Tuesday, May 24, 2016

thumbnail

పొడుపు కథలు

 పొడుపు కథలు :

* ఈకలు ఈరమ్మ, ముళ్ల పేరమ్మ, సంతకు వెళితే అందరూ కొనేవారే
జ. ఉల్లిపాయ

* గుప్పెడు పిట్ట.. దాని పొట్టంతా తీపి.
జ. బూరె

* అడవిలో పుట్టింది, మా ఇంటికి వచ్చింది. తాడేసి కట్టింది. తైతక్కలాడింది. కడవలో దూకింది. పెరుగులో మునిగింది. వెన్నంత తెచ్చింది.
జ. కవ్వం

* దాస్తే పిడికిలో దాగుతుంది. తీస్తే ఇల్లంతా పాకుతుంది.
జ. దీపం

* జామ చెట్టు కింద జానమ్మ, ఎంత గుంజినా రాదమ్మా.
జ. నీడ

* నామముంది కాని పూజారి కాదు. వాలముది కానీ కోతి కాదు.
జ. ఉడుత

* సినిమాహాలుకి మనతో వస్తుంది. టికెట్ తీసుకుంటుంది. సినిమా చూడదు. మనం చూసి వచ్చేవరకు వేచి చూస్తుంది.
జ. మన వాఇనం

* అరచేతిలో అద్దం.. ఆరు నెలల యుద్ధం
జ. గోరింటాకు

* ఆకు చిటికెడు. కాయ మూరెడు.
జ. మునగకాయ

* ఆకు బారెడు. తోక మూరెడు.
జ. మొగలిపువ్వు 

* ఇల్లుకాని ఇల్లు
జ. బొమ్మరిల్లు

* ఇంటికి అందం
జ. గడప

* ఇంటింటికీ ఒక నల్లోడు
జ. మసిగుడ్డు

* ఇంటికి అంత ముండ కావాలి
జ. భీగము

* ఇల్లంతాఎలుక బొక్కలు..
జ. జల్లెడ

* ఇల్లంతా తిరిగి మూల కూర్చొంది
జ. చీపురుకట్ట

* ఇంటి వెనుక ఇంగువ చెట్టు ఎంత కోసినా తరగదు
జ. పొగ

* ఇంతింతాకు, బ్రహ్మంతాకు, విరిస్తే ఫెళఫెళ
జ. అప్పడం

* ఆ ఇంటికి ఈ ఇంటికి మధ్య దూలం
జ. ముక్కు

* ఈత చెట్టుకి ఇద్దరు బిడ్డలు
జ. కల్లు కుండలు  

* ఆకాశంలో పాములు
జ. పొట్లకాయ

* ఓ ఆకు..మర్రి ఆకు.. కాయ.. మామిడి కాయ.. పువ్వు మల్లెపువ్వు
జ. జిల్లేడు

* ఆకులేని అఢవిలో జీవంలేని జంతువు జీవమున్న జంతువులను వేటాడుతుంది.
జ. దువ్వెన

* ఆకేలేయదు నీరుతాగదు. నేలని పాకదు. ఏమిటి ఆ తీగ?
జ. విద్యత్తు తీగ

* ఆడవాళ్లకుండనిది.. మగవాళ్లకు ఉండేది?
జ. మీసం

* ఆ ఇంటికి ఈ ఇంటికి లాలా బుడిగి
జ. కుక్కపిల్ల

* ఆ వీధిరాజుకి కొప్పుంది. జుట్టలేదు. కళ్లున్నాయి చూపులేదు
జ. కొబ్బరి కాయ

* ఆరామడల నుంచి అల్లుడు వస్తే అత్తగారు వడ్డించింది విత్తులేని కూర
జ. పుట్టగొడుగులు

* ఇక్కడ విచిన కోడి ఇందూరు పోయింది
జ. లేఖ

* ఇటుకతో ఇల్లు కట్టి.. దంతాన తనుపుపెట్టే.. తానుబోయి సరసమాడెను
జ. మొగలిపువ్వు  

* ఆకాశంలో 60 గదులు, గదిగదికో సిపాయి, సిపాయికో తుపాకి.
జ. తేనెపట్టు

* ఆకాశంలో అంగవస్ర్తాలు ఆరబెట్టారు.
జ. అరిటాకు

* ఆలుకాని ఆలు.
జ. వెలయాలు

* అందంకాని అందం
జ. పరమానందం, బ్రహ్మానందం

* ఆ కొండకు ఈ కొండకు ఇనుప సంకెళ్లు.
జ. చీమలదండు

* ఆకాశన అప్పన్న.. నేలకుప్పన్న బోడినాగన్న.. పిండి పిసకన్న
జ. వెలగపండు

* ఆకాశాన కొడవళ్లు వ్రేలాడుతున్నాయి.
జ. చింతకాయలు

* ఆ ఆటకత్తె ఎప్పుడూలోనే నాట్యం చేస్తుంది
జ. నాలుక

* ఆకాశాన పటం.. కింద తోక.
జ. గాలిపటం

* ఆకాశంలో ఎగురుతుంది. పక్షి కాదు. మనుషుల్ని ఎగరేసుకుపోతుంది గాలికాదు.
జ. విమానం  

 * అరచేతిలో 60 నక్షత్రాలు
జ. జల్లెడ

* అరచేతి పట్నంలో 60 వాకిళ్లు
జ. అద్దం

* అంకటి బంకటి కూర, తియ్యగున్నది. ఇంత పెట్టు
జ. మీగడ

* అడ్డ గోడ మీద పూజారప్ప
జ. తేలు

* అడవిలో పుట్టింది, అడవిలో పెరిగింది. మా ఇంటికి వచ్చింది తైతక్కలాడింది.
జ. కవ్వం

* అదిలేకపోతే ఎవ్వరూ ఏమీ తినరు. ఏమిటి?
జ. ఆకలి

* అనగనగనగా ఓ అప్సరస. ఆమె పేరులో మధ్య అక్షరం తీసేస్తే మేక.
జ. మేనక

* అవ్వ చీరకు పుట్టెడు చిల్లులు.
జ. పుట్ట

* అరం కణం గదిలో 60 మంది నివాసం
జ. అగ్గిపెట్టె, పుల్లలు

* ఆ బాబా ఈ బాబా పోట్లాడితే కూన రాములు వచ్చి తగువు తీర్చాడు.
జ. తాళం 

 * పోకంత పొట్టోడు. ఇంటికి గట్టోడు.
జ. తాళం కప్ప

* అమ్మతమ్ముడినికాను, కానీ నేను మీకు మేనమాను.
జ. చందమామ

* అరటిపండుకి పదే
విత్తులు
జ. బొగడగొట్టం

* అడవిలో ఆంబోతు రంకే వేస్తుంది
జ. గొడ్డలి

* అరచేతి కింద అరిసె
జ. పిడక

* అలాము కొండకు సలాము కొట్టు
జ. గొడ్డలి

* అమ్మంటే దగ్గరకు.. అయ్యంటే దూరంగా పోయేవి ఏమిటి?
జ. పెదవులు

* అంక పొంకలు లేనిది.
జ. శివలింగం

* అడవిలో అక్కమమ తల విలబోసుకుంది?
జ. ఈతచెట్టు

* అక్క ింటిలో చెల్లి ఇంటిలోనికి వెలుగు తెస్తుంది
జ. పెద్ద పొయ్యి  

 * అడ్డగోడమీద బుడ్డ చెంబు, తోసినా ఇటుపక్క పడదు. అటు పక్క పడదు.
జ. ఆబోతు మూపురం.

* అయ్యకు అందవు. అమ్మకు అందుతాయి.
జ. పెదవులు

* మనిషికి రెండే కాళ్లు, ఏడు చేతులు.
జ. నిచ్చెన

* మూలన కూర్చుంటుంది. ఎండొచ్చినా, వానొచ్చినా బయటకు బయలుదేరుతుంది.
జ. గొడుగు.

* ఎర్రవాడొస్తే, నల్లవాడు పారిపోతాడు
జ. సూర్యుడు, చంద్రుడు

* బంగారు చెంబులో వెండి గచ్చకాయ
జ. పనసతొన.

* నల్లని షర్టువాడు, కావలికి గట్టివాడు.
జ. తాళం.

* తోవలో పుట్టేది, తోవలో పెరిగేది, తొవలో పోయేవారి కొంగు పట్టేది?
జ. ముళ్ల మొక్క

* బండకు కొడితే వెండి ఊడుతుంది?
జ. కొబ్బరికాయ

* వానా లేక ఎండా లేక పైరు పచ్చంగా, ఆకు లేక సున్నం లేక నోరు ఎర్రంగ
జ. రామచిలుక.  

* దేహమెల్ల కళ్లు, దేవేంద్రుడు కాదు. నరవాహనము లేక నడిచిపోలేదు. తనకు జీవం లేదు, జీవుల్ని చంపు.
జ. వల

* పొట్టలో వేలు, నెత్తి మీద రాయి.
జ. ఉంగరం

* పొడవాటి మానుకి నీడే లేదు.
జ. దారి

* పోకంత పొట్టి బావ, కాగంత కడప మోస్తాడు.
జ. పొయ్యి

* ముట్టుకుంటే ముడుచుకుంటుంది. పట్టుకుంటే గుచ్చుకుంటుంది.
జ. అత్తిపత్తి

* ముద్దుగా నుండును, ముక్కుపైకెక్కు, చెవులు రెండూ లాగి చెంప నొక్కు దండి పండితులకు దారి చూపుట వృత్తి.
జ. కళ్లజోడు.

* పైడిపెట్టెలో ముత్యపు గింజ
జ. వడ్లగింజ

* తల్లి కూర్చొండు, పిల్ల పారాడు.
జ. కడవ, చెంబు

* పూజకు పనికిరాని పువ్వు. పడతులు మెచ్చే పువ్వు.
జ. మొగలిపువ్వు.

* ఇంతింత ఆకు, ఇంపైన ఆకు, రాజుల మెచ్చిన రత్నాల ఆకు?
జ. తమలపాకు  

* తొలుతో చేస్తారు. కర్రతో చేస్తారు. అన్నం పెడతారు, అదే పనిగా బాదుతారు?
జ. మద్దెల

* తోలు నలుపు, తింటే పులుపు.
జ. చింతపండు

* తొలు తియ్యన, గుండు మింగన్నా?
జ. అరటి పండు

* జానెడు ఇంట్లో, మూరెడు కర్ర?
జ. కుండలో గరిటె.

* కుడితి తాగదు, మేత మేయదు, కానీ కుండెకు పాలిస్తుంది?
జ.తాటిచెట్టు

* కొప్పుంది కాని జుట్టు లేదు, కళ్లున్నాయి కానీ చూపు లేదు?
జ. కొబ్బరి కాయ

* కొమ్ములుంటాయి కానీ ఎద్దు కాదు. అంబారీ ఉంటుంది కానీ ఏనుగు కాదు?
జ. నత్త

* పైన చూస్తే పండు, పగుల గొడితే బొచ్చు?
జ. పత్తి కాయ.

* నూరు పళ్లు, ఒకటే పెదవి.
జ. దానిమ్మ

* సన్నని స్తంభం, ఎక్కలేరు దిగలేరు.
జ. సూది  

* కాళ్ళు చేతులు లేని అందగత్తెకు బోలెడు దుస్తులు.
జ. ఉల్లిపాయ

* నల్లకుక్కకు నాలుగు చెవులు
జ. లవంగం

* తెలిసి కాయ కాస్తుంది. తెలీకుండా పువ్వు పూస్తుంది.
జ. అత్తి చెట్టు

* తొడిమ లేని పండు, ఆకులేని పంట.
జ. విభూది పండు, ఉప్పు

* తన్ను తానే మింగి, మావమౌతుంది.
జ. మైనపు వత్తి

* చూస్తే చూసింది గానీ కళ్లు లేవు. నవ్వితే నవ్వింది గాని పళ్లు నోరు లేదు, తంతే తన్నింది గాని కాలు లేదు.
జ. అద్దం

* చూస్తే చిన్నోడు, వాడి ఒంటి నిండా నార బట్టలు?
జ. టెంకాయ

* తల నుండి పొగ చిమ్ముంది, భూతం కాదు. కన్నులెర్రగా ఉండు రాకాసి కాదు. పాకిపోవుచుండు పాము కాదు?
జ. రైలు

* నిలబడితే నిలుస్తుంది, కూర్చుంటే కూలబడుతుంది?
జ. నీడ

* దాని పువ్వు పూజకు రాదు. దాని ఆకు దొప్పకు రాదు, దాని పండు అందరు కోరు?
జ. చింతపండు  

* ఇల్లంతా వెలుగు, బల్లకింద చీకటి.
జ. దీపం

* ఎర్రటి పండు మీద ఈగైనా వాలదు.
జ. నిప్పు

* ఎందరు ఎక్కిన విరగని మంచం.
జ. అరుగు.

* దాస్తే పిడికిలిలో దాగుతుంది, తీస్తే ఇల్లంతా జారుతుంది.
జ.దీపం వెలుగు.

* ఓహొయి రాజా! ఒడ్డు పొడుగేమి? పట్టుకోబోతే పిడికెడు లేవు?
జ. పొగ

* కాళ్లు లేవు గానీ నడుస్తుంది. కళ్లు లేవు గానీ ఏడుస్తుంది?
జ. మేఘం

* తలపుల సందున మెరుపుల గిన్నె.
జ. దీపం

* తల్లి దయ్యం, పిల్ల పగడం.
జ. రేగుపండు

* తెల్లకోటు తొడుక్కున్న ఎర్రముక్కు దొర
జ. కొవ్వొత్తి

* ఒకటే తొట్టి, రెండు పిల్లలు.
జ. వేరుశనగ 

* అడ్డగోడమీద బుడ్డ చెంబు, తోసినా ఇటుపక్క పడదు. అటు పక్క పడదు.
జ. ఆబోతు మూపురం.
-------------------------------------------------------------
* అయ్యకు అందవు. అమ్మకు అందుతాయి.
జ. పెదవులు
--------------------------------------------------------------
* మనిషికి రెండే కాళ్లు, ఏడు చేతులు.
జ. నిచ్చెన
---------------------------------------------------------------
* మూలన కూర్చుంటుంది. ఎండొచ్చినా, వానొచ్చినా బయటకు బయలుదేరుతుంది.
జ. గొడుగు.
----------------------------------------------------------------
* ఎర్రవాడొస్తే, నల్లవాడు పారిపోతాడు
జ. సూర్యుడు, చంద్రుడు.
-------------------------------------------------------
* బంగారు చెంబులో వెండి గచ్చకాయ
జ. పనసతొన.
--------------------------------------------------------
* నల్లని షర్టువాడు, కావలికి గట్టివాడు.
జ. తాళం.
--------------------------------------------------------
* తోవలో పుట్టేది, తోవలో పెరిగేది, తొవలో పోయేవారి కొంగు పట్టేది?
జ. ముళ్ల మొక్క
---------------------------------------------------------
* బండకు కొడితే వెండి ఊడుతుంది?
జ. కొబ్బరికాయ
---------------------------------------------------------
* వానా లేక ఎండా లేక పైరు పచ్చంగా, ఆకు లేక సున్నం లేక నోరు ఎర్రంగ
జ. రామచిలుక.  

* దేహమెల్ల కళ్లు, దేవేంద్రుడు కాదు. నరవాహనము లేక నడిచిపోలేదు. తనకు జీవం లేదు, జీవుల్ని చంపు.
జ. వల
-----------------------------------------------------------------------------------
* పొట్టలో వేలు, నెత్తి మీద రాయి.
జ. ఉంగరం
-----------------------------------------------------
* పొడవాటి మానుకి నీడే లేదు.
జ. దారి
-----------------------------------------------------
* పోకంత పొట్టి బావ, కాగంత కడప మోస్తాడు.
జ. పొయ్యి
------------------------------------------------------
* ముట్టుకుంటే ముడుచుకుంటుంది. పట్టుకుంటే గుచ్చుకుంటుంది.
జ. అత్తిపత్తి
-------------------------------------------------------------------------------------
* ముద్దుగా నుండును, ముక్కుపైకెక్కు, చెవులు రెండూ లాగి చెంప నొక్కు దండి పండితులకు దారి చూపుట వృత్తి.
జ. కళ్లజోడు.
--------------------------------------------------------------------------------------
* పైడిపెట్టెలో ముత్యపు గింజ
జ. వడ్లగింజ
-----------------------------------------------
* తల్లి కూర్చొండు, పిల్ల పారాడు.
జ. కడవ, చెంబు
------------------------------------------------
* పూజకు పనికిరాని పువ్వు. పడతులు మెచ్చే పువ్వు.
జ. మొగలిపువ్వు.
-------------------------------------------------
* ఇంతింత ఆకు, ఇంపైన ఆకు, రాజుల మెచ్చిన రత్నాల ఆకు?
జ. తమలపాకు 

* తొలుతో చేస్తారు. కర్రతో చేస్తారు. అన్నం పెడతారు, అదే పనిగా బాదుతారు?
జ. మద్దెల
----------------------------------------------------------------------
* తోలు నలుపు, తింటే పులుపు.
జ. చింతపండు
-----------------------------------------------------------------------
* తొలు తియ్యన, గుండు మింగన్నా?
జ. అరటి పండు
------------------------------------------------------------------------
* జానెడు ఇంట్లో, మూరెడు కర్ర?
జ. కుండలో గరిటె.
------------------------------------------------------------------------
* కుడితి తాగదు, మేత మేయదు, కానీ కుండెకు పాలిస్తుంది?
జ.తాటిచెట్టు
-------------------------------------------------------------------------
* కొప్పుంది కాని జుట్టు లేదు, కళ్లున్నాయి కానీ చూపు లేదు?
జ. కొబ్బరి కాయ
-------------------------------------------------------------------------
* కొమ్ములుంటాయి కానీ ఎద్దు కాదు. అంబారీ ఉంటుంది కానీ ఏనుగు కాదు?
జ. నత్త
-------------------------------------------------------------------------
* పైన చూస్తే పండు, పగుల గొడితే బొచ్చు?
జ. పత్తి కాయ.
--------------------------------------------------------------------------
* నూరు పళ్లు, ఒకటే పెదవి.
జ. దానిమ్మ
---------------------------------------------------------------------------
* సన్నని స్తంభం, ఎక్కలేరు దిగలేరు.
జ. సూది  

 మా ఊరెద్దు మీ ఊరు పోదు ,మీ ఊరెద్దు మా ఊరు రాదు ?
జ : మైలు రాళ్లు .
--------------------------------------------------------------------------------------------------
  మెడ ఉంటుంది కానీ తల ఉండదు , చేతులు ఉంటాయి కానీ వేల్లుండవు ?
జ : చొక్కా
--------------------------------------------------------------------------------------------------
  అర చేతికింద అరిసె ?
జ : పిడక .
----------------------------------------------------------------------------------------------------
 వందమంది అన్నదమ్ములకు ఒకే తాడు ?
జ : చీపురు .
----------------------------------------------------------------------------------------------------
 అన్నదమ్ములు ముగ్గురు ,అయితే బుద్ధులు మాత్రం వేరు . నీళ్లలో మునిగే వాడొకడు ,తేలే వాడొకడు , కరిగే వాడొకడు ?
జ : వక్క,ఆకు , సున్నం .
----------------------------------------------------------------------------------------------------
  మా ఇంటి వెనక ఇంగువ చెట్టు;ఎంత కోసిన గుప్పెడు కాదు?
జ: పొగ గొట్టం లోని పొగ.

మూడు కాళ్ళ ముసలమ్మ నీళ్లు తాగి కొయ్య మింగుతుంది .ఏమిటది ?
జ:సాన.
----------------------------------------------------------------------------------------------------
ఊరికంతా ఒకటే దుప్పటి . ఏమిటది ?
జ :ఆకాశం .
----------------------------------------------------------------------------------------------------
లోకమంతా చాప వేసి , నిద్ర పోకుండా తిరుగుతూ ఉంటాడు . ఎవరతను ?
జ :సముద్రం .
----------------------------------------------------------------------------------------------------
ఇంటికి కన్ను , కంటికి కన్ను , మింటికి కన్ను ఇల్లంతా వెలుగునిచ్చు . ఎవరది ?
జ :దీపం .
----------------------------------------------------------------------------------------------------
ఎర్రని కోటలో తెల్లని భటులు ?
జ :నోటిలో పళ్ళు .
----------------------------------------------------------------------------------------------------
ముఖము లేకున్నా బొట్టు పెట్టుకుంటుంది ?
జ: గడప .
----------------------------------------------------------------------------------------------------
గాలి గండమే కానీ దానికి నీటి గండం లేదు ?
జ : చేప .
----------------------------------------------------------------------------------------------------
గొడుగు కాని గొడుగు ,కొరకరాని పిడుగు ?
జ :కుక్కగొడుగు .
----------------------------------------------------------------------------------------------------
చాచుకొని సావిట్లో పడుకుంటుంది .ముడుచుకుని మూలన నక్కుతుంది ?
జ :చాప .
----------------------------------------------------------------------------------------------------
  జీడి వారి కోడలు ,వేడి వారి మరదలు ,వైశాఖ మాసంలో ఇంటికి వస్తుంది ?
జ : మామిడి పండు .  

 చింపిరి చింపిరి గుడ్డలు ముత్యాల వంటి బిడ్డలు .ఏమిటది ?
జ :మొక్కజొన్నపొత్తు.
----------------------------------------------------------------------------------------------------
కిటకిట తలుపులు కిటారి తలుపులు తియ్యావేయ్యా తీపులు లేవు . ఏమిటది ?
జ :కనురెప్పలు .
----------------------------------------------------------------------------------------------------
అడవిలో పుట్టింది ,అడవిలో పెరిగింది మాయింటి కొచ్చింది ,తైతక్కలాడింది . ఏమిటది ?
జ ;కవ్వం .
----------------------------------------------------------------------------------------------------
గోడమీద బొమ్మ !గొలుసుల బొమ్మ !వచ్చే పోయేవారిని వడ్డించే బొమ్మ !ఏమిటది ?
జ :తేలు.
----------------------------------------------------------------------------------------------------
చిటారు కొమ్మన మిఠాయి పొట్లం . ఏమిటది ?
జ :తేనెపట్టు .
----------------------------------------------------------------------------------------------------
నిగనిగలాడే నిర్మల వస్తువు ,భుగ భుగ మండే పరిమళ వస్తువు ,నీటికి నానదు,గాలికి కరుగు ,నిప్పుకు మండు.ఏమిటది ?
జ :కర్పూరం .
----------------------------------------------------------------------------------------------------
మా తాత దొడ్డిలో మంచి ఎద్దుల మంద ,ఎద్దులు పడుకుంటే పగ్గాలు మేస్తాయి .ఏమిటది ?
జ :గుమ్మడికాయ .
----------------------------------------------------------------------------------------------------
తెల్లని బంతి చల్లని బంతి అందని బంతి ఆడని బంతి .ఏమిటది ?
జ :జాబిలి .
----------------------------------------------------------------------------------------------------
మూట విప్పితే ముత్యాలు .ఏమిటది ?
జ :దానిమ్మపండు .
----------------------------------------------------------------------------------------------------
కింద గట్టు ,పైన గట్టు మధ్యలో ఎర్రబొట్టు .ఏమిటది ?
జ :నాలుక .  

ప్ర :- కారం కాని కారం ?
జ :- ఆకారం .

ప్ర :- ఇదొస్తే ఎవరైనా నోరు తెరిచి దారి ఇవ్వాల్సిందే ?
జ :- ఆవలింత .

ప్ర :- దీని పళ్ళు ఊడితే మళ్ళీ రావు ?
జ :- దువ్వెన .

ప్ర :- కూత కూస్తే కాని పరుగు తీయదు ?
జ :- రైలు .

ప్ర :- మనిషి కాదు. జ్ఞానం లేదు. కాని , తన వేయి కళ్ళతో మంచి చెడ్డలను వేరు చేస్తుంది. ఏంటది ?
జ :- జల్లెడ .

ప్ర :- మొండెం వుంటుంది . కాని , తల , కాళ్ళు , చేతులు లేవు . ఏంటది ?
జ :- సీసా .

ప్ర :- అందర్నీ చూడగలదు . తనను తాను చూడలేదు ?
జ :- కన్ను .

ప్ర :- వంటి నిండా గాయాలు . కడుపు నిండా రాగాలు . ఏంటది ?
జ :- పిల్లనగ్రోవి .

ప్ర :- నాలుగు కాల్లునాయి . నిలబడగలదు . కానీ , నడవలేదు . ఏంటది ?
జ :- కుర్చీ .

ప్ర :- రెక్కల్లేని పిట్ట ఎంత ఎగిరినా ఉన్నచోట నుండి కదలదు . ఏంటది ?
జ :- జెండా .  

ప్ర : పై పచ్చ ,లో తెలుపు , గులకరాళ్ళు , తేటనీళ్ళు ఏంటది ?
జ : కమలాపండు .

ప్ర : కర్రకాని కర్ర ఏంటది ?
జ : జీలకర్ర .

ప్ర : బంగారు భరిణలో రత్నాలు.పగలగొడితేగాని రావు ?
జ : దానిమ్మ పండు .

ప్ర : ఒక వైపు తిప్పితే దారి మూస్తుంది .మరో వైపు తిప్పితే దారి తెరుస్తుంది . ఏంటది ?
జ : తాళంచెవి .

ప్ర : గాజు పంజరంలో మిణుగురు పురుగు.పగలు నిద్ర , రాత్రి జాగారం చేస్తుంది . ఏంటది ?
జ : బల్బు .

ప్ర : నల్లని పైరు . ఎంత కోసినా పెరుగుతుంది . ఏంటది ?
జ : జుట్టు .

ప్ర : నిమ్మ కాని నిమ్మ ?
జ : దానిమ్మ .

ప్ర : జనం కాని జనం ?
జ : భోజనం .

ప్ర : వనం కాని వనం ?
జ : భవనం .

ప్ర : పాలు కాని పాలు ?
జ : విన్నపాలు / మురిపాలు / జులపాలు . 

*******************************సమాప్తం*******************************
thumbnail

తెలుగు సామెతలు

తెలుగు సామెతలు

అంత్యనిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మేలు
అంబలి తాగే వారికి మీసాలు యెగబట్టేవారు కొందరా
అతి రహస్యం బట్టబయలు
అడిగేవాడికి చెప్పేవాడు లోకువ
అత్తలేని కోడలుత్తమురాలు కోడల్లేని అత్త గుణవంతురాలు
అనువు గాని చోట అధికులమనరాదు
అభ్యాసం కూసు విద్య
అమ్మబోతే అడివి కొనబోతే కొరివి
అయితే ఆదివారం కాకుంటే సోమవారం
ఆలూ లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం
 
ఇంట్లో ఈగల మోత బయట పల్లకీల మోత
ఇల్లు కట్టి చూడు పెళ్ళి చేసి చూడు 
ఇంట గెలిచి రచ్చ గెలువు
ఇల్లు పీకి పందిరేసినట్టు
ఎనుబోతు మీద వాన కురిసినట్టు
చెవిటి వాని ముందు శంఖమూదినట్టు
కందకు లేని దురద కత్తిపీటకెందుకు
కత్తిపోటు తప్పినాక కలంపోటు తప్పదు 
కుక్క కాటుకు చెప్పుదెబ్బ
కోటి విద్యలు కూటి కొరకే
నీరు పల్లమెరుగు నిజము దేవుడెరుగు
పిచ్చుకపై బ్రహ్మాస్త్రం
పిట్ట కొంచెము కూత ఘనము 
రొట్టె విరిగి నేతిలో పడ్డట్టు

వాన రాకడ ప్రాణపోకడ
కళ్యాణమొచ్చినా కక్కొచ్చినా ఆగదు
మీసాలకు సంపంగి నూనె
 ఆ మొద్దు లొదే ఈ పేడు
 ఆ తాను ముక్కే !!!
 ఆడబోయిన తీర్థము యెదురైనట్లు
 ఆడలేక మద్దెల వోడు అన్నట్లు
 ఆది లొనే హంస పాదు
 ఏమీ లేని యెడారిలో ఆముదము చెట్టే మహా వృక్షము
 ఆకలి రుచి యెరుగదు, నిద్ర సుఖమెరుగదు
 ఆకాశానికి హద్దే లేదు
 ఆలస్యం అమృతం విషం
 ఆరే దీపానికి వెలుగు యెక్కువ
 ఆరోగ్యమే మహాభాగ్యము
 ఆత్రానికి బుద్ధి మట్టు
 
 ఆవులింతకు అన్న ఉన్నాడు కాని, తుమ్ముకు తమ్ముడు లేడంట
 ఆవు చేను మేస్తే, దూడ గట్టు మేస్తుందా?
 అబద్ధము ఆడినా అతికినట్లు ఉండాలి
 అడగందే అమ్మైనా అన్నమ్ పెట్టదు
 అడ్డాల నాడు బిడ్డలు కాని, గడ్డాల నాడు కాదు
 ఏ ఎండకు ఆ గొడుగు
 అగడ్తలొ పడ్డ పిల్లికి అదే వైకున్ఠం
 అగ్నికి వాయువు తొడైనట్లు
 ఐశ్వర్యమొస్తే అర్ధరాత్రి గొడుగు పట్టమనేవాడు
 అందని మ్రానిపండ్లకు అర్రులు చాచుట
 అందితే జుట్టు అందక పోతే కాళ్ళు
 అంగట్లో అన్నీ ఉన్నా, అల్లుడి నోట్లో శని ఉన్నట్లు
 అన్నపు చొరవే గాని అక్షరపు చొరవ లేధు
 అప్పు చేసి పప్పు కూడు
 అయ్య వచే వరకు అమావాస్య ఆగుతుందా 
 అయ్యవారిని చెయ్యబొతే కోతి బొమ్మ అయినట్లు
 బతికుంటే బలుసాకు తినవచ్చు
 బెల్లం కొట్టిన రాయిలా
 భక్తి లేని పూజ పత్రి చేటు
 బూడిదలో పోసిన పన్నీరు
 చాదస్తపు మొగుడు చెబితే వినడు, గిల్లితే యేడుస్తాడు
 చాప కింద నీరులా
 చచ్చినవాని కండ్లు చారెడు
 చదివేస్తే ఉన్నమతి పోయినట్లు
 విద్య లేని వాడు వింత పశువు
 చేతకానమ్మకే చేష్టలు ఎక్కువ
 చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్లు
 చక్కనమ్మ చిక్కినా అందమే
 చెడపకురా చెడేవు
 చీకటి కొన్నాళ్ళు, వెలుగు కొన్నాళ్ళు
 చెరువుకి నీటి ఆశ, నీటికి చెరువు ఆశ
 చింత చచ్చినా పులుపు చావ లేదు
 చింతకాయలు అమ్మేదానికి సిరిమానం వస్తే, ఆ వంకర టింకరవి యేమి కాయలని అడిగిందట
 చిలికి చిలికి గాలివాన అయినట్లు
 డబ్బుకు లోకం దాసోహం
 దేవుడు వరం ఇచ్చినా పూజారి వరం ఇవ్వడు
 దరిద్రుడి పెళ్ళికి వడగళ్ళ వాన
 దాసుని తప్పు దండంతో సరి
 దెయ్యాలు వేదాలు పలికినట్లు
 దిక్కు లేని వాడికి దేవుడే దిక్కు
 దొంగకు దొంగ బుద్ధి, దొరకు దొర బుద్ధి
 దొంగకు తేలు కుట్టినట్లు
 దూరపు కొండలు నునుపు
 దున్నపోతు మీద వర్షం కురిసినట్లు
 దురాశ దుఃఖమునకు చెటు
 ఈతకు మించిన లోతే లేదు
 ఎవరికి వారే యమునా తీరే
 ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారు
 గాడిద సంగీతానికి ఒంటె ఆశ్చర్యపడితే, ఒంటె అందానికి గాడిద మూర్ఛ పోయిందంట
 గాజుల బేరం భోజనానికి సరి
 గంతకు తగ్గ బొంత
 గతి లేనమ్మకు గంజే పానకము
 గోరు చుట్టు మీద రోకలి పోటు
 గొంతెమ్మ కోరికలు
 గుడ్డి కన్నా మెల్ల మేలు
 గుడ్డి యెద్దు జొన్న చేలో పడినట్లు
 గుడ్డు వచ్చి పిల్లను వెక్కిరించినట్లు
 గుడి  మింగే వాడికి నంది పిండీమిరియం
 గుడినీ గుడిలో లింగాన్నీ మింగినట్లు
 గుడ్ల మీద కోడిపెట్ట వలే
 గుమ్మడి కాయల దొంగ అంటే భుజాలు తడుముకొన్నాడట 
 గుర్రము గుడ్డిదైనా దానాలో తక్కువ లేదు
 గురువుకు పంగనామాలు పెట్టినట్లు
తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టినట్లు
 ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడు
 ఇంటి పేరు కస్తూరివారు వీధిలో గబ్బిలాల కంపు 
 ఇంటికన్న గుడి పదిలం
 ఇసుక తక్కెడ పేడ తక్కెడ
 జోగి జోగి రాజుకుంటే బూడిద రాలిందంట
 కాచిన చెట్టుకే రాళ్ళ దెబ్బలు
 కాగల కార్యము గంధర్వులే తీర్చినట్లు
 కాకి ముక్కుకు దొండ పండు
 కాకి పిల్ల కాకికి ముద్దు
 కాలం కలిసి రాక పోతే కర్రే పామై కాటు వేస్తుంది
 కాలు జారితే తీసుకోగలము కాని నోరు జారితే తీసుకోగలమా
 కాసుంటే మార్గముంటుంది
 కడుపు చించుకుంటే కాళ్ళపైన పడ్డట్లు
 కలకాలపు దొంగ ఒకనాడు దొరుకును
 కలిమి లేములు కావడి  కుండలు
 కలిసి వచ్చే కాలం వస్తే, నడిచి వచ్చే కొడుకు పుదతాదు
 కంచే చేను మేసినట్లు
 కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా!
 కందకు కత్తి పీట లోకువ
 కందెన వేయని బండికి కావలసినంత సంగీతం
 కరవమంటే కప్పకు కోపం విడవమంటే పాముకు కోపం
 కీడెంచి మేలెంచమన్నారు
 కొండ  నాలికకి మందు  వేస్తే ఉన్న నాలిక ఊడినట్లు
 కొండల్లే వచ్చిన ఆపద కూడా మంచువలే కరిగినట్లు
 కొండను తవ్వి యెలుకను పట్టినట్లు
 కొన్న దగ్గిర కొసరు గాని కోరిన దగ్గర కొసరా
 కూసే గాడిద వచ్చి  మేసే గాడిదను చెరిచిందిట
 కూటికి పేదైతే కులానికి పేదా
 కొరివితో తల గోక్కున్నట్లు
 కోతి పుండు బ్రహ్మాండం
 కోతికి కొబ్బరి చిప్ప ఇచ్చినట్లు
 కొత్తొక వింత పాతొక రోత
 కోతి విద్యలు కూటి కొరకే 
 కొత్త అప్పుకు పొతే పాత అప్పు బయటపడ్డదట
 కొత్త బిచ్చగాడు పొద్దు యెరగడు
 కృషితో నాస్తి దుర్భిక్షం
 క్షేత్ర మెరిగి విత్తనము పాత్ర మెరిగి దానము
 కుడుము చేతికిస్తే పండగ అనేవాడు
 కుక్క వస్తే రాయి దొరకదు రాయి దొరికితే కుక్క రాదు
 లేని దాత కంటే ఉన్న లోభి నయం
 లోగుట్టు పెరుమాళ్ళకెరుక
 మెరిసేదంతా బంగారం కాదు
 మంచమున్నంత వరకు కాళ్ళు చాచుకో 
 నోరు మంచిదయితే ఊరు మంచిదవుతుంది 
 మంది యెక్కువయితే మజ్జిగ పలచన అయినట్లు
 మనిషి మర్మము మాను చేవ బయటకు తెలియవు
 మనిషి పేద అయితే మాటకు పేదా
 మనిషికి మాటే అలంకారం
 మనిషికొక మాట పశువుకొక దెబ్బ
 మనిషికొక తెగులు మహిలో వేమా అన్నారు
 మంత్రాలకు చింతకాయలు రాల్తాయా
 మీ బోడి సంపాదనకు ఇద్దరు పెళ్ళాలా 
 మెత్తగా ఉంటే మొత్త బుద్ధి అయ్యిందట
 మొక్కై వంగనిది మానై వంగునా
 మొరిగే కుక్క కరవదు
 మొసేవానికి తెలుసు కావడి బరువు
 ముల్లును ముల్లుతోనే తీయాలి వజ్రాన్ని వజ్రంతొనే కొయ్యాలి
 ముండా కాదు ముత్తైదువా కాదు
 ముందర కాళ్ళకి బంధాలు వేసినట్లు
 ముందుకు పోతే గొయ్యి వెనుకకు పోతే నుయ్యి
 ముంజేతి కంకణముకు అద్దము యెందుకు
 నడమంత్రపు సిరి నరాల మీద పుండు
 నేతి బీరకాయలో నెయ్యి యెంత ఉందో నీ మాటలో అంతే నిజం ఉంది
 నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా
 నవ్వు నాలుగు విధాలా చేటు
 నీ చెవులకు రాగి పొగులే అంటే అవీ నీకు లేవే అన్నట్లు
 నిదానమే ప్రధానము
 నిజం నిప్పు లాంటిది
 నిమ్మకు నీరెత్తినట్లు
 నిండు కుండ తొణకదు
 నిప్పు ముట్టనిది చేయి కాలదు
 నూరు గొడ్లు తిన్న రాబందుకైనా ఒకటే గాలిపెట్టు
 నూరు గుర్రాలకు అధికారి ఐనా భార్యకు యెండు పూరి
నెల్లాళ్ళు సావాసం చేస్తే వారు వీరు అవుతారు
 ఒక ఒరలో రెండు కత్తులు ఇమడవు
 ఊపిరి ఉంటే ఉప్పు అమ్ముకొని బ్రతకవచ్చు
బతికి ఉంటే బలుసాకు తినవచ్చు 
 ఊరంతా చుట్టాలు ఉత్తికట్ట తావు లేదు
 ఊరు మొహం గోడలు చెపుతాయి
 పాకి దానితొ సరసమ్ కంటే అత్తరు సాయిబు తో కలహం మేలు
 పాము కాళ్ళు పామునకెరుక
 పానకంలో పుడక
 పాపమని పాత చీర ఇస్తే గోడ చాటుకు వెళ్ళి మూర వేసిందట
 పచ్చ కామెర్లు వచ్చిన వాడికి లోకం అంతా పచ్చగా కనపడినట్లు
 పండిత పుత్రః శుంఠ
 పనిలేని మంగలి పిల్లి తల గొరిగినట్లు
 పరిగెత్తి పాలు తాగే కంటే నిలబడి నీళ్ళు తాగడం మేలు
 పట్టి పట్టి పంగనామం పెడితే గోడ చాటుకు వెళ్ళి చెరిపి వేసుకున్నాడట
పెదిమ దాటితే పృథివి దాటును
 పెళ్ళంటే నూరేళ్ళ పంట
 పెళ్ళికి వెళుతూ పిల్లిని చంకన పెట్టుకు వెళ్ళినట్టు
 పేనుకు పెత్తనమిస్తే తల అంతా కొరికిందట
 పెరుగు తోట కూరలో పెరుగు యెంత  ఉందో నీ మాటలో అంతే నిజం ఉంది
 పిచ్చి కోతికి తేలు కుట్టినట్లు
 పిచ్చోడి చేతిలో రాయిలా
 పిల్లి శాపాలకు ఉట్లు తెగుతాయా
 పిల్లికి చెలగాటం యెలుకకు ప్రాణ సంకటం
 పిండి కొద్దీ రొట్టె
 పిట్ట కొంచెము కూత ఘనము
 పోరు నష్టము పొందు లాభము
 పోరాని చోట్లకు పోతే రారాని మాటలు రాకపోవు
 పొర్లించి పొర్లించి కొట్టిన మీసాలకు మన్ను కాలేదన్నదట
 పుణ్యం కొద్దీ పురుషుడు, దానం కొద్దీ బిడ్డలు
 పువ్వు పుట్టగానే పరిమళించినట్లు
 రాజు గారి దివాణంలో చాకలోడి పెత్తనము
 రామాయణంలో పిడకల వేట
 రమాయణం అంతా విని రాముడికి సీత యేమౌతుంది అని అడిగినట్టు
రామేశ్వరం వెళ్ళినా శనేశ్వరం వదలనట్లు
 రెడ్డి వచ్చే మొదలు పెట్టు అన్నట్టు
 రొట్టె విరిగి నేతిలో పడ్డట్లు
 రౌతు కొద్దీ గుర్రము
 ఋణ శేషం శత్రు శేషం ఉంచరాదు
 చంకలో పిల్లవాడిని ఉంచుకుని ఊరంతా వెతికినట్టు
 సంతొషమే సగం బలం
 సిగ్గు విడిస్తే శ్రీరంగమే
 సింగడు అద్దంకి పోనూ పొయ్యాడు రానూ వచ్చాడు
 శివుని ఆజ్ఞ లేక చీమైనా కుట్టదు
 శుభం పలకరా యెంకన్నా అంటే పెళ్ళి కూతురు ముండ ఎక్కడ అన్నాడంట!
 శ్వాస ఉండేవరకు ఆశ ఉంటుంది
 తాచెడ్డ కోతి వనమెల్ల చెరిచిందట
 తాడి తన్ను వాని తల తన్నేవాడు ఉంటాడు 
 తాళిబొట్టు బలం వల్ల తలంబ్రాల వరకు బతికాడు
 తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు
 తాటాకు చప్పుళ్ళకు కుందేళ్ళు బెదురుతాయా
 తాతకు దగ్గులు నేర్పినట్టు
 తేలుకు పెత్తనమిస్తే తెల్లవార్లూ కుట్టిందట
 తన కోపమే తన శత్రువు
 తన్ను మాలిన ధర్మము మొదలు చెడ్డ బేరము
 తంతే గారెల బుట్టలో పడ్డట్లు
 తప్పులు వెదికే వాడు తండ్రి ఒప్పులు వెదికేవాడు వోర్వలేనివాడు
 తీగ లాగితే డొంక అంతా కదిలినట్లు
 తెగేదాక లాగవద్దు
 తిక్కలోడు తిరణాళ్ళకు వెలితే ఎక్కా దిగా సరిపొయిందంట
 తినే ముందు రుచి అడుగకు వినే ముందు కథ అడుగకు
 తినగా తినగా గారెలు చేదు
 తింటే గారెలు తినాలి వింటే భారతం వినాలి
 తియ్యటి తేనె నిండిన నోటితోనే తేనెటీగ కుట్టేది
 ఉల్లి చేసిన మేలు తల్లి కూడ చేయదు
 ఉపకారానికి పోతే అపకారమెదురైనట్లు
 ఉరుము ఉరుమి మంగళం మీద పడ్డట్టు
 ఉత్తికెక్కలేనమ్మ స్వర్గానికెక్కినట్టు 
 వాపును చూసి బలము అనుకున్నాడట
 వీపుమీద కొట్టవచ్చు కాని కడుపు మీద కొట్టరాదు
 వెర్రి వెయ్యి విధాలు
 వినాశకాలే విపరీత బుద్ధి
 యే ఎండకు ఆ గొడుగు
 యే గాలికి ఆ చాప
 యెద్దు పుండు కాకికి ముద్దు
 యేకులు పెడితే బుట్టలు చిరుగునా
 యెక్కడైనా బావ కానీ వంగ తోట దగ్గర మాత్రం కాదు
 యెప్పుడూ ఆడంబరంగా పలికే వాడు అల్పుడు.....
thumbnail

చిలిపి ప్రశ్నలు

చిలిపి ప్రశ్నలు : 

* వైద్యులు ఆపరేషన్ చేస్తున్నప్పడు ముఖానికి గుడ్డ ఎందుకు కట్టుకుంటారు?
జ. ఎవరు చేశారో తెలియకూడదని

* నోరు లేకపోయినా కరిచేవి?
జ. చెప్పులు

* చేయడానికి ఇష్టపడానికి ధర్మం
జ. కాలధర్మం

* డబ్బులు ఉండని బ్యాంకు
జ. బ్లడ్ బ్యాంక్

* ఓకే చోదకుడితో నడిచే బస్సు
జ. డబుల్ డెక్కర్ బస్సు

* ఎంత విసిరినా చేతిలో ఉండే కర్ర
జ. విసనకర్ర

* ఉత్తరానికి, దక్షిణానికి తేడా?
జ. ఉత్తరం పోస్టు డబ్బాలో వేయగలం. దక్షిణాన్ని వేయలేం.

* విసిసిపీ నదిలో ఎక్కువ ఏమున్నాయి?
జ. ‘సీ’లు

* మొదటి ర్యాంకు రావాలంటే పరీక్షలు ఎలా రాయాలి?
జ. పెన్నుతో

* మనకు కలలు ఎందుకు వస్తాయి.
జ. కంటాం కాబట్టి 

* తాగలేని రసం ఏమిటి?
జ. పాదరసం.

* పిల్లలు ఉండని స్కూల్ ఏమిటి?
జ. డ్రైవింగ్ స్కూల్

* నడవలేని కాలు ఏమిటి?
జ. పంపకాలు

* ఆడలేని బ్యాట్ ఏమిటి?
జ. దోమల బ్యాట్

* కనిపించని గ్రహం ఏమిటి?
జ. నిగ్రహం.

* భోజనంలో పనికి రాని రసం ఏమిటి?
జ. పాదరసం.

* తాగలేని రమ్ ఏమిటి?
జ. తగరం.

* దేవుడు లేని మతం ఏమిటి?
జ. కమతం

* దున్నలేని హలం?
జ. కుతూహలం.

* రాజులు నివశించని కోట ఏమిటి?
జ. తులసి కోట 

* అందరికీ ఇష్టమైన కారం ఏమిటి?
జ. ఉపకారం.

* కరవలేని పాము?
జ. వెన్నుపాము.

* కొట్టకుండా తగిగే దెబ్బ ఏమిటి?
జ. వడదెబ్బ

* తాగలేని పాలు ఏమిటి?
జ. పాపాలు.

* పూజకు పనికిరాని పత్రి ఏమిటి?
జ. ఆసుపత్రి

* గీయలేని కోణం ఏమిటి?
జ. కుంభకోణం.

* చెట్లు లేని వనం?
జ. భవనం.

* వెలిగించలేని క్యాండిల్?
జ. ఫిల్డర్ క్యాండిల్.

* కోడి వేడినీళ్లు తాగితే ఏం చేస్తుంది?
జ. ఉడకబెట్టిన గుడ్డు పెడుతుంది.

* స్కూల్ బ్యాగులో ఉండని స్కేలు
జ. రిక్టర్ స్కేలు  

* తాజ్ మహల్ ఎక్కడుంది?
జ. భూమ్మీద.

* ఇంటికి పెట్టలేని గేట్ ఏమిటి?
జ. ఇంటరాగేట్

* అంకెల్లో లేని పది?
జ. ద్రౌపది.

* చేపల్ని తినే రాయి ఏమిటి?
జ. కొక్కిరాయి.

* వాహనాలకు ఉండని టైర్లు ఏమిటి?
జ. సెటైర్లు

* భార్య లేని పతి ఎవరు?
జ. అల్లోపతి

* అన్నం తినకపోతే ఏమవుతుంది?
జ. మిగిలిపోతుంది.

* కూర్చోలేని హాలు ఏమిటి?
జ. వరహాలు.

* వాహనాలకు ఉండని టైర్ ఏమిటి?
జ. రిటైర్

* తినలేని కాయ ఏమిటి?
జ. లెంపకాయ 

* నారి లేని విల్లు ఏమిటి?
జ. హరివిల్లు

* డబ్బులుండని బ్యాంక్ ఏమిటి?
జ. బ్లడ్ బ్యాంక్

* వేసుకోలేని గొడుగు ఏమిటి?
జ. పుట్టగొడుగు.

* చీమలు కనిపెట్టలేని షుగర్ ఏమిటి?
జ. బ్రౌన్ షుగర్

* వేయలేని టెంట్ ఏమిటి?
జ. మిలిటెంట్

* మొక్కకు పూయని రోజాలు ఏమిటి?
జ. శిరోజాలు.

* రుచి లేని కారం ఏమిటి?
జ. ఆకారం

* చారలు లేని జీబ్రా ఏమిటి?
జ. ఆల్జీబ్రా

* అందరూ కోరుకునే సతి ఏమిటి?
జ. వసతి.

* అందరికి నచ్చే బడి ఏమిటి?
జ. రాబడి. 

* పగలు కూడా కనపడే నైట్ ఏమిటి?
జ. గ్రానైట్

* ఎగ్జామినర్ దిద్దని పేపర్ ఏమిటి?
జ. న్యూస్ పేపర్.

* వేలికి పెట్టుకోలేని రింగ్ ఏమిటి?
జ. ఫైరింగ్

* అందరూ భయపడే బడి ఏమిటి?
జ. చేతబడి.

* అందరూ నమస్కరించే కాలు ఏమిటి?
జ. పుస్తకాలు

* వీసా అడగని దేశమేమిటి?
జ. సందేశం.

* ఆయుధంలేని పోరాటమేమిటి?
జ. మౌనపోరాటం.

* గుడ్డు పెట్టలేని కోడి ఏమిటి?
జ. పకోడి

* కనిపించని వనం ఏమిటి?
జ. పవనం.

* నీరు లేని వెల్ ఏమిటి?
జ. ట్రావెల్ 

* సూర్యుడు ప్రవేశించలేని రాశి ఏది ?
జ :-  ద్రవ్యరాశి .
----------------------------------------------------------------------------------------------------
* గులాబ్ జామ్ తియ్యగా అవ్వాలంటే ఏం చేయాలి ?
జ :-  వండాలి !
----------------------------------------------------------------------------------------------------
* ఆడవాళ్లు ఎక్కువగా కోరుకునే వరం ?
జ :-  సవరం .
----------------------------------------------------------------------------------------------------
* కోడి లేకుండా గుడ్లేలా వస్తాయి ?
జ :-  బాతులు పెడితే .
----------------------------------------------------------------------------------------------------
* కదులుతున్న రైలు ఎక్కబోయి కిందపడితే ఏమవుతుంది ?
జ :-  రైలు వెళ్లిపోతుంది !
----------------------------------------------------------------------------------------------------
* కొత్త చెప్పులు కొనగానే ఎక్కడికి వెళ్లడానికి భయపడతారు?
జ :-  గుడికి !
----------------------------------------------------------------------------------------------------
* ఆర్పలేని మంట ?
జ :-  కడుపు మంట !
----------------------------------------------------------------------------------------------------
* పాకుతూ వెళ్లే కొండ ?
జ :-  అనకొండ .
----------------------------------------------------------------------------------------------------
*  తలలో ఉండే పాలు?
జ :-  జుల పాలు .
----------------------------------------------------------------------------------------------------
*  పోపుల పెట్టెలోని కర్ర ?
జ :-   జిల్లకర్ర .    

* కాకినాడ నుంచి వైజాగ్ పరిగెడుతుంటే మొదటగా వచ్చేది ఏంటి ?
జ :- ఆయాసం .
----------------------------------------------------------------------------------------------------
* గుమ్మాలకు తోరణాలు ఎందుకు కడతారు ?
జ :- కట్టకపోతే పడిపోతాయి కాబట్టి !
----------------------------------------------------------------------------------------------------
* ఎంత వయసొచ్చినా బేబీగానే ఉండాలంటే ఏం చేయాలి ?
జ :- బేబీ అని పేరు పెట్టుకోవాలి !
----------------------------------------------------------------------------------------------------
* డాక్టర్ కు ఇళ్ళు అద్దెకిస్తే ఏమవుతుంది ?
జ :- అద్దె వస్తుంది !
----------------------------------------------------------------------------------------------------
* గుళ్లో భక్తులకు ప్రసాదం ఎప్పుడు పెడతారు ?
జ :- చేయి చాచినప్పుడు .
----------------------------------------------------------------------------------------------------
* చేతులు మారినా సెకండ్ హ్యాండ్ కానిది ?
జ :- డబ్బు .
----------------------------------------------------------------------------------------------------
* ఏం . ఆర్. పి.ధర లేకుండా కొనేది ?
జ :- పెళ్ళికొడుకును !
----------------------------------------------------------------------------------------------------
* ఒక్కరోజులో సరిగ్గా వంద కిలోల స్వీట్స్ అమ్మాలం టే ఏం చేయాలి ?
జ :- తూచాలి !
----------------------------------------------------------------------------------------------------
* యమగండం , రాహుకాలం లేని వారం ?
జ :- పరివారం.
----------------------------------------------------------------------------------------------------
* అప్పట్లో ప్రయాణం చేయాలంటే గుర్రాలపై వెళ్ళేవారు ఎందుకు ?
జ :- నడిచివెళ్ళలేక !

* మన టైం బాగుండాలంటే ఏం చేయాలి ?
జ :- వాచీ శుభ్రం చేసుకోవాలి !
----------------------------------------------------------------------------------------------------
* ఒక పీకాక్ రోజుకి రెండు గుడ్లు పెడితే వారానికి ఎన్ని గుడ్లు పెడుతుంది ?
జ :- పీకాక్ గుడ్లు పెట్టదుగా !పీ హేన్ పెడుతుంది !
----------------------------------------------------------------------------------------------------
* నలుపు , తెలుపు కావాలంటే ఏం చేయాలి ?
జ :- 'న' కు బదులు 'తే ' రాయాలి !
----------------------------------------------------------------------------------------------------
* భయపెట్టే గ్రహం ఏది ?
జ :- ఆగ్రహం .
----------------------------------------------------------------------------------------------------
* నవ్వు నాలుగు విధాల చేటని ఎందుకు అంటారు ?
జ :- నోరుంది కాబట్టి !
----------------------------------------------------------------------------------------------------
* నొప్పి పుట్టించే కాలు ?
జ :- టీకాలు .
----------------------------------------------------------------------------------------------------
* వాహనాలు లేని రోడ్లు, చెట్లులేని అడవి , ఇళ్ళు లేని నగరాలు ఎక్కడ కనిపిస్తాయి ?
జ :- పటంలో .
----------------------------------------------------------------------------------------------------
* పక్షులు ఎక్కువగా సేదతీరే పురం ?
జ :- గోపురం .
----------------------------------------------------------------------------------------------------
* నీడ ఎలా ఏర్పడుతుంది ?
జ :- నల్లగా .
----------------------------------------------------------------------------------------------------
* నీళ్లు లేని చెరువు ?
జ :- అచ్చెరువు . 

*  నోటితో కాకుండా తినేది ?
జ :-  తిట్టు .
----------------------------------------------------------------------------------------------------
*  చెట్లకు కాయని ఫలాలు ?
జ :-  రాశి ఫలాలు .
----------------------------------------------------------------------------------------------------
*  మనమంతా తక్కువగా నిద్రపోయే నెల ఏది ?
జ :-   ఫిబ్రవరి .
----------------------------------------------------------------------------------------------------
*  ఎంత వర్షం కురిసినా తడవనిది?
జ :-  సముద్రం .
----------------------------------------------------------------------------------------------------
*  చలికాలంలో పది కప్పుల ఐస్ క్రీం ఒకేసారి తింటే ఏమవుతుంది ?
జ :-  అసాధ్యమవుతుంది .
----------------------------------------------------------------------------------------------------
*  పులి మనకు నమస్కారం పెడితే ఏం చేయాలి ?
జ :-  పారిపోవాలి !
----------------------------------------------------------------------------------------------------
*  ఆఫ్రికా అడవి మనుషులు అరటి పండు తినే ముందు ఏం చేస్తారు ?
జ :-  తొక్క తీస్తారు .
----------------------------------------------------------------------------------------------------
*  పడుకున్నా నిద్రపట్టని వారు ఎక్కువగా చేసే పని ?
జ :-  మెలుకువగా ఉండటం .
----------------------------------------------------------------------------------------------------
*  ముట్టుకోలేని కారు ?
జ :-  షికారు .
----------------------------------------------------------------------------------------------------
*  వేడి వేడి బజ్జీలు మూతి కాలకుండా తినాలంటే ముందు ఏం చేయాలి ?
జ :-  నోరు తెరవాలి . 

thumbnail

మంచి అలవాట్లు

మంచి అలవాట్లు :

*  రోజుకు ఎనిమిది గంటలు నిద్రపోవాలి.

*  లేచిన వెంటనే పక్క బట్టలు తీయటం.

*  విద్య చెప్పిన వారిని మరువరాదు.

*  వేకువ(తెల్లవారు) జామునే లేవటం.

*  వేళకు బడికి (స్కూల్‌కి) వెళ్ళటం.

*  శుభ్రంగా క్రింద పడకుండా పలహారం(టిఫిన్) తినటం.

*  శుభ్రంగా పళ్ళు తోముకోవటం.

*  శుభ్రమైన బట్టలు ధరించటం.

*  సజ్జనులతో స్నేహము చేయవలెను.

*  సాటి విధ్యార్ధితో స్నేహ భావంతో మెలగటం.

*  స్వామి యందు భక్తి నుంచుము.

*  బడికి వెళ్ళటానికి పది నిమిషాల ముందే కావలసినవన్ని సంచిలో (Bag) సర్దుకోవాలి .

*  బడికి వెళ్ళేటప్పుడు బూట్లను శుభ్రంగా తుడుచుకొని బూట్లను వేసుకోవాలి .

*  బీదలను చూసి హేళన చేయవద్దు .

*  బూట్లను శుభ్రంగా ఉంచుకోవాలి .

*  భోజనం చేసే ముందు చేతులు కడుక్కోవటం .

*  భోజనం చేసే ముందు వస్తువులను (గిన్నెలను) తీసుకురావటానికి అమ్మకు సాయం చేయటం .

*  మంచి అలవాట్లకు మించిన ధనం లేదు .

*  మంచిని మించిన గుణం లేదు .

*   మనిషికి మాటే అలంకారం .

*  మాట వెండి, మౌనం బంగారం .

*  నీళ్ళు పట్టు కోవటం అయిన వెంటనే పంపు కట్టేయాలి .

*  నీళ్ళు వృధా చేయవద్దు .

*  నోరు మంచిదయితే, ఊరు మంచిదవుతుంది .

*  పరనింద పనికిరాదు .

*  పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవటం .

*  పుస్తకాలను చక్కగా సర్దుకోవాలి .

*  పెద్ద వాళ్ళు వచ్చినప్పుడు లేచి నిలబడటం .

*  పెద్దల మాటలు వినవలెను .

*  పెద్దలను గౌరవించాలి .

*  పేదల మీద దయ ఉంచవలెను .

*  చెడ్డవారి చెలిమి చేయరాదు .

*  చేసిన మేలు మరువరాదు .

*  జీవహింస చేయరాదు .

*  టి వి చూసేటప్పుడు టి వి కి దగ్గరగా కూర్చోవద్దు .

*  తనను తాను పొగడు కొనరాదు .

*  తల్లిదండ్రులను కష్ట పెట్టరాదు .

*  తిన్న వెంటనే పళ్ళు తోముకోవటం .

*  తొందరపడి ఏ పనీ చేయరాదు .

*  నమ్మిన వారిని మోసం చేయరాదు .

*  నిప్పుతో లేక అగ్గిపుల్లలతో ఆడకూడదు .

*  ఉపాధ్యాయులను గౌరవించటం .

*  ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలు, మంచి మాటలు నేర్చుకోవటం .

*  ఎల్లప్పుడూ దైవచింతన చేయుము .

*  ఏదైన తిన్న తరువాత కాగితాలను, తొక్కలను చెత్తకుండీలో (Dust Bin) వేయాలి .

*  ఒకరి మీద చాడీలు చెప్పరాదు .

*  కరెంటు వైర్లతో, స్విచ్చులతో, ప్లగ్గులతో ఆడకూడదు .

*  ఖాళీ సమయాల్లో బొమ్మలు గీయటం, చిన్న చిన్న కథలు చదవటం వంటివి చేయటం .

*  గురువుల మాట వినాలి .

*  గ్యాస్ పొయ్యితో (బర్నర్‌తో) ఆడకూడదు .

*  చక్కగా తల దువ్వు కోవటం .

*  అమ్మకి చిన్న చిన్న పనులలో సాయంచేయటం.

*  అసత్యం ఆడకూడదు.

*  ఆకలిగొన్న వానికి అన్నము పెట్టుము.

*  ఆటలాడుచోట, అలుక పూనరాదు.

*  ఆడిన మాట తప్పరాదు.

*  ఆడుకున్న తరువాత ఆట వస్తువులను సర్దుకోవాలి.

*  ఇంటి పని (హోం వర్క్) అయిన తర్వాతనే ఆడుకోవాలి.

*  ఇంటి పని (హోం వర్క్) సరిగ్గా చేయటం.

*  ఇంటికి వచ్చిన వారిని గౌరవించటం.

*  ఇంటిలోకి వచ్చే ముందు కాళ్ళు శుభ్రంగా తుడుచుకొని రావాలి.