Wednesday, May 25, 2016

thumbnail

నామకరణం

నామకరణం పేర్లు.. పెట్టాల్సినవి..పెల్టకూడనివి..

మీకు అమ్మాయా..


అబ్బాయా? ఏం పేరు పెట్టారు? ఏదో ఒక పేరు.. పేరులో ఏముంది..! అంటారా? గులాబీని మరోలా పిలిస్తే మాత్రం దాని గుబాళింపు తగ్గుతుందా? - అంటారు షేక్ స్పియర్. కరెక్టే. కానీ ఇది చేతన్ భగత్ కాలం. మోడ్రన్‌గా ఉండాలి. పేరులో ఏముంది అంటే.. కుదరదు. నేమ్‌లోనే ఫేమ్ ఉంది. పిల్లలు పుట్టకముందే స్కూల్లో సీటు రిజర్వ్ చేసుకునే జమానా ఇది. అలాంటిది పిల్లల నామకరణం విషయం అంత లైట్ తీసుకుంటుందా ఈ జనరేషన్? కదా. మరి పెట్టాల్సిన పేర్లు.. పెట్టకూడని వాటి గురించి మీకు తెలుసా?


నోరు మంచిదయితే ఊరు మంచిదవుతుంది అన్నారు. కానీ పేరు మంచిదయితే మనిషి మంచోడవుతాడు అని ఎవరైనా అన్నారా?- ఈ డౌట్ మీకెప్పుడైనా వచ్చిందా? అయితే మీరింకా 1947 మోడల్ బ్రెయిన్‌నే వాడుతున్నారన్నమాట. అందుకే ప్రపంచం ఐదో తరం (ఫిఫ్త్ జనరేషన్)లో ఉంటే మనం ఇంకా మూడో తరం(3జీ)లోనే ఉన్నాం. ఈజిప్టులో ఒక పాప పేరు.. ఫేస్‌బుక్. ఈజిప్టులో ఉద్యమానికి ఫేస్‌బుక్ ఎంతటి మౌస్ అందించిందో తెలుసా? అందుకే.. ఆ స్ఫూర్తితో పాపకు పేరు పెట్టుకున్నారు. చూశారా.. ఇక్కడ స్విచ్ వేస్తే అక్కడ లైట్ వెలిగినట్లు.. అక్కడ పాపకు పేరు పెడితే ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నాం. అదే మరి పేరుకున్న గొప్పదనం. అందుకే పిల్లల నామకరణం విషయంలో ఇవి తెలుసుకోవాలి.

ధర్మ శాస్త్రం ప్రకారం..


హిందూధర్మంలో నామకరణ మహోత్సవం అనేది పుట్టిన ప్రతివ్యక్తికీ చేయాల్సిన ఒక సంబురం. ధర్మశాస్త్రంలో చెప్పిన విధంగా షోడశ సంస్కారాలలో పుంసావన కర్మలు ముఖ్యమైనవి. ఇందులో బారసాల ఇంకా ముఖ్యం. బారసాల నాడు పెట్టిన పేరు అన్ని విధాలా మంచిది. కొంతమంది శిశువు పుట్టినప్పుడు ఉన్న నక్షత్రం ప్రకారం ఆ నక్షత్రానికి కలిసే అక్షరంతో పేరు పెడతారు. కానీ అలా పెట్టాల్సిన అవసరం లేదు. బిడ్డపుట్టిన తర్వాత బారసాల నాడు బియ్యంలో నక్షత్ర నామం, సంవత్సర నామం, వ్యావహారిక నామం అని మూడు పేర్లను రాస్తారు. అందులో మిగిలిన రెండింటికీ అంత ప్రాధాన్యత లేకపోయినా వ్యావహారిక నామానికే ప్రాధాన్యత. అందుకని ఏదైనా అవసరం ఉండి పేరు మార్చుకున్నా, అది నామమాత్రానికే కాని ఆ పేరుతో చేసే ఏ పూజలు, పనులు ఫలించవు. నిత్యనైమిత్త కర్మలన్నింటికీ ఆ పేరే వాడాలి. పేరు జీవితాన్ని ప్రతిబింబిస్తుంది. నామకరణ మహోత్సవంలో మంచి తిథిని, అనుకూల సమయాన్ని చూసి పేరు పెడతారు. అందుకని ఆ పేరుతో పిలిస్తే ఆపేరు వల్ల కలిగే లాభనష్టాలు, పాపపుణ్యాలు అతనికి ప్రాప్తిస్తాయి అని చెప్పారు ప్రఖ్యాత జ్యోతిష్య పండితులు, వేద పండితులు ఒజ్జల విఠల శాస్త్రి.

పెట్టాల్సినవి..


అమ్మాయి పుడితే బేసి సంఖ్య అక్షరాలు వచ్చేలాగా, అబ్బాయి పుడితే సరిసంఖ్య అక్షరాలు వచ్చేలా పేరు పెట్టాలి. దీని వల్ల వారికి స్మృతి, స్తుతి, సదాచార సంపన్నత అలవడతాయి. అలాగే పెట్టే పేరులో సున్నా ఉండవద్దు అనే నియమం కూడా ధర్మశాస్త్రం, శాంతుల కమలాకరం అనే గ్రంథాలలో ఉంది. ఇది అభివృద్ధి నిరోధకం. ఇప్పటికాలంలో చాలామంది పేరు ట్రెండీగా ఉండాలని, కొత్తగా ఉండాలని ఎలాంటిది పడితే అలాంటి పేరు పెడుతున్నారు. భగవంతుని పేర్లు, పెద్దల పేర్లు కలిసేలా పేరు ఉండాలి. పేరు పెట్డడం వల్ల అందరూ పదేపదే ఆ పేరుతో పిలుస్తారు. దాని వల్ల భగవన్నామ స్మరణ జరిగి పుణ్యం వస్తుంది. కానీ ఇప్పుడు అలాంటి పేర్లు పెట్టుకోవడానికి చాలామంది నామోషీ పడుతున్నారు. దేశాల ఆచారాల ప్రకారం పెద్దల పేర్లను పెట్టే సాంప్రదాయం కూడా ఉంది. ఆంధ్రప్రాంతంలో తాత సరే వారిపేరు పెడితే తెలంగాణ ప్రాతంలో చనిపోయిన పెద్దల పేర్లు తమ పిల్లలకు పెట్టుకుంటారు. పేరుపెట్టడంలో కూడా ఆంధ్ర ప్రాంత వాసులు పదకొండవ రోజు తొట్టెలలో తెలంగాణలో 21వ రోజున వేస్తారు. ఇలా సంప్రదాయలలో తేడాలు ఉన్నా ఈ వేడుకను వైభవంగా చేస్తారని దత్తోపాసకులు మాల్లాది చన్ద్రశేఖర సిద్ధాంతి.

పెట్ట కూడనివి..


పేర్లు మార్చుకుంటే కలిసొస్తుందనేది నేను సమర్థించనంటారు మైలవరపు శ్రీనివాసరావు. అది కేవలం మూఢనమ్మకం మాత్రమే. ఒకసారి పెట్టిన పేరును మార్చడానికి వీలు లేదని శాస్త్రంలో గట్టిగా చెప్పబడింది. కానీ ఈవిషయం తెలియక చాలా మంది పేరు మారిస్తే కలిసొస్తుందని అనుకుంటున్నారు. మన మనసు దేనిపట్ల అయితే పాజిటివ్‌గా ఆలోచిస్తుందో దాని పరంగానే జీవితం నడుస్తుంది తప్ప పేరును మార్చేసుకున్నంత మాత్రాన జీవితం మారిపోదు. ఇంకా కొంతమందైతే సీత, రాముడు, హరిశ్చంద్రుడు ఇలాంటి వారిపేర్లను పెట్టుకుంటే జీవితాంతం కష్టాలొస్తాయి అనే అపోహలో ఉండిపోతున్నారు. కానీ వారందరూ తమ తమ కార్యాలతో విజయాన్ని సాధించిన వారే. వారిపేరును పెట్టుకొని స్మరిస్తే మనకూ పుణ్యం. నక్షత్రాల పేర్లు, చెట్టుపేర్లు, నదుల పేర్లు పెట్టకూడదని ధర్మశాస్త్రంలో చెప్పారు. ఏమాటకామాటే చెప్పుకోవాలి ఏ పేరుతో పిలిచినా సరే, మనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకునేలా కృషి చేయాలి. నలుగురిలో ఒకడిగా కాకుండా అందరికోసం ఒకడిగా ఉండాలి. మంచిపేరును ఎంచుకోవడం మంచి పేరు తెచ్చుకోవడమే ముఖ్యం అని చెప్పారాయన.

నామ ధ్యేయం


ఏ : ఏ అక్షరంతో పేరు ఉన్నట్లయితే మీరు నమ్మదగిన వ్యక్తులు. అందం పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు. స్వతంత్ర భావాలు కూడా మీ సొంతం. మీకు సాహసాలు చేయడం అంటే ఇష్టం.
బీ : మీకు భావోద్వేగాలు ఎక్కువ. మీకు ధైర్యం కూడా ఎక్కువే. విలాసవంతమైన జీవితాన్ని ఇష్టపడతారు.
సీ : పోటీతత్వం, నైపుణ్యం మీ సొంతం. స్వతత్ర భావాలుంటాయి. మంచి మాటకారులు. చెప్పదలుచుకున్న విషయాన్ని సాగదీయకుండా స్పష్టంగా చెప్పగలరు.
ఈ: కలుపుగోలుగా మాట్లాడతారు. స్నేహితుల సంఖ్య ఎక్కువే. మాట తీరుతో ఇతరులను ఆకట్టుకుంటారు.
ఎఫ్ : మీరు మంచి ప్లానర్ అని చెప్పవచ్చు. ప్రతి పనిని పక్కాగా ప్లాన్ చేసుకుని ముందడుగు వేస్తారు.
జీ : ఒక లక్ష్యాన్ని ఏర్పరుచుకొని దానికోసమే ప్రయత్నిస్తుంటారు ఈ అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులు.
హెచ్ : సృజనాత్మకత మీ సొంతం. తమను తాము నియంత్రించుకోగలరు. ఆత్మవిశ్వాసం కూడా ఎక్కువే.
ఐ : మీరు సాహసవంతులు. ైస్టెలిష్‌గా ఉండడానికి ప్రాధాన్యత ఇస్తారు. సృజనాత్మక పట్ల మీకు ఆసక్తి.
జే : లక్ష్య సాధన కోసం చాలా పోరాడతారు. మేథస్సు కలిగి ఉంటారు.
కే : కాస్త ఎక్కువగా సిగ్గుపడే వ్యక్తులు మీరు. అందరితో కలిసి ఉండాలని అనుకుంటారు.
ఎల్ : వీరు ఆకర్షణీయంగా ఉంటారు. డబ్బు, హోదా కలిగిన కెరీర్‌ను ఎంచుకుంటారు. కష్టపడే తత్వం మీది.
ఎమ్ : ధైర్యం, తెలివి, హార్డ్‌వర్క్ మీ సొంతం. మంచి నమ్మకస్తులు. సున్నితమైన మనస్కులు కూడా. మీ మనసు ఎవరైనా గాయపెడితే ఇక తిరిగి వారిని పట్టించుకోరు.
ఓ : ఓ అక్షరంతో పేరు మొదలయ్యే వారు వివేకవంతులని చెప్పొచ్చు. నీతి నిజాయితీ వీరికి ఉండే అదనపు లక్షణాలు.
పీ : మీరు చురుకుగా, జీవితాన్ని ఆనందంగా అనుభవిస్తారు. సృజనాత్మకత కలిగి ఉంటారు.
క్యూ : మీరు రచయితలుగా లేదా వక్తలుగా రాణించగలరు. ట్రెండ్‌ను ఫాలో అవ్వాలని అనుకోరు.
ఆర్ : నమ్మకం, జాలి, దయ వీరి సొంతం. ఎవరినైనా సరే ఇట్టే నమ్మేస్తారు. ఉల్లాసంగా ఉండడానికి ఇష్టపడతారు.
టీ : టీ తో పేరు స్టార్ట్ అయ్యే వ్యక్తులు ఎప్పుడూ బిజీగా ఉండడానికే ఇష్టపడతారు.
యూ : మీరు ప్రతిభావంతులుగా రాణిస్తారు. కష్టపడి పనిచేసే తత్వాన్ని కలిగి ఉంటారు.
వీ : మీరు విశ్వాసపాత్రులు. డైనమిక్ స్వభావాన్ని కలిగి ఉంటారు. ప్రతి పనినీ పక్కాప్రణాళికతో అమలు చేస్తుంటారు.
డబ్ల్యూ : మీరు గ్రేట్ లవర్స్‌గా ఉంటారు. మీ మనసు అర్థం చేసుకోవడం చాలా కష్టం.
ఎక్స్ : ఎక్స్ అక్షరంతో పేరు మొదలయ్యే వారు విలాసవంతమైన జీవితాన్ని కోరుకుంటారు. శాంత స్వభావులు. ప్రేమించి పెళ్లి చేసుకోవాలనే తత్వాన్ని కలిగి ఉంటారు.
వై : మీ పేరు వై అక్షరంతో ప్రారంభమైతే స్వతంత్రంగా ఉండాలనుకుంటారు. వ్యాపారం చేయడానికి ఇష్టపడతారు. సాహసకృత్యాలు కూడా వీరికి ఇష్టమే.


మీరు ఎలాంటి వ్యక్తులో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఆంగ్లంలో మీ పేరు ఏ అక్షరంతో మొదలవుతుందో దాన్ని బట్టి తెలుసుకోవచ్చు.

డీ అక్షరంతో పేరు ప్రారంభం అయ్యేవాళ్లకి ఆత్మైస్థెర్యం ఎక్కువ. వ్యాపారం చేయాలని అనుకుంటారు. శుభ్రత విషయంలో నిక్కచ్చిగా ఉంటారు. ఎవరికైనా చేతనైనంత సహాయం చేయాలనే స్వభావం కలిగి ఉంటారు.

ఎన్ అక్షరంతో మీ పేరు ప్రారంభం అయిన వారు సృజనాత్మకత కలిగి ఉంటారు. కళాత్మక ప్రతిభ కూడా మీ సొంతం. విరామం తీసుకోవడానికి ఇష్టపడరు. ప్రతీ పనిలోనూ పర్‌ఫెక్షన్ కోరుకుంటారు.

మీ గ్లామర్‌తో అందరినీ ఆకర్షిస్తారు. ఏదైనా పని ప్రారంభించాలంటే దానికి ముందు చాలా అలోచిస్తారు. టైమ్‌సెన్స్, పక్కాప్రణాళికను కలిగి ఉంటారు. నిజాయితీ, ఆగ్రహం కూడా ఎక్కువే. రాజకీయవేత్తగా లేక ఏదైనా ప్రత్యేక రంగంలో మీదైన ముద్రవేస్తారు.

వీరు మంచి మాటకారులుగా ఉండి ఎదుటి వారికి ఎప్పుడూ సలహాలు ఇస్తుంటారు. కొన్ని విషయాలలో స్పష్టమైన అవగాహన కలిగి ఉంటారు. సలహాదారులుగా ఉండడం వీరికి ఇష్టం.

ఇవి నిషేధం


-నక్షత్రాల పేర్లని శిశువులకు పెట్టకూడదనేది మొదటి నిషేధం. నక్షత్రాలు 27 ఉంటే ఆ అన్నిటికీ చంద్రుడొక్కడే భర్త అయిన కారణంగానూ, నక్షత్రనామాన్ని శిశువుకి పెడితే ఆ స్త్రీ శిశువుకి సవతి దోషం పట్టవచ్చుననే భయంతో నక్షత్రనామాన్ని పెద్దలు
-నదుల పేర్లు పెట్టకూడదనేది రెండో నిషేధం. నదులెన్ని ఉన్నా వాటన్నింటికీ సముద్రుడే భర్త. అందుకే నదుల పేరు అమ్మాయిలకు పెడితే సవతి దోషం ఉండొచ్చని నిషేధించారు.
-తీగల పేర్లు, చెట్ల పేర్లు కూడా పెట్టకూడదనేది మూడో నిషేధం. చెట్లు చెట్లు రాసుకుని నిప్పు పుట్టి అడవులు కాలిపోతుంటాయి, చెట్లను నరుకుతారు, గాలికి పడిపోతాయి, చీడ పడుతుంది, ఎండకీ వానకీ దిక్కూమొక్కూ లేకుండా ఒంటరిగా ఉంటాయి కాబట్టి అలాంటి కష్టాలు చందన, కేతకి, మల్లిక, మాలతి లాంటి పేర్లను పెట్టొదంటారు.
-లకారం ఓ అక్షరంతో కలిసిన అక్షరాలున్న (క్ర-క్ల..) పేరుని కూడా పెట్టరాదన్నారు పెద్దలు. ర బదులు ల పలకితే అర్థంలో భేదం రావడమే కాక, ఒక్కో సందర్భంలో అపార్థం కూడా కలగొచ్చు. ఆమ్రమనే పదానికి మామిడి పండు అనే అర్థం. దాన్ని ఆమ్ల అని పలికితే ఉసిరి అనే అర్థాన్నిస్తుంది.
-పేర్లని బట్టి కష్టాలు రావు : సీత, దమయంతి, సావిత్రి, శకుంతల.. ఇలాంటి పేర్లు పెట్టుకున్నవారికి కష్టాలు వస్తాయనే అపోహ ఉన్నది. నిజాన్ని నిజంగా ఆలోచిస్తే సీతమ్మ రామచంద్రునికి మార్గదర్శకురాలు. అందుకే పేరుని బట్టి కష్టాలు రావు.
-పేరు మార్చొకోకూడదు : పెట్టుకున్న పేరు మార్చుకోవడం, అక్షరాలని వంకరటింకరగా చేసుకుని పలికించుకోవడం.. ఇలాంటి వాటి ద్వారా జీవితగతి మారుతుందనుకోవడం భ్రమ మాత్రమే.
 
 

Subscribe by Email

Follow Updates Articles from This Blog via Email

No Comments