రకృతిసిద్ధ మైన పౌష్టిక ఆహారాన్ని తీసుకుంటూ, ఎక్కువ కేలరీలు ఉన్న ఆహార పదార్థాలు మానేయాలి.
వైద్యం
శరీరములో హార్మోనులు అసమతుల్యత కొంతకాలానికి - సుమారుగా 1 సం. నకు, సర్దుకోవడము వలన మొటిమలు వాటంతటవే పోతాయి, మళ్ళీ పుట్టవు.
పెద్ద మొటిమలు వున్నవాళ్ళు -
  • క్లిండామైసిన్+అయిసోట్రిటినోయిన్ , కలిసివున్న ఆయింట్ ను వాడాలి (eg. Clindac-A ointment)
  • Femcinol -A skin ointment ... apply daily two times.
  • డాక్షిసైక్లిన్ (Doxycycline)100 mg రోజుకి ఒకటి చొప్పున 7-10 రోజులు వాడాలి.
  • మచ్చలు పోవడానికి "అలొవెరా " తో కూడిన ఆయింట్మెంట్ (eg. Aloderm-B ointment) సుమారు నెల రోజులు వాడాలి.
ప్రత్యామ్నాయాలున్నాయి...మొటిమలు త్వరగా నయం కావాలంటే.. కొన్నిరకాల పీల్స్‌, లేజర్లు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. అలాంటివాటిల్లో శాలిసిలిక్‌ యాసిడ్‌, మాండలిక్‌ యాసిడ్‌, గ్త్లెకోలిక్‌ యాసిడ్‌ ఉన్న పీల్స్‌ ఎంచుకోవాలి. ఈ చికిత్సను రెండు వారాలకోసారి ఆరు నుంచి ఎనిమిది విడతల వారీగా చేస్తారు. ఈ చికిత్సతో పాటు మందులు కూడా సూచిస్తారు వైద్యులు. అప్పుడే ఫలితం త్వరగా ఉంటుంది. పరిస్థితిని బట్టి లేజర్‌ చికిత్స కూడా మరో ప్రత్యామ్నాయం.
లేజర్‌ చికిత్సలున్నాయ్‌...మోముపై గుంటలకు లేజర్‌, డెర్మారోలర్లు అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ గుంటల్ని పూర్తిగా నివారించాలంటే.. ముందు మొటిమల్ని పూర్తిగా నివారించడం తప్పనిసరి. అప్పుడే గుంటల్ని పూర్తిగా తగ్గింవచ్చు. వీటికోసం అందుబాటులో ఉన్న రెండుమూడు రకాల లేజర్‌ చికిత్సల్లో ఫ్రాక్షనల్‌ సీఓ2, అర్బియం గ్లాస్‌, ఎన్డీయాగ్‌, ఐపీఎల్‌.. వంటివి కొన్ని. ఈ చికిత్సను నెలకోసారి మూడు, నాలుగు విడతల్లో చేస్తారు. డెర్మారోలర్‌ అయితే.. ఐదు విడతల్లో నెలకోసారి చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ రెండింటినీ కలిపి కూడా చేయవచ్చు.
ఈ రెండూ వద్దనుకుంటే.. ఫిల్లర్లు ప్రయత్నించవచ్చు. ఇవి తాత్కాలికం, సెమీ పర్మనెంట్‌, శాశ్వత పద్ధతుల్లో ఉంటాయి. తాత్కాలిక ఫిల్లరయితే.. ఆ ఫలితం ఆరు నుంచి ఎనిమిది నెలలు మాత్రమే ఉంటుంది. సెమీ పర్మనెంట్‌ చేయించుకుంటే.. ఏడాది నుంచి ఏడాదిన్నర దాకా పనిచేస్తుంది. శాశ్వత ఫిల్లర్‌తో ఐదు నుంచి ఎనిమిదేళ్ల వరకు గుంటలు కనిపించవు. ఈ చికిత్సను మాత్రం ఒకేసారి చేస్తారు.

ఆడవారికి వీటిని దూరం చేసి ముఖసౌందర్యాన్ని కాపాడుకోవడానికి కొన్ని గృహ-చిట్కాలు...
  • ఒక చెంచా గంధపు పొడిలో చిటికెడు పసుపు, కొద్దిగా పాలు పోసి కలిపి ముఖానికి రాస్తే క్రమేణా మొటిమలు తగ్గుతాయి.
  • మొటిమలు తగ్గడానికి రెండు రోజులకొకసారి అర కప్పు ఆలోవెరా గుజ్జుని సేవించండి లేదా చర్మం మీదకూడా పూయవచ్చు. గర్భిణులు ఆలోవెరా గుజ్జును సేవించకూడదు.
  • దాల్చిన చెక్కను పేస్ట్‌లా చేసి మొటిమలపై రాసి కాసేపాగి కడిగేయండి.
  • రాత్రి పడుకోబోయే ముందు గోరువెచ్చని నీటితో ముఖం శుభ్రంగా కడుక్కుని మెంతి ఆకులతో చేసిన పేస్ట్‌ని ముఖానికి పట్టించి ఆరిన తర్వాత కడిగేస్తే మొటిమలు మాయమవుతాయి.
  • ఒక టీస్పూన్ మిరియాల పొడి కానీ మిరియాలు కానీ తీసుకుని అందులో 8 వేపాకులు, 20 గ్రాముల చందనం పొడి కలిపి నూరుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి అరగంట తరువాత వేడినీటితో కడగాలి. ఇలా రోజుకొకసారి ఒక వారం రోజులపాటు వేసుకుంటే మొటిమలు రావు. ఉన్నవి తగ్గిపోతాయి.
  • కొత్తిమీర రసంలో చిటికెడు ఉప్పు కలిపి ముఖానికి రాసి అరగంట తర్వాత చన్నీటితో కడిగితే మొటిమలు పోతాయి. ఉసిరి విత్తనాలను నాలుగైదు గంటలపాటు నీటిలో నానపెట్టి తర్వాత దాన్ని రుబ్బి ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించినా కూడా మొటిమలు మాయమవుతాయి. అలాగే ఉల్లి రసం రాస్తే మొటిమలు, కాలిన గాయాల తాలూకు మచ్చలు తగ్గుతాయి.
  • కమలా పళ్ళ తొక్కలను ఎండ బెట్టి చూర్ణం చేసి మొహానికి రాసుకుంటే మొటిమలు, వాటి తాలూకు మచ్చలు కూడా పోతాయి. ముఖాన మొటిమలు, మచ్చలు, పొడలు లాంటివి ఉంటే... కొద్దిగా పొదీనా ఆకులు మెత్తగా నూరి రాత్రి పడుకునే ముందు ముఖానికి రాసి, ఉదయాన్నే శుభ్రంగా కడిగి వేయాలి. ఇలా వారం రోజులు చేస్తే మచ్చలు లేకుండాపోతాయి.
  • మొటిమలతో బాధపడేవారు బూరుగు చెట్టుకుండే ముల్లును బాగా అరగదీసి ఆ చూర్ణాన్ని పట్టించినా కూడా ఫలితం ఉంటుంది. ఇలా చేయడం వల్ల సమయానికి సమయం, డబ్బుకు డబ్బు ఆదా అవుతుంది.
మొటిమలతో జాగ్రత్తలు : 
చూడటానికి మొటిమలు చిన్నగానే ఉంటాయి గానీ యుక్తవయసు పిల్లలను తెగ ఇబ్బంది పెడతాయి. సౌందర్యపరంగానే కాదు.. మానసికంగానూ వేధిస్తాయి. అందుకే ముఖంపై ఒక్క మొటిమ కనబడినా వెంటనే గిల్లేస్తుంటారు. నిజానికి ఇలా గిల్లటం వల్ల మొటిమలు తగ్గకపోగా మరింత తీవ్రమయ్యే ప్రమాదముంది. కాబట్టి మొటిమలు గలవారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం తప్పనిసరి.
* ముఖంపై నూనె లేదా జిడ్డుగా ఉండే ఎలాంటి పదార్థాలనూ రాయకూడదు. ఇలాంటివి చర్మంలోని తైల గ్రంథులు మూసుకునేలా చేసి మొటిమలను మరింత తీవ్రం చేస్తాయి. తప్పనిసరైతేనే ముఖానికి మేకప్‌ వేసుకోవాలి. అలాగే పడుకునేప్పుడు మేకప్‌ను పూర్తిగా కడుక్కోవాలి.
* రోజూ షాంపూతో తలస్నానం చేయటం వల్ల ముఖం జిడ్డుబారకుండా ఉంటుంది. తలకు నూనె, క్రీముల వంటివి వాడితే.. అవి ముఖమంతా విస్తరించి, మొటిమలు ఉద్ధృతం కావటానికి దోహదం చేస్తాయి.
* మొటిమల సమస్య తీవ్రంగా గలవారిలో కొందరికి తైలగ్రంథుల మార్గంలో అధికంగా నూనె పేరుకుపోవటం వల్ల పసుపురంగులో గానీ నల్లగా గానీ ముఖంపై చిన్న బుడిపెలు (బ్లాక్‌హెడ్స్‌) ఏర్పడుతుంటాయి. వీటిని గిల్లటం మంచిది కాదు. దీంతో మొటిమలు తగ్గటం ఆలస్యమవుతుంది.
* రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే చర్మ సౌందర్యం కూడా మెరుగుపడుతుంది. ఇది మొటిమలు తగ్గేందుకూ దోహదం చేస్తుంది.
* కొందరు మొటిమలు తగ్గేందుకు వేసుకునే మందులను వెంటనే ఆపేస్తుంటారు. ఇది మంచి పద్ధతి కాదు. ఇలాంటి మందులు పూర్తి ప్రభావం చూపేందుకు 8 వారాల వరకు సమయం పడుతుందని గుర్తించాలి.


===============================================================
thumbnail

Acidity and treatment-అసిడిటీ వస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలు

అసిడిటీ వస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలు , Acidity and treatment



"ఇదివరకు ఏం తిన్నా అరాయించుకునే వాళ్లం".." ప్రస్తుతం పరిస్థితి అలా లేదు". " ఏ ఆహారం తీసుకోవాలంటే భయమేస్తుందని" చెప్పే వారి సంఖ్య నానాటికి అధికమవుతోంది. ఏదైనా ఆహారం తీసుకోగానే తేన్పులు, చిరాకు, గుండెలో మంట వంటివి వస్తే.. ఈ పరిస్థితినే అసిడిటీ అంటారు .ఎసిడిటీ అనేది జబ్బు కాదు. జీర్ణ వ్యవస్థ సరిగా లేకపోతే కడుపులో మంట అన్పిస్తుంది. పొట్టలో ఆమ్లాలు ఉత్పన్నమవుతాయి. రక్తంలో ఆమ్ల, క్షార సమతుల్యత సమపాళ్లలో ఉంటే ఈ సమస్య రాదు.
జీర్ణాశయంలోని జఠర గ్రంధులు జఠర రసాన్ని ఉత్పత్తి చేస్తాయి. ఈ జఠర రసంలో హైడ్రో క్లోరిక్ ఆమ్లం ఉంటుంది. ఇది జీర్ణాశయంలోని బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. ఒక్కోసారి ఇది అధికంగా తయారవుతుంది. అలా అధిక ఉత్పత్తి కావడాన్నే ‘ఎసిడిటీ’ అంటారు.
సాధారణంగా మనం తినే ఆహారంవలన, మన జీవన గమనం వలన ఎసిటిడీ వచ్చే వీలుంది. జిహ్వ చాపల్యం అధికంగా వుండేవారికి ఇది దగ్గరి చుట్టం. దొరికింది కదాని.. ఎక్కడపడితే అక్కడ.. ఏది పడితే అది తినేవారికి ఎసిడిటీ సమస్య అందుబాటులో ఉంటుంది.
ఎసిడిటీ వున్నవారికి చాతీలోను, గొంతులోను, గుండెల్లోనూ, జీర్ణాశయంలోనూ మంటగా వుంటుంది. పుల్లటి తేపులతో ఆహారం నోటిలోకి వచ్చినట్లుంది. కడుపు ఉబ్బరించి వాంతి వచ్చినట్లుంటుంది. మలబద్ధకం, అజీర్ణం పెరిగి ఆకలి మందగిస్తుంది.
జీవన విధానం.. మన దైనందిన జీవన విధానం కూడా ఎసిడిటీకి దారితీస్తున్నాయి. ఉద్యోగం, పిల్లలు, పిల్లల చదువులు.. సమాజంలో అవతలవారితో పోటీపడటం, ఉరుకులపరుగుల జీవనం తీవ్ర మానసిక ఒత్తిడిని కలిగిస్తున్నాయి. ఈ మానసిక ఒత్తిడి ఆరోగ్యంమీద పనిచేసి ఎసిడిటీనీ కలిగిస్తున్నాయి. దీనినే ఈ విదంగా చెప్పవచ్చును ... Hurry , worry , curry ....... leads to Acidity .
ఉపశమనం.. జీవన విధానంలో మార్పులు తీసుకోవటం ద్వారా కొంతమేరకు దీని ఉపశమనం పొందవచ్చు.
  • ఆల్కహాల్, పొగ త్రాగుడు, గుట్కాలు లాంటి పదార్థాలను పూర్తిగా మానివేయాలి.
  • మానసిక ఆందోళనను తగ్గించుకోవాలి.
  • ఎక్కడపడితే అక్కడ ఫాస్ట్ఫుడ్స్ తినకూడదు.
  • మసాలాలతో కూడిన ఆహార పదార్థాలు తినటం తగ్గించుకోవాలి. ప్రతిరోజూ నియమిత సమయంలో, ఆహారాన్ని ఆదరా బాదరాగా కాక ప్రశాంతంగా.. బాగా నమిలి తినాలి.
  • తగినంత విశ్రాంతి తీసుకోవాలి.
కాబట్టి ఎసిడిటీనీ పెంచుకోవడం కానీ తగ్గించుకోవడం కానీ.. మన అలవాట్లు, ఆహార నియమాలలో వుంది. ప్రతివారూ కాస్త శ్రద్ధ తీసుకొని వీటిని పాటిస్తే.. ఎసిడిటీని తరిమేయవచ్చు.
ఈ అసిడిటీతో బాధపడేవారు తినవల్సిన /తినకూడని పదార్ధములు ... 
పులుపు గా ఉన్న పదార్ధాలు తినికూడదు . ,
పచ్చిగా ఉన్న కాయలు , పండ్లు తినకూడదు ,
మసాలా వస్తువులు ఎక్కువగా తినకూడదు .,
తేలికగా జీర్ణం అయ్యే పదార్ధములే తినాలి ,
కొబ్బరి కోరుతో తయారయ్యే పదార్ధములు తక్కువగా తినాలి ,
నూనే వంటకాలు మితము గా తీసుకోవాలి (ఫ్రై ఫుడ్స్ ),

అసిడిటీని తగ్గించాలంటే...
ఆయుర్వేదము :
 ఆవకూర, మెంతి కూర, పాలకూర, క్యాబేజీ, ముల్లంగి ఆకులు, ఉల్లి కాడలు, తోటకూరలను తరిగి ఒకటిన్నర లీటరు నీళ్లలో వేసి బాగా మరిగించాలి. తరువాత అందులో ఉప్పు, అల్లం రసం, నిమ్మరసం, రెండు వెల్లుల్లి రెబ్బలు నలిపి కలియబెట్టాలి. అసిడిటీ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ సూప్ తాగితే ఒంట్లో తేలిగ్గా ఉంటుంది.
అల్లోపతి:
  • యాంటాసిడ్ మాత్రలు గాని , సిరప్ గాని ఉదా: tab . gelusil mps or sy.Divol --3-4 times for 4 days
  • యాసిడ్ ను తగ్గించే మాత్రలు : cap. Ocid -D.. 2 cap / day 3-4 days.
  • -----------------------Or. cap.Rabest-D.. 1 cap three time /day 3-4 days. వాడాలి .


అసిడిటీ మందులు దీర్ఘకాలం వాడొద్దు!
  • అజీర్ణం, పుల్లటి త్రేన్పులు, ఛాతీలో మంట వంటివి తరచుగా కనిపించే సమస్యలే. ముఖ్యంగా వృద్ధుల్లో ఎంతోమంది వీటితో బాధపడుతుండటం చూస్తూనే ఉంటాం. వీటి నుంచి తప్పించుకోవటానికి చాలామంది ఒమెప్రొజాల్‌ వంటి ప్రోటాన్‌ పంప్‌ ఇన్‌హిబిటార్స్‌ (పీపీఐ) మాత్రలు వేసుకుంటూ ఉంటారు. డాక్టర్లు సిఫారసు చేయకపోయినా సొంతంగా కొనుక్కొని వాడేవాళ్లూ లేకపోలేదు. అయితే వీటిని ముట్లుడిగిన మహిళలు దీర్ఘకాలం వాడటం మంచిది కాదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీంతో ఎముకల పటిష్ఠం తగ్గి.. తుంటి ఎముకలు విరిగే ప్రమాదం పెరుగుతోందని హెచ్చరిస్తున్నారు. బోస్టన్‌లోని మసాచుసెట్స్‌ జనరల్‌ ఆసుపత్రికి చెందిన డాక్టర్‌ హమీద్‌ ఖలీల్‌ బృందం ఇటీవల ఒక అధ్యయనం చేసింది. నెలసరి నిలిచిపోయిన 80 వేల మంది మహిళలను పరిశీలించింది. మొత్తం ఎనిమిదేళ్ల పాటు చేసిన ఈ అధ్యయనంలో.. పీపీఐలు వాడేవారిలో తుంటిఎముక విరిగే ముప్పు 35% పెరిగినట్టు గుర్తించారు. ఇక పొగతాగే అలవాటుంటే ఇది మరింత ఎక్కువవుతుండటం గమనార్హం. ఈ మందులను ఆపేస్తే ఎముక విరిగే ముప్పు రెండేళ్లలోనే మామూలు స్థాయికి చేరుకుంటోంది కూడా. బరువు, వయసు, వ్యాయామం, పొగ తాగటం, ఆహారంలో క్యాల్షియం మోతాదు, క్యాల్షియం మాత్రల వాడకం వంటి అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకొని ఈ ముప్పును లెక్కించారు. ఆహారం ద్వారా నియంత్రించ గలిగే సమస్యలకూ డాక్టర్లు చాలాసార్లు పీపీఐలను సిఫారసు చేస్తున్నారని ఖలీల్‌ చెబుతున్నారు. వీటిని కొన్నాళ్లు వాడాక ఆపేయటమే మంచిదని.. అయితే వెంటనే మానేస్తే త్రేన్పులు, ఛాతీలో మంట వంటివి తిరగబెట్టే అవకాశం ఉన్నందువల్ల నెమ్మదిగా తగ్గించుకుంటూ రావాలని సూచిస్తున్నారు. సాధారణంగా ముట్లుడిగిన వారికి క్యాల్షియం మాత్రలనూ సిఫారసు చేస్తుంటారు. అయితే పీపీఐలు మన శరీరం క్యాల్షియాన్ని గ్రహించే ప్రక్రియను అడ్డుకుంటాయి. దీంతో క్యాల్షియం మాత్రలు వేసుకున్నా ప్రయోజనం కనబడటం లేదు. అందువల్లే క్యాల్షియం మాత్రలు వేసుకుంటున్న వారిలోనూ తుంటిఎముక విరిగే ముప్పు అలాగే ఉంటోందని ఖలీల్‌ పేర్కొంటున్నారు.

  • ===========================


thumbnail

Acanthosis-nigricans -ఎకాంతోసిస్ నైగ్రికాన్స్

Acanthosis-nigricans , ఎకాంతోసిస్ నైగ్రికాన్స్ 

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -Acanthosis-nigricans , ఎకాంతోసిస్ నైగ్రికాన్స్- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


ఎకాంతోసిస్ నైగ్రికాన్స్ అనేది ఒక చర్మసంబంధ సమస్య. చర్మపు ముడతలు, పల్లాలు ముదురు రంగులో వెల్‌వెట్ మాదిరిగా మందంగా తయారవటం ఈ వ్యాధి ముఖ్య లక్షణం. వ్యాధి ప్రభావానికి లోనైన చర్మం దళసరిగా మారడమే కాకుండా చెడు వాసన కూడా వస్తుంటుంది. ఈ వ్యాధిలో సాధారణంగా చంకలు, గజ్జలు, మెడ
వెనుక చర్మపుముడతలు నలుపుగా, మందంగా తయారవుతుంటాయి.  సాధారణంగా అధిక బరువు కలిగిన వ్యక్తుల్లోనూ, షుగర్ వ్యాధిగ్రస్తుల్లోనూ ఈ లక్షణం కనిపిస్తుంటుంది.

చిన్నతనంలో ఈ లక్షణాలు కనిపిస్తుంటే, పెద్దయిన తరువాత షుగర్ వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది. చాలా చాలా అరుదైన ఎకాంతోసిస్ నైగ్రికాన్స్ అనేది  అమ్లాశయపు క్యాన్సర్‌కిగాని లేదా కాలేయపు క్యాన్సర్‌కిగాని హెచ్చరిక లక్షణంగా కనిపించవచ్చు. ఈ లక్షణం  కనిపిస్తున్నప్పుడు సాధారణంగా దీనికి దారితీసే వ్యాధి స్థితిని సరిదిద్దితే సరిపోతుంది.

లక్షణాలు
చంకలు, గజ్జలు, మెడలోని చర్మపు ముడుతలు, పల్లాలు ముదురు రంగులోకి మారతాయి మందంగా, వెల్‌వెట్ గుడ్డ మాదిరిగా తయారవుతాయి ఈ మార్పులు వెంటనే కాకుండా నెమ్మదిగా, కొన్ని నెలలు, సంవత్సరాలపాటు  చోటుచేసుకుంటాయి. వ్యాధి ప్రభావానికి గురైన చర్మం నుంచి చెడు వాసన వస్తుంటుంది. కొద్దిగా  దురదగా కూడా అనిపిస్తుంటుంది.

కారణాలు
ఇన్సులిన్ హార్మోన్‌ని శరీరం వినియోగించుకోలేకపోవటం (ఇన్సులిన్ రెసిస్టెన్స్): క్లోమగ్రంథి  (ప్యాంక్రియాస్) ఇన్సులిన్ హార్మోన్‌ని విడుదల చేస్తుందన్న సంగతి తెలిసిందే. ఇన్సులిన్ అనేది షుగర్‌ని శరీరం వినియోగించుకోవడానికి సహాయపడుతుందన్న సంగతి కూడా తెలిసిందే. ఒకవేళ ఈ ఇన్సులిన్ శరీరం
గుర్తించలేకపోతే దానిని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు. దీనివల్ల చర్మం ముడతలు మందంగా, నలుపుగా తయారవుతాయి. ఇన్సులిన్ రెసిస్టెన్స్‌వల్ల  మున్ముందు కాలంలో షుగర్ వ్యాధివచ్చే అవకాశం ఉంటుంది.

అధిక బరువు : స్థూలకాయుల్లో చర్మం ముడతలు మందంగా నల్లగా  తయారవుతాయి. ఇన్సులిన్ రెసిస్టెన్స్‌కి ప్రధాన కారణం అధిక బరువు.  స్థూలకాయం షుగర్ వ్యాధికి ఒక ముఖ్యమైన ప్రేరకం. 

హార్మోన్ సమస్యలు : అండాశయాల్లో నీటి బుడగలు పెరగటం, థైరాయిడ్ గ్రంథి పనితీరు తగ్గటం, కిడ్నీల మీద ఉండే ఎడ్రినల్ గ్రంథులు వ్యాధిగ్రస్తం కావటం వంటి కారణాలవల్ల చర్మపు ముడుతలు మందంగా, నల్లగా తయారవుతాయి.

మందులు : సంతాన నిరోధక మాత్రలు, కార్టికోస్టీరాయిడ్ మందులు, నియాసిన్ వంటి మందుల వాడకం వల్ల కూడా చర్మపు ముడతలు  నల్లగా మందంగా
తయారై ఎకాంతోసిస్ నైగ్రికాన్స్  రావచ్చు.

క్యాన్సర్ : శరీరపు అంతర్గ భాగాల్లో పెరిగే కాన్సర్ కణితులవల్ల కూడా చర్మం మీద ముడతలు నల్లగా మందంగా తయారవుతాయి. ఆమాశయం, పెద్దప్రేగు, కాలేయానికి సంబంధించిన క్యాన్సర్లలో ఇలాంటి లక్షణం కనిపిస్తుంటుంది.

ప్రేరకాలు (రిస్కులు):
అధిక బరువు, వంశపారంపర్యత, జన్యువులు.

పరీక్షలు- నిర్థారణ
ఈ వ్యాధిని నిర్థారించడానికి కొంత సమాచారాన్ని మీరు డాక్టర్‌కి ఇవ్వాల్సి ఉంటుంది. ఉదాహరణకు: -మీ కుటుంబంలో నలుపుదనంతోకూడిన మందపాటి చర్మం ముడతలు ఉన్నాయా?
 -మీ కుటుంబంలో షుగర్ వ్యాధి ఉందా? -మీకు అండాశయానికి, లేదా థైరాయిడ్ గ్రంథికి సంబంధించిన సమస్యలు ఉన్నాయా?
-మీరు ఇతర వ్యాధులకు ఏవన్నా  మందులు వాడుతున్నారా?ఎప్పుడైనా స్టీరాయిడ్ మందును వాడాల్సిన అవసరం వచ్చిందా?
-ఈ లక్షణాలు ముందుగా ఎప్పుడు మొదలయ్యాయి?
-సమయం గడిచే కొద్దీ ఇవి తీవ్రతరమవుతున్నాయా?
-మీ శరీరంలో ఏ భాగాలు వ్యాధి లక్షణాలను ప్రదర్శిస్తున్నాయి?
-మీకు గాని లేదా మీ కుటుంబంలో ఇతరులకు ఎవరికైనా గాని క్యాన్సర్ వచ్చిన ఇతివృత్తం ఉందా?


ఆయుర్వేద చికిత్సా వ్యూహం--/ -డాక్టర్ చిరుమామిళ్ల మురళీమనోహర్ 

చికిత్సల ఉద్దేశ్యం-లక్షణాలను కలిగించే అంతర్గత వ్యాధిని ముందుగా గుర్తించి అదుపులో ఉంచటం. చర్మం ఎబ్బెట్టుగా కనిపించకుండా మచ్చల గాఢతను తగ్గించటం -ఆహారంలో మార్పులు చేర్పులను సూచించటం -ఒకవేళ అధిక బరువు కలిగి ఉంటే బరువు తగ్గేలాఆహార, విహార, ఔషధాపరమైన చికిత్సలను
సూచించటం చర్మంమీద నలుపు రంగు మందపాటి వైద్య సలహాతో వాడుకోవాల్సిన ఔషధాలు--పంచతిక్తఘృత గుగ్గులు, మహామంజిష్టాది క్వాథం, మహాభల్లాతక రసాయనం,  అమృత భల్లాతక లేహ్యం,  లంకేశ్వర రసం,  అరగ్వదాది ఉద్వర్తనం , మహా మరీచ్యాది తైలం, శే్వత కరవీరాది తైలం

అల్లోపతిక్ చికిత్స : 

కారణాన్ని బట్టి ట్రీట్ మెంట్ చేయాలి . మదుమేహము అదుపులో ఉండేటట్లు , కాన్సర్ అయితే దానికి తగిన వైద్యాన్ని ఇవ్వవలసి ఉంటుంది. సాధారణము గా ఇది దానంతట అదే తగ్గిపోవును .. . దాని మూలాన్ని బాగుజేసుకుంటే .
Restoderm or  Total derm వంటి ఆయింట్ మెంట్స్ బయట మచ్చలు పైన పూత గా రాస్తే కొద్దికాలము లో ఇది పూర్తిగా మామూలు చర్మము రంగులోనికి మారిపోవును .
  • ======================
thumbnail

Absent mindedness-పరధ్యానం

పరధ్యానం , Absent mindedness


పరధ్యానం(Absent mindedness)- మెంటల్ హెల్త్ :

ధ్యానం మంచిదే...కాని పరధ్యానంతోనే అసలు సమస్య. పరధ్యానంలో పడితే అసలు విషయంపై దృష్టి కేంద్రీకరించలేరు. పని పక్కదారి పడుతుంది. రహదారి వదిలేసి పక్కదారులు పడితే ప్రమాదమే కదా! దాంతో ప్రధానమైన విషయాలను విడిచి, కొత్తవాటి గురించే ఆలోచిస్తుంటాం.

పరధ్యానానికి ఎన్నో కారణాలుంటాయి. వాటితో ఎన్నో సమస్యలూ వస్తాయి. వాటిని అధిగమించడాని కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే అసలు సమస్యలు, కొసరు సమస్యలూ అన్నింటికీ పరిష్కారం దొరుకుతుంది.

బస్‌స్టాప్‌కు వెళ్లి బస్సు గురించి చూస్తూ ఎక్కడో ఆలోచిస్తే ఆ బస్సు వెళ్లిపోయింది కూడా తెలియకపోవచ్చు. రోడ్డు దాటే సమయంలో అలెర్ట్‌గా ఉండకపోతే ఏ ప్రమాదమైనా జరగవచ్చు. ఇవి ఏ పనులు చేసేటప్పుడైనా ఏర్పడవచ్చు. మనిషిక్కడ, మనసెక్కడో అన్నట్టుగా ఉండటం వలన ఇబ్బందులు తలెత్తుతుంటాయి.

సుజన్యకు 35 ఏళ్లు. భర్త ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగి. ఎప్పుడూ బిజీగా ఉంటాడు. వీరికి ఇద్దరు పిల్లలు. హాస్టల్‌లో ఉండి చదువుకుంటున్నారు. పనివాళ్లు ఇంటి పని చేసేసి వెళ్లిపోతారు. సుజన్యకు కావల్సినంత ఖాళీ సమయం. ఈ మధ్య సుజన్యలో వస్తున్న మార్పు భర్తను కలవరపరుస్తోంది. తను పిలిచినా త్వరగా పలకడం లేదు. రాతిళ్లు సరిగ్గా నిద్రపోవడం లేదు. ముందున్న హుషారు ఎంతమాత్రం లేదు. మనిషిగా ఇక్కడే ఉంటుంది కాని, ఎప్పుడూ ఏదో ఆలోచిస్తున్నట్టుగా ఉంటుంది. డాక్టర్ని కలిస్తే డిప్రెషన్ పరధ్యానం అని చెప్పారు.

* * *
మాధురి, రమేష్‌కు పెళ్లై రెండేళ్లే అవుతోంది. విడాకులు తీసుకుంటానని మాధురి తన తల్లిదండ్రుల దగ్గర పోరుతోంది. కారణం రమేష్‌కు అసలు ఇంటి ధ్యాసే లేదని, ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ పరధ్యానంగా ఉంటున్నాడని, అతనికి ఇష్టం లేని పెళ్లి చేసి తన గొంతు కోశారని’ కంప్లైంట్. తర్వాత తెలిసిన నిజం. రమేష్ సొంతంగా వ్యాపారం మొదలుపెట్టాడు. బిజినెస్ పనుల్లో టూర్లకు వెళ్లడం, ఎలా చేస్తే త్వరగా ఎదుగుతామనే ఆలోచనలు, ఆర్థిక సమస్యల మూలంగా పరధ్యానంగా ఉండేవాడు.

* * *
భార్గవ్‌కి పద్నాలుగేళ్లు. నైన్త్ క్లాస్ చదువుతున్నాడు. ఈ మధ్య ఎప్పుడూ పరధ్యానంగా ఉంటున్నాడు, చదువుమీద ఏకాగ్రత లేదు అని తల్లి బెంగపెట్టుకుంది. భార్గవ్‌ని తరచి తరచి అడిగితే తేలిన విషయం ఏంటంటే కిందటి క్లాస్‌లో లాగ మ్యాథమేటిక్స్ మంచిగా చెప్పే టీచర్ లేరు. ఫ్రెండ్స్ కూడా సపోర్ట్‌గా లేరు. లెక్కల్లో ఫెయిల్ అవుతానేమో అనే ఆందోళనతో పరధ్యానంగా ఉంటున్నాడు.

* * *
ధ్యానం అంటే ఆరోగ్యానికి మేలు కలిగించేదిగా, మనసుకు ప్రశాంతత నిచ్చేదిగా చెబుతుంటారు. మరి పరధ్యానం అంటే...! మనిషి ఉన్న చోటే ఉండి, అతని ఆలోచనలు మాత్రం ఎక్కడో ఉండటం. చుట్టుపక్కల ఏం జరుగుతుందో కూడా అర్థం కానట్టుగా ఉంటారు. ఆలోచన, ఆచరణ ఒకేదానిపై కేంద్రీకరించినప్పుడు ఆ పని సఫలీకృతం అవుతుంది. ఉదాహరణకు బస్‌స్టాప్‌కు వెళ్లి బస్సు గురించి చూస్తూ ఎక్కడో ఆలోచిస్తే ఆ బస్సు వెళ్లిపోయింది కూడా తెలియకపోవచ్చు. రోడ్డు దాటే సమయంలో అలెర్ట్‌గా ఉండకపోతే ఏ ప్రమాదమైనా జరగవచ్చు. ఇవి మరే వర్క్ చేసేటప్పుడైనా ఏర్పడవచ్చు. మనిషిక్కడ, మనసెక్కడో అన్నట్టుగా ఉండటం వలన ఇబ్బందులు తలెత్తుతుంటాయి. ఇది ఏ పనికైనా వర్తిస్తుంది. అంతమాత్రాన పరధ్యానం మానసిక వ్యాధి అని చెప్పడానికి లేదు. కొంత మంది వ్యక్తితత్వం అలా ఉన్నట్టుగా ఉంటుంది. కాకపోతే వ్యాధి రూపంలో ఒక లక్షణంగా ఉంటే ఉండొచ్చు. మామూలు వ్యక్తుల్లోనూ ఈ సమస్య ఉంటుంది. పరధ్యానానికి వారు వీరు, వయసు తేడా ఏమీ లేదు.

ఇలా ఉంటారు...
పరధ్యానంగా ఉన్నవారిని అంత తేలికగా తీసిపారేయడానికి వీలులేదు. వీరు...సున్నిత స్వభావులై, కళాత్మక హృదయం కలవారై ఉంటారు. ఎక్కువగా ఊహల్లో వివరిస్తుంటారు. చిత్రకారులు, రైటర్లు.. ఈ కోవకు చెందుతారు. తాము చేయబోయే పనిని రకరకాలుగా ఆలోచిస్తూ, ఊహించుకుంటూ, తమలో తాము మాట్లాడుకుంటూ ఉండటం వల్ల దైనందని జీవితంలో చుట్టుపక్కల వారిని పట్టించుకోరు. చాలా మెతకగా, నెమ్మదస్తులై ఉంటారు. రకరకాల కాంపిటిషన్స్‌లో పాల్గొనాలనే ఉత్సాహాన్ని చూపరు. పైగా వీటికి చాలా దూరంగా ఉంటారు.

ఎప్పుడూ మానసిక ప్రశాంతను కోరుకుంటారు. తమ భావాలను మరొకరితో పంచుకోవడానికి అంత ఉత్సాహం చూపరు. తక్కువగా మాట్లాడుతారు. ప్రతి ఒక్క విషయానికి ఇంకొకరిమీద ఆధారపడుతుంటారు. మెచ్యూర్డ్‌గా ఉండరు. సహజత్వానికి దూరంగా ఉంటారు.

పరధ్యానంగా ఉండటం వల్ల ...సమస్యలు
నేర్చుకోవాలన్న ఆసక్తి, ఏకాగ్రత ఉండదు. దీని వల్ల ఏం చేస్తున్నారో ఆ పని మైండ్‌లో రిజిస్టర్ కాదు. ఇది పిల్లల్లో అయితే చదువులో వెనకబడేలా చేస్తుంది. పెద్దల్లో పనుల్లో లోపాలు, జాప్యం, కెరియర్‌లో ఎదుగుదల లేకపోవడం.. వంటి నష్టాలు సంభవిస్తుంటాయి.

సమస్యల నుంచి త ప్పుకోవాలనుకుంటారు. ప్రశాంతంగా ఉంటే చాలు అనుకుంటారు. కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్‌తో దూరంగా ఉంటారు కనుక ఎప్పుడూ ఒంటరితనంతో బాధపడతుంటారు.

వివాహ బంధంలో భాగస్వామితో త్వరగా సర్దుకుపోలేరు. ఎదుటి వ్యక్తి అంటే ఉండే భయం కారణంగా వివాహం కూడా వద్దనుకుంటారు.

ఏదైనా వర్క్ విషయంలో ‘చేస్తాను’ అని మాట ఇచ్చి నిలుపుకోలేరు. దీంతో ఎదుటివారి నమ్మకాన్ని కోల్పోతుంటారు.

కారణాలు
వంశపారంపర్యం: తల్లిదండ్రుల్లో పరధ్యానం సమస్య ఉంటే అది వారి పిల్లలకూ వచ్చే అవకాశం ఉంటుంది.

కుటుంబ వాతావరణ: ఇంట్లో పెద్దవాళ్లు పిల్లలతో చులకనగా మాట్లాడటం. ఉదాహరణకు ‘నీకే పనీ చేతకాదు, ఓ చోట కూర్చో, నువ్వు సరిగ్గా చదవలేవు...’ వంటి పెద్దల మాటల ప్రభావం చిన్నతనంలో ఒంటరిగా ఉండేలా చేస్తుంది. ఇంకొంతమంది పిల్లల్ని అతిగారాబం చేస్తుంటారు. తింటున్నా, కూర్చున్నా, నిల్చున్నా... ఏం చేస్తే ఏ ప్రమాదం ముంచుకొస్తుందో అనే భావంలో ఉంటారు. అన్నీ సజావుగా జరిగిపోవడంతో ఎప్పుడూ సౌకర్యాన్నే కోరుకుంటారు. తమకు అనుగుణంగా లేనప్పుడు త్వరగా మూడీ అయిపోతారు. ఇవి రకరకాల ఆలోచనలను కలిగిస్తాయి.

పిల్లలు మానసికంగా ఒత్తిడికి లోనైనప్పుడు (ఎమోషనల్ ప్రాబ్లమ్స్), అతిగా ఆలోచిస్తున్నప్పుడు కూడా పరధ్యానం వస్తుంటుంది.

పెద్దవారిలో పర్సనాలిటీ డిసార్డర్స్, మేజర్ డిప్రెషన్ డిసార్డర్స్ వల్ల మనసు దిగులుగా, దుఃఖంగా ఉండటం, తమను తాము తక్కువగా అంచనా వేసుకొని వాళ్లలో వాళ్లు లీనమైపోతారు.

స్కిజోఫ్రీనియో: ఇది తీవ్రతరమైన మానసిక జబ్బు. వ్యక్తి తన ఆలోచనల్లో తాను ఉండిపోతాడు. చుట్టుపక్కల వాతావరణం అంతా బాధాకరంగా అనిపిస్తుంటుంది. అందరూ బాధపెట్టేవారుగానే కనిపిస్తారు. రకరకాల అనుమానాలు పెట్టుకుంటారు. తమ ముందు ఎవరూ లేకున్నా, ఎవరో వచ్చి మాట్లాడుతున్నట్టుగా ఉంటారు.

మద్యం, సిగరెట్, మత్తు పదార్థాలు అలవాటైన వారు కూడా ఏదో పోగొట్టుకున్నట్టు పరధ్యానంగా ఉంటారు. మందుల ప్రభావం వల్ల, వ్యసనం వల్ల కూడా ఇలా జరుగుతుంటుంది.

మల్టీటాస్కింగ్ : ఒకేసారి రకరకాల పనులు చేసేవారిలో అయోమయం నెలకొంటుంది. ముఖ్యంగా స్ర్తీలు- ఇంటి పనులు, పిల్లల పనులు, ఉద్యోగినులైతే ఆఫీస్ పనులు... ఇలా ఒక పని తర్వాత మరో పని పెట్టుకొనే వారు, పనులను ఒక ఆర్డర్ ప్రకారం చేసుకోనివారు పరధ్యానంగా కనిపిస్తుంటారు. అలాగే వ్యాపారాలు, వృత్తి, ఉద్యోగాలు.. ఎన్నో రకాల పనులు పెట్టుకునేవారిలో ఈ సమస్య ఉంటుంది. దీని వల్ల తప్పులు దొర్లుతుంటాయి. ఏకాగ్రత లోపిస్తుంది. దీంతో ‘మర్చిపోతున్నాం’ ‘మతిమరుపు మూలంగా ఏ పనీ చేయలేకపోతున్నాం’ అని తిట్టుకుంటూ ఉంటారు. కాని ఇది మతిమరుపు కాదు, పరధ్యానం వల్ల కలిగే సమస్య.

పరధ్యానం నుంచి బయట పడాలనుకునేవారు...

మనస్తత్వ నిపుణులను సంప్రదించి, మానసిక రుగ్మతతో ఉంటే చికిత్స తీసుకోవాలి.
ఇష్టమైన పనులు చేయాలి. వారం మొత్తం ఏమేం పనులు చేశామో వారాంతంలో గుర్తుచేసుకొని బుక్‌లో రాసుకోవాలి.
ఏకాగ్రత కుదరడానికి, సోషల్ స్కిల్స్‌లో ప్రావీణ్యానికి శిక్షణ తీసుకోవాలి.
ఏకాగ్రత పెరగడానికి రకరకాల పజిల్స్‌తో మెంటల్ ఎక్సర్‌సైజ్‌లు చేయాలి. పిల్లల చేత వీటిని చేయించాలి.
పాజిటివ్ దృక్పథాన్ని అలవరుచుకోవాలి.
సమయానుకూలంగా పనిని విభజించుకొని దానికి తగినట్టుగా పనులు చేసుకోవాలి. అదేవిధంగా ఆ రోజు చేయాల్సిన పనుల జాబితా రాసుకోవాలి. అనుకున్న పని పూర్తవగానే టిక్ పెట్టుకోవాలి.
ఒక బుక్ పెట్టుకొని ఏయే సమయాల్లో పరధ్యానంగా ఉంటున్నారు? ఎందుకు ఉంటున్నారు? అనేవి రాసుకోవాలి.
పిల్లలు దేని కారణంగా పరధ్యానంగా ఉంటున్నారో తెలుసుకొని, చర్చిస్తే ఆ సమస్యకు సులువుగా పరిష్కారం దొరుకుతుంది.

  • ========================================
thumbnail

Abortion-గర్భస్రావం

గర్భస్రావం , Abortion



  • ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు --గర్భస్రావం , Abortion-- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


పిండం ఆరో నెలకు ముందు లేదా 500 గ్రాముల బరువులోపు ఉండి పడిపోయినప్పుడు గర్భస్రావంగా చెబుతారు. వరుసగా 2 నుంచి 3 సార్లు అలా జరిగినప్పుడు దానికి గల కారణాలు విశ్లేషించాల్సి ఉంటుంది.

  • సాధారణంగా ఎప్పుడైనా ఒక సారి గర్భస్రావం జరగడానికి 50 శాతం మహిళలకు అవకాశం ఉండొచ్చు. ఇవేకాక దీనికి ఎన్నో కారణాలుటాయి. పిండం తయారీలో లోపం అన్నింటికన్నా ముఖ్యం. ఈ లోపాలు ఉన్నప్పుడు సహజంగానే ఎదుగుదల ఆగి గర్భస్రావమవుతుంది. జన్యుపరమైన కారణాలు ఒక్కోసారి గర్భస్రావానికి కారణమైనా కూడా పదే పదే ఇలా జరగదు. కాబట్టి ఒకసారి గర్భస్రావం అయితే దాని గురించి ఎక్కు వగా కంగారు పడాల్సిన అవ సరం లేదు. వరుసనే ఎక్కువ సార్లు గర్భ స్రావం జరగడానికి అనేక కారణా లున్నాయి. అందు లో ముఖ్య మైనవి .

కారణాలు 

  • తల్లి వయసు : 19 నుంచి 24 ఏళ్ల వయసులో గర్భం దాల్చ డానికి అన్నింటి కన్నా క్షేమ మైనా వయసు. 29 ఏళ్ల వరకు పర్వాలేదు. కానీ 30 ఏళ్లు దాటిన తర్వాత రిస్కు ఎక్కువుంటుంది.
  • జన్యుపరమైనవి : కనీసం 50 శాతం గర్భస్రావాలకు ఇవే కారణం. మొదటి మూడు నెలల్లోనే ఇవి చాలావరకు జరుగుతాయి. ప్రతీసారి అలా జరగాలని లేదు. జన్యుపరమైన లోపాలు గలిగిన పిండం ఎదగకుండా ఇది ఒక రకమైన సహజ సెలెక్షన్‌.
  • గర్భసంచిలో లోపాలు : పుట్టకతో గర్భకోశంలో ఉన్న లోపాల వల్ల రక్తప్రసరణ సరిగ్గా జరగకపోవడం, సర్విక్స్‌ వదులగా ఉండటం, గర్భకోశ ఆకారం పిండం ఎదుగులకు సరిపోకపోవడం, చిన్నగా ఉండటం వంటివి జరగొచ్చు. దీని వల్ల మూడో నెలలోపు లేదా నాలుగు ఐదు నెలల పిండంగా ఉన్నప్పుడు కూడా గర్భస్రావాలు జరిగే అవకాశాలున్నాయి. సర్విక్స్‌ వదులుగా ఉండి గర్భం నిలువకపోవడం అనేది పుట్టుకతో వచ్చిన లోపం మాత్రమే కాకుండా క్రితం జరిగిన ప్రసవంలో చిరిగిపోవడం వల్ల అనేక మార్లు గర్భస్రావం జరగడం వల్ల, ఇన్‌ఫెక్షన్ల వల్ల కూడా గర్భస్రావం అయ్యే అవకాశముంది. పిండానికి ఎలాంటి ఇన్‌ఫెక్షను సోకకుండా సర్విక్స్‌ కాపాడుతుంది. అది వదులు అయినప్పుడు గర్భకోశానికి, పిండానికి సోకే ఇన్‌ఫెక్షన్ల వల్ల కూడా నొప్పులు ముందే మొదలైన గర్భస్రావం జరగొచ్చు.
  • కంతులు : ఇవి ఉన్న ప్రదేశాన్ని బట్టి గర్భస్రావం అయ్యే అవకాశం ఉంటుంది. కంతులు గర్భకోశం లోపలివైపు ఉన్నప్పుడు పిండం ఎదగడానికి సరైన రక్తప్రసరణ జరగకపోవడం, ముందే కాన్పు, నొప్పులు రావడం అసలు గర్భం ధరించడానికే ఆలస్యం అవడం జరగొచ్చు. ఇవే కంతులు గర్భకోశానికి బయటివైపు ఉన్నప్పుడు ఇలా జరగడానికి అవకాశం కొంచెం ఎక్కువ.
  • ఇతర కారణాలు : అవాంఛిత గర్భం తీసివేయడానికి అనేసార్లు క్యూరుటు చేయించుకోవడం వల్ల గర్భకోశంలో అనవసరమైన పొరలు ఏర్పడే అవకాశముంది. క్షయ వచ్చినప్పుడు కూడా ఇలా జరగొచ్చు. ఈ పొరలు రక్తప్రసరణను అడ్టుకుంటాయి. వీటిని హిస్టిరోస్కోపి ఆపరేషను ద్వారా తొలగించొచ్చు. పాలిసిస్టిక్‌ ఓవరి సిండ్రోం, థైరాయిడ్‌ గ్రంథి పనితీరులో లోపాలు, మధుమేహం వంటి వ్యాధులు ఉన్నవారిలో గర్భస్రావాలు జరగొచ్చు.
  • రక్తం గడ్డకట్టడంలో లేడాలు, ఎపిఎల్‌ఎ సిండ్రోం, ధూమపానం, పెల్విక్‌ ఇన్‌ఫెక్షన్లు, మానసికంగా అశాంతి, ఉద్యోగంలో పనిఒత్తిడి వంటివి కూడా గర్భస్రావానికి కారణం కావొచ్చు.

చికిత్స :

  • రెండోసారి గర్భస్రావం అయినప్పటి నుండి వైద్యుల పర్యవేక్షణలో ఉండి కొన్ని రకాల పరీక్షలు చేయించి ఫోలిక్‌ యాసిడ్‌ వాడుకుని మళ్లీ గర్భం ప్లాన్‌ చేయొచ్చు. అబార్షన్‌ అయినప్పుడు పిండాన్ని విశ్లేషణకు పంపించి, ఎటువంటి జన్యు సమస్యలు ఉన్నాయో తెలుసుకోవచ్చు. మేనరికంలో వివాహం అయితే దంపతులకు కెరియోటైపు పరీక్షను నిర్వహించాల్సి ఉంటుంది. ఇంకా అవసరమైన రక్తపరీక్షలు, స్కానింగు, థైరాయిడ్‌ టెస్టులు జరిపి ఏవైనా ఇబ్బంది తెలిసినప్పుడు తగిన చికిత్స చేయాల్సి ఉంటుంది.

గర్భకోశంలో ఏవైనా లోపాలు, సర్విక్స్‌ వదులుగా ఉండటం వంటివి జరిగినప్పుడు అవసరాన్ని బట్టి ఆపరేషను ద్వారా సరిదిద్దొచ్చు. లేదా నాలుగో నెలలో సర్విక్స్‌కు కుట్టువేసి వదులవడాన్ని నిరోధించొచ్చు.

  • గర్భం నిర్ధారణ అయినప్పటి నుండి తగిన మందులు, వాడుకుని, విశ్రాంతి తీసుకోవాలి. వైద్యుల సలహా ప్రకారం స్కానింగు చేయించుకుంటే పండంటి పాపాయికి జన్మనొవ్వొచ్చు.


--డాక్టర్‌ బి.లావణ్య, స్త్రీవ్యాధుల వైద్యనిపుణులు,కేర్‌ హాస్పిటల్స్‌, బంజరాహిల్స్‌,--హైదరాబాద్‌. 

  • ================================
thumbnail

Abdominal T.B - Awareness ఉదరకోశపు క్షయ అవగాహన

ఉదరకోశపు క్షయ అవగాహన,Abdominal T.B-Awareness


  •  -

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జాబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -ఉదరకోశపు క్షయ అవగాహన(Abdominal T.B-Awareness)- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

క్షయ వ్యాధికి గురైన మొత్తం బాధితుల్లో సుమారు 5 శాతం మంది ఉదరకోశ క్షయతో బాధపడుతున్నారని గణాంకాలు తెలియజేస్తు న్నాయి. వీరిలో 25 నుంచి 60 శాతం మందికి పెరిటోనియల్‌ క్షయకు గురవుతున్నారు ఊపిరి తిత్తులకు సోకే క్షయతోపాటు, ఉదరకోశానికి సోకే క్షయ వ్యాధికి గురైన వారు 20 నుంచి 50 శాతం వరకూ ఉన్నారు.

వివిధ కారణాల వల్ల మనిషి వ్యాధి నిరోధక శక్తిని అణచివేసే మందులను (ఇమ్యునో సప్రెసెంట్స్‌) వాడటం, హెచ్‌ఐవి / ఎయిడ్స్‌ మొదలైన వ్యాధుల కారణంగా ఉదరకోశపు క్షయ తిరిగి విజృంభిస్తూ ఆందోళన కలిగించే స్థాయికి చేరుతోంది.
ఉదరకోశంలోని పెరిటోనియం, మీసెట్రీ, లింఫ్‌నోడ్స్‌, పేవులు ఇతర అవయవాలు క్షయ వ్యాధికి గురి కావచ్చు. ఇది అనేక రకాల వ్యాధుల లక్షణాలను ప్రదర్శించవచ్చు. ఉదా హరణకు ఇన్‌ఫ్లమేటరీ బొవెల్‌ డిసీజ్‌, కేన్సర్‌, ఇతర ఇన్‌ఫెక్షన్స్‌లో కనిపించే లక్షణాలు ఈ వ్యాధిలో కూడా కనిపించే అవకాశాలున్నాయి.

ఈ వ్యాధి సరైన సమయంలో తగిన చికిత్స తీసుకోని పక్షంలో దీర్ఘకాలిక వైకల్యానికి లేదా ఇతరత్రా ఇక్కట్లకు దారి తీయవచ్చు. ఈ కారణంగా వ్యాధిని తొలిదశలోనే గుర్తించి తగిన చికిత్స తీసుకోవడం అవసరం.
ఉదరకోశపు క్షయ వ్యాధి సోకిన ఉదరంలోని అవయవాన్ని అనుసరించి వివిధ రకాలైన లక్ష ణాలను ప్రదర్శిస్తుంది కనుక వాటిని నిర్ధారిం చడానికి కంప్యూటెడ్‌ టోమోగ్రఫీ (సి.టి.) స్కాన్‌ పరీక్ష చేయాల్సి ఉంటుంది. సి.టి. పరీక్ష ద్వారా ఉదరకోశంలోని అన్ని అవయవా లను ఒకేసారి పరీక్షించడానికి అవకాశం ఉంటుంది.

ఉదరకోశంలో క్షయ వ్యాధి సోకడానికి ప్రధాన కారణం మైకోబాక్టీరియం ట్యూబర్‌క్యు లోసిస్‌ లేదా మైకోబాక్టీరియం ఏవియం అనే సూక్ష్మక్రిములు. వ్యాధి నిరోధక శక్తిని అణచడా నికి ఔషధాలు సేవించే వారిలో రెండవరకం సూక్ష్మక్రిమి సాధా రణంగా కనిపిస్తుంటుంది.
కలుషిత ఆహారం ద్వారా ఈ బాక్టీరియా శరీ రంలోకి చేరుతుంది. చిన్న ప్రేవులు, లింఫ్‌ నోడ్స్‌ మొదలైనఅవయవాల క్షీణతకు ఈ బ్యాక్టీ రియా కారణమవుతుంది. ఈ అవయవాలు చిట్లిపోవడం ద్వారా బాక్టీరియా పెరిటోనియం లోకి చేరి పెరిటోనియల్‌ ట్యుబర్‌క్యులోసిస్‌కు దారి తీస్తుంది.

ఉదరకోశ క్షయ వ్యాధుల్లో అత్యంత సాధార ణంగా కనిపించే వ్యాధి పెరిటోనియల్‌ టిబి. పెరిటోనియల్‌ టిబి మూడు రకాలు.
ద్రవాలతో నిండిన సంచులు లేదా జలో దరంతో కూడిన తడితో కూడిన (వెట్‌ టైప్‌) టిబి ఒక రకం.
లింఫ్‌ ఎడినోపతి, ఉదరకోశ కండరాలు ముద్దలాగా కనిపించే పొడి రకపు (డ్రై టైప్‌) టిబి రెండవ రకం. ఒమెంటమ్‌ మందంగా మారడం వల్ల కంతుల మాదిరిగా కనిపించే క్షయ మూడవ రకం.

వీటిలో మూడవరకం క్షయను ఉదర కుహ రంలో ఏర్పడిన కంతులని పొరబడటం జరుగు తుం టుంది. ఆహార నాళానికి సోకే క్షయ వ్యాధి అత్యంత సాధారణంగా ఇలియమ్‌, సీకమ్‌ భాగాలకు సోకుతుంది. ఇతర భాగాల విషయంలో పెద్దపేగు, జెజునమ్‌, మలా శయం, డుయోడినమ్‌, జీర్ణకోశ భాగాలకు ఆరోహణా క్రమంలో సోకుతుంది.
ఆహార నాళానికి సోకే క్షయ అల్సర్‌ రకంగా కానీ, హైపర్‌ప్లాస్టిక్‌ రకంగా కాని, ఈ రెండింటి కలయికగా కానీ కనిపిస్తుంది. ఇలియమ్‌, సీకమ్‌ భాగాలకు (ఇలియో సీకల్‌) సోకే క్షయ ఎక్కువగా హైపర్‌ప్లాస్టిక్‌ రకంగా ఉంఉంది.

ఉదరకోశంలో సోకే క్షయ వివిధ రూపాలుగా కనిపి స్తుంది. సి.టి. స్కాన్‌ ద్వారా దీనిని సమగ్రంగా పరీక్షిం చడం సాధ్యమవుతుంది.
ఉదరకోశ క్షయ వ్యాధికి గురైన వారిలో కనిపించే లక్షణాలు - కడుపు నొప్పి, వాపు, జ్వరం, రాత్రి వేళల్లో చెమటలు పట్టడం, ఆకలి లేక పోవడం, బరువు తగ్గిపోవడం మొదలైనవి.

ఉదరకోశ క్షయ వ్యాధికి గురయ్యే వారిలో అత్యధికులు పేదవర్గాలకు చెందిన వారే. ఉదర కోశ క్షయ వ్యాధికి గురైన వారికి ఛాతీ ఎక్స్‌రే తీసినప్పుడు, ఊపిరితిత్తుల క్షయకు గురైన దాఖలేవీ కనిపించలేదు. చర్మానికి సంబంధిం చిన క్షయ కోసం చేసే పరీక్షల ఫలితాలు కూడా కొన్ని కేసుల్లో నెగటివ్‌గా వచ్చాయి.

ఉదరకోశ క్షయ వ్యాధికి గురైన వారిలో అత్యధికులు కడుపు నొప్పి, కడుపులో నీరు చేరి ఉబ్బిపోవడం (అసైటిస్‌) వంటి లక్షణాలతో చికిత్స కోసం వైద్యుల వద్దకు వస్తుంటారు. కొందరిలో అసైటిస్‌ లేకుండా కడుపు నొప్పి మాత్రమే ఉండవచ్చు.
ఉదరకోశానికి క్షయ వ్యాధి సోకినప్పుడు హిస్టొపాథొలాజికల్‌ పరీక్షల ద్వారా వ్యాధి నిర్ధారించవచ్చు. అంతేకాకుండా, కేన్సర్‌ వంటి ఇతర వ్యాధులు సోకిన విషయాన్ని కూడా పరీక్షించవచ్చు.

చికిత్స :
టి.బి. జబ్బులో వాడే మందులే వాడలి . ఒక కోర్సు పూర్తి కాలము వాడాలి .
శరీరంలో క్షయ వ్యాధి ఏ భాగంలో ఉన్నప్పటికీ చికిత్సా విధానం మాత్రం ఒకటే. రిఫాంపిసిన్‌, ఐసోనెక్స్‌, ఇతాంబ్యుటాల్‌ వంటి మందులతో వ్యాధిని పూర్తిగా నయం చేయ వచ్చు. ఈ వ్యాధికి కనీసం 6 నెలలు క్రమం తప్పకుండా వైద్య సలహాపై మందులు వాడాలి. మందులు వాడటం మొదలుపెట్టిన నెల రోజుల్లో రోగికి చాలా వరకూ ఉపశమనం వస్తుంది. కానీ ఆరు నుంచి తొమ్మిది నెలల పాటు తప్పనిసరిగా మందులు వాడాలి. కొంత మంది ఉపశమనం లభించిందని మందులు వాడటం మానేస్తుంటారు. ఇటువంటి వారికి వ్యాధి తిరిగి ఆరంభమవుతుంది.

వ్యక్తిగత శుభ్రత, పరిసరాల శుభ్రతతోపాటు ఇళ్లలో గాలి, వెలుతురు మొదలైనవి బాగా ఉండేలా చూసుకోవాలి. దగ్గినప్పుడు, తుమ్మిన ప్పుడు చేతి రుమాలు అడ్డంగా పెట్టుకోవాలి. ఎక్కడపడితే అక్కడ కళ్లె ఉమ్మేయకూడదు.ఉమ్మి వేయడానికి మూత ఉన్న కప్పు ఉప యోగించాలి. మంచి పోషకాహారం తీసుకుని వ్యాధి నిరోధక శక్తిని పెంపొందింప జేసుకోవాలి.

  • ============================================
thumbnail

Stomach pain-Abdominal pain-కడుపు నొప్పి

కడుపు నొప్పి ,Abdominal pain,stomach pain


-- ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జాబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -కడుపు నొప్పి (Abdominal pain/stomach pain)- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


ఉదరకోశంలో ఏ అవయవానికి సమస్య ఎదు రైనా అది కడుపు నొప్పిగా ప్రదర్శితమవు తుంది. ఛాతీ ఎముకలు, డయాఫ్రం కిందు గానూ, కటివలయానికి పైభాగంలోనూ ఉదర కోశం అమరి ఉంటుంది. ఉదరకోశంలో జీర్ణకోశం, చిన్న ప్రేవులు, పెద్ద పేగు, కాలేయం, గాల్‌బ్లాడర్‌, పాంక్రియాస్‌ తదితర అవయవాలు ఉంటాయి. ఈ అవయవా లనుంచి ఉత్పన్నమయ్యే నొప్పినే మనం కడుపు నొప్పి అని వ్యవహరిస్తుంటాము. కొన్నిసార్లు ఉదరకోశంలోని అవయవాల నుంచి కాకుండా, ఉదరకోశానికి సమీపంలో ఉండే ఇతర అయవాలనుంచి వెలువడే నొప్పి కూడా కడుపు నొప్పిగా ప్రదర్శితమవుతుంది.

ఉదాహరణకు శ్వాసకోశాల కింది భాగం, మూత్రపిండాలు, గర్భాశయం, అండాశయం మొదలైన ఇతర అవయవాలనుంచి వెలువడే నొప్పి కడుపు నొప్పిగా అనిపించవచ్చు.
అలాగే ఉదరకోశంలోని అవయవాలకు సంబంధించిన నొప్పి ఉదరకోశానికి వెలుపలి నొప్పిగా కనిపించవచ్చు. ఉదాహరణకు పాంక్రియాస్‌కు సమస్య ఎదురైనప్పుడు అది నడుము నొప్పిగా భ్రమింపజేయవచ్చు.
అంటే ఈ నొప్పులు ఉత్పన్నమైన చోట కాకుండా, ఇతర ప్రదేశంలో బహిర్గతమవవచ్చు. ఈ రకమైన నొప్పులను వైద్యపరిభాషలో రిఫర్డ్‌ పెయిన్స్‌ అని అంటారు.

కారణాలు
ఇన్‌ఫ్లమేషన్‌ (ఉదాహరణలు - అపెండిసై టిస్‌, డైవర్టిక్యులైటిస్‌, కొలైటిస్‌వంటి వ్యాధులు)
ఉదరకోశం ఉబ్బటానికి కారణమయ్యే అంశాలు (ఉదాహరణకు చిన్న ప్రేవుల్లో అడ్డం కులు, పిత్తాశయంలో రాళ్లు ఏర్పడి పైత్యరస వాహిక (బైల్‌డక్ట్‌)లో అడ్డంకి ఏర్పడటం, హెపటై టిస్‌ కారణంగా కాలేయం వాపు చెందడం మొదలైనవి)
ఉదరకోశంలోని ఏదేని అవయవానికి రక్త సర ఫరా సక్రమంగా జరుగకపోవడం (ఉదాహరణకు - ఇస్కిమిక్‌ కొలైటిస్‌ వ్యాధి)
ఇవేకాక మరికొన్ని అంశాలు కూడా కడుపు నొప్పికి కారణమవుతాయి.
ఉదాహరణకు ఇరిటబుల్‌ బొవెల్‌ సిండ్రోమ్‌ (కొన్నాళ్లు మలబద్ధకం, మరికొన్నాళ్లు విరేచ నాలు కలగడం) వంటి వ్యాధిలో కడుపు నొప్పి తీవ్రంగా ఉంటుంది.

అయితే ఈ వ్యాధిలో కడుపు నొప్పి ఎందుకు వస్తుందనే విషయం ఇదమిత్థంగా తెలియదు. కాని చిన్న ప్రేవుల కండరాలు అసాధారణంగా వ్యాకోచ సంకోచాలకు గురి కావడం కాని, చిన్న ప్రేవుల్లో ఉండే సున్నితమైన నరాలు నొప్పికి సంబంధించిన సంకేతాలను విడుదల చేయడం వంటివి కారణమై ఉంటాయని భావిస్తున్నారు.
ఈ రకమైన కడుపు నొప్పులను వైద్య పరి భాషలో ఫంక్షనల్‌ పెయిన్స్‌ అని వ్యవహరి స్తారు. ఎందుకంటే వీటిలో కడుపు నొప్పికి స్పష్టమైన కారణమంటూ కనపించదు కనుక.

వ్యాధి నిర్ధారణ
కడుపు నొప్పిని నిర్ధారించడానికి ఈ కింది అంశాలు ఉపకరిస్తాయి.
- నొప్పి లక్షణాలు
- రోగిని భౌతికంగా పరీక్షించడం
- ఎక్స్‌రేలు, ఎండోస్కోపి తదితర పరీక్షలు
- శస్త్ర చికిత్సలు

నొప్పి లక్షణాలు
రోగిని ప్రశ్నించడం, భౌతికంగా పరీక్షించడం ద్వారా కడుపు నొప్పికి కారణాలేమిటో తెలుసు కుని వ్యాధిని నిర్ధారించడానికి అవకాశం ఉంటుంది. దీనికి ఈ కింది అంశాలు దోహద పడతాయి.
నొప్పి ఎలా ప్రారంభమైంది? : నొప్పి ఎలా ప్రారంభమైందనే అంశం అతి ముఖ్యమైనది. ఉదాహరణకు కడుపు నొప్పి హఠాత్తుగా ప్రారం భమైతే పెద్ద పేగుకు రక్త సరఫరాకు అంత రాయం కలిగినట్లు కాని, పిత్తనాళంలో రాళ్ల వల్ల అడ్డంకి ఏర్పడటం కాని కారణమై ఉండవచ్చు నని ఊహించవచ్చు.

నొప్పి ఏ భాగంలో ఉంది? : అపెండిసైటిస్‌ కారణంగా కలిగే కడుపు నొప్పి ఉదరకోశంలో కుడి కింది భాగంలో, అపెండిక్స్‌ ఉన్న ప్రాంతంలో ఏర్పడుతుంది.
సాధారణంగా అపెండిసైటిస్‌ నొప్పి బొడ్డు ప్రాంతంలో ఆరంభమై నెమ్మదిగా అపెండిక్స్‌ ఉన్న ఉరదకోశంలోని కుడివైపు కింది భాగానికి చేరుతుంది.

డైవర్టిక్యులైటిస్‌ కారణంగా ఏర్పడే కడుపు నొప్పి ఉదరకోశంలో ఎడమవైపు కింది భాగంలో ఉంటుంది.
పిత్తాశయంలో సమస్య వల్ల కలిగే కడుపు నొప్పి ఉదరకోశం కుడివైపు పైభాగంలో పిత్తాశయం ఉన్న ప్రాంతంలో ఏర్పడుతుంది.
నొప్పి ఏ తీరుగా ఉంది? : నొప్పి ఏ తీరుగా ఉందనే అంశం మరికొన్ని సమస్యలను తెలుసుకోవడానికి ఉపకరిస్తుంది. ఉదాహరణకు చిన్న ప్రేవుల్లో అడ్డంకి ఏర్పడటం వల్ల కలిగే కడుపు నొప్పి తెరలు తెరలుగా ప్రారంభమవు తుంది. బిగబట్టినట్లుండే నొప్పి చిన్నప్రేవులు తీవ్రంగా సంకోచిం చినట్లు సూచిస్తుంది.

పైత్యరస వాహికలో రాళ్ల వల్ల అడ్డంకి ఏర్ప డిన కారణంగా కలిగే నొప్పి ఉదరకోశం ఊర్ధ్వ భాగంలో నిరంతరం కొనసాగే నొప్పిగా ఉంటుంది. ఈ నొప్పి కనీసం 30 నిముషాల నుంచి కొన్ని గంటలపాటు కొనసాగు తుంది.
అక్యూట్‌ పాంక్రియాటైటిస్‌ కారణంగా కలిగే నొప్పి చాలా తీవ్రంగా, భరించలేని స్థాయిలో ఉదరకోశం ఊర్ధ్వ భాగంలోనూ, నడుము పైభాగంలోనూ వస్తుంది.

నొప్పి కొనసాగే కాలం : ఇరిటబుల్‌ బొవెల్‌ సిండ్రోమ్‌ కారణంగా కలిగే కడుపు నొప్పి తీవ్రస్థాయికి చేరి, నెమ్మదిగా ఉపశమిస్తుంది. ఇది కొన్ని నెలలనుంచి సంవత్సరాల వరకూ కొనసాగవచ్చు.
గాల్‌బ్లాడర్‌లో రాళ్లు ఏర్పడటం వల్ల కలిగే నొప్పి కొన్ని గంటలపాటు ఉంటుంది.
కడుపులో అల్సర్లు, జీర్ణకోశంనుంచి ఆమ్లాలు పైకి ఆహారనాళంలోకి ఎగదన్నడం వంటి సమస్యల కారణంగా ఉత్పన్నమయ్యే నొప్పి కొన్ని వారాలు లేదా నెలలపాటు తీవ్రంగా ఉంటుంది. తరువాత కొన్ని వారాలు, నెలలు తక్కువగా ఉంటుంది.

నొప్పి తీవ్రం కావడానికి కారణాలు : అవ యవం కందినట్లు అయి, వేడి, మంట, నొప్పి మొదలైన వాటితో కలిసి వాపు చెందడాన్ని ఇన్‌ఫ్లమేషన్‌ అంటారు. ఇన్‌ఫ్లమేషన్‌ కారణంగా కలిగేనొప్పి తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు, కదలి నప్పుడు తీవ్రమవుతుంది. అపెండిసైటిస్‌, డైవ ర్టిక్యులైటిస్‌, కొలి సిస్టయిటిస్‌, పాంక్రియాటైటిస్‌ వంటి వ్యాధులను దీనికి ఉదాహరణగా చెప్పు కోవచ్చు.

నొప్పిని ఉపశమింపజేసే అంశాలు : ఇరి టబుల్‌ బొవెల్‌ సిండ్రోమ్‌ కారణంగా కాని, మలబద్ధకం వల్ల కాని కలిగే నొప్పి మల విసర్జన అలవాట్లలో మార్పులు చేసుకోవడం వల్ల ఉపశమిస్తుంది.జీర్ణాశయంలో లేదా చిన్న ప్రేవుల్లో ఏదేని అడ్డంకి కారణంగా కలిగే నొప్పి వాంతి జరిగిన తరువాత కడుపు ఉబ్బరం తగ్గిపోవడంతో తాత్కాలికంగా ఉపశమిస్తుంది.

జీర్ణాశయంలో కాని, డుయోడినమ్‌ (జీర్ణాశ యాన్ని, చిన్న ప్రేవులను కలిగే భాగం)లో కాని ఏర్పడిన అల్సర్ల కారణంగా కలిగే నొప్పి ఆహా రాన్ని తీసుకోవడం వల్ల లేదా యాంటాసిడ్‌ మందులను తీసుకోవడం వల్ల ఉపశమిస్తుంది.

Treatment:

Tab. Meftal spas 1 tab 3 times /day for 2-3 days.
Tab. Gelusil mps 1 tab 3 times /day for 2-3 days.

ఇంకా నొప్పి తగ్గక పోతే డాక్టర్ ని సంప్రదించాలి .

  • ========================================
thumbnail

Abdominal fat

పొట్ట లో కొవ్వు పెరుగుదల-అనర్దాలు ,Abdominal(Belly)fat-disadvantages

  •  

[Obesity+belly.jpg]

బొజ్జ : వయసు మీద పడుతున్న కొద్దీ పొట్ట కూడా పెరగటం సహజమే. పురుషులు పెద్దగా పట్టించుకోకపోవచ్చు గానీ ఇది ఎంతోమంది స్త్రీలకు పెద్ద సమస్యగానే పరిణమిస్తుంది. శరీరాకృతినే మార్చేసి మరింత వయసు ముదిరినట్టు చేస్తుంది మరి. ఇది అందానికే కాదు ఆరోగ్యానికీ చేటు కలిగిస్తుంది. శరీరంలో మిగతా భాగాల్లోని కొవ్వు కన్నా పొట్ట మీద పేరుకునే కొవ్వు చాలా ప్రమాదకరమైంది తెలుసా? ఇది గుండె జబ్బులు, మధుమేహం, కొన్ని రకాల క్యాన్సర్లు రావటానికీ దోహదం చేస్తుంది. అలాగని బాధ పడుతూ కూచోకుండా జీవనశైలిలో మార్పులు చేసుకోవటంతో పాటు కొన్ని రకాల వ్యాయామాలు చేయటంతో దీనిని తగ్గించుకునే ప్రయత్నం చేయటం చాలా అవసరం.

సైనికులు , పోలీసులు ప్రతి రోజూ కవాతు చేస్తారు . సైనికుల్లో ఎవరికైనా పొట్ట ,బొజ్జ రావడము చూడము కాని కొంతమంది లేకా పోలీసులందరికీ బొజ్జ కనబడుతూ ఉంటుంది. కారణము వారి శిక్షణ , ఆహార నియమావళి , క్రమబద్ధమైన వ్యాయామము .

ఎందుకొస్తుంది?


వయసు పెరుగుతున్న కొద్దీ జీవక్రియలు మందగిస్తుంటాయి. దీంతో శరీరంలో కొవ్వు మోతాదూ నెమ్మదిగా పెరుగుతూ వస్తుంది. పురుషుల్లో కన్నా స్త్రీలల్లోనే ఇది ఎక్కువ. మెనోపాజ్‌ అనంతరం చేతులు, కాళ్లు, తొడల వద్ద కొవ్వు తగ్గిపోతూ పొట్ట దగ్గర పేరుకుపోవటం ప్రారంభిస్తుంది. కడుపుని పట్టుకున్నప్పుడు చర్మం కింద చేతికి తగిలే కొవ్వు కన్నా.. లోపల అవయవాల చుట్టూ పేరుకునే కొవ్వు ఇంకా ప్రమాదకరం. ఇది వంశ పారంపర్యంగానూ రావొచ్చు. ముట్లుడిగిన తర్వాత కలిగే హార్మోన్ల మార్పు కూడా దీనికి దోహదం చేస్తుంది. బరువు పెరగకుండా బొజ్జ పెరుగుతున్నా ప్రమాదకరమే.

కొలుచుకుంటే సరి

ఎత్తు బరువుల నిష్పత్తిని (బీఎంఐ) బట్టి అధిక బరువును గుర్తించొచ్చు గానీ దీంతో శరీరంలో కొవ్వు శాతాన్ని తెలుసుకోలేం. నడుం చుట్టుకొలత ద్వారా పొట్ట భాగంలో కొవ్వు ప్రమాదకర స్థాయికి చేరుకున్న విషయాన్ని పసిగట్టొచ్చు. దీన్ని ఎలా చూడాలో తెలుసా?

* ముందు బొడ్డు భాగంలో కడుపు చుట్టూ టేపుని చుట్టండి.
* శ్వాస మామూలుగా తీసుకోండి. కడుపుని లోపలికి పీల్చొద్దు.
* చర్మం నొక్కుకుపోయేలా టేపుని మరీ బిగుతుగా కూడా బిగించరాదు.
* నడుం చుట్టు కొలత 35 అంగుళాలుంటే అదుపులోనే ఉన్నట్టు.
* 35 అంగుళాలకు మించితే అనారోగ్యకర కొవ్వు పేరుకుందనే అర్థం.

తగ్గించుకునేదెలా?

కొన్ని రకాల వ్యాయామాలు, ఆహారంలో మార్పులతో పొట్టను తగ్గించుకోవచ్చు.

* వ్యాయామం: బొజ్జను తగ్గించుకోవటానికి రోజూ వ్యాయామం చేయటం అన్నింటికన్నా ఉత్తమమైన మార్గం. దీంతో బరువుతో పాటే పొట్ట కూడా తగ్గుతూ వస్తుంది. బరువులు ఎత్తే వ్యాయామాలూ పొట్ట తగ్గటానికి ఉపయోగపడతాయని కొన్ని అధ్యయనాల్లో తేలింది. అయితే ఎంతసేపు, ఏయే రకాల వ్యాయామాలు చేయాలన్నది వారి శారీరక శ్రమ, పనులను బట్టి ఆధారపడి ఉంటుంది. ఎవరికేది అవసరమో వైద్యుల సలహా మేరకు నిర్ణయించుకోవాలి.

* ఆహారం: ఆహార పదార్థాలు కొనేటప్పుడు సంతృప్త కొవ్వులకు బదులు పాలీ అసంతృప్త కొవ్వులు ఉండేవి ఎంచుకోవాలి. మామూలు పిండి పదార్థాలు గల పాలిష్‌ పట్టిన బియ్యం, గోధుమలు, బ్రెడ్‌, శుద్ధిచేసిన పాస్తాలకు బదులు సంక్లిష్ట పిండి పదార్థాలు ఉండే పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. తక్కువ తినటంతో పాటు కేలరీలనూ తక్కువగా తీసుకుంటే బరువు తగ్గుతారు.
పొట్తను (కొవ్వును) తగ్గించే కొన్ని ఆహారపదార్ధాలు :
  • గుడ్డులోని తెల్లసొన ,
  • అన్ని రకాల పండ్లు ,
  • పచ్చిగా తినగలిగే కాయకూరలు ,
  • ఆవిరిమీద ఉడికే కాయకూరలు ,
  • యాపిల్ పండ్లు ,
  • కాల్సియం ఎక్కువగా ఉండే పాలు , పెరుగు , మజ్జిక , రాగులు ,


* పొట్ట కండరాలను దృఢ పర్చటం: మామూలు వ్యాయామం, ఆహార నియమాలతో బొజ్జ తగ్గకపోతుంటే.. పొట్ట కండరాలను దృఢం చేసే వ్యాయామ పద్ధతులు అనుసరించాలి. ముఖ్యంగా పొత్తి కడుపు, కడుపులోపలి కండరాలను పటిష్ఠం చేయటంపై దృష్టి సారించాలి.

* హర్మోన్‌ చికిత్స: అరుదుగా కొందరికి మెనోపాజ్‌ అనంతరం హార్మోన్‌ రిప్లేస్‌మెంట్‌ చికిత్స (హెచ్‌ఆర్‌టీ) తీసుకోవటం కూడా ఉపయోగపడుతుంది.

అనర్థాలు--బొజ్జ మూలంగా రకరకాల జబ్బులు దాడి చేసే ప్రమాదముంది. అవి--
  •  గుండె జబ్బులు
  •  రొమ్ము క్యాన్సర్‌
  •  మధుమేహం
  •  జీవక్రియల అస్తవ్యస్తం
  •  పిత్తాశయ సమస్యలు
  •  అధిక రక్తపోటు
  •  పెద్దపేగు క్యాన్సర్‌

పొట్ట వద్ద పేరుకునే కొన్ని కొవ్వు కణాలు ఇన్స్‌లిన్‌ నిరోధకతను ప్రేరేపించే హార్మోన్లనూ ఉత్పత్తి చేస్తాయని పరిశోధనల్లో తేలింది. ఇది మున్ముందు మధుమేహానికి దారి తీయొచ్చు. మరికొన్ని కణాలు మెనోపాజ్‌ తర్వాత ఈస్ట్రోజెన్‌ను ఉత్పత్తి చేస్తాయి. దీంతో రొమ్ము క్యాన్సర్‌ ముప్పు పొంచి ఉంటుంది.

బొజ్జ తగ్గించుకునే కొన్ని చిట్కాలు : 

అల్పా హారము తప్పనిసరి :  ప్రతి రోజూ ఉదయము అల్పాహారము తీసుకోవడము తప్పనిసరి . ఉదయము ఎమీ తినకపోవడమంటే ఎవరికి వారు శిక్ష విధించుకోవడమే. ఉదయము నిండి సాయంత్రమువరకూ చేసే పనులన్నింటికీ తగిన శక్తినిచ్చేది . . . ఆ అల్పాహారమే . అల్పాహారమువలన శరీరము బరువు , ఆకృతి అదుపులో ఉంటాయి .

ఉప్పు తగ్గించాలి : ఎవరైతే  తక్కువ ఉప్పు తింటారొ వారు లవెక్కరు . ఉప్పుకు శరీరములో నీటిని , కొవ్వును నిలవా చేసే గుణము ఉన్నది . ఫలితము వా బరువు పెరుగుతారు .చలాకీతనము తగ్గుతుంది. అందుకే రోజుకు 6 గ్రాములకు మించి ఉప్పు వాడకుండా ఉంటే పొట్ట తగ్గుతుంది.

మూడు పూట్లా తినండి : బరువు తగ్గాలి అనగానే ఆహారము తీసుకోవడము మానేస్తారు. ఇటు వంటి డైటింగ్ ప్రమాదకరము . లావు తగ్గాలన్నా , పొట్ట కరగాలన్నా మూడు పూటలా ఆహారము తీసుకోవాలి . ఆ తినే ఆహారము విషయము లో జాగ్రత్తపడాలి . శరీరానికి అవసరమైన పోషక పదార్ధాలు సమపాళ్ళలో లభించేలా ఆహారము తీసుకోవాలి. పరిమితమైన ఆహారము తీసుకోవాలి.

నడక అవసరము : నదక సహజ వ్యాయామము . ఇతర వ్యాయామాలు చేసేవారు కూడా నడాల్సిందే . 1.5 కిలోమీటర్లు పావుగంట కాలము లో వేగము గా నడిచేవిధముగా సాధనచేయాలి . రోజుకు సుమారు 3 కి.మీ నడిస్తే మంచిది.

ఎత్తుపల్లాల్లో పరుగు : కాళ్ళకు బలాన్నిస్తుంది పరుగు . కొవ్వును బాగా కరిగిస్తుంది. ఎత్తు పల్లాలో కొండలమీదికి నడక , పరుగు , ఎక్కి దిగ గలిగితే పాదము నేలమీద తాకే సమయము బాగా తగ్గుతుంది. ఫ్యాట్ కరిగేందుకు దోహదపడుతుంది . గుండెజబ్బులున్నవారు కొండలెక్కడము మంచిది కాదు .

వేపుళ్ళు వద్దు : రుచికి బాగుంటాయని ఎక్కువమంది వేపుడు కూరలు తింటారు .. కాని ఆరోగ్యరీత్యా వేపుడు కూరలు మంచివి కావు . ఉడికించిన కూరలు తింటేనే శరీరరూపము మెరుగ్గా ఉంటుంది. కాబట్టి కూర లన్నింటినీ సగం మేర ఉడికించి తర్వాత కొంద్దిగా వేయించి తినడం ద్వారా రుచి, ఆరోగ్యము రెండూ లభిస్తాయి.

సాయంకాల సమయ ఆహారము : సాయంకాలము లో ఏదో ఒకటి తినాలి . ఆకలి తో ఉండకూడదు . ఎండిన పళ్ళు, కొవ్వులేని ఆహారపదార్ధములు, తాజా పండ్లు తినాలి. నూనెలో ముంచి తేలిన చిప్స్ , నూడిల్స్ , కురుకురేల వంటివి అస్సలు తినకూడదు .

నీరు బాగా త్రాగాలి : నీరు మన దాహానికి తగ్గట్టుగా తాగుతూ ఉండాలి . నీరు తాగడము వలన ఆహారము తీసుకోవడము తగ్గుతుంది. జీవ పక్రియ మెరుగవుతుంది. నీరు శరీరానికి అవసము . తగినంత ఉంటే ఆలోచనలు స్పస్టముగా ఉంటాయి. నిర్ణయాలు తీసుకోవడము లో అటు ఇటు అవ్వదు .

శ్వాసతీరు  మార్చుకోవడము : సైనికులకు శ్వాస వ్యాయామము ప్రత్యేకము గా చేయిస్తారు. శ్వాసక్రియను చాతీకి పరిమితం చేయక  కిందనున్న పొట్టను పైకిలాగుతూ శ్వాసను పీల్చి వదలడము చెయ్యాలి. ఇది పరుగెడుతున్నప్పుడు చేయాలి . ఉదరబాగముతో కలిపిన శ్వాసక్రియవల్ల శరీర రూపములో మార్పువస్తుంది . పొట్ట లోపలికి పోతుంది.

బరువుతో పరుగు : పరుగు చ్క్కని వ్యాయామము . అయితే పొట్ట బాగ తగ్గాలంటే వీపుకు ఏధనా బరువును కట్టుకొని పరుగెట్టడము మంచిది. సైనికులు తమ అవసరాలకు సంబంధించిన సామానులతో కూడిన సంచి వీపుకు తగిలించుకొని పరిగెడు తుంటారు దీనివలన కొవ్వు కరిగిపోతుంది. కొత్తగాకొవ్వు చేరనివ్వదు .

పరుగు తీరు : మేము ప్రతిరోజూ పరిగెడుతున్నాము . . . కాని శరీరములో మార్పు కనిపించడము లేదంటారు. పరిగెత్తేటపుడు త్లల ఎత్తి ఉంచాలి . ముందుకు చూస్తూఉండాలి . వీపును వెనక్కి నెట్టినట్లుగా , మోచేతులు శరీరానికి పక్కగా ఉంచి పరుగెత్తాలి .దీనివల్న పరుగు వేగము అందుకుంటుంది ... కొవ్వు కరిగే అవకాశాలు ఎచ్చువ అవుతాయి.

తగినంత నిద్ర : నిద్ర వలన రెండురకాల లాభాలున్నాయి. ఒకటి కండరాలు అలసటనుండి తేరుకుంటాయి. నిద్రలో ఎక్కువ కాలరీలు కరుగుతాయి. నిద్ర తగినంత పోకపోతే బలహీన పడతారు. కొవ్వు అదనము పేరుకుపోయి ఇబ్బంది కలిగిస్తుంది.

వ్యాయామములో మార్పు : ఒకే తరహా కసరత్తు నెలల తరబటి చేయకుండా రకరకాల పద్దతులలో వ్యాయామము మార్చి చేస్తూ ఉండాలి .దీనివలన కొత్త ఉత్సాయము , కొత్త లాబాలు శరీరానికి చేర్చిన వారవుతారు.

రిలాక్ష్ అవ్వాలి : నిరంతము టెన్సన్‌ మంచిది కాదు . ఒత్తిడిలో ఉన్నవారు ఆహారము అధికము గా తీసుకుంటారు. వారి హార్మోనులు సమతుల్యము తప్పుతాయి. సరియైన సమయానికి అవసరమైన పని చేస్తూ మిగతా సమయాల్లో విశ్రాంతి తీసుకోవాలి. గాబరా గాబర గా ఏదో ఒకటి తింటూ ఎల్లప్పుడు పని ఒత్తిడిలో ఉండకూడదు . వీరు ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్స్ నే తీసుకోవడము జరుగుతూ ఉంటుంది. . . ఇవి కొవ్వును అధికం చేస్తాయి.

  • ==================================