Friday, February 12, 2016

thumbnail

Soundarya Chitkalu - సౌందర్య చిట్కాలు

సౌందర్య చిట్కాలు :

1.

ముఖంపై మచ్చలు ఇబ్బంది పెడుతున్నాయా ?

కొందరు స్త్రీలకు ముఖంపై చారికల్లాంటి మచ్చలు ఇబ్బంది పెడతాయి.వీటిని నివారించడానికి ఈ క్రింది చిట్కాలు పాటిస్తే సరిపోతుంది.
»
ముఖాన్ని ఎప్పటికప్పుడు శుభ్రంగా కడుక్కోవాలి.
»
ఎక్కువగా నిళ్ళు తిసుకోవడం వల్ల ముఖం తాజాగా తయారయ్యి మచ్చలు పొతాయి.
»
కొంచెం ఉల్లి రసంలో చెంచా తేనె కలిపి ముఖానికి రాసుకుంటే ముఖంపై మచ్చలు నివారించవచ్చు.
»
మచ్చలపై నిమ్మతొక్కలతో మసాజ్ చేసుకోవాలి.
Face marks removal tips in Telugu ,ముఖంపై మచ్చలు ఇబ్బంది పెడుతున్నాయా ?,face marks removal,face marks home remedies,face marks removal natural,face marks treatment,face marks after pregnancy
»
వారానికి రెండు సార్లు బాదం పప్పును నీటిలో నానబెట్టి నానిన తరువాత దంచి ఒక చెంచా నిమ్మరసంలో కలిపి మెత్తగా పేస్ట్ లా చేసుకుని ముఖానికి పట్టిస్తే గుణం కనబడుతుంది.
»
కొంచెం ఉల్లి రసంలొ దూదిని ముంచి నల్ల మచ్చలు ఉన్నచోట రాసుకుంటే ఫలితం ఉంటుంది.
»
అరకప్పు టమోటో రసంలో అరకప్పు మజ్జిగను మిక్స్ చేసి మచ్చలు మీద రాస్తే మచ్చలు పోతాయి.

౨.

పెదవులు పగులుతున్నాయా ?

అందమైన పెదవులు మగువకు ఎంతో అందాన్ని చేకూరుస్తాయి.అయితే శీతాకాలంలో ఎక్కువగా పెదవులు పగిలి చాలా ఇబ్బంది పెడుతుంటాయి.మరి ఇలా పెదాలు పగలకుండా ఉండటానికి ఈ చిట్కాలు పాటిస్తే మీ పెదవులు గులాబీరేకుల్లా సుతారంగా ఉంటాయి.
»
పెదవులు ఎక్కువగా పగులుతుంటే వాటికి పాల మీగడ రాయాలి.
»
గులాబీ రేకులను పాలలో కలిపి పెదవులపై రాసి కొంచెం సేపాగిన తర్వాత కడుక్కుంటే మృదువుగా తయారవుతాయి.
»
పెదాలపై వున్న నలుపు పోగొట్టాలంటే తేనే,గ్లిజరిన్,నిమ్మరసం కలిపి రాసుకోవాలి.
»
మీగడలో సెనగ పిండి,నిమ్మరసం కలిపి పెదాలకు రాసుకుంటే మృదువుగా తయారవుతాయి.


౩. 

మొటిమలు మిమ్మల్ని బాదిస్తున్నాయా ?

యుక్త వయసు వచ్చిన తర్వాత ఎక్కువ మంది ఆడవారిని మొటిమలు వేధిస్తుంటాయి.వీటివల్ల ముఖం అందవికారంగా తయారయ్యి నలుగురితో కలవాలంటే సంకొచించే పరిస్ధితి ఏర్పడుతుంది.అయితే అలాంటి వారు ఈ చిట్కాలు పాటిస్తే మొటిమలు మిమ్మల్ని దరిచేరవు.
»
మొటిమలు ఎక్కువగా ఆయిల్ పుడ్ తినేవారిలో వస్తాయి.కాబట్టీ అయిల్ పుడ్ ను వీలైనంత వరకూ తగ్గించుకునేలా చూడాలి.
»
మొటిమలు ఎక్కువగా ముఖం మీద ఉండే బ్యాక్టీరియా వల్ల వస్తుంటాయి.కాబట్టి ముఖాన్ని ఎప్పటికపుడు సబ్బుతో శుభ్రంగా కడుక్కుని పొడి టవల్ తో శుభ్రంగా తుడుచుకోవాలి.
»
మొటిమలు ఉన్నవారు వాటిని సూది,పిన్నిసు వంటి వాటితో పొడుస్తుంటారు.ఇలా చెయ్యడం వల్ల దీనిలో ఉండే బ్యాక్టీరియా ముఖంలోని ఇతర ప్రాంతాలకు విస్తరించే ప్రమాదం ఉంది.
»
మొటిమలు వాచి నొప్పి పెడుతుంటే ఐస్ క్యూబ్ను వాటిపై మెల్లగా రుద్దుతుంటే కొంచేం ఉపశమనం లభిస్తుంది.
beauty tips for pimples,pimples on face removal tips,మొటిమలు మిమ్మల్ని బాదిస్తున్నాయా ?,pimples remove tips in telugu,pimples cure tips,motimalu thaggalante emi cheyali,motimalu,beauty tips in telugu
»
కొంచెం నిటీలో దాల్చిన చెక్క పొడి వేసి మెత్తగా పెస్ట్ లా చేసుకుని మొటిమలకు పట్టిస్తే ఫలితం కనబడుతుంది.
»
మొటిమలు ఎక్కువగా ఉన్నవారు మాంసాహరం తగ్గించాలి.
»
నీటిని ఎక్కువగా తాగడం వల్ల కూడా మొటీమలు రాకుండా చూసుకోవచ్చు.
»
మొటిమలు ఉన్నయి కదా అని ఏక్రిం బడితే ఆక్రిం రాసేయకూడదు.దీనివల్ల మీ ముఖం ఇన్ పెక్షన్ బారిన పడే ప్రమాదం ఉంది.
»
టమోటాపండు రసం తీసీ మొటిమలు మీద రాసుకుంటే ఫలితం కనిపిస్తుంది.
»
కొంచెం నిమ్మరసంలో వేపాకు పొడి వేసి బాగా కలుపుకుని మొటిమల మీద రాస్తే మొటిమల నుండి విముక్తి పొందవచ్చు.
»
మొటిమలు ఉన్న చోట తెల్ల ఉల్లిపాయ రసం తీసి దానిలో కొంచెం తెనె,చిటికెడు ఉప్పు కలిపి పేస్ట్ చేసుకుని అప్లైచేస్తే మొటిమలు తగ్గుతాయి.
»
మొటిమలు మీద వెల్లుల్లి రసం రాయడం వల్ల వీటిని నివారించవచ్చు.



౪.

మీ గోళ్ళను అందంగా ఉంచుకోవాలనుకుంటున్నారా ?

మగువల సౌందర్య పోషణలో చేతి గోళ్ళు ప్రముఖ పాత్ర పోషిస్తాయి.చాలా మంది వీటిని అల్లారు ముద్దుగా కాపాడుకుంటూ ఉంటారు.అలాంటి వారి కోసం మేమందిస్తున్న కొన్ని టిప్స్ ఇవిగో..
»
నెయిల్స్ ని కత్తిరించేటప్పుడు చాలా జాగ్రత్త అవసరం పదునైన సాధనాలతో కత్తిరించు కోవడం వల్ల ఒకోసారి గోటి చిగుళ్ళు దెబ్బతిని పెరుగుదల ఆగిపోయె ప్రమాదం ఉంది.
»
గోళ్ళు కత్తిరించుకునే ముందు చేతిని కొంచెం నులివెచ్చటి నిటిలో నానబెట్టి ఆ తర్వాత కట్ చేసుకుంటే త్వరగా కట్ అవుతాయి.
Nails care tips in telugu,మీ గోళ్ళను అందంగా ఉంచుకోవాలనుకుంటున్నారా ?,nails care tips home,nails care tips,natural nails care tips,beauty tips nails care,beauty tips in telugu
»
నెయిల్ పాలిష్ అదే పనిగా ఎక్కువసార్లు వాడటం వల్ల విటిలో ఉండే కెమికల్ మీ గోళ్ళను పాడు చేసే ప్రమాదం ఉంది.
»
గోళ్ళు పాడవకుండా ఉండటానికి అసహజసిద్దమైన పాలిష్ల కన్నా ప్రకృతిలో దొరికే గోరింతాకు రుబ్బి పెట్టుకోవడం చాలా ఉత్తమం.ఎందుకంటె దినిలో ఉండే అనేక ఔషదగుణాలు మీ గోళ్ళను పాడవకుండా కాపాడుతాయి.
»
రోజు పడుకునేముందు గోళ్ళచుట్టూ ఏదైనా క్రీంస్ రాసుకుంటే గోళ్ళ చుట్టూ ఉండీఅ చర్మం మెత్తగా తయారవుతుంది.



5 .

చుండ్రు తగ్గడానికి తీసుకోవలసిన జాగ్రత్తలు

కొంతమంది మహిళలను చుండ్రు సమస్య వీపరీతంగా వేధిస్తూ ఉంటుంది.ఈ చుండ్రు వల్ల అనేక మంది సమస్యలను ఎదుర్కుంటూ ఉంటారు.మరి ఈ చిట్కాలను పాటిస్తే చుండ్రు మీ దరిదాపులకు కూడా రాదు.అవేంటో చూద్దామా మరి.
»
వారంలో కనీసం రెండు సార్లయినా తలమ్మటా కుంకుడుకాయతో గానీ స్నానం చయ్యాలి.
»
కొబ్బరి నూనెలో కొంచెం నిమ్మరసం కలిపి కుదుళ్ళకు బాగా పట్టేలా పట్టించి గంట తర్వాత తల స్నానం చెయ్యాలి.
»
గసగసలాను మెత్తగా పెష్ట్ లా చేసుకుని తలకు పట్టించి ఒక గంట తర్వాత స్నానం చేస్తే ఫలితం ఉంటుంది.
dandruff solutions in telugu,చుండ్రు తగ్గడానికి తీసుకోవలసిన జాగ్రత్తలు,dandruff home remedy,dandruff home remedy,chundru,dandruff tips,dandruff solutions for hair,dandruff control tips in telugu
»
ఒక కప్పు వేడి నీటిలో నిమ్మకాయ రసంపిండి తలకు పట్టించి తలస్నానం చేయ్యాలి.
»
కొబ్బరి నూనెలో కర్పూరం కలుపుకుని కురులకు పట్టించి అరగంట ఆగిన తర్వాత స్నానం చేస్తే ఫలితం ఉంటుంది.
»
మందార ఆకులను వేడి నూనెలో కలిపి తలకు రాసుకోవాలి.
»
టీస్పూన్ కీరాజ్యూస్ లో కొంచెం నిమ్మరసం,చిటికెడు పసుపు కలిపి చర్మానికి రాసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
»
కొబ్బరి నీళ్ళలో రెండుచుక్కలు నిమ్మరసం కలిపి తాగితే చుండ్రు నుండి ఉపసమనం పొందవచ్చు.
»
పారిజాతం గింజల్ని మెత్తగా నూరి పోడిచేసి దీన్ని నూనెలో కలిపి తలకు పట్టించి స్నానం చేస్తే ఫలితం ఉంటుంది.
»
తలస్నానం చేసే ముందు కురులకు పెరుగు పట్టించి అరగంట తరువాత స్నానం చేస్తే ఫలితం ఉంటుంది.
»
జుట్టుకు హెర్బల్ ఆయిల్ మసాజ్ చేసుకోవడం వల్ల చుండ్రును నివారించవచ్చు.


6.

కలువల్లాంటీ కళ్ళు కోసం

అందమైన కళ్ళు మీ అందాన్ని నిబడీకృతం చేస్తాయి. చక్కటి కలువల్లాంటి కళ్ళు కోసం ఈ చిట్కాలు పాటించండి.
»
అరటిస్పూన్ కిరా రసంతో కొద్దిగా రొజ్ వాటర్ కలిపి ఈ మిశ్రమాన్ని కళ్ళకు రాసుకుని అరగంట సేపు ఉంచి ఆ తర్వాత కడుక్కుంటే కళ్ళు ఆకర్షణీయంగా ఉంటాయి.
»
కళ్ళు చాలా సున్నితమైనవి కాబట్టి బజారున దొరికే ఏ క్రీమ్ పడితే ఆ క్రీం రాసేయకూడదు.అలా చెయడం వల్ల మీ కళ్ళు ఇన్ పెక్షన్ బారిన పడే ప్రమాదం ఉంది.
»
తగినంతసేపు నిద్ర పోవడం వల్ల కళ్ళు తాజాగా కనబడతాయి.
»
గ్లాస్ నిటిలో ఉసిరి పొడి నానబెట్టి ఉదయాన్నే ఈ మిశ్రమంతో కళ్ళు కడుక్కుంటే తాజాగా మెరుస్తాయి.
»
కళ్ళ చుట్టూ ఉండే ముడతలు పొవాలంటే పాలమిగడతో అక్కడ మసాజ్ చేసుకుంటే ముడతలు నుండి విముక్తి పొందవచ్చు.
»
కీరదోసకాయలను చక్రాల్లా కోసి ఆ చక్రాలను కళ్ళ మీద ఉంచుకుంటే కళ్ళూ తాజాగా ఉంటాయి.
»
రోజూ పావుగంట పాటు రెండు చేతులను రేండు కాళ్ళపై ఉంచుకుని ప్రశాంతంగా కూర్చుంటే మీ కళ్ళకు రిలిఫ్ లభిస్తుంది.
»
అల్మాండ్ ఆయిల్ లొ కొంచెం ఆలివ్ అయిల్ కలిపి కంటి చుట్టూ ఉండే నలుపు ప్రాంతంపై రాస్తే ఆ నలుపును నివారించవచ్చు.
»
కళ్ళకు మేకప్ వేసుకునే బ్రష్ల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి.వీటిపై ఉండే దుమ్ము,ధూళీ వల్ల మీ కళ్ళకు ఇంఫెక్షన్ రావచ్చు.
»
ఉప్పు నీటితొ కళ్ళను కడుక్కోవడం వల్ల కళ్ళు మెరుస్తాయి.



౭.

మిలమిల మెరిసె చేతుల కోసం

     స్త్రీల సౌందర్య పోషణలో చేతులు ప్రముఖపాత్ర పోషిస్తాయి.చాలామంది వాటిని ఎంతో అపురూపంగా చూసుకుంటారు.అలాంటి వారి కొసమే మెము అందిస్తున్న ఈ చిట్కాలు.
»
ఎండలోనికి వెళ్ళినప్పుడు ఎండతాకిడికి చేతులు కమిలిపోతాయి.కాబట్టి బయటకు వేళ్ళేటపుడు చేతికి గ్లౌజులు ధరించాలి.
»
చేతికి ఎప్పటికపుడు మాయిశ్చరైజర్ క్రీములు రాస్తూ ఉండాలి.
»
నిమ్మరసంలో పంచదార కలిపి చేతులకు మర్ధనా చేసుకుంటే చేతులు నునుపుగా ఉంటాయి.
»
ఆకుకూరలు,పండ్లు ఎక్కువగా తీసుకోవడంవల్ల మీ చేతులు నిగనిగలాడతాయి.
»
గ్లిజరిన్,ఆలివ్ ఆయిల్ కలిపిన మిశ్రమాన్ని చేతులకు రాసుకుంటే చేతులు కాంతివంతంగా తయారవుతాయి.
»
టీస్పూన్ పంచదారలో టీస్పూన్ కొబ్బరి నూనె కలిపి ఈ మిశ్రమాన్ని చేతులకు మర్ధనా చేసుకోవడం వల్ల చేతులు నునుపుగా తయారవుతాయి.
»
బట్టలు ఉతుకుతున్నప్పుడు బట్టలసబ్బులో ఉండే రసాయన పదార్ధాలు మీ చేతిని హని చేసే ప్రమాదం ఉంది.కాబట్టి వుతికిన వేంటనే నిమ్మరసాన్ని చేతికి రాసుకుని కాసేపాగాక కడుక్కోవాలి.
»
అతివేడయిన,అతిచల్లనైన పదార్ధాలను డైరక్ట్ గా చేతితో తాకకూడదు.
»
ఒకస్పూన్ రోజ్ వాటర్ లో ఒకస్పూన్ గ్లిజరిన్ కలిపి చేతులకు రాసుకుని గంట తర్వాత శుభ్రంగా కడుక్కుంటే మీ చేతులు మృదువుగా తయారవుతాయి.



౮ .

చర్మం మెరుస్తూ నిగనిగలాడటానికి చిట్కాలు

ప్రతీ స్త్రీ తన చర్మం నిగనిగలాడుతూ ఉండాలని కోరుకుంటుంది.అయితే కాలుష్యం,ఎండ మొదలైన వాటి బారిన పడి చర్మం కమిలిపోవడం,తెల్లని మచ్చలు రావడం,గరుకుగా తయారవడం,వంటివి జరగవచ్చు.ఇలాంటి దుష్ప్రాబావాల నుండి మీ చర్మాన్ని రక్షించుకోవాలంటే ఈ క్రింది జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది.
ఆహర పరంగా తీసుకోవలసిన జాగ్రత్తలు -
»
బొప్పాయి,అరటి,జామ,ఆపిల్ వంటిపండ్లను ఎక్కువగా తీసుకోవాలి.
»
ఎక్కువ సార్లు మంచీనిరు తాగడం అలవాటు చేసుకోవాలి.
»
నిమ్మ,ఉసిరి లాంటి పుల్లటి పండ్లను ఎక్కువగా తీసుకోవాలి.ఎందుకంటే వీటిలో ఉండే సి విటమిన్ మీ చర్మాన్ని కాపాడుతుంది.
skin glowing tips,skin glowing tips in telugu,skin glowing tips for men,skin glowing tips homemade,skin glowing tips for women,చర్మం మెరుస్తూ నిగనిగలాడటానికి చిట్కాలు,skin glowing treatment,skin glowing diet,skin glowing fruits
»
ఒక చిన్న పాత్రలో నారింజ తొక్కలు వేసి అయిదు నిమిషాలు మరిగించి దించి ఆ తొక్కలను చర్మంపై రాసుకుంటే చర్మం నిగనిగలాడుతుంది.
»
తేనెను అప్పుడప్పుడు తీసుకోవడం వల్ల చర్మం పొడిబారకుండా తాజాగా ఉంటుంది.
»
నానబెట్టిన బాదం పొప్ప్ను ఉదయాన్నే తిసుకుంటే చర్మం పొడిబారదు.
»
టీస్పూన్ కీరాజ్యూస్ లో కొంచెం నిమ్మరసం,చిటికెడు పసుపు కలిపి చర్మానికి రాసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
»
రోజూ ఒక గుడ్డును తీసుకుంటే చర్మానికి మంచిది.
»
ఎక్కువగా పళ్ళరసాలను తాగితే చర్మానికి గ్లో వస్తుంది.
»
కలబందను కొన్ని రోజులపాటు చర్మానికి రాసుకుంటే ఫలితం కనబడుతుంది.
»
కొబ్బరి నూనెను చర్మమంతా వారానికి ఒకసారి మర్దనా చేసుకొవాలి.


9 .

కురులు ఏపుగా పెరగడానికి చిట్కాలు

వత్తైన జుట్టు మగువకు ఎంతో అత్మ వశ్వాసాన్నిస్తుంది.అయితే కొంత మంది ఆడవారికి జుట్టు చాలా పలచగా ఉంటుంది.మరి జుట్టు పలచగా ఉందని బాదపడకుండా ఈ క్రింది చిట్కాలను పాటిస్తే మీ జుట్టు కూడా ఏపుగా పెరుగుతుంది.ఇక్కసారి అవేంటో చూద్దామా..
»
జుట్టు ఎక్కువగా రాలిపోయేవారు దువ్వెనతో స్పీడ్ గా కాకుండా కాస్త నెమ్మదిగా దువ్వుకుంటే జుట్టు దువ్వెనకు చిక్కి తెగిపోకుండా కాపాడుకోవచ్చు.
»
తలలకు నూనెను పట్టించి కుదుళ్ళ వరకూ వెళ్ళాలా మర్దనా చేసుకోవాలి.దీని వల్ల వెంట్రుకలకు రక్త ప్రసరణ బాగా జరిగి వెంట్రుకలు బలంగా పెరుగుతాయి.
»
వారానికి కనీసం రెండు సార్లయినా కుంకుడు కాయతోగాని తలమ్మటా స్నానం చెయ్యాలి.
»
బయట పనుల మీద ఎక్కువ తిరిగెవారు తలకు దుమ్మూ,దూళి పట్టకుండా చున్నీగానీ,షాల్ గానీ కట్టుకోవాలి.
Hair growth tips in telugu,కురులు ఏపుగా పెరగడానికి చిట్కాలు,hair growth tips for women home remedies in telugu,hair growth tips for girls,hair growth tips for women in telugu,hair growth food,hair growth tips for men at home
»
స్నానం చేసిన వెంటనే జుట్టును ప్యాన్ గాలిలో అరబెట్టి ఆ తర్వాత దువ్వుకోవాలి.తడిజుట్టును దువ్వితే తెగిపొయె ప్రమాదం ఉంది.
»
మందారపు పువ్వుని కాగేనూనేలో వేసి చల్లారిన తర్వాత జుట్టుకు పట్టించుకోవాలి.
»
జుట్టు ఎదుగుదలకు పోషకపదార్ధాలు,ప్రోటిన్స్ అవసరం కాబట్టి బలమైన పోషక పదార్ధాలైన పాలు,పళ్ళరసాలును ఎక్కువగా ఎక్కువగా తీసుకోవాలి.
»
దువ్వుకునే దువ్వెనల్లో దుమ్ము,మట్టి వంటివి చెరకుండా ఎప్పటికప్పుడు శుభ్రపరుచుకుని ఆ తరువాత దువ్వుకోవాలి.
»
తలంటుకునే ముందు వెంట్రుకలకు కలబంద రసం పూసి అరగంట తర్వాత తలస్నానం చేస్తే జుట్టు నిగనిగ మెరుస్తుంది.
»
అవసరమైన ఆందోళనలకు గురవడం వల్లకూడా జుట్టు రాలిపోయే ప్రమాదం ఉంది.కాబట్టి మనసును ఎప్పుడూ ప్రశాంతంగా ఉంచుకోండి.


మూలం : ఆంధ్ర బులెటిన్ .కం ,...

thumbnail

Vantinti Chitkalu - వంటింటి చిట్కాలు

వంటింటి చిట్కాలు :

వంటింటి చిట్కాలు

»
కొబ్బరిముక్కను పెరుగులో వేస్తే తొందరగా పెరుగు పాడవదు.
»
పప్పు తొందరగా ఉడకాలంటే ఉడికేటపుడు డాల్డా గాని నూనె వేయాలి.
»
నిమ్మకాయ తొక్కలను పిండిన తర్వాత వాటిని కుక్కర్ కింద వేయడం వల్ల వాసనరాదు.
»
పచ్చిమిరపకాయలు ముచ్చికలను తీసి ఫ్రిజ్ లో నిల్వ ఉంచడం వల్ల తొందరగా పాడవవు.
»
పాలు కాచేటపుడు పొంగకుండా ఉండాలంటే అంచుకు నూనె రాయాలి.
»
అగర్బత్తిసుసితొ ఇత్తడిపాత్రలను కడగడంవల్ల బాగాశుభ్రపడతాయి.
»
వంకాయ ముక్కలు నల్లబడకుండా ఉండాలంటే స్పూను పాలు వేయాలి.
»
పసుపు నీటితో కిచెన్ను శుభ్రంచేయడం వల్ల ఈగలు రావు.
»
బిస్కెట్ పేకెట్ బియ్యండబ్బాలో ఉంచడం వల్ల తొందరగా మెత్తబడవు
»
ఇంగువ నీల్వ చేసే డబ్బాలో పచ్చిమిరపకాయ వేస్తే తాజాగా ఉంటుంది.
»
నూనె పొరపాటున ఒలికితే ఆ ప్రాంతంలో కొంచెం మైదాపిండి జల్లితే నూనెను త్వరగా పీల్చేస్తుంది.
»
క్యాబేజి ఉడికించేటపుడు వాసనరాకుండా ఉండాలంటే చిన్న అల్లం ముక్క వేయ్యాలి.
»
కత్తిపీటకు ఉప్పురాయడం వల్ల పదునుగా తయారవుతుంది.
»
బట్టలపై నిమ్మరసంగానీ,టూత్ పేస్ట్ గానీ వేసిరుద్దడం వల్ల ఇంకు మరకలు పోతాయి.
»
ఎండుకొబ్బరిచిప్ప కందిపప్పుడబ్బాలో వేసి నిల్వ ఉంచితే పప్పు పాడవదు.
»
కాకరకాయ ముక్కలను కొంచెం ఉప్పురాసి,నీళ్ళు చల్లి గంట సేపు ఉంచితే చేదు పోతుంది.
»
వెల్లుల్లిపాయను మెత్తగా దంచి కొంచెం నీటితో కలిపి బొద్దింకలు వచ్చేచోట ఉంచితే అవి ఆ ప్రాంతానికి రావు.
»
మినపప్పు త్వరగా నానాలంటే ఆ నీళ్లలో ఇనుపవస్తువు ఏదైనా వెయ్యాలి.
»
బ్రెడ్ పేకెట్ లో బంగాళదుంప ముక్కలు ఉంచితే త్వరగా పాడవదు.
»
నూనె పొంగకుండా ఉండాలంటే నూనెలో కొంచెం చింతపండు వెయ్యాలి.
»
చేతులకు నూనెరాసి పనసకాయ తరిగితే జిగురు అంటకుండా ఉంటుంది.
»
వడియాల పిండిలో కొంచెం నిమ్మరసం వేస్తే తెల్లగా వస్తాయి.
»
గుడ్లు ఉడకబెట్టేటపుడు కొంచెం ఉప్పు వేసి ఉడకనిస్తే పెంకులు త్వరగా ఊడిపోతాయి.
»
పకోడిలు వేసేటపుడు పిండిలో కొంచెం సోడా కలిపితే లావుగా అవుతాయి.